వసతిగృహాలకు గ్యాస్ సిలిండర్లు | gas cylinders grant to hostels and anganwadi centers | Sakshi
Sakshi News home page

వసతిగృహాలకు గ్యాస్ సిలిండర్లు

Published Mon, Dec 23 2013 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM

gas cylinders grant to hostels and anganwadi centers

కలెక్టరేట్, న్యూస్‌లైన్ :  జిల్లాలోని బీసీ, సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో కట్టెల పొయ్యిపై వంట చేసే నిర్వాహకుల కష్టాలు తీరనున్నాయి. ఇక నుంచి వీరు  గ్యాస్‌పై చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 2,967 కొత్త గ్యాస్ కనెక్షన్లు కేటాయిస్తూ కలెక్టర్ అహ్మద్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రొసిడింగ్ ఆయా సంబంధిత అధికారులకు అందా యి. పాఠశాలల్లో చదువుతున్న 50 మంది విద్యార్థులకు ఒక గ్యాస్ కనెక్షన్, ఒక సిలిండర్, రెగ్యులెటర్ చొప్పున కేటాయించారు. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు 890, పాఠశాలలకు 1,951, సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు 102,  గురుకుల పాఠశాలలకు 22, ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని నూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్‌కు రెండు చొప్పున కొత్త గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి.
 పాఠశాలలకు కనెక్షన్లు ఇలా..
 జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద వంటచేసి పెట్టేందుకు జిల్లాలోని పాఠశాలలకు 1,951 గ్యాస్ కనెక్షన్లు కేటాయించారు. గుడిహత్నూర్, బేల, జైనథ్, తాంసి మండలాలకు 126, కౌటాల, లోకేశ్వరం మండలాలకు 45, ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి మండలాలకు 222, ఆసిఫాబాద్, జైనూర్, సిర్పూర్(యు), తిర్యాణికి 192, ముథోల్, తానూర్‌కు 69, బెజ్జూర్‌కు 36, బెల్లంపల్లి, నెన్నెలకు 44, జన్నారంకు 43, దిలావర్‌పూర్, సారంగాపూర్‌లకు 33, తలమడుగుకు 33, వాంకిడి, కెరమెరిలకు 94, బోథ్, బజార్‌హత్నూర్‌లకు 79, నేరడిగొండ, ఇచ్చోడకు 70, దహెగాం, సిర్పూర్(టి)లకు 38, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లిలకు 111, నిర్మల్‌కు 44, మందమర్రికి 15, కాసిపేటకు 40, తాండూర్, భీమినిలకు 45, కౌటాల, సిర్పూర్(టి), బెజ్జూర్‌లకు 99, రెబ్బెనకు 34, ఆదిలాబాద్‌కు 86, భైంసా, కుభీర్‌కు 83, దండేపల్లి, కాగజ్‌నగర్‌కు 75, లక్సెట్టిపేటకు 7, ఖానాపూర్, కడెంకు 94, మామాడ, లక్ష్మణచాందకు 35, జైపూర్‌కు 39, మంచిర్యాల మండలానికి 20 గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి.

ఇదిలా ఉండగా, ముథోల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలకు 12 కనెక్షన్లు మంజూరు చేశారు. ఆదిలాబాద్‌లోని రాంనగర్‌లో గల వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలకు మూడు, లక్సెట్టిపేటలోని బీసీ బాలు గురుకల పాఠశాలకు మూడు, మామడలోని కస్తూర్భా గాంధీ విద్యాలయానికి(కేజీబీవీ) నాలుగు గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి.
 వసతిగృహాలు, అంగన్‌వాడీలకు కేటాయింపు..
 సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహాలకు 102 గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. ఒక్కొ వసతిగృహానికి ఆరు కనెక్షన్ల చొప్పున కేటాయించారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహం(బాలుర, బాలికలు) ఆదిలాబాద్‌కు 12, మందమర్రికి 12, మంచిర్యాలకు, 12, లక్సెట్టిపేటకు 12, నిర్మల్‌కు 12, కాగజ్‌నగర్‌కు 12, ఉట్నూర్‌కు ఆరు, బెల్లంపల్లికి 12, ఆసిఫాబాద్‌కు 12 గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. ఇదిలా ఉండగా, అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి తాంసి, తలమడుగు, ఆదిలాబాద్, గుడిహత్నూర్ మండలాలకు 252 కనెక్షన్లు మంజూరు చేశారు. బోథ్, బజార్‌హత్నూర్, ఇచ్చోడలకు 147, నేరడిగొండ, ఇచ్చోడలకు 77, సిర్పూర్(టి), కాగజ్‌నగర్‌లకు 68, కౌటాల, బె జ్జూర్‌లకు 129, భీమినికి 41, బేల, జైనథ్‌లకు 126, దహెగాం మండలానికి 50 చొప్పున 890 కనెక్షన్లు మంజూరయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement