మూసీ బాధితులకు పునరావాసం, పరిహారం తర్వాతే ముందడుగు
పరీవాహకంలో అతికష్టం మీద సగం ఇళ్లకే ఆర్‌బీ మార్క్
ఖాళీ అయిన ఇళ్ల కూల్చివేత సైతం అంతంతే..
అందుబాటులోఉన్న డబుల్ ఇళ్ల కేటాయింపు పూర్తి
మిగతా వారి పరిస్థితేంటని అధికారుల తర్జనభర్జన
మూసీ నిర్వాసితుల నుంచి తీవ్ర వ్యతిరేకత
సాక్షి, హైదరాబాద్: మూసీ పరీవాహకం పరిధిలోని నివాసాల కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మూసీ ప్రక్షాళనలో భాగంగా నదీగర్భం, బఫర్ జోన్‌లో గుర్తించిన నివాసాలకు పునరావాసం, పరిహారం అంశాలు తేల్చాకే కట్టడాల తొలగింపునకు ముందడుగు వేయాలని సర్కారు పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు అందడటంతో రెవెన్యూ యంత్రాంగం వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నదీ గర్భంలో సైతం రెడ్ మార్కింగ్ నిలిచిపోగా, నివాసాలు ఖాళీ చేసి డబుల్ బెడ్ రూమ్‌లకు తరలిన కుటుంబాల ఇళ్లను సైతం కొన్నింటిని మాత్రమే కూలీలతో కూల్చివేశారు. మిగతా కూల్చివేత పెండింగ్‌లో పడింది. కొన్ని ఉమ్మడి కుటుంబాలు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించినా..వెళ్లని పరిస్థితి నెలకొంది. ఇళ్ల కూల్చివేతలపై మూసీ పరీవాహకం పరిధిలోని నివాసితుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుండడంతో అధికారులు ముందుకు వెళ్లేందుకు సాహసించడం లేదు. సర్కారు మాత్రం మూసీ ప్రక్షాళన తప్పనిసరి అని పేర్కొంటున్నా...నివాసితులకు పునరావాసం, పరిహారం ప్రధాన సమస్యగా తయారైంది.
ఆదిలోనే హంసపాదు
మూసీ ప్రక్షాళనకు ఆదిలోనే హంసపాదు ఎదురైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నదీ పరీవాహకం పరిధిలో సర్వే ద్వారా గుర్తించిన నివాసాలపై రెడ్‌మార్కింగ్ వేసేందుకు అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నం బెడిసి కొట్టినట్లయింది. నివాసితుల నుంచి త్రీవ వ్యతిరేకత ఎదురుకాగా, సగం ఇళ్లకు మాత్రమే రెడ్ మార్క్ వేసి వెనుకకు తగ్గక తప్పలేదు. మరోవైపు నివాసితులకు ప్రతిపక్ష పారీ్టల మద్దతు పెరగడంతో వారు సైతం ఆందోళనలను ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో నదీగర్భంలో రెడ్‌మార్క్ వేసిన గృహాల జోలికి సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా పరీవాహక పరిధిలో 12,184 పైగా అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని రెండుగా వర్గీకరించి నదీగర్భం, బఫర్ జోన్లుగా విభజించారు. నదీగర్భంలో 2,166 నిర్మాణాలు ఉండగా, అందులో 288 భారీ నిర్మాణాలున్నాయి. నదీ సరిహద్దు నుంచి రెండు వైపులా 50 మీటర్లు వరకు గల బఫర్‌జోన్ పరిధిలో 7,851 ఆక్రమణలు, ఇందులో 1032 బడా నిర్మా ణాలున్నట్లు అ«ధికారులు గుర్తించారు. మిగతా పరిధిలో 3004 అక్రమ కట్టడాలున్నట్లు బయటపడింది.
పునరావాసంపై అయోమయం
మూసీ నదీ గర్భంలోని నివాసితులు పునరావాసం సమస్యగా తయారైంది. అధికార లెక్కల ప్రకారం 2166 డబుల్ బెడ్‌రూమ్‌లు అవసరం ఉంటుంది. అందులో హైదరాబాద్ జిల్లా పరిధిలో 1595, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో 239, రంగారెడ్డి జిల్లా పరిధిలో 332 కుటుంబాలను పునరావాసం కల్పించాల్సిన ఉంటుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 14 డబుల్ బెడ్‌రూమ్ సముదాయాల్లో మొత్తం మీద ఖాళీగా ఉన్న గహాలు 500కు పైగా కూడా లేనట్లు తెలుస్తోంది. నివాసాలు ఖాళీ చేసిన సుమారు 10 శాతం కుటుంబాలకు పునరావాసం కల్పించగలిగారు. సైదాబాద్, హిమాయత్‌నగర్,æ నాంపల్లి మండలాల్లోని వివిధ బస్తీలు, కాలనీలకు చెందిన 193 మందిని మలక్‌పేటలోని పిల్లిగుడిసెలు, జియా గూడ, ప్రతాపసింగారం, జంగంమెట్‌లోని రెండు పడకల గృహసముదాయానికి తరలించారు. మిగతా వారికి పునరావాసంపై ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
Comments
Please login to add a commentAdd a comment