జిల్లాకు 4,850 ఇళ్లు | 4,850 double bed rooms granted in distric | Sakshi
Sakshi News home page

జిల్లాకు 4,850 ఇళ్లు

Published Sun, Feb 28 2016 2:52 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

జిల్లాకు 4,850 ఇళ్లు - Sakshi

జిల్లాకు 4,850 ఇళ్లు

నిర్మాణానికి రూ.302 కోట్లు మంజూరు
లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు జరిగితే చర్యలు
రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి

 తాండూరు: డబుల్ బెడ్‌రూం ఇళ్లతో పేదల సొంతింటి కలను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేయనుందని రవాణా శాఖ మంత్రి పి.మహేం దర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మంత్రి యాలాల మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని కుత్బుల్లాపూర్, మేడ్చల్, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల, పరిగి, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో 4,850 ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.302 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు. అర్బన్‌లో 1,240 ఇళ్లకు రూ.75 కోట్లు, గ్రామీణ జిల్లాకు 4,850 ఇళ్లు

 ప్రాంతంలో 3,610 ఇళ్ల నిర్మాణాలకు రూ.2,77 కోట్లు మంజూరైనట్టు మంత్రి వివరించారు. గ్రా మీణ ప్రాంతంలో ఒక్కో ఇంటికి రూ.6.29 ల క్షలు, అర్బన్ ప్రాంతంలో రూ.5.30 లక్షలు ని ర్మాణ వ్యయం అవుతుందన్నారు. స్థానిక తహసీల్దార్లు లబ్ధిదారులను ఎంపిక చేస్తారని, ఈ విషయంలో పొరపాట్లు జరిగితే తహసీల్దార్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా జరుగుతుందన్నారు. అర్హులైన పేదలకు అన్ని సౌకర్యాలతో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి అందజేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement