grant
-
కేంద్రం ఏపీకి ఇచ్చింది అప్పే.. గ్రాంట్ కాదు : మహవా
ఢిల్లీ : లోక్‌సభలో బడ్జెట్‌పై పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ మహవా మోయిత్ర మాట్లాడారు.కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ప్రజలను ఫూల్స్ చేయొద్దన్నారు. ఏపీకి ఇచ్చేది అప్పేనని గ్రాంట్ కాదని అన్నారు. డాలర్ల లోను కట్టాల్సిన బాధ్యత ఏపీ భవిష్యత్తు తరాలదేనని అన్నారు టీఎంసీ ఎంపీ మహవా మోయిత్ర.ఇక ఉత్తరాంధ్ర,రాయలసీమ, ప్రకాశం వంటి వెనుకబడి జిల్లాలకు గ్రాంట్లు ఇస్తామని, కానీ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవని సూచించారు. తెలివైన ఏపీ ప్రజల్ని ఫూల్స్ చేస్తున్నారంటూ ఫైరయ్యారు. -
ఒక్క రూపాయీ గ్రాంట్ రాలే!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ముగిసిపోయింది. కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇప్పుడేకాదు చాలా ఏళ్లుగా రాష్ట్రానికి గ్రాంట్లు ఇచ్చే విషయంలో కేంద్రం శీతకన్ను వేస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించిన దాంట్లో సగం కూడా నిధులను మంజూరు చేయడం లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో రూ.2,317 కోట్లు అయినా ఇవ్వగా.. ఈసారి అయితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.21 వేలకోట్లకుపైగా వస్తాయని బడ్జెట్లో అంచనా వేసుకుంది.పన్నుల వసూళ్లతోనే..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ 30వ తేదీ వరకు ఆదాయ, వ్యయాలపై రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు ఇచ్చిన నివేదికలోని గణాంకాల ప్రకారం పన్ను రాబడులు ఆశించిన మేర వస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో పన్ను రాబడులు రూ.11,464 కోట్లు వచ్చాయి. మే నెలలో కొంత తగ్గి రూ.10,954 కోట్లు వచ్చినా, జూన్‌లో మళ్లీ పుంజుకుని రూ.12,190 కోట్లు వచ్చాయి. మొత్తంగా మూడు నెలల్లో కలిపి అన్నిరకాల రాబడులు, పన్నుల్లో వాటా, అప్పులు కలిపి రూ.48,790.66 కోట్లు ఖజానాకు సమకూరగా.. అందులో రూ.34,609 కోట్లు పన్ను ఆదాయం కిందే అందాయి. అంటే మొత్తం రాబడిలో 80శాతానికిపైగా పన్నుల రూపంలోనే ఖజానాకు వచ్చినట్టు అర్థమవుతోంది.మూడు నెలల్లో రూ.13,171 కోట్ల అప్పులుఇక ఈ మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.13,171 కోట్లు అప్పుల రూపంలో సమకూర్చుకుంది. ఏప్రిల్‌లో రూ.2,246 కోట్లు, మేలో రూ.5,133 కోట్లు, జూన్‌లో రూ.5,790 కోట్లు రుణాలు తీసుకుంది. ఈ మొత్తంలో సగం వరకు గతంలోని అప్పుల అసలు, వడ్డీలకు చెల్లించినట్టు కాగ్‌కు సమర్పించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్‌లో రూ.1,865 కోట్లు, మేలో రూ.1,864 కోట్లు, జూన్‌లో రూ.2,203 కోట్లు అప్పుల కింద చెల్లించారు. ఇక ఇతర ఖర్చుల విషయానికి వస్తే జీతాలకు రూ.11,026.69 కోట్లు చెల్లించారు. గత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో చెల్లించిన దానికంటే ఇది రూ.1,300 కోట్లు అధికం. పింఛన్ల కోసం రూ.4,311.62 కోట్లు, సబ్సిడీల కింద రూ.3,354 కోట్లు చెల్లించారు. మొత్తం రాబడిలో రూ.45,320.12 కోట్లు ఖర్చయిందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
ఇన్నోవేటర్స్..తక్కువ ఖర్చుతో అద్భుత ఆవిష్కరణలు!
పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న వారి కోసం తక్కువ ధరలో, సౌకర్యవంతమైన ఇయర్ ఇంప్లాంట్‌ను డెవలప్ చేశారు మదురైకి చెందిన ట్విన్స్ రామన్, లక్ష్మణన్. బోయింగ్ ఇండియా (బెంగళూరు) బోయింగ్ యూనివర్శిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ అండ్ డెవలప్మెంట్(బిల్డ్) గ్రాంట్ ΄పొందిన వారిలో రామన్, లక్షణన్ ఒకరు...పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న అమ్మాయికి తల్లిదండ్రులు వైద్యం చేయించాలనుకున్నారు. తమ ఆస్తిని అమ్మగా వచ్చిన డబ్బుతో కూతురుకి నెల రోజులు మాత్రమే వైద్యం చేయించగలిగారు. ఈ విషయం రామ్, లక్షణ్ సోదరులకు తెలిసింది. ఈ ట్విన్స్ మదురైలోని ఒక కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చదువుతున్నారు. స్క్రాప్ మెటీరియల్‌తో వెంటిలేటర్‌ను తయారుచేయాలని ప్రయత్నిస్తున్న సోదరులు అమ్మాయి విషయం తెలిసిన తరువాత ఇయర్ ఇంప్లాంట్‌ను డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నారు. పుట్టుకతో వచ్చే వినికిడి లోపానికి చికిత్స చేయడానికి నాన్–ఇన్వేసివ్ హియరింగ్ ఇంప్లాంట్ డెవలప్ చేయడంలో విజయం సాధించారు. సంప్రదాయ ఇంప్లాంట్లతో పోల్చితే దీని ధర తక్కువ. ఫస్ట్ ప్రోటోటైప్‌ను తమ పెరట్లో(బ్యాక్ యార్డ్)లో క్రియేట్ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తమ వేంచర్‌కు ‘బ్యాక్‌యార్డ్ క్రియేటర్స్’ అని పేరు పెట్టుకున్నారు. ఖర్చును తగ్గించడం తోపాటు సౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఇంప్లాంట్ ఇది. బోయింగ్ యూనివర్శిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ అండ్ డెవలప్మెంట్ (బిల్డ్–బెంగళూరు) గ్రాంట్ పొందిన విజేతల్లో రామ్,లక్ష్మణన్‌లు ఉన్నారు. చెవి వెనుక భాగంలో ఉంచే ఈ పరికరం విద్యుత్ తరంగాలను విడుదల చేసి నరాలను తాకి ఉత్తేజపరుస్తుంది. ఎలాంటి అసౌకర్యం లేకుండా వినడానికి సహాయపడుతుంది. ‘మాగ్నటిక్ ఇంప్లాంట్‌కు ఉండే పరిమితులు మా డివైజ్‌లో ఉండవు’ అంటున్నాడు రామన్. మన దేశంలో ప్రారంభ దశ స్టార్టప్‌లను ప్రొత్సహించడానికి 2019లో ‘బిల్డ్’ను ప్రారంభించారు. కస్టమర్ సెగ్మెంటేషన్ గురించి ఎంత బాగా ఆలోచించారు....మొదలైన విషయాల ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది 1200 ఐడియాలు వచ్చాయి. ‘గ్రాంట్’ మొదలైనప్పటి నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఐడియాలు రావడం ఇదే మొదటిసారి. ఒక్కో స్టార్టప్‌కు పది లక్షల రూపాయలు ఇస్తారు. రామన్, లక్ష్మణన్‌లతో ΄ాటు ప్రిత్వీష్ కుందు (గ్రీన్ ఎనర్జీ ఫర్ ఏవియేషన్ సెక్టార్), ఐశ్వర్య కర్నాటకి, పరీక్షిత్ మిలింద్ సోహోని–ముంబై (గ్లోవట్రిక్స్–సైన్‌లాంగ్వేజ్‌ను స్పీచ్ అంట్ టెక్ట్స్‌లోకి ట్రాన్స్లెట్ చేసే పరికరం), సత్యబ్రత శతపథి–ఒడిషా (బన్వీ ఏరో), దేవేంద్ర ప్రధాన్, బిశ్వజిత్ (సిటీపీఎల్–భువనేశ్వర్)లు ‘బిల్డ్’ గ్రాంట్‌కు ఎంపికైన వారిలో ఉన్నారు. అండర్ వాటర్ రోబోటిక్స్.. మన దేశంలో డ్యామ్‌లు, బ్రిడ్జీలు... మొదలైన వాటికి సంబంధించిన అండర్‌వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి ఇన్స్పెక్షన్, ఆపరేషన్ అనేది సవాలుగా మారింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలాలో చదువుకున్న దేవేంద్ర ప్రధాన్, బిశ్వజిత్ ఈ సమస్యకు పరిష్కారం కనుకొన్నారు. అండర్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్యవేక్షణను వేగవంతం, సురక్షితం చేయాలనే లక్ష్యంతో ‘సిటీపీఎల్’ కంపెనీ స్థాపించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఏఐ–బేస్డ్ టెక్నాలజీతో అటానమస్ అండర్‌వాటర్ వెహికిల్(ఏయూవీ), రిమోట్లీ ఆపరేట్ వెహికిల్(ఆర్వోవీ)ని డెవలప్ చేశారు. ‘అండర్‌వాటర్ రోబోటిక్స్‌కు సంబంధించిన రంగంలో మన దేశంలో నాలుగు స్టార్టప్‌లు మాత్రమే ఉన్నాయి. అందులో సిటీపీఎల్ ఒకటి’ అంటున్న దేవేంద్ర మెర్సిడెస్ బెంజ్ ‘ఆర్ అండ్ డీ’ విభాగంలో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని జర్మనీ నుంచి ఇండియాకు వచ్చి బిస్వజిత్‌తో కలిసి ‘సిటీపీఎల్’ను స్టార్ట్ చేశాడు. మెకట్రోనిక్స్, ఆటోమేషన్ ఇంజనీరింగ్ చేసిన బిశ్వజిత్ స్టార్టప్ కోసం చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు. (చదవండి: 'శబ్దమే శాపం' ఆమెకు! అత్యంత అరుదైన వ్యాధి..ఆఖరికి పిల్లల నవ్వులు కూడా..!) -
పసుపు బోర్డు..గిరిజన వర్సిటీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించారు. రాష్ట్ర రైతులు ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్న జాతీయ పసుపు బోర్డును, ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో ఆదివారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో.. రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతుంది. దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేయడంతోపాటు వినియోగించేది, ఎగుమతి చేసేది ఈ పంటే. కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. దీనిపై పరిశోధనలు పెరిగాయి. పాలమూరు సభ సాక్షిగా ఇక్కడి పసుపు రైతుల సంక్షేమం కోసం తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు (నేషనల్ టర్మరిక్ బోర్డు)ను ఏర్పాటు చేస్తాం. ములుగులో ట్రైబల్ వర్సిటీ.. ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రూ.900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనివర్సిటీకి సమ్మక్క–సారలమ్మ పేరు పెడుతున్నాం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో వివిధ భవనాలను ప్రారంభించాం. హెచ్సీయూకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా కలి్పంచి, ప్రత్యేక నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. నారీశక్తి వందన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించడం ద్వారా నవరాత్రులకు ముందే శక్తి పూజ స్ఫూర్తిని నెలకొల్పాం. వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమ రంగాలకు ప్రయోజనం తెలంగాణ ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చేలా అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేయడం సంతోషంగా ఉంది. నాగ్‌పూర్–విజయవాడ కారిడార్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ కారిడార్‌లో కొన్ని ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలను కూడా గుర్తించాం. ఇందులో ఎనిమిది ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐదు మెగా ఫుడ్ పార్కులు, నాలుగు ఫిషింగ్ సీఫుడ్ క్లస్టర్లు, మూడు ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు, ఒక టెక్స్టైల్ క్లస్టర్ ఉన్నాయి. దేశంలో నిర్మిస్తున్న ఐదు టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. హన్మకొండలో నిర్మించే ఈ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వేలాది మందికి ఉపాధి ఇచ్చేలా.. ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఇంధన భద్రతపై చర్చ జరుగుతోంది. కేవలం పరిశ్రమలకే కాకుండా ప్రజలకు కూడా ఇంధన శక్తిని అందిస్తున్నాం. దేశంలో 2014లో 14 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉంటే 2023 నాటికి 32 కోట్లకు పెరిగాయి. ఇటీవల గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా తగ్గించాం. దేశంలో ఎల్పీజీ వినియోగాన్ని పెంచడంలో భాగంగా పంపిణీకి సంబంధించి నెట్‌వర్క్‌ను విస్తరించాల్సి ఉంది. ఇందులో భాగంగా హసన్–చర్లపల్లి ఎల్పీజీ పైప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఇది ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో దోహదపడుతుంది. కృష్ణపట్నం–హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్ వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది..’’అని ప్రధాని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపనలు ఇవీ.. రూ.3,397 కోట్లతో మూడు ప్యాకేజీలుగా వరంగల్ నుంచి ఖమ్మం వరకు చేపట్టనున్న ఎన్‌హెచ్–163 పనులు రూ.3,007 కోట్లతో మూడు ప్యాకేజీలుగా ఖమ్మం నుంచి విజయవాడ వరకు నిర్మించే ఎన్‌హెచ్–163జీ పనులు కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ వరకు రూ.1,932 కోట్లతో చేపట్టే మల్టీ ప్రొడక్ట్ పైపులైన్ నిర్మాణ పనులు ప్రారంభించినవి ఇవీ.. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు రూ.2,457 కోట్లతో నిర్మించిన నాలుగు లేన్ల 365 బీబీ నంబర్ జాతీయ రహదారి మునీరాబాద్–మహబూబ్‌నగర్ రైల్వేలైన్‌లో భాగంగా జక్లేర్ నుంచి కృష్ణా వరకు రూ.505 కోట్లతో పూర్తి చేసిన కొత్త లైన్ రూ.81.27 కోట్లతో హెచ్‌సీయూలో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ భవనాలు రూ.2,166 కోట్లతో హసన్ (కర్ణాటక) నుంచి చర్లపల్లి వరకు నిర్మించిన ఎల్పీజీ పైప్‌లైన్ జాతికి అంకితం నారాయణపేట జిల్లాలోని కృష్ణా స్టేషన్ నుంచి కాచిగూడ–రాయచూర్– కాచిగూడ డీజిల్, ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (డెమూ) రైలు సర్విస్ ప్రారంభం -
Elon Musk: రూ.1.86 కోట్ల గ్రాంట్ గెలుచుకున్న ముంబై స్టూడెంట్స్
ఎలన్ మస్క్ స్థాపించిన ఎక్స్‌ప్రైజ్ సంస్థ నుంచి భారీ గ్రాంటుని సాధించారు ముంబైకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు. యూకేలోని గ్లాస్కోలో జరుగుతున్న కాప్ 26 సదస్సులో ఈ విద్యార్థుల ప్రజెంటేషన్‌కి ఈ గ్రాంట్ దక్కింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబైకి చెందిన శ్రీనాథ అయ్యర్, అన్వేష బెనర్జీ, సృష్టి భామరే, శుభంకుమార్లు కాలుష్యాన్ని తగ్గించే ట్రై మాడ్యులర్ టెక్నాలజీ సాస్‌ఐఐటీబీ (SASIITB) కాన్సెప్టును గ్లాస్కోలో ప్రదర్శించారు. వీరి కాన్సెప్టు ప్రకారం.. కార్బన్ డై ఆక్సైడ్ విడుదలయ్యే చోట ట్రై మాడ్యులర్ని ఉంచినట్టయ్యితే కార్బన్ డై యాక్సైడ్ ఉప్పుగా మారుతుంది. గ్లాస్కోలో జరిగే సదస్సులో కార్బన్ రిమూవల్ స్టూడెంట్స్ కాంపిటిషన్‌ను నిర్వహించారు. ఇందులో కార్బన్ని తగ్గించే ఫ్యూచర్ టెక్నాలజీ అందించిన స్టూడెంట్స్‌కి 5 మిలియన్ డాలర్లు ప్రైజ్‌మనీగా నిర్ణయించారు. మొత్తం 23 కాన్సెప్టులో ఇందులో బహుమతులు, గ్రాంట్లు గెలుచుకున్నాయి. ఇందులో ఐఐటీ ముంబై టీం 2,50,000 డాలర్ల గ్రాంట్‌ని నవంబరు 11న అందుకుంది. ఇండియన్ కరెన్సీలో ఈ గ్రాంటు రూ.1.86 కోట్లుగా ఉంది. ఈ గ్రాంటుతో సాస్‌ఐఐటీబీ బృందం స్టార్టప్‌ను నెలకొల్పే అవకాశం ఉంది. చదవండి:ఎలన్ మస్క్ దెబ్బకు.. వారంలో రూ.13 లక్షల కోట్లు ఆవిరి -
చిన్న సంస్థలకు ఫేస్బుక్ రూ. 32 కోట్ల గ్రాంటు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిస్థితులను అధిగమించి, చిన్న సంస్థలు (ఎస్ఎంబీ) తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు అవసరమైన తోడ్పాటునివ్వనున్నట్లు సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ వెల్లడించింది. అయిదు నగరాల్లోని (హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరు) 3,000 పైచిలుకు చిన్న వ్యాపారాలకు 4.3 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 32 కోట్లు) మేర గ్రాంట్ ఇనవ్వనున్నట్లు ఫేస్బుక్ ఇండియా ఎండీ అజిత్ మోహన్ ఒక బ్లాగ్‌పోస్టులో తెలిపారు. సింహభాగం నగదు రూపంలోను మిగతాది యాడ్ క్రెడిట్స్ రూపంలో ఉంటుందని పేర్కొన్నారు. అన్ని రకాల వ్యాపారాలకు ఇది వర్తిస్తుందని, ఫేస్‌బుక్‌కు సంబంధించిన సాధనాలేమీ వాడని సంస్థలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని వివరిం చారు. గ్రాంటు ద్వారా పొందిన నిధుల వినియోగంపై ఎలాంటి షరతులు ఉండవని, ఆయా సంస్థలు తమకు కావాల్సిన విధంగా వినియోగించుకోవచ్చన్నారు. 2020 జనవరి 1 నాటికి కనీసం 2 నుంచి 50 మంది సిబ్బంది ఉన్న సంస్థలు దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన సంస్థలకు సుమారు రూ. 63,000 నగదు, రూ. 38,000 విలువ చేసే ఫేస్బుక్ యాడ్ క్రెడిట్స్ లభిస్తాయి. చదవండి: వాటికి నిబంధనలు అవసరం లేదు : ట్రాయ్ -
అడ్వకేట్లకు అండగా నిలిచిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బార్ కౌన్సిల్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకి ధన్యవాదాలు తెలిపింది. కరోనా కారణంతో లాక్డౌన్ విధించడంతో ఇబ్బంది పడుతున్న అడ్వకేట్లను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 25 కోట్లను మంజూరు చేసింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఇది అడ్వకేట్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని బార్ కౌన్సిల్ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో 40,000వేల మంది అడ్వకేట్లు ఉన్నారని వారిలో కొత్తగా ఈ వృత్తిని ఎంచుకున్న వారు లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్నారని బార్ కౌన్సిల్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. (ఢిల్లీలో జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం) కేవలం ఈ వృత్తి మీదే ఆధారపడిన వారు కేసులు లేక జీవనం కొనసాగించడం కష్టంగా ఉందని వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని బార్ కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందిన ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు రూ. 25 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఇందుకు గాను బార్‌కౌన్సిల్ సభ్యులు అనంతసేన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. (వలస కార్మికులను పంపిస్తాం : కానీ...!) -
జీడిపల్లి పునరావాసం కోసం ముందడుగు
సాక్షి, అనంతపురం: బెళుగుప్ప మండలం జీడిపల్లి గ్రామ సమీపంలోని జీడిపల్లి రిజర్వాయర్‌ను 2005లో ప్రారంభించి 2012 నాటికి పూర్తి చేసి కృష్ణా జలాలతో నింపుతున్నారు. రిజర్వాయర్ మూలంగా కిందభాగాన ఉన్న జీడిపల్లి గ్రామస్తులు ఊటనీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం జీడిపల్లి వాసులకు ఆర్అండ్ఆర్ (రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్) పథకం కింద పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చినా పట్టించుకోలేదు. ఇందుకోసం అప్పటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఐదేళ్లూ పోరాటాలు చేశారు. గ్రామస్తులతో కలిసి జల జాగరణ చేశారు. గ్రామస్తులను అధికారుల వద్దకు పిలుచుకెళ్లారు. కలెక్టరేట్ ముట్టడి, ధర్నా చేశారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ ‘జీడిపల్లి పునరావాసం’పై పలుమార్లు గళం విప్పారు. దీంతో దిగొచ్చిన గత ప్రభుత్వం కంటితుడుపు చర్యగా జీఓ 468 విడుదల చేసి చేతులు దులుపుకుంది. కొత్త ప్రభుత్వంలో ముందడుగు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను విన్నవించారు. ఇందులో భాగంగా జీడిపల్లి గ్రామస్తులకు పునవాసం, కమ్యూనిటీ లిఫ్ట్ డ్రిప్ ఇరిగేషన్, ఆమిద్యాల, రాకెట్ల లిఫ్ట్ నిర్మాణం వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో జీడిపల్లి గ్రామస్తుల పునరావాసానికి 2019–20 సంవత్సరంలో తొలివిడతగా రూ. 15 కోట్లు కేటాయిస్తూ ఆర్అండ్ఆర్ ప్రత్యేక కమిషనర్ రేఖారాణి గతవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఆర్అండ్ఆర్ క్యాష్ బెనిఫిట్స్‌కు రూ. 10 కోట్లు, నిర్మాణాలకు రూ. 4 కోట్లు, భూ సేకరణకు రూ. 90 లక్షలు, పరిహారానికి రూ. 10 లక్షలు కేటాయించారు. సీఎల్‌డీఐలోకి గ్రామాలు చేర్చండి ఉరవకొండ నియోజకవర్గంలో 20 వేల హెక్టార్లకు సాగు నీరందించడానికి రూ. 890 కోట్లతో మంజూరైన కమ్యూనిటీ లిఫ్ట్ డ్రిప్ ఇరిగేషన్ (సీఎల్‌డీఐ) పథకంలోకి గంగవరం, కాలువపల్లి గ్రామాలను చేర్చాలని ముఖ్యమంత్రిని విశ్వేశ్వరరెడ్డి కోరారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అలాగే హంద్రీ–నీవా ప్రధాన కాలువ ఉరవకొండ మండలంలో వెళ్తున్నా ఆమిద్యాల, రాకెట్ల, కౌకుంట్ల ఆయకట్టుకు డీపీఆర్‌లో నీటిని కేటాయించలేదు. ఈ విషయాన్ని అప్పట్లోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దృష్టికి విశ్వేశ్వరరెడ్డి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన వైఎస్ఆర్ ఆమిద్యాల, రాకెట్ల, కౌకుంట్ల గ్రామాల్లోని 8 వేల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకు 52వ ప్యాకేజీలో భాగంగా ‘ఆమిద్యాల, రాకెట్ల లిఫ్ట్’ను మంజూరు చేశారు. టెండర్లు పూర్తయినా గత ప్రభుత్వం పనులు చేపట్టలేదు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విశ్వేశ్వరరెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సీఎం ఆదేశాలతో పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ చర్యల పట్ల ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
‘గ్రాంట్’కు గుండుసున్నా!
నూజివీడు : ప్రభుత్వ పాఠశాలలకు స్కూల్ గ్రాంట్, టీచర్స్ గ్రాంట్లను టీడీపీ సర్కారు ఇప్పటికీ విడుదల చేయలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు గడుస్తున్నా నిధులు విడుదల చేయకపోవడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాల నిర్వహణకు నిధులను ఏటా సెప్టెంబరు నెలలో ప్రభుత్వం విడుదల చేస్తుంటుంది. అయితే ఈసారి జనవరి నెల సగం గడిచిపోయినా నిధుల విడుదల ఊసే లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నపాటి ఖర్చులకు కూడా నిధులు లేక ఉపాధ్యాయులు అల్లాడిపోతున్నారు. కొన్నిచోట్ల ఉపాధ్యాయులే తమ జేబుల్లో డబ్బులు వేసుకుని ఖర్చులను భరిస్తున్నారు. బోధనా సామగ్రికి కూడా.. బోధనకు అవసరమైన చాక్‌పీసులు, డస్టర్లు, బోధనా సామగ్రి, చిన్న చిన్న పనుల నిర్వహణ కోసం పాఠశాలలకు నిధులు అవసరం ఉంది. ఏటా సెప్టెంబరు నాటికే అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రభుత్వం విద్యా శాఖ ద్వారా మెయింట్‌నెన్స్ గ్రాంటు, స్కూల్ గ్రాంట్లను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది. అలా జమ అయ్యిన నిధులను పాఠశాల నిర్వహణకు, బోధనా సామగ్రి కొనుగోలుకు ఉపయోగిస్తుంటారు. ప్రాథమిక పాఠశాలలకు మెయింట్‌నెన్స్ కింద రూ.5 వేలు, స్కూల్ గ్రాంట్ కింద మరో రూ.5 వేలును ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలలకు మెయింట్‌నెన్స్ గ్రాంటు కింద రూ.7 వేలు, స్కూల్ గ్రాంట్ కింద రూ.5 వేలు విడుదల చేస్తుంది. వీటిని చిన్న చిన్న పనులకు, సున్నం వేయించడానికి, విద్యుత్ బిల్లులు చెల్లించడానికి, హ్యాండ్ బోర్లు, విద్యుత్ మోటర్లు రిపేరుకు వస్తే బాగు చేయించడానికి, చీపుర్లు కొనుగోలు చేయడానికి, స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే తదితర కార్యక్రమాల నిర్వహణకు వాడుతుంటారు. అలాగే పిల్లలకు పాఠాలు బోధించేటప్పుడు అవసరమైన బోధనోపకరణాల కొనుగోలుకు కూడా వీటిని వినియోగిస్తారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమై ఏడు నెలలు అవుతున్నా ఇంత వరకు ఆ కొద్దిపాటి నిధులను విడుదల చేయకపోవడంపై ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరో 3 నెలల్లో.. మరో మూడు నెలల్లో విద్యా సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ నిధులు ఇవ్వకపోతే ఎలాగని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. నూజివీడు మండలంలో 94 పాఠశాలలు, చాట్రాయిలో 52, ముసునూరులో 67, ఆగిరిపల్లి మండలంలో 58 స్కూల్స్ ఉన్నాయి. వీటన్నింటికి నిధులు విడుదల కాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు తమ జేబుల్లో డబ్బులను ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వీటిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా స్కూల్ గ్రాంట్, మెయింట్‌నెన్స్ గ్రాంటులను విడుదల చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
అప్పు అవసరం ఉండదు!
గద్వాలరూరల్ : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడుల సమయంలో అండగా నిలిచేందుకు ఖరీఫ్ నుంచి ఎకరాకు రూ.4 వేల పెట్టుబడి సాయం అందించనుంది. దీనికోసం గ్రామాల వారీగా కసరత్తు కూడా పూర్తయింది. ఈ పథకం నియోజకవర్గంలోని చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగకరంగా ఉండనుంది. నియోజకవర్గంలో చెరువులు, జూరాల ఆయకట్టు కింద పంటలు సాగుచేస్తున్నారు. వర్షాలు ఎక్కువగా కురిసిన సమయాల్లో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. దీంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వ్యవసాయాన్ని వదిలేసి వలస బాట పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎకరాకు రూ.4 వేల చొప్పున పంట పెట్టుబడులకు ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించడంతో రైతులు సంబరపడుతున్నారు. ఈ ఆర్థిక సాయం అందితే బీడుపొలాలు సైతం సాగులోకి వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. 24 గంటల విద్యుత్ అందిస్తుండటంతో వ్యవసాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఒక్క గట్టు మండలంలో మాత్రం నీటి వనరులు తక్కువగా ఉండటంతో రైతులు పెట్టుబడి సాయంతో ఊరట చెందనున్నారు. నష్టపోతామంటున్న కౌలు రైతులు.. ప్రభుత్వం పట్టాదారులకే పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించడంతో నియోజకవర్గ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో భూ యజమానులు వివిధ కారణాలతో భూమిసాగు చేయకపోవడంతో భూమిని ఇతర రైతులు కౌలుకు తీసుకొని సాగుచేస్తూ.. పెట్టుబడి, కష్టం, పంటలు నష్టపోయినా భరించేది కౌలు రైతులేనని వారు వాపోతున్నారు. భూ యజమానుల నుంచి ఎకరాకు రూ.20 వేల వరకు చెల్లించి సాగుచేస్తుండగా.. వాతావరణం అనుకూలిం చక, తెగుళ్లు వచ్చి పంట చేతికి రాకపోయినా నష్టపోవాల్సింది తామేనని, ఆరుగాలం కష్టపడి పండిస్తే కనీసం పెట్టుబడి చేతికి రావడం లేదని, మళ్లీ అప్పులు చేసి పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం కౌలు రైతులకు కూడా అందజేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ సాయంతో ఊరట ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి సాయంతో పంటల సాగు సమయంలో విత్తనాలు, మందులు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. చెక్కుల పంపిణీతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. అందుకు అనుగుణంగా అధికారులు పారదర్శకంగా పంపిణీ చేపట్టాలి. – తిరుమలరెడ్డి, వెంకంపేట సాగుచేసే రైతులకే ఇవ్వాలి భూ యజమానుల నుంచి రూ.18 వేలకు కౌలుకు తీసుకొని పంటలను సాగు చేస్తున్నాను. భూ యజమానులు పట్టణాల్లో నివసిస్తూ వారి పొలాలను కౌలుకు ఇస్తున్నారు. కష్టపడేది, పెట్టుబడి పెట్టేది మేము. ప్రభుత్వ సాయం కౌలు రైతులకు కాకుండా పట్టాదారులకు అందించడం ఎంతవరకు న్యాయం. – శేఖర్, షాబాద్ ప్రభుత్వానికి నివేదికలు పంపించాం ప్రభుత్వం ఎకరాకు రూ.4 వేలు పెట్టుబడిగా అందించేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రభుత్వ ఆదేశాల మేరకు వివరాలను సిద్ధం చేశాం. ప్రభుత్వం అడిగిన వెంటనే రైతుల వివరాలను అందజేశాం. ప్రభుత్వం మే నెల నుంచి చెక్కుల రూపంలో పెట్టుబడి సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది. – అశోక్‌వర్ధన్‌రెడ్డి, ఏడీఏ -
‘కౌలు’కు కష్టమే !
బూర్గంపాడు: పంటల సాగుకు ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయంపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే సర్కారు రూపొందించిన విధివిధానాలు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి. సాయం చేసే విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు రైతులను ఆలోచనలో పడేస్తున్నాయి. పంటలు సాగు చేసేవారికి కాకుండా భూముల పట్టాదారులకే పెట్టుబడి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కౌలురైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో ఏళ్ల తరబడి పోడుభూములు సాగుచేసుకుంటున్న గిరిజన రైతులకు కూడా పెట్టుబడి సాయం అందే పరిస్థితులు లేవు. దీంతో జిల్లాలో 35వేల మందికి పైగా రైతులకు నష్టం జరిగే అవకాశాలున్నాయి. కౌలురైతులకు మొండిచేయి... పంటల సాగుకు పెట్టుబడి ఖర్చులు అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం కేవలం భూములు పట్టాదారులకే సాయమందిస్తే... వాస్తవానికి ఆ భూముల్లో పంటలు సాగు చేసే కౌలురైతుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జిల్లాలో 28వేల మందికి పైగా కౌలురైతులున్నారు. వీరికి సాగు పెట్టుబడులకు బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వటం లేదు. కేవలం ప్రైవేటు వడ్డీలతో సాగు చేయాల్సి వస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, గిట్టుబాటు ధరలు దక్కకపోవటంతో ఏటా నష్టాలే చవిచూస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్లీ కౌలు వ్యవసాయమే చేస్తున్నారు. వరుస పంటనష్టాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల్లో ఎక్కువమంది కౌలురైతులే కావటం గమనార్హం. ఇప్పుడు ప్రభుత్వ పెట్టుబడి సాయం కూడా ఇవ్వబోమని ప్రకటించటం వారిని మరింత కుంగదీస్తోంది. పంటలు సాగు చేసేవారికి పెట్టుబడి సాయం అందించకుండా భూములు కౌలుకు ఇచ్చి పంటలు సాగుచేయని పట్టాదారులకు పెట్టుబడి సాయం ఇస్తే లాభమేమిటని కౌలురైతులు ప్రశ్నిస్తున్నారు. తమకే సాయమందించాలని కోరుతున్నారు. కాగా, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర రైతులకు కౌలు కూడా చెల్లదని అధికారులు చెబుతున్నారు. దీంతో కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని రైతుసంఘాల నాయకులు కోరుతున్నారు. అటవీ భూములకు సాయం పూజ్యం... ఏళ్ల తరబడి పోడుభూములు సాగుచేసుకుంటూ అటవీహక్కు పత్రాలు పొందిన గిరిజన రైతులకు కూడా పెట్టుబడి సాయం అందే పరిస్థితి లేదు. అటవీ హక్కులు కలిగిన భూములను రెవెన్యూ అధికారులు సాగు పెట్టుబడి పథకంలోకి తీసుకురాలేదు. దీంతో పోడుసాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు కూడా ప్రభుత్వం మొండిచేయి చూపించే పరిస్థితి నెలకొంది. గిరిజనేతర రైతులకు భూములున్నా పట్టాహక్కులు లేక సాయం అందటం లేదు. దీంతో జిల్లాలో సగం మందికి మాత్రమే పెట్టుబడి ఖర్చులు రానున్నాయి. ఏజెన్సీలోనే సాగు అధికం.. జిల్లాలో సాగు విస్తీర్ణం ఏజెన్సీ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంది. గిరిజనులు, గిరిజనేతరులు ఏళ్ల తరబడి పోగు వ్యవసాయం చేస్తున్నారు. వీరిలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ఐదెకరాల లోపు భూమి ఉన్నవారే మూడొంతుల మంది ఉన్నారు. గిరిజనేతర రైతులు తమకున్న ఎకరా, రెండెకరాలకు తోడు మరో నాలుగైదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పంటలు సాగుచేస్తున్నారు. కేవలం పంటల సాగుపైనే వీరి జీవనం ఆధారపడి ఉంది. పోడుభూములు సాగుచేసుకుంటున్న గిరిజన రైతులకు కూడా పదెకరాలలోపు భూములే ఉన్నాయి. వీరిలో చాలా మందికి అటవీహక్కు పత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఆ భూములకు కూడా పంట సాయం అందదని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతుల్లో కలవరం మొదలైంది. -
ఎస్సారెస్పీ కాల్వలకు మరో 750 కోట్లు
♦ నీటి పారుదల అధికారులతో సమీక్షలో మంత్రి హరీశ్‌రావు ♦ చిట్టచివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కాల్వల ఆధునీకరణ పనులకు మరో రూ.750 కోట్లు మంజూరు చేయనున్నట్టు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దీనిపై రెండు రోజుల్లో సమగ్ర అంచనాలతో ప్రతిపాదనలు పంపాలని ప్రాజె క్టు అధికారులను ఆదేశించారు. గురువారం ఎస్సారెస్పీ ప్రాజెక్టు అంశంపై మంత్రి సమీక్షించారు. ఈఎన్సీలు మురళీధర్, విజయప్రకాష్, సీఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సారెస్పీ ప్రధాన కాలువ పూడుకుపోవడంతో ఇంత కాలం భూపాలపల్లి, మహబూబా బాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజక వర్గాలు సాగునీటిని చూడలేదని.. వాటికి సాగునీరందించడానికి కాలువల ఆధునీకరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రధాన కాలువను 8,000 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించినా.. ఎన్నడూ 6 వేల క్యూసెక్కులకు మించి పారలేదన్నారు. ఈ నేపథ్యంలో ఆ కాలువను ఆధునీకరించి పూర్తి సామర్థ్యంతో నీరు పారేలా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. పూర్తి ఆయకట్టుకు నీరివ్వాల్సిందే.. ఎస్సారెస్పీ పరిధిలోని మొత్తం 9.68 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా పని చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు చేపట్టాలని.. రెవెన్యూ అధికారులతో సమన్వయంతో పనిచేసి పూర్తి ఆయకట్టు లక్ష్య సాధనకు ప్రయత్నించాలని సూచించారు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందించడం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని.. ఈ విషయంలో అలసత్వాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు. యుద్ధప్రాతిపదికన పనులు లోయర్ మానేరు డ్యామ్ ఎగువ, దిగువ ప్రాంతాల్లో మరమ్మతులు, ఇతర ఆన్ గోయింగ్ పనులు పూర్తి చేసి ఆయా కాలువలను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తొలుత చివరి ఆయకట్టుకు, అనంతరం సమీపంలోని ఆయకట్టుకు సాగునీటి పంపిణీ చేయాలని సూచించారు. సాగునీటి శాఖ అధికారులకు రెవెన్యూ సిబ్బంది సహకరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను హరీశ్‌రావు ఆదేశించారు. ఈ డిసెంబర్ కల్లా మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు డ్యామ్‌కు నీరందిస్తున్నామని, వచ్చే ఏడాది కాళేశ్వరంతో ఎస్సారెస్పీని అనుసంధానం చేస్తామని తెలిపారు. డిసెంబర్ కల్లా ఉదయ సముద్రం నల్లగొండ జిల్లాలోని ఉదయ సముద్రం ప్రాజెక్టును డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని.. 50 వేల ఎకరాలకు నీరివ్వాలని, 60 చెరువులు నింపాలని హరీశ్‌రావు ఆదేశించారు. ఏఎంఆర్పీ లోలెవల్ కెనాల్ భూసేకరణ కోర్టు కేసులను త్వరగా పరిష్కరించుకోవాలన్నారు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో 29 కిలోమీటర్ల పని పూర్తయిందని.. మిగతా 14.2 కిలోమీటర్ల పనులు వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని కోరారు. పెండ్లి పాకల రిజర్వాయర్ నిర్మాణంలో పెండింగ్‌లో ఉన్న 1994 ఎకరాల భూసేకరణకు వీలుగా సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులు, సాగునీటి శాఖ ఇంజనీర్లతో ఒక సమావేశం నిర్వహించాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్‌కు సూచించారు. -
ట్రాక్టర్లతో సరిపెట్టేశారు!
13 నియోజకవర్గాలకు 40 చొప్పున మంజూరు ఎస్డీపీ కింద రూ.12.85 కోట్లు కేటాయింపు ఇతర పరికరాలకు రూ.7.36 కోట్లు అనంతపురం అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు యాంత్రికీకరణ పథకానికి అనుమతులు మంజూరు చేసింది. అయితే ట్రాక్టర్లు, కొన్ని రకాల యంత్ర పరికరాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ వాటి ధరలు, రాయితీలు, విధి విధానాలు విడుదల చేయకపోవడంతో అమలు చేయడానికి వ్యవసాయశాఖ సిద్ధం కాలేని పరిస్థితి నెలకొంది. 2017–18 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే ఏప్రిల్, మే నెలల్లో యాంత్రికీకరణ పథకానికి అనుమతి ఇచ్చిఉంటే ఉపయోగరకంగా ఉండేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎస్డీపీ కింద రూ.20.21 కోట్లు బడ్జెట్ కేటాయింపు : ప్రస్తుతం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీపీ) కింద 520 ట్రాక్టర్లకు రూ.12.85 కోట్లు, ఇతర పథకం కింద మరికొన్ని యంత్ర పరికరాలకు రూ.7.36 కోట్లు మంజూరు చేసినట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ట్రాక్టర్ల విషయానికొస్తే జిల్లాకు 520 మంజూరు కాగా అందులో అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఒక్క ట్రాక్టర్ కూడా కేటాయించలేదు. మిగతా 13 నియోజక వర్గాలకు 40 చొప్పున కేటాయించారు. అధికారికంగా ఇన్చార్జ్ మంత్రి అనుమతులు తప్పనిసరి చేయడంతో అధికార పార్టీకి చెందిన నేతలు తమ అనుచరులకు ఇచ్చుకునే పరిస్థితి నెలకొనడంతో సామాన్య రైతులకు ట్రాక్టర్లు దక్కే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇకపోతే జిల్లా వ్యవసాయశాఖ రూ.40.93 కోట్లు బడ్జెట్‌తో 14,739 యూనిట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపింది. రూ.20.21 కోట్ల బడ్జెట్‌తో ట్రాక్టర్లు, కొన్ని యంత్రపరికరాలకు అనుమతివ్వడం గమనార్హం. -
ఎట్టకేలకు టీచర్ గ్రాంట్ విడుదల
-12,395 మందికి రూ.61.97 లక్షలు -322 స్కూల్ కాంప్లెక్స్‌ల నిర్వహణకు రూ.35.42లక్షలు రాయవరం : పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు బోధనాభ్యసన సామగ్రి(టీఎల్ఎం) తయారీ నిమిత్తం సర్వశిక్షాభియాన్ ఎట్టకేలకు టీచర్ గ్రాంట్ విడుదల చేసింది. జిల్లాలో ఉన్న 12,395 మంది టీచర్లకు రూ.61,97,500 విడుదల చేస్తూ ఎస్ఎస్ఏ పీవో ఎం.శేషగిరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీచర్‌కు రూ.500 వంతున 20016–17 విద్యా సంవత్సరంగానికి విడుదల చేశారు. గత రెండేళ్లుగా టీచర్ గ్రాంట్ విడుదల కాకపోగా ఈ విద్యా సంవత్సరం చివర్లో విడుదల చేయడం గమనార్హం. ప్రాథమిక పాఠశాలల్లోని 7,960 మంది ఉపాధ్యాయులకు రూ.39.80 లక్షలు, 2,013 మంది ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు రూ.10,06,500, ఉన్నత పాఠశాలల్లో ఆరు, ఏడు, ఎనిమిది తరగతులు బోధించే 2,422 మందికి రూ.12.11 లక్షలను విడుదల చేశారు. జిల్లాలో ఉన్న 322 స్కూల్ కాంప్లెక్స్‌లకు తొలి విడతగా రూ.11 వేల వంతున రూ.35.42లక్షల విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు. టీచర్, స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్ల వినియోగానికి మార్గదర్శకాలను కూడా ఉత్తర్వుల్లో పొందపర్చారు. టీచర్ గ్రాంట్ మార్గదర్శకాలు టీచర్ గ్రాంట్‌కు సంబంధించి ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాలి. ప్లాస్టిక్ క్లే కొనవచ్చు. అదే సందర్భంలో ప్రింటెడ్ మెటీరియల్, రెడీమేడ్ వస్తువులు కొనరాదు. వర్కింగ్ మోడల్స్, లైవ్ లెసన్ సీడీ/డీవీలు, టీఎల్ఎం ప్రిపరేషన్ సీడీలు కొనవచ్చు. లెసన్ వీడీయోలు, పీపీటీలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్ వినియోగం ఇలా.. ప్రతి స్కూల్ కాంప్లెక్స్‌కు రూ.22 వేలను విడుదల చేశారు. ఈ నిధుల్లో రూ.10వేలను కంటింజెన్సీ నిమిత్తం. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం టీఏ నిమిత్తం రూ.5 వేలు, టీఎల్ఎం గ్రాంట్ నిమిత్తం రూ.7వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కంటింజెంట్ గ్రాంట్‌ను.. ఆర్వోటీల మెయింటెనెన్స్, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రిజిస్టర్స్, రికార్డ్స్, స్టేషనరీ, ఉపాధ్యాయుల బోధనకు సంబంధించిన రిఫరెన్స్ పుస్తకాలు, విద్యా సంబంధమైన సీడీల కొనుగోలుకు వినియోగించాలి. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం తన పరిధిలోని పాఠశాలలను సందర్శించాలి. టీఏ బిల్లుగా నెలకు రూ.500 వంతున ఏడాదికి రూ.5 వేలు కేటాయించారు. పాఠశాల మానిటరింగ్, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల హెచ్ఎంలతో సమావేశానికి ఈ నిధులను వినియోగించాలి. మంచి టీఎల్ఎం కొనుగోలు చేయాలి.. బోధనాభ్యసన సామగ్రి కొనుగోలుకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను పాఠశాలలకు పంపించాం. టీచర్ గ్రాంట్‌తో పాఠశాలల్లో ఆకర్షణీయమైన బోధనా సామగ్రిని సమకూర్చుకోవాలి. – మేకా శేషగిరి, పీవో, ఎస్ఎస్ఏ సద్వినియోగం చేసుకోవాలి.. ఉపాధ్యాయులకు టీఎల్ఎం గ్రాంట్‌ను పాఠశాల ఖాతాలకు విడుదల చేశాం. ఈ నిధులతో బోధనాభ్యసన సామగ్రిని కొనుగోలు చేసుకుని సమర్ధవంతమైన బోధన చేపట్టాలి. – చామంతి నాగేశ్వరరావు, ఏఎంవో, ఎస్ఎస్ఏ -
సర్వశిక్షా అభియాన్ నిధులు విడుదల చేయాలి
నల్లగొండ టూటౌన్: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక విద్య నిధులు విడుదల చేయలేదని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక యూటీఎప్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు విడుదల చేసిందని, రాష్ట్రం నుంచి 40 శాతం విడుదల చేయాల్సి ఉండగా నేటికి విడుదల చేయకపోవడంతో కేంద్రం నుంచి రావల్సిన రూ.1830 కోట్లు ఆగిపోయాయని తెలిపారు. ప్రభుత్వం నిధులను త్వరగా విడుదల చేసి అవసరమైన పాఠశాలలకు ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. కంప్యూటర్ విద్యకు నిధులు అదనంగా విడుదల చేయాలని కోరారు. జిల్లాలో 700 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టారని, ఆయా పాఠశాలలు అస్తవ్యస్తంగా ఉన్నాయని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం కేజీ నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ కోసం ప్రత్యేకాధికారిని నియమించాలని కోరారు. మధ్యాహ్నాం భోజన ఏజన్సీలకు పారితోషికం పెంచాలని, విద్యార్థులకు మెస్ చార్జీలను పెంచాలని హైస్కూల్ విద్యార్థులకు రూ.12, ప్రాథమిక విద్యార్థులకు రూ.10లకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్. రాములు, జిల్లా అధ్యక్షుడు ఎం. రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎడ్ల సైదులు, వెంకటేశం, ఎం. యాదయ సైదులు, శ్రీనివాసాచారి, అనిల్, మురళయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
హడ్కో రుణాన్ని గ్రాంట్‌గా మారుస్తాం
నగర మేయర్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు, సిటీ: నగర పాలక సంస్థ పరిధిలోని భూగర్భడ్రైనేజీ, తాగునీటి పథకాలకు సంబంధించి హడ్కో రుణాలను గ్రాంట్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ప్రజలపై భారం లేకుండా చేస్తామని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ విభాగం ఎస్ఈ మోహన్, ఇంజనీరింగ్ అధికారులతో శనివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో భూగర్భ, తాగునీటి పథకాలకు సంబంధించి 10శాతం పనులు ఇప్పటికే చేపట్టినట్లు తెలిపారు. సంగం బ్యారేజీ నుంచి నీటిని పైప్లైన్ల ద్వారా నీటిని తీసుకువచ్చి శుద్ధిచేసి నగర ప్రజలకు అందజేస్తున్నామన్నారు. నగరంలో 32 ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నామని, ఇప్పటికే ఏడు ట్యాంకులు ప్రారంభించినట్లు తెలిపారు. ‘సాక్షి’లో ‘రుణమా..సాయమా’ శీర్షికన శనివారం ప్రచురితమైన కథనంపై స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 90 శాతం వరకు ఆర్థిక భారం భరిస్తుందని, ప్రజలపై ఎటువంటి భారం లేకుండా చేస్తున్నామన్నారు. హడ్కో రుణాలను గ్రాంటు క్రింద మార్చేందుకు ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడు, మున్సిపల్ మంత్రి నారాయణ ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
పైసా లేకుండా పారిశుద్ధ్య పనులెలా?
