Planning Commission
-
ఈ స్వారీ ఏమిటి సామీ!
చంద్రబాబు నాయుడు (సీబీఎన్) ముఖ్యమంత్రి అయిన నాలుగేళ్ళకే కేంద్ర ‘ప్లానింగ్ కమిషన్’ను నిబంధనలు అధిగ మించి ‘ఇరవై ఏళ్ల నా విజన్ –2020’ అంటూ ఒక ‘డాక్యుమెంట్’ను ‘మెకెన్సీ’ కన్సల్టెన్సీ కంపె నీతో రాయించుకున్నారు. 30 ఏళ్ల క్రితం మొదలయిన ‘సరళీకరణ’, ‘ప్రైవేటీకరణ’లను ఆయన అలా మలుచుకున్నారు. ఐదేళ్ల కాలానికి మించి ‘ప్లానింగ్’ అనేది అప్పటికి ప్రభుత్వ విధానంగా లేదు. కానీ జరిగింది ఏమిటి? ‘విజన్ డాక్యుమెంట్’లో ముందుగా చెప్పని రాష్ట్ర విభజన జరిగింది. రెండు కొత్త ప్రాంతీయ పార్టీలు ఏర్పడి, అవి అధికారంలోకి కూడా వచ్చాయి. విభజన తర్వాత ఒక ‘టర్మ్’ ప్రభుత్వంలో ఉన్నా... ఓడి మరో ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి, మళ్ళీ ఇప్పుడు గెలిచి సీఎం అయ్యారు. అయితే అందుకు ఆయన పలు రాజీలు పడ్డారు. ఇలా ‘విజన్ డాక్యుమెంట్’ ఒక్కటే కాదు, ఆయనది మొదటి నుంచీ ఎప్పుడూ ఏవో కొన్ని ‘టూల్స్’ దన్నుతో నెట్టుకొచ్చే నిలకడలేని సందిగ్ధ స్థితి. ఆయనకు ఆ హోదా సిద్ధాన్నం (‘టిన్ ఫుడ్’) కావడంతో... ఆ ‘పోస్టు’కు ఉండే సహజ పోటీలో నెగ్గుకుని రావడం కోసం మొదట్లోనే – ‘మేనేజిరియల్ స్కిల్స్’తో ప్రజల దృష్టి మళ్ళించ గలిగిన కొందరు ‘బ్యురోక్రాట్ల’ను, ‘మీడి యా’ను ఆయన దగ్గరకు తీశారు. ‘విన్–విన్’ అంటూ పరస్పర ప్రాయోజిత మార్గం ‘రిఫార్మ్స్’ కాలంలో అలా కలిసి వచ్చింది. అలా ఆయన ‘సీటు’లోకి వచ్చిన ఏడాదికే ‘కొరియన్ మోడల్’ అంటూ ‘జన్మభూమి’ని తెచ్చి దానికి సొంతూరు ‘సెంటిమెంట్’ ప్రచారం కల్పించారు. చివరికి ‘జన్మభూమి’ అంటే... అదొక పార్టీ ‘స్టిక్కర్’లా మారింది. నిజానికి ఇవి పాత విషయాలు. అయితే ఇక్కడ వీటిని గుర్తు చేయడానికి కారణం ఉంది. గతంలో సీబీఎన్ నిర్ణయాత్మకతలోని సందిగ్ధ స్థితిని ‘కవర్’ చేసి మునుపటిలా ఆయన్ని ‘బ్రాండింగ్’ చేయడం 2025 నాటికి సదరు తల నెరిసిన ‘మీడియా మేనేజర్ల’కు సైతం ఇప్పుడు అలవి కావడం లేదు. కారణం ఒకప్పుడు ఆ బాధ్యత అవలీలగా చేసిన ప్రధాన ‘మీడియా’తో సమాంతరంగా ‘సోషల్ మీడియా’ వచ్చిన ఫలితంగా వాళ్ళు ఇపుడు తరచూ గందరగోళానికి గురవడమే! వాళ్ల నోటికి నిబంధనలతో కూడిన ‘బుక్’ అంటూ ఏమీ ఉండదు కనుక, చివరికి వాళ్ళు ‘అధికారులకు కళ్ళు నెత్తికెక్కాయి... గతంలో ఇలా లేదు. జగన్ మోహన్ రెడ్డి అంటే వాళ్ళు భయపడేవారు...’ అంటూ కూడా మాట్లా డుతున్నారు. చివరికి దీన్ని ఇద్దరు నాయకుల యుద్ధ భూమిగా మార్చి ప్రభుత్వంలో ‘ఎగ్జిక్యూటివ్’ (కార్య నిర్వాహకవర్గం) అనుసరించాల్సిన ‘బుక్’ ఉంటుంది, ‘జ్యుడిషియరీ’ (న్యాయవ్యవస్థ)కి వాళ్ళు జవాబుదారీ అవుతారనే ఇంగితం లేకుండా వీరి ప్రహసనం సాగు తున్నది. అనివార్యంగా రాజ్యనీతిలోకి చొచ్చుకొచ్చిన సరళీ కరణ–ప్రైవేటీకరణల ప్రభావం, నైసర్గికంగా రాష్ట్రం విభజన జరగడం ఈ సందర్భంగా గమనార్హం. అది రాష్ట్రమైనా, సమాజమైనా ఒక కోత (కట్)కు గురైన ప్పుడు, మునుపు చూడని కొత్త పార్శా్వలు, వాటికి మొలిచే కొత్త మొలకలు అనేకం బయటకు వస్తాయి. ఆ దశలో పాలనకు అవి విసిరే సవాళ్ళను ఎదుర్కొని వాటి పర్యవసానాలను రాజ్యంగ స్ఫూర్తికి లోబడి పరిష్కరించే అధికార యంత్రాంగాన్ని ‘రాజ్యం’ ప్రభుత్వ పరిధిలో ఉండే ‘ఎగ్జిక్యూటివ్’ నుంచి సిద్ధం చేసుకోవాలి. అది వారి ‘సర్వీసు’లకు తగిన రక్షణ ఇవ్వాలి. రాజకీయాల కోసం వాళ్ళను బలిచేస్తే, నష్టపోయేది రాష్ట్రమే! దాన్ని అర్థం చేసుకునే దార్శనికత ‘లెజిస్లేచర్’ (శాసన వ్యవస్థ)కు ఉండాలి. విభజనతో ఏర్పడిన కొత్త రాష్ట్రంలో ఇంకా ‘రాజ్యం’ వైపు ప్రాథమిక అవసరాల కోసం చూసే నిర్లక్షిత సమాజాల అవసరాల పట్ల కనీస స్పృహ ఎగ్జిక్యూటివ్ – లెజిస్లేచర్లు ఇద్దరికీ ఉండాలి. కానీ సంస్కరణల మొదట్లో ‘సమ్మిళిత వృద్ధి’ (ఇంక్లూజివ్ గ్రోత్) అంటూ హామీ ఇచ్చి, ఇప్పుడు దాన్ని అటకెక్కించి ‘సంక్షేమాన్ని’ సమీక్షించే బాధ్యతను నోరున్న ప్రతి ఒక్కరూ తీసుకోవడం, వైసీపీ ప్రభుత్వం తర్వాత కొత్తగా చూస్తున్నాం. కేవలం తాము ‘లెజి స్లేచర్’ పక్షం ‘మీడియా’ అనే ఒకే ఒక్క ఆధిక్యతతో ‘ప్రైవేటు’గా ప్రభుత్వ పాలనలోకి చొరబడి, ‘ఎగ్జిక్యూ టివ్’ మీదికి ఎక్కేస్తున్న విపరీత ధోరణిని 2024 ఎన్ని కలు తర్వాత కొత్తగా చూస్తున్నాము. ప్రభుత్వ వ్యవస్థలు, శాఖలు ఆధునిక ‘టెక్నాలజీ’తో తమ నిధులకు గండి పడకుండా ‘లీకేజీ’లను కట్టడి చేస్తుంటే, ప్రకృతికి ఏ కంచె లేదని సహజ వనరులు తవ్వుకుంటూ సొమ్ము చేసుకుంటుంటే... దాన్ని వదిలి పేదలకు సంక్షేమ పథ కాల అవసరాన్ని ప్రశ్నించడానికి ఈ ‘మేనేజర్లు’ బరి తెగిస్తున్నారు. ఈ కొత్త ధోరణిపై చర్చ మొదలు కాకపోతే కొన్నాళ్ళకు ‘ప్రైవేటు’ శక్తులు తమ పరిధి దాటి ప్రభుత్వ జాగాలోకి చొచ్చుకు వస్తాయి. సీబీఎన్ రాజకీయాలకు మొదటి నుంచి తనదైన ‘పబ్లిక్ పాలసీ’ అంటూ ఒకటి లేక, ‘ట్రెండ్స్’ను బట్టి అది మారడం వల్ల, గడచిన పదే ళ్ళలో ఆయన స్వీయ సమాచార వ్యవస్థ ‘టెర్మినల్స్’కు చేరింది. అందుకే ఆ ‘క్యాంప్’ నుంచి పరస్పర విరుద్ధ ప్రకటనలు చూస్తున్నాం. జరిగిన రెండు కలెక్టర్ల సమా వేశాల్లోనూ, ఈ నెల కుప్పం పర్యటనలోనూ సీబీఎన్– ‘నాది పొలిటికల్ గవర్నెన్స్’ అంటుంటే, ఆయన ‘మీడియా మేనేజర్లు’ మాత్రం – ‘బాబు గారూ! మీరు ఎప్పటిలా మళ్ళీ ‘సీఈఓ’ అయ్యారు. అలా వద్దు సార్! మీరు రాజకీయాలు మాత్రమే చేయండి’ అనడం ఈ గందరగోళానికి పరాకాష్ఠ!జాన్సన్ చోరగుడివ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
మొత్తం కేంద్రానికే.. రాష్ట్రాలు గగ్గోలు!
కేంద్రం నుంచి రాష్ట్రాలకు సక్రమంగా నిధుల బదిలీ జరగడం లేదని చాలాకాలంగా రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. నిధుల బదిలీలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ రాష్ట్రాలు నిరసన గళం వినిపిస్తున్నాయి. పన్నులు, సెస్సుల రూపంలో కేంద్రం ఎక్కువ ఆదాయం ఆర్జిస్తోందని కథనాలు వస్తున్నాయి. పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ మొత్తం పన్ను వసూళ్లలో సెస్సుల ద్వారా సమకూరిన వాటా 18 శాతం. తాజాగా ఇప్పుడది 30శాతానికి పెరిగినట్లు కొన్ని కథనాల ద్వారా తెలిసింది. కేంద్రానికి పెరిగిన ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకోవడం లేదనే వాదనలున్నాయి. నిబంధనల ప్రకారం సెస్సుల ఆదాయంలోనూ రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మొత్తం పన్ను వసూళ్లలో 50శాతాన్ని రాష్ట్రాలకు పంచాలి. మిగిలిన 50శాతం నిధుల్లో 10శాతాన్ని వివిధ రాష్ట్రాల్లో జాతీయ ప్రాజెక్టులపై వెచ్చించాలి. ఇదీ చదవండి: ఒకసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ టు శ్రీకాకుళం! ఓటు బ్యాంకు రాజకీయాలు, ఉచిత వరాలు చాలా రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. పెట్టుబడులకు వాటి వద్ద నిధులు ఉండటం లేదు. ఉత్పత్తి పెంపుదల, ఉపాధిపట్ల అధిక దృష్టి సారించే రాష్ట్రాలకు నిధుల బదిలీలో ఆర్థిక సంఘం ప్రాధాన్యమివ్వాలని నిపుణులు చెబుతున్నారు. -
ప్రఖ్యాత వ్యవసాయ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ ఇక లేరు
న్యూఢిల్లీ: ప్రఖ్యాత వ్యవసాయ ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ప్రొఫెసర్ అభిజిత్ సేన్ (72) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సోమవారం అర్థరాతత్రి కన్నుమూశారని అభిజిత్ సేన్ సోదరుడు డాక్టర్ ప్రణబ్ సేన్ ప్రకటించారు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆయను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని, అప్పటికే ఆయన మరణించారని తెలిపారు. ఆయన మరణంపై రాజకీయ ప్రముఖులు, ఆర్థిక ,వ్యవసాయరంగ నిపుణులు పలువురు సంతాపం ప్రకటించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 2004 నుంచి 2014 వరకు ప్రణాళికా సంఘం సభ్యుడిగా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని తొలి ఎన్‌డిఎ ప్రభుత్వంలో వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సిఎసిపి) ఛైర్మన్‌గా అభిజిత్ సేన్, జూలై 2000లో సమర్పించిన రిపోర్ట్ ప్రముఖంగా నిలిచింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొంది, నాలుగు దశాబ్దాల కరియర్లో అభిజిత్ సేన్ న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని బోధించేవారు. అంతకుముందు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ , ఎసెక్స్‌లలో కూడా ఎకానమిక్స్ బోధించారు. వ్యవసాయ ఖర్చులు అండ్ ధరల కమిషన్ అధ్యక్షుడు సహా అనేక ముఖ్యమైన ప్రభుత్వ పదవులను ఆయన నిర్వహించారు. సేన్‌కు భార్య జయతి ఘోష్(దివైర్ డిప్యూటీ ఎడిటర్), కుమార్తె జాహ్నవి సేన్ ఉన్నారు. Prof Abhijit Sen was a fine economist with both his head & heart in the right place. His work, interventions benefitted many lives & families. I’m sure that my friend had much more to say & contribute at this difficult time India is going through. His passing is a big loss to us. pic.twitter.com/Jxb0V4BZFU — Sitaram Yechury (@SitaramYechury) August 30, 2022 -
India@75: ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’
భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1న సరికొత్త వ్యవస్థ ‘నీతి ఆయోగ్’ ఏర్పాటైంది. అంతకు ముందు ఉన్న భారత ప్రణాళికా సంఘం.. కేంద్ర మంత్రిమండలి తీర్మానం ద్వారా 1950 మార్చి 15 న ఏర్పాటైంది. 2014 లో మోడీ తన మొదటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో, ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయాలనే ఉద్దేశ్యాన్ని ప్రకటించారు. తదనుగుణంగా నీతి ఆయోగ్ కు రూపకల్పన జరిగింది. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు ఎం.ఎస్.నారాయణ, ఆర్.కె.లక్ష్మణ్, కేశవరెడ్డి, డి. రామానాయుడు, రాళ్లబండి కవితా ప్రసాద్, నర్రా రాఘవరెడ్డి, షీలా కౌల్ (100), ఎం.ఎస్. విశ్వనాథన్, వి. రామకృష్ణ, ఏడిద నాగేశ్వరరావు, కళ్లు చిదంబరం, కొండవలస లక్ష్మణరావు, రంగనాథ్.. కన్నుమూత. జాతీయోద్యమ కార్యకర్త మదన్ మోహన్ మలావ్యాకు మరణానంతర ‘భారత రత్న’. తొలి ‘ఇంటర్నేషనల్ యోగా డే’ వేడుకలు. గోదావరి పుష్కరాల్లో భక్తుల తొక్కిసలాట (రాజమండ్రి). 29 మంది మృతి. (చదవండి: శతమానం భారతి: లక్ష్యం 2047.. అమృతయాత్ర) -
ఇన్ఫ్రా ప్రాజెక్టులు.. ప్రజల నెత్తిన రూ 4.38 లక్షల కోట్ల భారం!
