నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం ఈతవాకిళ్లు గ్రామంలో అక్రమంగా నిల్వఉంచిన 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మఠంపల్లి ఎస్‌ఐ ఆకుల రమేష్ బుధవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు.
మఠంపల్లి: నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం ఈతవాకిళ్లు గ్రామంలో అక్రమంగా నిల్వఉంచిన 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు బుధవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఈతవాకిళ్లు గ్రామానికి చెందిన గ్రంథి జనార్దన్‌కు చెందిన ఇంటిలో నిల్వఉంచిన బియ్యాన్ని ముందస్తు సమాచారం మేరకు మఠంపల్లి ఎస్‌ఐ ఆకుల రమేష్.. సిబ్బందితో దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.