40 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
Published Thu, Oct 31 2013 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM
పూళ్ల(భీమడోలు), న్యూస్‌లైన్ : జాతీయ రహదారిపై పూళ్ల వద్ద గూడ్స్ క్యారి యర్ వ్యాన్ ప్రమాదానికి గురికాగా దానిలో అక్రమంగా రవాణా చేస్తున్న 40 క్వింటాళ్ల రేషన్ బియ్యూన్ని రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు బుధవారం సాయంత్రం పట్టుకున్నారు. వ్యాన్ డ్రైవర్, యజమాని బాలకృష్ణను పోలీసులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పూళ్ల సమీపంలోని కస్తూరి రైస్ మిల్లులో ఉంచారు. వివరాల్లోకి వెళ్లితే.. కృష్ణాజిల్లా విస్సన్సపేట నుంచి తూర్పుగోదావరి జిల్లా మండపేటకు 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గూడ్స్ క్యారియర్ వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్నారు. మార్గం మధ్యలో పూళ్ల వద్దకు వచ్చేసరికి రోడ్డుపై భారీ గోతులు ఉండడంతో అదుపు తప్పిన వ్యాన్ డివైడర్‌పై పడి బోల్తా కొట్టింది.
దీంతో వ్యాన్‌లో ఉన్న 80 బియ్యం బస్తాలు బయట పడ్డాయి. స్థానికులు గుర్తించి విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. విజిలెన్స్, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని యజమాని బాలకృష్ణ నుంచి వివరాలు సేకరించారు. విన్సన్నపేట పరిసర గ్రామాల్లోని చౌకడిపో డీలర్ల నుంచి కేజీ రూ.12లు వంతున కొనుగోలు చేసినట్లు అతను చెప్పాడు. లారీ తాడేపల్లిగూడెం వెళ్లి అక్కడ నుంచి మధ్యవర్తి ద్వారా మండపేటకు వెళ్తుందని అధికారులు చెప్పారు. విజిలెన్స్ సీఐ వెంకటేశ్వరరావు, సీఎస్‌డీటీ జి.విజయకుమార్‌రాజు, ఏసీటీవో రాజేంద్రప్రసాద్, వీఆర్వోలు అనిత, శ్రీనివాసరావు, కానిస్టేబుల్ బాషా పాల్గొన్నారు.
Advertisement
Advertisement