బోట్‌క్లబ్ (కాకినాడ) : ప్రస్తుతం జిల్లాలో పారిశుద్ధ్య లేమి కారణంగా ప్రజలు పలు అనారోగ్యాలకు గురవుతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో రోజురోజుకీ ఆసుపత్రి పాలయ్యేవారి సంఖ్య పెరిగిపోతోంది. డెంగీ జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఉన్నతాధికారులు గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ కార్యదర్శులను ఆదేశిస్తున్నారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన 14 ఆర్థిక సంఘ నిధులు ఇవ్వకపోవడంతో జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలు పైసా కూడా లేదు. దీంతో ప్రస్తుతం పారిశుద్ధ్య పనులు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో సర్పంచులు, కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో 1069 గ్రామ పంచాయతీలుండగా వీటిలో 350కిపైగా మేజర్ పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీల్లో నిధులకు అంతగా ఇబ్బందులు లేవు. మిగిలిన 719 పంచాయతీల్లో సగానికిపైగా పంచాయతీల్లో డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. పారిశుద్ధ్య పనులు చేసేందుకు ఆర్థిక సమస్యలు తలెత్తడంతో డ్రైయిన్‌లో పూడిక తీత, రోడ్లపై చెత్త పేరుకుపోతోంది. ఇంటి పన్నులు మీద వచ్చే ఆదాయం గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికే సరిపోతోంది. ఇక పారిశుద్ధ్య పనులు చేసే అవుట్ సోర్సింగ్ ఇబ్బందికి నెలనెలా జీతాలు ఇవ్వడానికి, కచ్చా డ్రైయిన్లు తవ్వేందుకు, విద్యుత్ దీపాలు మెయింటినెన్స్‌కు డబ్బులు సరిపోని పరిస్థితి ఉంది. ఆర్థిక సంఘ నిధులేవీ... గత మార్చి నెల్లో ఇవ్వాల్సిన 14వ ఆర్థిక సంఘ నిధులు ఇంకా పంచాయతీలకు ఇవ్వలేదు. సంవత్సరానికి రెండు దఫాలుగా 14వ ఆర్ధిక సంఘ నిధులు గ్రామ పంచాయతీలకు జమ చేస్తుంటారు. గత మార్చిలో జిల్లాకు రావాల్సిన రూ. 74.78 కోట్లు ఇంకా జమకాలేదు. దీంతో పలు గ్రామ పంచాయతీ అకౌంట్స్ జీరో బ్యాలెన్స్‌లో ఉన్నాయి. జిల్లాలోని పెద్దాపురం మండలం తాటిపర్తి, తిరుపతి, కిర్లంపూడి మండలం గోనాడ, పాలెం, గండేపల్లి మండలం మురారి, ఎస్ . తిమ్మాపురం, ప్రత్తిపాడు మండలం రాచపల్లి, తుని మండలం డి పోలవరం, అనపర్తి మండలం పేర రామచంద్రపురం, కెగంగవరం మండలం దంగేరు, కడియం మండలం మురముండ,మండపేట మండలం మారేడుబాక, రామచంద్రపురం మండలం చోడవరం, ఉప్పలగుప్తమండలం భీమనపల్లి, నంగవరం, పిగన్నవరం మండలం ముంగడపాలెం, ఆత్రేయపురం , ముమ్మిడివరం మండలం గేదెల్లంక తదితర గ్రామాల్లో రూపాయి కూడా లేదు. అప్పులు చేసి పారిశుద్ధ్య పనులు... ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధా్యనికి ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా రోజు గ్రామాల్లోని రోడ్డుపై పేరుకొనపోయిన చెత్తా, చెదారం , డ్రైయిన్‌లోని పూడిత తీయడం, మంచినీటి పథకాలు శుభ్రం చేయడం, రోడ్లుపై తడిగా ఉన్నా ప్రాంతాల్లో బ్లీచింగ్ జల్లడం వంటి పనులు చేయాలని సర్పంచులు, కార్యదర్శులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఉన్న సిబ్బందితో ఈ కార్యక్రమాలు చేయాలంటే కష్టం కావడంతో తాత్కాలిక సిబ్బందిని నియమించి పనులు చేస్తున్నారు. వీరికి డబ్బులు ఇచ్చేందుకు సర్పంచి, కార్యదర్శులు అప్పులు చేస్తున్నారు. -
నేటి నుంచి రూపాయికే నల్లా కనెక్షన్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మిగిలిన 73 నగర, పురపాలక సంస్థల పరిధిలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రూపాయికే నల్లా కనెక్షన్లను మంజూరు చేయాలని ఆదేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ కానున్నాయి. రెండు వారాల కిందే ఉత్తర్వులు జారీ కావాల్సి ఉన్నా, పాలేరు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వాయిదా వేసుకుంది. ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ సన్నద్ధమైంది. తెల్లరేషన్‌కార్డు ఉన్న కుటుంబాలకు ఈ పథకం కింద రూపాయికే నల్లా కనెక్షన్ మంజూరు చేయనున్నారు. కనెక్షన్ కోసం కావాల్సిన పైపులతో పాటు రోడ్డు తవ్వకాల వ్యయాన్ని సైతం స్థానిక పురపాలికలే భరిస్తాయి. -
అసంపూర్తి పనులకు నిధులివ్వండి
♦ పాతవి పూర్తయితేనే కొత్త పనులు మంజూరు ♦ ‘ఉపాధి’లో లక్ష్యసాధన ఆధారంగా పదోన్నతులు ♦ గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, రంగారెడ్డి జిల్లా : ‘గ్రామీణాభివృద్ధిలో భాగంగా తలపెట్టిన పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలి.. మధ్యలో పనులు ఆపితే కొత్తగా పనులు మంజూరు చేసేది లేదు. పురోగతి ఆధారంగానే నిధులు ఇస్తాం.’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో గ్రామీణాభివృద్ధి, అనుబం ధ సంస్థల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, సంజీవరావు, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రాంచంద్రన్ హాజరయ్యారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులపై సమీక్షిస్తూ మంత్రి పైవిధంగా స్పందించారు. లక్ష్యసాధనతోనే ప్రమోషన్లు.. ఉపాధి హామీ ఉద్యోగులకు ఇకపై పనితీరు, నిర్దేశించిన లక్ష్యాల సాధన ఆధారంగానే పదోన్నతు లిస్తామని మంత్రి చెప్పారు. లక్ష్యసాధనలో వెనకబడితే వారికి పదోన్నతి కష్టమన్నారు. ఉపాధి పని కల్పన కోసం కొత్తగా టోల్‌ఫ్రీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఉపాధిహామీ పథకానికి హరితహారాన్ని జోడిస్తున్నామని, అదే విధంగా ఇంకుడు గుంతలు కూడా ఈ పథ కం కింద తవ్వించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంగన్వాడీ, పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించి పనులు వేగవంతం కావాలని, అసంపూర్తి భవనాలుంటే కొత్తవి మంజూరు చేయబోమన్నారు. అన్ని గ్రామపంచాయతీల్లో వందశాతం శానిటేషన్ అమలయ్యే లా చూడాలన్నారు. మూడు నెలలకోసారి పం చాయతీరాజ్ రోడ్లు, ఉపాధిహామీ పురోగతిపై సమీక్షలు నిర్వహిస్తానన్నారు. సమావేశంలో జేసీ ఆమ్రపాలి, డీఆర్డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ హరిత, డీపీఓఅరుణ పాల్గొన్నారు. ఆ మంత్రి ఎవరు? అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలపై సమీక్షలో భాగంగా.. ‘జిల్లాలో అక్రమ లేఅవుట్లు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి. వాటిలో నిర్మాణా లు సైతం అదేస్థాయిలో కొనసాగుతున్నాయి. వీటిని అరికట్టడంలో పంచాయతీ శాఖ నిర్తిప్తత పాటిస్తున్నట్లుంది’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అభిప్రాయపడ్డారు. దీంతో జిల్లా పంచాయతీశాఖ అధికారి అరుణ స్పందిస్తూ.. అక్రమ లేఅవుట్లను గుర్తించి వాటిని కూల్చివేసే సందర్భంలో మంత్రి నుంచి ఫోన్లు రావడం.. దాంతో జేసీబీ, ప్రొక్లెయన్లతో వెనుదిరగడం జరిగిందని వివరించారు. ఇంతలో మంత్రి మహేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. జిల్లా మంత్రిగా నేను ఎన్నడూ డీపీఓకు ఫోన్ చేయలేదన్నారు. తనకు ఫోన్ చేసిన మంత్రి ఎవరో వివరాలు బయటపెట్టాలని నిలదీశారు. అక్రమాలను ఉపేక్షించొద్దని.. వాటిని కూల్చివేయాలన్నారు. ఇంతలో ఆమె మౌనం వహించడంతో అక్కడ కొంత నిశబ్ద వాతావరణం నెలకొంది. వెంటనే మంత్రి జూపల్లి జోక్యం చేసుకుంటూ ఇబ్బందులుంటే జిల్లా మంత్రితో సమావేశమై సమస్యల్ని పరిష్కరించుకోవాలంటూ ఇతర అంశాలపై సమీక్షను కొనసాగించారు. మంత్రి ఫోన్‌తో కూల్చివేతలు నిలిపివేసినట్లు డీపీఓ చెబుతున్న సందర్భంలో మంత్రి మహేందర్‌రెడ్డి కలగజేసుకోవడం.. సభలో అంతర్గత చర్చకు దారితీసింది. -
సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట కలిగింది. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావా కేసుకు సంబంధించి ఆయనకు ఢిల్లీ కిందిస్థాయి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం కేజ్రీవాల్ తోపాటు మరో ఐదుగురు ఆప్ నేతలకు కూడా గురువారం బెయిలిచ్చింది. తన పరువుకు నష్టం కలిగేలా అవాస్తవాలతో కూడిన ప్రకటనలను సీఎం కేజ్రీవాల్ ఆయన పార్టీ నేతలు విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజ్పేయ్లపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించి వారిని ఈ రోజు(ఏప్రిల్ 7న) కోర్టుకు హాజరుకావాల్సిందిగా కిందిస్థాయి కోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగానే వారికి బెయిల్ మంజూరు చేసింది. అరవింద్ కేజ్రీవాల్‌కు పార్టీ సలహాదారు,ఎమ్మెల్యే గోపాల్ మోహన్ జామీనుగా ఉండగా ఢిల్లీ మంత్రి ఇమ్రాన్ అశుతోష్‌కు నరేశ్ బాల్యాన్ సంజయ్ సింగ్ కు, నితిన్ త్యాగి కుమార్ విశ్వాస్‌కు జామీన్లుఆ ఉన్నారు. ఒక్కొక్కరి వద్ద రూ.20 వేల పూచికత్తు కోర్టుకు సమర్పించారు. ఈ కేసు విచారణ సందర్బంగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కూడా కోర్టుకు హాజరయ్యారు. -
జిల్లాకు 4,850 ఇళ్లు
♦ నిర్మాణానికి రూ.302 కోట్లు మంజూరు ♦ లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు జరిగితే చర్యలు ♦ రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి తాండూరు: డబుల్ బెడ్రూం ఇళ్లతో పేదల సొంతింటి కలను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేయనుందని రవాణా శాఖ మంత్రి పి.మహేం దర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మంత్రి యాలాల మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని కుత్బుల్లాపూర్, మేడ్చల్, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల, పరిగి, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో 4,850 ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.302 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు. అర్బన్‌లో 1,240 ఇళ్లకు రూ.75 కోట్లు, గ్రామీణ జిల్లాకు 4,850 ఇళ్లు ప్రాంతంలో 3,610 ఇళ్ల నిర్మాణాలకు రూ.2,77 కోట్లు మంజూరైనట్టు మంత్రి వివరించారు. గ్రా మీణ ప్రాంతంలో ఒక్కో ఇంటికి రూ.6.29 ల క్షలు, అర్బన్ ప్రాంతంలో రూ.5.30 లక్షలు ని ర్మాణ వ్యయం అవుతుందన్నారు. స్థానిక తహసీల్దార్లు లబ్ధిదారులను ఎంపిక చేస్తారని, ఈ విషయంలో పొరపాట్లు జరిగితే తహసీల్దార్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా జరుగుతుందన్నారు. అర్హులైన పేదలకు అన్ని సౌకర్యాలతో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి అందజేస్తామన్నారు. -
అండగా నిలవండి, చేయూతనివ్వండి
-
20,950 కోట్ల గ్రాంట్ ఇవ్వండి