న్యూఢిల్లీ: ఒకటో వంతు మౌలిక రంగ ప్రాజెక్టులు అధిక వ్యయ భారంతో, జాప్యంతో కొనసాగుతున్నట్టు కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు శాఖ తెలిపింది. రూ.150 కోట్ల వ్యయాలకు మించి 1,679 కోట్ల ప్రాజెక్టులకు గాను సుమారు 439 ప్రాజెక్టులు.. మొత్తం మీద రూ.4.38 లక్షల కోట్ల అధిక వ్యయ భారంతో నెట్టుకొస్తున్నాయని పేర్కొంది. ‘‘1,679 ప్రాజెక్టుల వాస్తవ వ్యయం రూ.22,29,544 కోట్లు. కానీ, వీటిని పూర్తి చేసేందుకు రూ.26,67,594 కోట్లు అవసరమవుతుంది. అదనంగా రూ.4,38,049 కోట్లు కావాలి. ఇది 19.65 శాతం అధికం’’ అని ప్రణాళిక శాఖ తెలిపింది. 2021 నవంబర్ నాటికి ఈ ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చు రూ.12,88,558 కోట్లు కాగా, మొత్తం అంచనా వ్యయాల్లో 48.30 శాతమని వివరించింది. ‘‘నిర్ణీత కాలవ్యవధికి అనుగుణంగా కాకుండా, ఆలస్యంగా నడుస్తున్న 541 ప్రాజెక్టుల్లో.. 90 ప్రాజెక్టులు 1–12 నెలలపాటు ఆలస్యం కాగా, 113 ప్రాజెక్టులు 13–24 నెలలుగా జాప్యంతో నడుస్తున్నాయి. 212 ప్రాజెక్టులు 25–60 నెలలుగా పూర్తికాకుండా ఉన్నాయి. మరో 126 ప్రాజెక్టులు 61 నెలల జాప్యంతో ఉన్నాయి’’ అని ప్రణాళిక శాఖ తెలిపింది. చదవండి:ఏఏఐకు ఎయిర్‌లైన్స్ బకాయిలు రూ.2,636 కోట్లు -
ఎకానమీ ‘యూ’ టర్న్!
