ఎలన్ మస్క్ స్థాపించిన ఎక్స్‌ప్రైజ్ సంస్థ నుంచి భారీ గ్రాంటుని సాధించారు ముంబైకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు. యూకేలోని గ్లాస్కోలో జరుగుతున్న కాప్ 26 సదస్సులో ఈ విద్యార్థుల ప్రజెంటేషన్‌కి ఈ గ్రాంట్ దక్కింది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబైకి చెందిన శ్రీనాథ అయ్యర్, అన్వేష బెనర్జీ, సృష్టి భామరే, శుభంకుమార్‌లు కాలుష్యాన్ని తగ్గించే ట్రై మాడ్యులర్ టెక్నాలజీ సాస్‌ఐఐటీబీ (SASIITB) కాన్సెప్టును గ్లాస్కోలో ప్రదర్శించారు. వీరి కాన్సెప్టు ప్రకారం.. కార్బన్ డై ఆక్సైడ్ విడుదలయ్యే చోట ట్రై మాడ్యులర్‌ని ఉంచినట్టయ్యితే కార్బన్ డై యాక్సైడ్ ఉప్పుగా మారుతుంది.
గ్లాస్కోలో జరిగే సదస్సులో కార్బన్ రిమూవల్ స్టూడెంట్స్ కాంపిటిషన్‌ను నిర్వహించారు. ఇందులో కార్బన్‌ని తగ్గించే ఫ్యూచర్ టెక్నాలజీ అందించిన స్టూడెంట్స్‌కి 5 మిలియన్ డాలర్లు ప్రైజ్‌మనీగా నిర్ణయించారు. మొత్తం 23 కాన్సెప్టులో ఇందులో బహుమతులు, గ్రాంట్లు గెలుచుకున్నాయి. ఇందులో ఐఐటీ ముంబై టీం 2,50,000 డాలర్ల గ్రాంట్‌ని నవంబరు 11న అందుకుంది. ఇండియన్ కరెన్సీలో ఈ గ్రాంటు రూ.1.86 కోట్లుగా ఉంది. ఈ గ్రాంటుతో సాస్‌ఐఐటీబీ బృందం స్టార్టప్‌ను నెలకొల్పే అవకాశం ఉంది.
చదవండి:ఎలన్ మస్క్ దెబ్బకు.. వారంలో రూ.13 లక్షల కోట్లు ఆవిరి
Comments
Please login to add a commentAdd a comment