14వ ఆర్థిక సంఘానికి రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదనలు 25 రంగాల్లో చేపట్టే అభివృద్ధి పనులతో వివరణ కొత్తగా ఏర్పడిన రాష్ర్టంలో 25 రంగాల అభివృద్ధికి రూ. 20,950 కోట్లను గ్రాంట్‌గా ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. తద్వారా తన ప్రాధాన్యాలను తెలియజేసింది. ముఖ్యమైన ఈ రంగాల్లో సేవల లోటును పూడ్చడానికి తగిన నిధులిచ్చి సహకరించాలని కోరింది. అలాగే నిధుల విడుదల విషయంలో నిబంధనలను సవరించాలని, జాప్యాన్ని అరికట్టాలని సూచించింది. పేద రాష్ట్రాల విషయంలో షరతులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రం రంగాల వారీగా కోరిన నిధులు, దానిపై వివరణ. - సాక్షి, హైదరాబాద్ ఎస్సీల అభివృద్ధి: రూ. 133.60 కోట్లు ఎస్సీ హాస్టళ్లు కూడా అద్దె భవనాల్లో ఉన్నాయి. ఉన్న హాస్టళ్లకు ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తున్నాం. కొత్త భవనాల నిర్మాణాలకు నిధులు అవసరం. 167 హాస్టల్ భవనాలకు నిధులు కావాలి. రోడ్లు, బ్రిడ్జిల నిర్వహణ: రూ. 1,000 కోట్లు 24,733 కిలోమీటర్ల పొడవున ఉన్న అంతర్రాష్ర్ట రోడ్లు, బ్రిడ్జ్జిల నిర్వహణకు నిధులు కావాలి. 63,341 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. వాటి నిర్వహణతో పాటు శిథిలావస్థకు చేరిన 207 బ్రిడ్జిల మరమ్మతులు, రోడ్డు భద్రతా చర్యలకు నిధులు కావాలి. వెనుకబడిన తరగతుల సంక్షేమం - విద్య, మౌలిక సదుపాయాలు: రూ. 273.70 కోట్లు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. టాయిలెట్లు, ప్రహరీ గోడలు, తాగునీటి సదుపాయాలు సరిగా లేవు. 119 హాస్టల్ భవనాలు నిర్మించాల్సి ఉంది సీడ్ బ్యాంకు పథకం: రూ. 500 కోట్లు దేశంలోనే ప్రముఖ విత్తనాభివృద్ధి కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించాం. విత్తనోత్ప త్తి రంగంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఫిషరీస్ డెవలప్మెంట్: రూ. 23 కోట్లు చేపల చెరువులు, రొయ్యల హేచరీస్‌ల అభివృద్ధికి ఈ నిధులను ఖర్చు చేస్తాం. డైరీ డెవలప్మెంట్ : రూ. 241 కోట్లు పాల సేకరణ పెంచేందుకు చర్యలు చేపడతాం. 10 మెట్రిక్ టన్నుల పాల పౌడర్ ప్లాంటును హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు, నిజమాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మిల్క్ చిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు వెచ్చిస్తాం. జ్యుడీషియల్ అడ్మినిస్ట్రేషన్ : రూ. 977.64 కోట్లు ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు వివిధ రకాల కోర్టుల ఏర్పాటు, భవనాల నిర్మాణాలకు, సదుపాయాల కల్పనకు వెచ్చిస్తాం. పోలీసు శాఖ: రూ. 1,691.75 కోట్లు పోలీసు శాఖ బలోపేతం, హైదరాబాద్‌లో సీసీటీవీల ఏర్పాటు, బలగాల అప్‌గ్రేడేషన్, వసుతుల మెరుగుకు ఖర్చు చేస్తాం. జైళ్ల అభివృద్ధి, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణం, ఆధునీకరణకు రూ. 135.82 కోట్లు కావాలి. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్: 614కోట్లు హైదరాబాద్‌లో అన్ని స్థాయిల్లో ఫైర్ సేవలను అభివృద్ధి చేస్తాం. వేగంగా చర్యలు చేపట్టే విధంగా సదుపాయాలు కల్పిస్తాం. డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్, డీపీసీ: రూ. 250 కోట్లు ప్రణాళిక విభాగాల వికేంద్రీకరణకు, జిల్లాల్లో అభివృద్ధికి ఈ నిధులు అవసరం. పర్యావరణం: రూ. 100 కోట్లు బస్సుల్లో మొబైల్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్లు, అవగాహన కార్యక్రమాలకు, కాజీపల్లి, ఆశని కుంటలో సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్కు వెచ్చిస్తాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి: రూ. 1,091.25 కోట్లు టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ అభివృద్ధి, ఐటీఐఆర్‌లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు, ఇంటర్నెట్ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాల కల్పన టూరిజం, ఆర్కియాలజీ: రూ. 203.05 కోట్లు వారసత్వ సంపదను కాపాడేందుకు, టూరి జాన్ని విస్తరింపజేసేందుకు వీటిని వెచ్చిస్తాం. ప్రోగ్రాం మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అథారిటీకి రూ. 50 కోట్లు మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ చర్యలు చేపడతాం. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థకు: 100 కోట్లు బడ్జెట్, రెవెన్యూ, ఖర్చులు, ఖాతాలు, మానవ వనరుల నిర్వహణకు ఈ నిధులను వెచ్చిస్తాం. గిరిజన సంక్షేమానికి రూ. 355.84 కోట్లు గిరిజన సంక్షేమానికి, విద్యాసంస్థలు, మౌలిక సదుపాయల కల్పన, ట్రైబల్ కల్చర్ రీసర్చ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు నిధులు అవసరం. నీటి రంగం నిర్వహణ, వాటర్ గ్రిడ్‌కు రూ. 7,700 కోట్లు గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, రక్షిత తాగునీటి అవసరాలు, ప్రాజెక్టులు, చెరువులు, కాలువల మరమ్మతులకు వెచ్చిస్తాం. ఆరోగ్య రంగం బలోపేతానికి రూ.500 కోట్లు తెలంగాణలో నిమ్స్ తరహాలో 12 ఆసుపత్రులను అభివృద్ధి చేస్తాం. అడవుల నిర్వహణ, తెలంగాణ హరిత హారం: రూ. 1,046.5 కోట్లు అటవీ అభివృద్ధి, వన్యప్రాణి సంరక్షణ, సామాజిక అడవుల పెంపకం, హరితహారం, అటవీ పరిశోధ న, ఐటీ వినియోగం వంటి కార్యక్రమాలను చేపడుతున్నాం. వచ్చే మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు పెంచుతాం. ఉన్నత విద్య బలోపేతం: రూ. 900 కోట్లు కొత్త యూనివర్సిటీలకు, పీజీ సెంటర్లకు అదనపు నిధులు కావాలి. రాష్ట్రం ఇచ్చే నిధులు వేతనాలు, రోజువారీ నిర్వహణకు సరిపోతున్నాయి. కొత్త భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు నిధులు అవసరం. ప్రాథమిక విద్య (ఎస్ఎస్ఏ): రూ.1,327.38 కోట్లు సర్వశిక్ష అభియాన్ ద్వారా ఇస్తున్న నిధులు సరిపోవడం లేదు. వేతనాల ఖర్చే ఎక్కువగా ఉంది. ప్రతి మూడు నెలలకు 14,277 మంది టీచర్ల వేతనాలకు, యూనిఫారాలకు అదనంగా నిధుల కావాలి. పాడి పరిశ్రమ రంగంలో మౌలికవసతులు: రూ. 106.36 కోట్లు పశుగణాభివృద్ధిలో భాగంగా ఎమర్జెన్సీ వెటర్నరీ ఆంబులెన్స్ సర్వీసుకు, పశువుల వ్యాధి నిర్ధారణ ప్రాంతీయ ల్యాబ్‌లు, జిల్లా స్థాయి ల్యాబ్‌ల ఏర్పాటు, గ్రామాల్లో వెటర్నరీ వసతుల కల్పనకు వెచ్చిస్తాం. ఇండస్ట్రియల్ పార్కుల నిర్వహణ: రూ. 313.36 కోట్లు పాత ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన విద్యుత్ రంగం, వ్యవసాయ ఫీడర్ల విభజన: రూ.1,316 కోట్లు గ్రామీణ గృహాలు, వాణిజ్య కేటగిరీలతో విద్యుత్ సరఫరా. వ్యవసాయానికి 7 గంట ల ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలి. ఇందుకోసం వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను విభజించాల్సి ఉంది. -
వడదెబ్బ, పిడుగుపాటు మరణాలకూ పరిహారం ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: వడదెబ్బ, పిడుగుపాట్లతో సంభవిస్తున్న మరణాలను ప్రకృతి వైపరీత్యాలుగానే పరిగణించి ప్రకృతి విపత్తుల సహాయ నిధి(ఎస్డీఆర్ఎఫ్) కింద ఆదుకోవాలని 14వ ఆర్థికసంఘాన్ని రాష్ట్రప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్న ఈ తరహా మరణాలకు ఎస్డీఆర్ఎఫ్ వర్తించని కారణంగా బాధిత కుటుంబాలకు సరైన పరిహారం అందడం లేదని తెలిపింది. శుక్రవారం 14వ ఆర్థికసంఘంతో జరిగిన సమావేశంలో ప్రకృతి విపత్తుల కారణంగా రాష్ట్రానికి జరుగుతున్న నష్టం, దీని నివారణకు కేంద్రం పెంచాల్సిన సాయం తదితరాలపై ప్రభుత్వం నివేదించింది. రాష్ట్రంలో గత ఐదేళ్లలో వరుస కరువు, అకాలవర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాడ్పడ్డారని పేర్కొంది. పంటనష్టం 50 శాతం, అంతకంటే ఎక్కువ ఉంటేనే ఇన్పుట్ సబ్సిడీ వర్తిస్తుందన్న కేంద్రనిబంధన రైతాంగానికి ప్రతికూలంగా మారిందని రాష్ట్రప్రభుత్వం వివరించింది. అందువల్ల ఇన్పుట్ సబ్సిడీకి పంట నష్టం అర్హతని 50శాతం నుంచి 25శాతానికి తగ్గించాలంది. దెబ్బతిన్న పంట విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని సబ్సిడీని నిర్ణయించాలని విజ్ఞప్తి చేసింది. 2007 నుంచి 2013 వరకు ఎస్డీఆర్ఎఫ్ కింద మొత్తంగా రూ.4,676.61కోట్లు కేటాయించినప్పటికీ.. ఒకే ఏడాదిలో విపత్తులు ఎక్కువగా వచ్చినందున రూ.2,160కోట్లు ఎక్కువగా అంటే రూ.6.836.97కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపింది. రాష్ట్రం అదనంగా ఖర్చు చేసిన మొత్తాన్ని కేంద్రం 75:25 నిష్పత్తిలో భరించాలని కోరింది. 1997 నుంచి ఆత్మహత్యలు 3,317.. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ప్రతిఏటా సగటు వర్షపాతంతో పోలిస్తే 18 నుంచి 24శాతం తక్కువ వర్షపాతం నమోదవుతోందని వాతావరణ శాఖ తేల్చిందని,తక్కువ వర్షపాతం కారణంగా కరవు రాష్ట్రాల్లో రాజస్థాన్ తర్వాత తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉందని తెలిపింది. 1997 నుంచి 2013 వరకు రాష్ట్రం వరుసగా పది ఏడాదుల్లో కరవును ఎదుర్కొనగా, 2009 నుంచి వరుసగా కరువు ఏర్పడింది. దీంతో 1997 నుంచి 2011 వరకు 3,317మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. -
కేసీఆర్ ప్రస్తావించిన పలు అంశాలు
కేంద్రానికి పన్నేతర ఆదాయం విపరీతంగా పెరుగుతోంది. సముద్రతీర రాయల్టీ, స్పెక్ట్రమ్ అమ్మకం, పెట్టుబడుల ఉపసంహరణతో భారీ ఆదాయం లభిస్తోంది. వీటన్నింటిలో రాష్ట్రానికి వాటాను పంచాలి. సెస్సు, సర్‌చార్జీలు విధించడం వల్ల వచ్చే ఆదాయాన్ని కూడా రాష్ట్రాలకు ఇవ్వాలి. 40 శాతం కేంద్ర పన్నులను రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల.. కేంద్ర వ్యయంలో కేవలం ఐదు శాతం మాత్రమే తగ్గుతుంది. ఈక్విటీ పారామీటర్లలో ఎక్కువ వెయిటేజీ ఇవ్వడం వల్ల మధ్యాదాయ రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాలో భారీగా కోతపడుతోంది. రాష్ట్రాల ద్రవ్య, రెవెన్యూ లోటు పరిమితిని కేంద్రంతో సమానంగా రాష్ట్రాలకు ఇవ్వాలి. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని రాష్ట్రాలపై రుద్దుతున్నారు. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని పాటిస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలివ్వాలి.కొత్త రాష్ట్రాలకు ఈ చట్టంలో మినహాయింపులు ఇవ్వాలి. ఆర్థిక సర్దుబాటును సమర్థంగా అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ జాతీయ సంస్థ(ఎన్ఐపీఎఫ్పీ) అధ్యయనం ప్రకారం 1998-99లో సబ్సిడీల మొత్తం రూ. 2,35,752 కోట్లు కాగా, ఇందులో రాష్ట్రాల మీద పడిన భారం ఏకంగా రూ. 1,55,924 కోట్లు. అంటే 66 శాతం. ఇది రాష్ట్రాలకు ఆర్థికంగా భారంగా మారుతోంది. అందువల్ల సబ్సిడీ భారాన్ని కేంద్రం, రాష్ట్రాల మధ్య సమంగా పంచాలి. అలాగే రాష్ట్రాలు భరించే సబ్సిడీ భారాన్ని కేంద్రం కూడా భరించాలి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రెవెన్యూ మిగులు కష్టం. తద్వారా మూలధన పెట్టుబడి సాధ్యం కాదు. కావున రెవెన్యూ ఖాతాలోకి కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరిగితే తప్ప సాధ్యం కాదు. టోకుమొత్తంలో డీజిల్ కొనుగోలుదార్ల(రైల్వే, ఆర్టీసీ, విద్యుత్ సంస్థలకు)కు మార్కెట్ ధరకు డీజిల్ విక్రయించడం వల్ల.. ప్రజా రవాణా వ్యయం పెరుగుతోంది. ప్రైవేట్ రవాణా పెరిగి కాలుష్యానికి దారితీస్తోంది. ప్రణాళిక పథక రచనలో ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్సుల(నాన్ శాలరీ)ను పరిగణలోకి తీసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్రం ప్రస్తుతం ఇస్తున్న 75 శాతం నష్టపరిహార వాటాను 90 శాతానికి పెంచాలి. సామాజిక న్యాయం మరింత పకడ్బందీగా అమలు కావాలంటే.. రాష్ట్రాలకు నిధులు అధికంగా ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే పౌర సేవల ధర నిర్ణయాధికారంపై కమిషన్ ఎలాంటి నియంత్రణను సిఫారసు చేయొద్దు. -
తెలంగాణలో ఆదాయం అంతగా లేదు!