న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థ ఇంతకన్నా మరింత నష్టానికి గురయ్యే అవకాశాలు లేవని ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా పేర్కొన్నారు. సంఘటిత రంగం 2021 ముగింపుకల్లా కోవిడ్–19 ముందస్తు స్థాయికి చేరుకునే అవకాశం ఉందని కూడా ఆయన విశ్లేíÙంచారు. అయితే ఈ రికవరీ ఆయా రంగాలను బట్టి విభిన్నంగా ఉంటుందని అంచనావేశారు. గత యూపీఏ ప్రభుత్వంలో భారత్ ఆర్థిక వ్యవస్థలో కీలకప్రాత పోషించిన అహ్లూవాలియా తాజాగా ఒక వెర్చువల్ కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యంశాలను పరిశీలిస్తే... ► సంఘటిత రంగం తొలత పురోగమిస్తే, దానిని అసంఘటిత రంగం అనుసరిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుంది. ఆయా పరిస్థితుల్లో ప్రైవేటు రంగంలో పెట్టుబడులు కూడా పెరుగుతాయి. ఇది ఎకానమీ పురోగతిలో కీలకం ► వ్యవసాయ రంగంలో ఆధునికీకరణ అవసరం ఉంది. అయితే దానిని ఎలా నిర్వహించాలన్న అంశం కీలకం. చట్టాల అమలు(కేంద్రం ఇటీవలి మూడు చట్టాల అమలు) విషయంలో రైతుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి.పంజాబ్, హర్యానా, పశి్చమ ఉత్తరప్రదేశ్‌లకు చెందిన వందలాది మంది రైతులు గత ఏడాది నుంచీ ఢిల్లీ సరిహద్దుల సమీపంలో ఆందోళనలు చేస్తూ, మూడు చట్టాల రద్దును కోరుతున్న సంగతి తెలిసిందే. ఎన్ఎంపీ ప్రయోజనకరమే: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) విధానానికి యూపీఏ ప్రభుత్వంలో ఎకానమీలో కీలక బాధ్యతలు పోషించిన అహ్లూవాలియా మద్దతు పలకడం గమనార్హం. ప్రభుత్వ ఆస్తుల లీజు ద్వారా నిధుల సమీకరణకు సంబంధించి కేంద్రం ఆవిష్కరించిన ఆరు లక్షల కోట్ల రూపాయల నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) విధానం వల్ల విద్యుత్ రంగం నుంచి రోడ్లు, రైల్వేల వరకూ వివిధ రంగాల్లో మౌలిక రంగం ఆస్తుల విలువలు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్ఎంపీకి తాను అనుకూలమని ఆయన స్పష్టం చేశారు. ఇది సరిగా అమలు చేస్తే ఆర్థిక వ్యవస్థకు మంచే జరుగుతుందని వివరించారు. బృహత్తర జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్ కార్యక్రమం కింద.. కేంద్రం ప్యాసింజర్ రైళ్లు మొదలుకుని, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రహదారులు, స్టేడియంలు ఇలా పలు మౌలిక రంగాల్లో అసెట్స్‌లో లీజుకివ్వడం తదితర మార్గాల్లో ‘మానిటైజ్’ చేయనుంది. ఇప్పటికే పూర్తయి నిరుపయోగంగా పడి ఉన్నవి లేదా పూర్తి స్థాయిలో వినియోగంలో లేనివి, పూర్తి స్థాయిలో విలువను అందించలేకపోతున్న బ్రౌన్‌ఫీల్డ్ ఇన్ఫ్రా అసెట్స్ మాత్రమే ఎన్ఎంపీ పరిమితం. ఇందులో యాజమాన్య హక్కులు లేదా స్థలం బదలాయింపు ఉండదు. ప్రైవేట్ రంగం పాలుపంచుకునేందుకు అవకాశం కలి్పంచడం ద్వారా ఆయా ఆస్తుల నుంచి మరింత విలువను రాబట్టడానికి వీలవుతుందని, అలాగే మానిటైజేషన్ ద్వారా వచి్చన నిధులను మౌలిక సదుపాయాల కల్పనపై ఇన్వెస్ట్ చేయడానికి సాధ్యపడుతుందని కేంద్రం పేర్కొంది. అయితే 70 యేళ్లపాటు కూడబెట్టిన ప్రజల ఆస్తులను అమ్మేస్తున్నారని ఈ విధానాన్ని ఉటంకిస్తూ, రాహుల్ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ విమర్శపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గతంలో స్పందిస్తూ, ‘‘అసలు ఆయన (రాహుల్ గాం«దీ) మోనిటైజేషన్ అంటే ఏమిటో అర్థం చేసుకున్నారా?’’ అని ఆర్థికమంత్రి ప్రశ్నించారు. ప్రైవేటుకు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణను మాత్రమే అప్పగిస్తున్నామని, యజమాని ప్రభుత్వమేనని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. -
మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు కీలక పదవి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. నియామక ఉత్తర్వులను సీఎం కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రగతిభవన్ లో ఆయనకు అందజేశారు. కేబినెట్ మంత్రి హోదాలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మూడేళ్ల పాటు వినోద్ పదవిలో కొనసాగుతారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా సీఎం వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి అంశాల్లో ప్రణాళికా సంఘం అత్యంత కీలకమైనది కావడంతో అనుభవజ్ఞుడైన వినోద్‌ను ఉపాధ్యక్ష పదవికి సీఎం ఎంపిక చేశారు. సెపె్టంబర్ చివరివారంలో 2019–20 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో అన్ని శాఖల వ్యవహారాలను సమీక్షించడంతోపాటు ప్రతిపాదనలు తయారు చేసే కీలక బాధ్యతనూ వినోద్‌కుమార్‌కు కేసీఆర్ అప్పగించారు. ఈయన కేబినెట్ భేటీలకు శాశ్వత ఆహా్వనితుడిగా ఉంటారు. రాజకీయ, పాలనా అంశాల్లో ఉన్న అనుభవంతోపాటు రాష్ట్ర భౌగోళిక, సామాజిక, ఆర్థిక అంశాల పట్ల అవగాహన కలిగిన వినోద్ సేవలు