20,950 కోట్ల గ్రాంట్ ఇవ్వండి
20,950 కోట్ల గ్రాంట్ ఇవ్వండి
Published Sat, Sep 20 2014 1:58 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
14వ ఆర్థిక సంఘానికి రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదనలు
25 రంగాల్లో చేపట్టే అభివృద్ధి పనులతో వివరణ
కొత్తగా ఏర్పడిన రాష్ర్టంలో 25 రంగాల అభివృద్ధికి రూ. 20,950 కోట్లను గ్రాంట్‌గా ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. తద్వారా తన ప్రాధాన్యాలను తెలియజేసింది. ముఖ్యమైన ఈ రంగాల్లో సేవల లోటును పూడ్చడానికి తగిన నిధులిచ్చి సహకరించాలని కోరింది. అలాగే నిధుల విడుదల విషయంలో నిబంధనలను సవరించాలని, జాప్యాన్ని అరికట్టాలని సూచించింది. పేద రాష్ట్రాల విషయంలో షరతులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రం రంగాల వారీగా కోరిన నిధులు, దానిపై వివరణ.
- సాక్షి, హైదరాబాద్
ఎస్సీల అభివృద్ధి: రూ. 133.60 కోట్లు
ఎస్సీ హాస్టళ్లు కూడా అద్దె భవనాల్లో ఉన్నాయి. ఉన్న హాస్టళ్లకు ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తున్నాం. కొత్త భవనాల నిర్మాణాలకు నిధులు అవసరం. 167 హాస్టల్ భవనాలకు నిధులు కావాలి.
రోడ్లు, బ్రిడ్జిల నిర్వహణ: రూ. 1,000 కోట్లు
24,733 కిలోమీటర్ల పొడవున ఉన్న అంతర్రాష్ర్ట రోడ్లు, బ్రిడ్జ్జిల నిర్వహణకు నిధులు కావాలి. 63,341 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. వాటి నిర్వహణతో పాటు శిథిలావస్థకు చేరిన 207 బ్రిడ్జిల మరమ్మతులు, రోడ్డు భద్రతా చర్యలకు నిధులు కావాలి.
వెనుకబడిన తరగతుల సంక్షేమం - విద్య, మౌలిక సదుపాయాలు: రూ. 273.70 కోట్లు
బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. టాయిలెట్లు, ప్రహరీ గోడలు, తాగునీటి సదుపాయాలు సరిగా లేవు. 119 హాస్టల్ భవనాలు నిర్మించాల్సి ఉంది
సీడ్ బ్యాంకు పథకం: రూ. 500 కోట్లు
దేశంలోనే ప్రముఖ విత్తనాభివృద్ధి కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించాం. విత్తనోత్ప త్తి రంగంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
ఫిషరీస్ డెవలప్‌మెంట్: రూ. 23 కోట్లు
చేపల చెరువులు, రొయ్యల హేచరీస్‌ల అభివృద్ధికి ఈ నిధులను ఖర్చు చేస్తాం.
డైరీ డెవలప్‌మెంట్ : రూ. 241 కోట్లు
పాల సేకరణ పెంచేందుకు చర్యలు చేపడతాం. 10 మెట్రిక్ టన్నుల పాల పౌడర్ ప్లాంటును హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు, నిజమాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మిల్క్ చిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు వెచ్చిస్తాం.
జ్యుడీషియల్ అడ్మినిస్ట్రేషన్ : రూ. 977.64 కోట్లు
ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు వివిధ రకాల కోర్టుల ఏర్పాటు, భవనాల నిర్మాణాలకు, సదుపాయాల కల్పనకు వెచ్చిస్తాం.
పోలీసు శాఖ: రూ. 1,691.75 కోట్లు
పోలీసు శాఖ బలోపేతం, హైదరాబాద్‌లో సీసీటీవీల ఏర్పాటు, బలగాల అప్‌గ్రేడేషన్, వసుతుల మెరుగుకు ఖర్చు చేస్తాం. జైళ్ల అభివృద్ధి, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణం, ఆధునీకరణకు రూ. 135.82 కోట్లు కావాలి.
స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్: 614కోట్లు
హైదరాబాద్‌లో అన్ని స్థాయిల్లో ఫైర్ సేవలను అభివృద్ధి చేస్తాం. వేగంగా చర్యలు చేపట్టే విధంగా సదుపాయాలు కల్పిస్తాం.
డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్, డీపీసీ: రూ. 250 కోట్లు
ప్రణాళిక విభాగాల వికేంద్రీకరణకు, జిల్లాల్లో అభివృద్ధికి ఈ నిధులు అవసరం.