సమైక్య రాష్ర్టంలో వచ్చినంత ఆదాయం ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టంలో రాదని కేంద్ర ఆర్థిక సంఘానికి రాష్ర్ట ప్రభుత్వం వివరించింది. అందువల్ల సవరించిన ఆదాయాన్నే పరిగణనలోకి తీసుకుని తగినన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ‘‘సమైక్య రాష్ట్రంలో ఎక్కడ అమ్మకాలు జరిగినప్పటికీ హైదరాబాద్‌లోనే విలువ ఆధారిత పన్ను(వ్యాట్) చెల్లించారు. బెవరేజ్ కార్పొరేషన్ కూడా ఇలాగే వ్యాట్ చెల్లించింది. సచివాయలం, అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉండటం... పే అండ్ అకౌంట్స్ ఆఫీసూ ఉండటంతో అన్ని చెల్లింపులు ఇక్కడే జరుగుతూ వచ్చాయి. తద్వారా వ్యాట్ ఆదాయంలో హైదరాబాద్‌కు 80 శాతం వస్తుందని లెక్కలు చెబుతున్నాయి. ఇదే అభిప్రాయమూ ఇప్పుడూ కొనసాగుతోంది. ఆయిల్ కంపెనీలు 30 శాతం వ్యాట్ చెల్లింపులను హైదరాబాద్‌లోనే చేస్తున్నాయి. వాస్తవ వినియోగం మాత్రం 8 శాతం మాత్రమే. 2012-13 ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుంటే ఆయిల్ కంపెనీల నుంచి వచ్చే వ్యాట్ ఆదాయం తెలంగాణలో 48 శాతం కాగా, ఆంధ్రాలో 52 శాతం. బెవరేజ్ కార్పొరేషన్ వాస్తవ అమ్మకాలను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ ఎక్సైజ్ ఆదాయం 45 శాతం మాత్రమే. ఇందులో హైదరాబాద్ వాటా 8 శాతమే. కేవలం 850 ప్రధాన డీలర్లను పరిగణనలోని తీసుకుని మొత్తం వ్యాట్ ఆదాయంలో తెలంగాణ వాటా 53 శాతమని లెక్కించారు. ఇది సరికాదు. వ్యాట్ ఆదాయంలో తెలంగాణ వాటా 42 నుంచి 44 శాతం మాత్రమే ఉంటుంది. పన్నుల ఆదాయంలో దీనినే పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాం. దీని ఆధారంగానే ఐదేళ్ల పాటు రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేయాలని అభ్యర్థిస్తున్నాం’’ అని రాష్ర్ట ప్రభుత్వం మొరపెట్టుకుంది. -
అండగా నిలవండి, చేయూతనివ్వండి
కొత్త రాష్ట్రం.. 9 జిల్లాలు వెనుకబడ్డవే ఆర్థికంగా చేయూతనివ్వండి 14వ కేంద్ర ఆర్థిక సంఘానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలంటే అధిక నిధులివ్వండి అనుకున్న స్థాయిలో హైదరాబాద్ ఆదాయం లేదని వివరణ రాష్ర్టంలో ప్రధాన సమస్యలు, ప్రభుత్వ ప్రాధాన్యతల వెల్లడి రుణమాఫీ, వాటర్ గ్రిడ్, సంక్షేమం తదితర పథకాల ప్రస్తావన 25 రంగాల అభివృద్ధికి రూ.20,950 కోట్ల గ్రాంట్ ఇవ్వాలని వినతి కేంద్ర పన్నుల్లో వాటాను 40 శాతానికి పెంచండి తలసరి ఆదాయం పెరుగుతుంటే నిధులు తగ్గించ డం సరికాదు జనాభాకు 25 శాతం, విస్తీర్ణానికి 30 శాతం వెయిటేజీ ఇవ్వండి కొత్త రాష్ట్రానికి మినహాయింపులు, ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి.. పలు అంశాలపై కేసీఆర్ ప్రజెంటేషన్ సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక సంఘాన్ని రాష్ర్ట ప్రభుత్వం కోరింది. రాష్ర్టం అన్నిట్లో వెనుకబడి ఉందని, ఆర్థికంగా చేయూతనిచ్చి అండగా నిలవాలని విజ్ఞప్తి చేసింది. నూతన రాష్ట్రం కావడంతో ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాల్సి ఉందని, కొత్త పథకాల అమలుకు తగిన సహాయాన్ని అందించాలని విన్నవించింది. ఈ మేరకు సమైక్య రాష్ట్రంలో ఎదుర్కొన్న ఇబ్బందులను పేర్కొనడంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ ఆర్థిక సంఘానికి నివేదిక సమర్పించింది. కీలకమైన 25 రంగాల్లో అభివృద్ధి కోసం రూ. 20,950 కోట్లను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఇవ్వాలని ప్రతిపాదనలు అందించింది. గురువారమే హైదరాబాద్‌కు వచ్చిన 14వ ఆర్థిక సంఘంతో శుక్రవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం సమావేశమైంది. ‘తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలుంటే.. తొమ్మిది జిల్లాలు వెనుకబడే ఉన్నాయి. అన్ని సూచికల్లోనూ వెనుకబడి ఉన్నాం. మాకు అధిక నిధులిచ్చి ఆదుకోండి’ అని ఈ సందర్భంగా కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అలాగే కేంద్ర పన్నుల కేటాయింపులో ఉన్న అసంబద్ధ వెయిటేజీలను మార్చాలని, కేంద్ర పన్నుల్లో ప్రస్తుతం రాష్ట్రాలకు ఇస్తున్న 32 శాతం వాటాను 40 శాతానికి పెంచాలని కూడా డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటిస్తున్న కొత్త పథకాలతో రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరుగుతోందని, మరోవైపు కష్టమైనప్పటికీ ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్ నిర్వహణ(ఎఫ్ఆర్బీఎం) చట్టాన్ని అమలు చేయాల్సి వస్తోందన్నారు. తెలంగాణ ప్రజల కల ఇంతకాలానికి నెరవేరిందని, ఆరు దశాబ్దాలుగా అణచివేతకు గురైన తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఆర్థిక సంఘం నుంచి విరివిగా నిధులిచ్చేందుకు కేంద్రానికి సూచించాలని కేసీఆర్ విన్నవించారు. తెలంగాణను వెనుకబడిన ప్రాంతంగా స్పష్టం చేసిన అనేక నివేదికలు, అభివృద్ధి సూచికలను ఈ సందర్భంగా ఆయన ఆర్థిక సంఘం దృష్టికి తీసుకొచ్చారు. హైదరాబాద్ ఆదాయం కూడా అనుకున్న స్థాయిలో లేదని వివరించారు. ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మెమోరాండం సమర్పిస్తూ పలు అంశాలపై కేసీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు కూడా తమ తమ శాఖల వారీగా ప్రజెంటేషన్ ఇచ్చారు. తలసరి ఆదాయం పెరిగితే... తలసరి ఆదాయం పెరగడానికి ప్రభుత్వాలు చేస్తున్న కృషిని అభినందించాలని, వెయిటేజీ పేరిట తగ్గించడం సరికాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తలసరి ఆదాయానికి ఎక్కువ వెయిటేజీతో రాష్ట్రం నష్టపోతోందన్నారు. కేంద్ర పన్నుల వాటాలో జనాభాకు 25 శాతం, రాష్ట్ర విస్తీర్ణానికి 30 శాతం వెయిటేజీ ఇచ్చి నిధులు కేటాయించాలని కోరారు. ద్రవ్య క్రమశిక్షణకు 27.5 శాతం, ద్రవ్య వ్యత్యాసానికి 17.5 శాతం వెయిటేజి ఇవ్వాలని విన్నవించారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1971 తర్వాత తెలంగాణ ప్రాంతానికి వలసలు భారీగా జరిగాయని తద్వారా జనాభా పెరిగిందన్నారు. అందుకు తగినట్లు మౌలికవసతుల కల్పనకు అధిక నిధులివ్వాల్సిందిపోయి.. కోతపెట్టడం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు. వెనుకబడిన రాష్ట్రాలకు ఇతర మార్గాల ద్వారా నిధులు సర్దుబాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రస్తావించిన పలు అంశాలు ఇలా ఉన్నాయి. - కేంద్రానికి పన్నేతర ఆదాయం విపరీతంగా పెరుగుతోంది. సముద్రతీర రాయల్టీ, స్పెక్ట్రమ్ అమ్మకం, పెట్టుబడుల ఉపసంహరణతో భారీ ఆదాయం లభిస్తోంది. వీటన్నింటిలో రాష్ట్రానికి వాటాను పంచాలి. సెస్సు, సర్ఛార్జీలు విధించడం వల్ల వచ్చే ఆదాయాన్ని కూడా రాష్ట్రాలకు ఇవ్వాలి. - 40 శాతం కేంద్ర పన్నులను రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల.. కేంద్ర వ్యయంలో కేవలం ఐదు శాతం మాత్రమే తగ్గుతుంది. - ఈక్విటీ పారామీటర్లలో ఎక్కువ వెయిటేజీ ఇవ్వడం వల్ల మధ్యాదాయ రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాలో భారీగా కోతపడుతోంది. - రాష్ట్రాల ద్రవ్య, రెవెన్యూ లోటు పరిమితిని కేంద్రంతో సమానంగా రాష్ట్రాలకు ఇవ్వాలి. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని రాష్ట్రాలపై రుద్దుతున్నారు. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని పాటిస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలివ్వాలి.కొత్త రాష్ట్రాలకు ఈ చట్టంలో మినహాయింపులు ఇవ్వాలి. - ఆర్థిక సర్దుబాటును సమర్థంగా అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సహకాలు ఇవ్వాలి. - పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ జాతీయ సంస్థ(ఎన్ఐపీఎఫ్పీ) అధ్యయనం ప్రకారం 1998-99లో సబ్సిడీల మొత్తం రూ. 2,35,752 కోట్లు కాగా, ఇందులో రాష్ట్రాల మీద పడిన భారం ఏకంగా రూ. 1,55,924 కోట్లు. అంటే 66 శాతం. ఇది రాష్ట్రాలకు ఆర్థికంగా భారంగా మారుతోంది. అందువల్ల సబ్సిడీ భారాన్ని కేంద్రం, రాష్ట్రాల మధ్య సమంగా పంచాలి. అలాగే రాష్ట్రాలు భరించే సబ్సిడీ భారాన్ని కేంద్రం కూడా భరించాలి. - కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రెవెన్యూ మిగులు కష్టం. తద్వారా మూలధన పెట్టుబడి సాధ్యం కాదు. కావున రెవెన్యూ ఖాతాలోకి కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరిగితే తప్ప సాధ్యం కాదు. - టోకుమొత్తంలో డీజిల్ కొనుగోలుదార్ల(రైల్వే, ఆర్టీసీ, విద్యుత్ సంస్థలకు)కు మార్కెట్ ధరకు డీజిల్ విక్రయించడం వల్ల.. ప్రజా రవాణా వ్యయం పెరుగుతోంది. ప్రైవేట్ రవాణా పెరిగి కాలుష్యానికి దారితీస్తోంది. - ప్రణాళిక పథక రచనలో ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్సుల(నాన్ సాలరీ)ను పరిగణలోకి తీసుకోవాలి. - పర్యావరణ పరిరక్షణ చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. - ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్రం ప్రస్తుతం ఇస్తున్న 75 శాతం నష్టపరిహార వాటాను 90 శాతానికి పెంచాలి. - సామాజిక న్యాయం మరింత పకడ్బందీగా అమలు కావాలంటే.. రాష్ట్రాలకు నిధులు అధికంగా ఇవ్వాలి. - రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే పౌర సేవల ధర నిర్ణయాధికారంపై కమిషన్ ఎలాంటి నియంత్రను సిఫారసు చేయొద్దు. వెనుకబాటుపై నివేదికలివిగో..! తెలంగాణ వెనుకబడిందని అనేక నివేదికలు తేల్చి చెప్పాయని, మానవాభివృద్ధి సూచిక మొదలు, టాస్క్‌ఫోర్స్ నివేదికలు సైతం తెలంగాణ అత్యంత వెనుకబడిన ప్రాంతమని స్పష్టం చేస్తున్నాయని ఆర్థిక సంఘానికి రాష్ర్ట ప్రభుత్వం తన నివేదికలో వివరించింది. దీని ప్రకారం... - ప్రాంతీయ అసమానతలను పరిష్కరించడంపై ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర మంత్రుల టాస్క్‌ఫోర్స్ దేశవ్యాప్తంగా 170 అత్యంత వెనుకబడిన జిల్లాలను గుర్తించింది. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి మినహా తెలంగాణలోని మిగిలిన ఎనిమిది జిల్లాలు ఉన్నాయి. - వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ ఫండ్ (బీఆర్జీఎఫ్) అమలు కోసం మానవాభివృద్ధి సూచిక తక్కువగా ఉన్న 250 జిల్లాలను కేంద్రం 2007లో గుర్తించింది. ఇందులో తొమ్మిది తెలంగాణ జిల్లాలు ఉన్నాయి. - ఉపాధి హామీ పథకాన్ని దేశం మొత్తం 187 జిల్లాల్లో ప్రాథమికంగా ప్రారంభిస్తే, హైదరాబాద్ మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అమలు చేశారు. - వ్యవసాయ ఉత్పత్తి దారుణంగా ఉన్న 100 జిల్లాలను దేశవ్యాప్తంగా కేంద్రం 2007లో గుర్తించింది. ఇందులో తెలంగాణలోని ఏడు జిల్లాలు ఉన్నాయి. - 12వ పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతల చాప్టర్లో తెలంగాణలోని ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలను ‘అత్యంత ఆకలి జిల్లాలు’గా పేర్కొన్నారు. - తెలంగాణలో వృద్ధిరేటు 2005-06లో 10.5 శాతం నుంచి 2012-13 నాటికి 4.5 శాతానికి పడిపోయింది. పైగా పారిశ్రామిక రంగంలో అభివృద్ధి తిరోగమనదిశలో (నెగటివ్ డెవలప్మెంట్) ఉంది. అయితే 2013-14లో వృద్ధిరేటు కొంచెం పెరిగి 5.5 శాతానికి చేరినప్పటికీ, వ్యవసాయ రంగ అభివృద్ధి మాత్రం 6.2 శాతం నుంచి 4.6 శాతానికి పడిపోయింది. ఇవీ రాష్ర్టంలో సమస్యలు! ఆర్థిక సంఘానికి రాష్ర్ట ప్రభుత్వం పలు ప్రధాన సమస్యలను ఏకరవుపెట్టింది. అవి ఇలా ఉన్నాయి. - సుమారు 60 శాతం భూమికి నీరు అందించే చెరువుల వ్యవస్థ ధ్వంసమైపోయింది. ప్రస్తుతం చెరువుల కింద సాగు 9 శాతం కంటే తక్కువకుపడిపోయింది. - 2001-02 నుంచి 2009-10 వరకు తెలంగాణ, ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు భారీగా విక్రయించారు. దీనివల్ల జిల్లా రైతాంగం తమ జీవనాధారాన్ని కోల్పోయింది. ఈ నష్టాన్ని పూడ్చడం సాధ్యమయ్యే పనికాదు. - రాష్ర్టం 1000 మెగావాట్ల విద్యుత్ లోటును ఎదుర్కొంటోంది. దీన్ని పూడ్చేందుకు భారీగా పెట్టుబడులతో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. - రోడ్లు, పట్టణ మౌలిక సదుపాయాలు, ప్రజా రవాణా కొరకు అనేక ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) ప్రాజెక్టులు అమలవుతున్నాయి. ఇందులో మెట్రోరైలు ప్రాజెక్టు ఒకటి. ఈ ప్రాజెక్టుల వల్ల వచ్చే ఎనిమిదేళ్ల వరకూ ఏటా రూ. 333 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. - 1961-71 మధ్యకాలంలో తెలంగాణలో పట్టణ జనాభా 35.6 శాతం ఉండగా... 2001-11 నాటికి అది 39.1 శాతానికి పెరిగిపోయింది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల నుంచి అనేక మంది రావడం వల్ల పట్టణ జనాభా పెరిగింది. ఈమేరకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. - పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఇవీ రాష్ర్ట ప్రభుత్వ ప్రాధాన్యతలు తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు పథకాలను ఈ సందర్భంగా రాష్ర్ట ప్రభుత్వం తన ప్రాధాన్యతలుగా పేర్కొంటూ ఆర్థిక సంఘం దృష్టికి తెచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. - దేశంలోకెల్లా రైతుల ఆత్మహత్యలు తెలంగాణలోనే అధికం. అందుకే రుణాల ఊబి నుంచి రైతులను బయటపడేసేందుకు వాటిని మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. - ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీల కోసం రూ. 50 వేల కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్నాం. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. బీసీలకు ఐదేళ్ల కాలంలో రూ. 25 వేల కోట్లు వెచ్చించనున్నాం. మైనార్టీలకు రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తాం. - ప్రతీ ఇంటికి మంచినీటి సరఫరా కోసం రూ. 25 వేల కోట్లతో వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. - వచ్చే మూడేళ్లల్లో 230 కోట్ల మొక్కలను నాటాలని ‘తెలంగాణకు హరిత హారం’ కార్యక్రమం ప్రారంభించాం. - శరవేగంగా పారిశ్రామిక అభివృద్ధి కోసం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండే పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తున్నాం. సమస్యలు ఇవీ..! ఆర్థిక సంఘానికి రాష్ర్ట ప్రభుత్వం పలు సమస్యలను ఏకరువు పెట్టింది. అవి ఇలా ఉన్నాయి.్హ సుమారు 60 శాతం భూమికి నీరు అందించే చెరువుల వ్యవస్థ ధ్వంసమైపోయింది. ప్రస్తుతం చెరువుల కింద సాగు 9 శాతం కంటే తక్కువకుపడిపోయింది. 2001-02 నుంచి 2009-10 వరకు తెలంగాణ, ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు భారీగా విక్రయించారు. దీనివల్ల జిల్లా రైతాంగం తమ జీవనాధారాన్ని కోల్పోయింది. ఈ నష్టాన్ని పూడ్చడం సాధ్యమయ్యే పనికాదు. రాష్ర్టం 1,000 మెగావాట్ల విద్యుత్ లోటును ఎదుర్కొంటోంది. దీన్ని పూ డ్చేందుకు భారీ పెట్టుబడులతో విద్యు త్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. రోడ్లు, పట్టణ మౌలిక సదుపాయాలు, ప్రజా రవాణా కొరకు అనేక ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) ప్రాజెక్టులు అమలవుతున్నాయి. ఇందులో మెట్రోరైలు ప్రాజెక్టు ఒకటి. ఈ ప్రాజెక్టుల వల్ల వచ్చే ఎనిమిదేళ్ల వరకూ ఏటా రూ. 333 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. 1961-71 మధ్యకాలంలో తెలంగాణలో పట్టణ జనాభా 35.6 శాతం ఉండగా... 2001-11 నాటికి అది 39.1 శాతానికి పెరిగిపోయింది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల నుంచి అనేక మంది రావడం వల్ల పట్టణ జనాభా పెరిగింది. ఈమేరకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. -
వసతిగృహాలకు గ్యాస్ సిలిండర్లు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలోని బీసీ, సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో కట్టెల పొయ్యిపై వంట చేసే నిర్వాహకుల కష్టాలు తీరనున్నాయి. ఇక నుంచి వీరు గ్యాస్‌పై చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 2,967 కొత్త గ్యాస్ కనెక్షన్లు కేటాయిస్తూ కలెక్టర్ అహ్మద్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రొసిడింగ్ ఆయా సంబంధిత అధికారులకు అందా యి. పాఠశాలల్లో చదువుతున్న 50 మంది విద్యార్థులకు ఒక గ్యాస్ కనెక్షన్, ఒక సిలిండర్, రెగ్యులెటర్ చొప్పున కేటాయించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు 890, పాఠశాలలకు 1,951, సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు 102, గురుకుల పాఠశాలలకు 22, ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని నూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్‌కు రెండు చొప్పున కొత్త గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. పాఠశాలలకు కనెక్షన్లు ఇలా.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద వంటచేసి పెట్టేందుకు జిల్లాలోని పాఠశాలలకు 1,951 గ్యాస్ కనెక్షన్లు కేటాయించారు. గుడిహత్నూర్, బేల, జైనథ్, తాంసి మండలాలకు 126, కౌటాల, లోకేశ్వరం మండలాలకు 45, ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి మండలాలకు 222, ఆసిఫాబాద్, జైనూర్, సిర్పూర్(యు), తిర్యాణికి 192, ముథోల్, తానూర్‌కు 69, బెజ్జూర్‌కు 36, బెల్లంపల్లి, నెన్నెలకు 44, జన్నారంకు 43, దిలావర్పూర్, సారంగాపూర్లకు 33, తలమడుగుకు 33, వాంకిడి, కెరమెరిలకు 94, బోథ్, బజార్హత్నూర్లకు 79, నేరడిగొండ, ఇచ్చోడకు 70, దహెగాం, సిర్పూర్(టి)లకు 38, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లిలకు 111, నిర్మల్‌కు 44, మందమర్రికి 15, కాసిపేటకు 40, తాండూర్, భీమినిలకు 45, కౌటాల, సిర్పూర్(టి), బెజ్జూర్లకు 99, రెబ్బెనకు 34, ఆదిలాబాద్‌కు 86, భైంసా, కుభీర్‌కు 83, దండేపల్లి, కాగజ్‌నగర్‌కు 75, లక్సెట్టిపేటకు 7, ఖానాపూర్, కడెంకు 94, మామాడ, లక్ష్మణచాందకు 35, జైపూర్‌కు 39, మంచిర్యాల మండలానికి 20 గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. ఇదిలా ఉండగా, ముథోల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలకు 12 కనెక్షన్లు మంజూరు చేశారు. ఆదిలాబాద్‌లోని రాంనగర్లో గల వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలకు మూడు, లక్సెట్టిపేటలోని బీసీ బాలు గురుకల పాఠశాలకు మూడు, మామడలోని కస్తూర్భా గాంధీ విద్యాలయానికి(కేజీబీవీ) నాలుగు గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. వసతిగృహాలు, అంగన్వాడీలకు కేటాయింపు.. సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహాలకు 102 గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. ఒక్కొ వసతిగృహానికి ఆరు కనెక్షన్ల చొప్పున కేటాయించారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహం(బాలుర, బాలికలు) ఆదిలాబాద్‌కు 12, మందమర్రికి 12, మంచిర్యాలకు, 12, లక్సెట్టిపేటకు 12, నిర్మల్‌కు 12, కాగజ్‌నగర్‌కు 12, ఉట్నూర్‌కు ఆరు, బెల్లంపల్లికి 12, ఆసిఫాబాద్‌కు 12 గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. ఇదిలా ఉండగా, అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి తాంసి, తలమడుగు, ఆదిలాబాద్, గుడిహత్నూర్ మండలాలకు 252 కనెక్షన్లు మంజూరు చేశారు. బోథ్, బజార్హత్నూర్, ఇచ్చోడలకు 147, నేరడిగొండ, ఇచ్చోడలకు 77, సిర్పూర్(టి), కాగజ్‌నగర్‌లకు 68, కౌటాల, బె జ్జూర్లకు 129, భీమినికి 41, బేల, జైనథ్లకు 126, దహెగాం మండలానికి 50 చొప్పున 890 కనెక్షన్లు మంజూరయ్యాయి.