సంపూర్ణంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సీఎం ఈ పదవిలో నియమించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి... కరీంనగర్ జిల్లాకు చెందిన వినోద్‌కుమార్ బాల్యం, విద్యాభ్యాసం అంతా వరంగల్‌లో కొనసాగింది. వామపక్ష విద్యార్థి సంఘ నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, 2001లో టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా చేరారు. అనంతరం పార్టీలో పలు హోదాల్లో పనిచేశారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా వ్యవహరించిన ఆయన 2004లో హన్మకొండ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. తిరిగి 2014లో కరీంనగర్ లోక్‌సభ నుంచి ఎన్నికైన ఆయన లోక్‌సభలో టీఆర్ఎస్ ఉపనేతగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నేరుగా సేవ చేసే అవకాశం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా రాష్ట్రానికి, ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం లభించిందని వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం నూతన ఉపాధ్యక్షుడి హోదాలో రాష్ట్ర పురోభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించే అవకాశం దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమకారుడిగా తెలంగాణ సమస్యలు, రాష్ట్ర వనరుల పట్ల ఉన్న అవగాహన నూతన బాధ్యతలు నిర్వర్తించడంలో తోడ్పడుతుందన్నారు. తనను ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా నియమించిన సీఎం కేసీఆర్‌కు వినోద్ కృతజ్ఞతలు తెలిపారు. -
బాబు దుబార ఖర్చుతోనే రాష్ట్రంలో ఆర్థికలోటు
-
‘చంద్రబాబు దుబారా వల్లే ఆర్థిక లోటు’
సాక్షి, హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడు దుబార ఖర్చుతోనే రాష్ట్రంలో ఆర్థికలోటు ఏర్పడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు డీఎన్ కృష్ణ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పరిస్థితి మెరుగుపడాలంటే రూ. 65వేల కోట్లు కావాలని 15వ ఆర్థిక సంఘాన్ని కోరినట్లు చెప్పారు. 15వ ఆర్థిక సంఘానికి తమ పార్టీ తరపున పలు అంశాలను తీసుకెళ్లామన్నారు. హైదరాబాద్‌ను కోల్పోయిన నవ్యాంధ్రప్రదేశ్‌కు అధిక నిధులు కేటాయించాలని కోరామన్నారు. రాష్ట్రం ఆర్థికపరంగా చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుదని, రెవిన్యూలోటు భర్తీ చేయాలంటే కేంద్ర సహాయం అవసరమని చెప్పామన్నారు. విభజన హామీలు నెరవేర్చకపోవడం దురదృష్టకరమని, 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్రం నిధులు కేటాయిస్తే ఏపీకి అన్యాయం జరుగుతుందని వివరించినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా రద్దు చేయాలని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదట్నుంచీ చెబుతున్నారని గుర్తు చేశారు. అప్పుడు కేంద్రం మాటలకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలికిందన్నారు. ఏపీ కేంద్రానికి చెల్లించాల్సిన అప్పును పూర్తిగా రద్దు చేయాలని తమ పార్టీ తరపున విజ్ఞప్తి చేశామన్నారు, లోటును భర్తీ చేసేందుకు రూ. 22,113 కోట్ల 14 వ ఫైనాన్స్ కమీషన్ ఇచ్చిందని, కానీ ఈ మొత్తం రెవిన్యూ లోటును భర్తి చేయలేకపోయిందన్నారు. రాష్ర్టంలో పునరుత్పాదకత విద్యుత్ ఉత్పత్తి అధికంగా జరుగుతోందని, రాష్ర్టానికి రాయితీలు ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. -
రాష్ర్ట అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర
కవాడిగూడ: వలస దోపిడీ పాలనను 60 ఏళ్లు భరించిన వాళ్లు.. స్వపరిపాలన వచ్చిన రెండేళ్లకే ప్రజలను రెచ్చగొట్టేలా అసహనాలను వ్యక్తం చేయడం సరైంది కాదనీ, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్రలో భాగమేనని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ లెక్చరర్స్ సంఘం ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టులను అడ్డుకునేందుకు విపక్షాలు చేస్తున్న చర్యల పై మేథావులు స్పందించాలన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి పునాది అని, జాతి ప్రయోజనాలే ధ్యేయంగా చివరి వరకూ పోరాడిన మహనీయుడని కొనియాడారు. సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీని వాస్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి తన ప్రాంతం తరుపున వాదించేందుకు నియమించుకున్న అడ్వకేట్ ప్రొఫెసర్ జయశంకర్ అని అభివర్ణించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం వీసీ ప్రొఫెసర్ సీతారామారావు మాట్లాడు తూ లెక్చరర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సర్వీసు రూల్స్ సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, డాక్టర్ అయాచితం శ్రీధర్, రూబీ, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రాల సమస్యలపై పంచాయితీ!