పర్యావరణం: రూ. 100 కోట్లు
బస్సుల్లో మొబైల్ ఎన్విరాన్‌మెంటల్ ఎగ్జిబిషన్లు, అవగాహన కార్యక్రమాలకు, కాజీపల్లి, ఆశని కుంటలో సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు వెచ్చిస్తాం.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి: రూ. 1,091.25 కోట్లు
టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ అభివృద్ధి, ఐటీఐఆర్‌లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు, ఇంటర్నెట్ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాల కల్పన
టూరిజం, ఆర్కియాలజీ: రూ. 203.05 కోట్లు
వారసత్వ సంపదను కాపాడేందుకు, టూరి జాన్ని విస్తరింపజేసేందుకు వీటిని వెచ్చిస్తాం.
ప్రోగ్రాం మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అథారిటీకి రూ. 50 కోట్లు
మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ చర్యలు చేపడతాం.
సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థకు: 100 కోట్లు
బడ్జెట్, రెవెన్యూ, ఖర్చులు, ఖాతాలు, మానవ వనరుల నిర్వహణకు ఈ నిధులను వెచ్చిస్తాం.
గిరిజన సంక్షేమానికి రూ. 355.84 కోట్లు
గిరిజన సంక్షేమానికి, విద్యాసంస్థలు, మౌలిక సదుపాయల కల్పన, ట్రైబల్ కల్చర్ రీసర్చ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు నిధులు అవసరం.
నీటి రంగం నిర్వహణ, వాటర్ గ్రిడ్‌కు
రూ. 7,700 కోట్లు
గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, రక్షిత తాగునీటి అవసరాలు, ప్రాజెక్టులు, చెరువులు, కాలువల మరమ్మతులకు వెచ్చిస్తాం.
ఆరోగ్య రంగం
బలోపేతానికి రూ.500 కోట్లు
తెలంగాణలో నిమ్స్ తరహాలో 12 ఆసుపత్రులను అభివృద్ధి చేస్తాం.
అడవుల నిర్వహణ, తెలంగాణ
హరిత హారం:
రూ. 1,046.5 కోట్లు
అటవీ అభివృద్ధి, వన్యప్రాణి సంరక్షణ, సామాజిక అడవుల పెంపకం, హరితహారం, అటవీ పరిశోధ న, ఐటీ వినియోగం వంటి కార్యక్రమాలను చేపడుతున్నాం. వచ్చే మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు పెంచుతాం.
ఉన్నత విద్య బలోపేతం: రూ. 900 కోట్లు
కొత్త యూనివర్సిటీలకు, పీజీ సెంటర్లకు అదనపు నిధులు కావాలి. రాష్ట్రం ఇచ్చే నిధులు వేతనాలు, రోజువారీ నిర్వహణకు సరిపోతున్నాయి. కొత్త భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు నిధులు అవసరం.
ప్రాథమిక విద్య
(ఎస్‌ఎస్‌ఏ): రూ.1,327.38 కోట్లు
సర్వశిక్ష అభియాన్ ద్వారా ఇస్తున్న నిధులు సరిపోవడం లేదు. వేతనాల ఖర్చే ఎక్కువగా ఉంది. ప్రతి మూడు నెలలకు 14,277 మంది టీచర్ల వేతనాలకు, యూనిఫారాలకు అదనంగా నిధుల కావాలి.
పాడి పరిశ్రమ రంగంలో మౌలికవసతులు:
రూ. 106.36 కోట్లు
పశుగణాభివృద్ధిలో భాగంగా ఎమర్జెన్సీ వెటర్నరీ ఆంబులెన్స్ సర్వీసుకు, పశువుల వ్యాధి నిర్ధారణ ప్రాంతీయ ల్యాబ్‌లు, జిల్లా స్థాయి ల్యాబ్‌ల ఏర్పాటు, గ్రామాల్లో వెటర్నరీ వసతుల కల్పనకు వెచ్చిస్తాం.
ఇండస్ట్రియల్
పార్కుల నిర్వహణ:
రూ. 313.36 కోట్లు
పాత ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన
విద్యుత్ రంగం, వ్యవసాయ ఫీడర్ల విభజన: రూ.1,316 కోట్లు
గ్రామీణ గృహాలు, వాణిజ్య కేటగిరీలతో విద్యుత్ సరఫరా. వ్యవసాయానికి 7 గంట ల ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలి. ఇందుకోసం వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను విభజించాల్సి ఉంది.
Advertisement
Advertisement