నీతి ఆయోగ్ మధ్యవర్తిత్వంలో చర్చలు.. కేంద్రం కొత్త ప్రయోగం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల్లో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను... ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు మధ్యవర్తిత్వం వహించే బాధ్యతను ప్రణాళికా సంఘం స్ధానంలో ఏర్పడ్డ నీతి ఆయోగ్‌కు అప్పగించింది. జనవరి మొదటి లేదా రెండో వారంలో రాష్ట్రాలవారీగా ఉన్నతాధికారులతో సమావేశమై చర్చలు జరపాలని సూచించింది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అరవింద్ పనగరియా అధ్యక్షతన ఢిల్లీలో ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ భేటీలకు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతోపాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు హాజరు కావాలని కేంద్రం ఆహ్వానించింది. రాష్టాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా ఆయా సమస్యలతో సంబంధమున్న కేంద్ర మంత్రిత్వశాఖల ముఖ్య కార్యదర్శులు కూడా సమావేశాలకు విధిగా హాజరు కావాలని ఆదేశించింది. కేంద్ర ఉన్నతాధికారులు, రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో చర్చలు జరిపితే కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారమయ్యే అవకాశాలుంటాయని కేంద్రం భావిస్తోంది. నీతి ఆయోగ్ అధ్వర్యంలో జరిగే ఈ భేటీలో మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన ఆహ్వానం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్లే బృందానికి రాష్ట్ర ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య నేతృత్వం వహిస్తారు. రాష్ట్ర విభజనతో ముడిపడిన వివిధ అంశాలపై తెలంగాణ, ఏపీల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాదిన్నర వ్యవధిలో కొన్ని పరిష్కారమైనప్పటికీ.. మరికొన్ని ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ప్రధానంగా విద్యుత్, సాగునీటిపారుదల, విద్య, వైద్యం, మౌలిక వసతులు, రోడ్లు భవనాలు, జాతీయ రహదారుల రంగాలతోపాటు ఉమ్మడి హైకోర్టు విభజన, ఉద్యోగుల పంపకాలు తదితరాంశాల్లో తెలంగాణ, ఏపీ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకొన్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు సైతం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఢిల్లీలో జరిగే భేటీ సందర్భంగా ఈ అంశాలన్నింటిపై కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులు సమగ్రంగా చర్చించనున్నారు. సమస్యలున్న విభాగాలకు చెందిన ఉన్నతాధికారులందరూ ఈ సమావేశాలకు హాజరవుతారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలన్నింటినీ నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు సిద్ధం చేస్తోంది. సమస్యలు, సంబంధిత వివరాలతో నివేదికలు తయారు చేయాలంటూ రాష్ట్ర ప్రణాళికశాఖ అన్ని శాఖలకు సమాచారం చేరవేసింది. -
నీతి ఆయోగ్‌కు కన్సల్టెంట్లు కావలెను!
న్యూఢిల్లీ: ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ నిపుణుల కొరతతో సతమతమవుతోంది. దీంతో ఏడుగురు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)లను నియమించుకోవాలని నిర్ణయించింది. ఒక్కొక్కరికి నెలకు రూ.1.55 లక్షల వేతనాన్ని ఇవ్వనున్నట్లు సంస్థ తన వెబ్సైట్లో ప్రకటించింది. ఆర్థిక, సామాజిక, ఐటీ, రవాణా, న్యాయ, ఇంజనీరింగ్ విభాగాల్లో కన్సల్టెంట్లు అవసరమని అందులో పేర్కొంది. ప్రత్యేక కార్యకలాపాల కోసం పనిచేసే వీరిని తొలుత ఏడాది కాలపరిమితితో నియమించనున్నట్లు తెలిపింది. ఆయారంగాల్లో సరైన నిపుణులు లభించకపోవడంతో సంస్థ కార్యకలాపాలకు విఘాతం కలుగుతోందని సీనియర్ అధికారి ఒకరు శనివారం చెప్పారు. దీంతో ఇందులో ఉన్న సభ్యులపై పనిభారం పెరుగుతోందని, సంస్థ వైస్‌చైర్మన్ అరవింద్ పనగరియా 10 డివిజన్లు, 20 మంత్రిత్వ శాఖలు పర్యవేక్షిస్తున్నారని; సభ్యుడు బిబేక్ దేబ్రాయ్ 3 డివిజన్లు, 18 మంత్రిత్వ శాఖలు, 15 రాష్ట్రాలు చూస్తున్నారన్నారు. మరో సభ్యుడు వీకే సారస్వత్ 15 మంత్రిత్వ శాఖలు, 17 రాష్ట్రాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. -
కొత్త పుంతలు... పాత కంతలు!
ప్రణాళికా సంఘం రద్దయి కొత్తగా ఏర్పాటైన ‘నీతి ఆయోగ్’ పాలకమండలి తొలి సమావేశం తీరుతెన్నులు చూసినవారికి ఆశానిరాశలు రెండూ కలుగుతాయి. అధికారంలోకొచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న అత్యంత కీలకమైన తొలి విధాన నిర్ణయం నీతి ఆయోగ్ ఏర్పాటు. దాని స్వరూప స్వభావాల గురించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్పిన వివరాలు కొత్త సంస్థపై పూర్తి అవగాహన కల్పించలేకపోయాయి. అయితే, ఆదివారంనాటి సమావేశంలో ప్రధాని చేసిన ప్రసంగం ఈ దిశగా కొంత ప్రయత్నం చేసింది. రాష్ట్రాల అవసరాల మేరకే పథకాలు రూపొందించడం...నిధులు, సాంకేతికతల్లో వాటికి సాధికారత కల్పించడం, సహకార సమాఖ్య వ్యవస్థ నిర్మాణానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషి వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. పై స్థాయిలో పథకాలు రూపొందించి రాష్ట్రాలపై రుద్దే పాత విధానానికి స్వస్తి పలికి...వాటి అవసరాలకు తగిన పథకాలు అమలుచేయడానికి సహకరిస్తామన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్న పథకాల్లో కొన్నిటిని రద్దు చేయడం, మరికొన్నిటిని రాష్ట్రాలకు బదిలీ చేయడంవంటి ప్రతిపాదనలున్నాయి. అందుకోసం సీఎంలతో ఒక ఉపసంఘం కూడా ఏర్పాటుచేస్తారు. ఇదికాక రాష్ట్రాల స్థాయిలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై ఒక ఉపసంఘం, నిరంతర ‘స్వచ్ఛ భారత్’ కోసం మరో ఉపసంఘం ఏర్పాటు కాబోతున్నాయి. పేదరిక నిర్మూలన, వ్యవసాయాభివృద్ధి అంశాల్లో రెండు టాస్క్ ఫోర్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. కనుక ఆ రెండూ...వాటికి సంబంధించిన పథకాలూ ఇకపై రాష్ట్రాల పరిధిలోనే ఉండబోతాయన్న అభిప్రాయం కలుగుతుంది. సహకార సమాఖ్య వ్యవస్థ గురించి మోదీ చెప్పారు గనుక ఆర్థిక విధానాల రూపకల్పనలో, ఆర్థికాభివృద్ధిలో కేంద్రమూ, రాష్ట్రాలూ కలిసి పనిచే స్తాయనుకోవచ్చు. రాష్ట్రాల అభిప్రాయాలకు విలువుంటుందని భావించవచ్చు. ప్రణాళికా సంఘం పనితీరు దీనికి భిన్నం. విధాన రూపకల్పన పూర్తిగా ఆ సంస్థే చూసుకునేది. ఆ విధానాలపై అది కేవలం రాష్ట్రాల అభిప్రాయాలను మాత్రమే అడిగేది. వాటి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండానే అమలు చేయించేది. నీతి ఆయోగ్ మాత్రం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని, వాటి ప్రతిపాదనలేమిటో తెలుసుకుని అందుకు అనుగుణంగా పథకాలు రూపొందిస్తుందని చెబుతున్నారు. అయితే, దీన్నే వికేంద్రీకరణగా చెప్పడం సరికాదు. అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, అమలు పూర్తిగా స్థానిక సంస్థలకివ్వడమే వికేంద్రీకరణలోని కీలకాంశం. స్థానిక సంస్థల కార్యకలాపాలను వెలుపలినుంచి సమీక్షిస్తూ, అవసరమైన సూచనలిస్తూ...అవి విజయవంతం కావడానికి తోడ్పడటం కేంద్ర, రాష్ట్రాల ప్రధాన బాధ్యతగా ఉండాలి. అలా అయినప్పుడే అది నిజమైన వికేంద్రీకరణ అవుతుంది. అయితే, ఆ విషయంలో మోదీ ప్రసంగం స్పష్టత ఇవ్వలేదు. నిర్ణయ ప్రక్రియలో భాగస్వామ్యం కోరుతూ, వికేంద్రీకరణను ప్రస్తావించిన సీఎంలు స్థానిక సంస్థల విషయంలో మాత్రం తమ వైఖరేమిటన్నది చెప్పలేదు. ఇక నిర్మాణరీత్యా నీతి ఆయోగ్ కేంద్ర, రాష్ట్రాల ప్రతినిధులు...నిపుణులతో ఉండే మేథో బృందంగా ఉంటుందని కేంద్రం ప్రకటించింది. అంతేకాదు... ఈ సంస్థలో పరిశోధన, కన్సల్టెన్సీ, టీమ్ ఇండియా విభాగాలుంటాయని తెలిపింది. ఈ వివరాలను చూస్తే రద్దయిన ప్రణాళికా సంఘానికీ, నీతి ఆయోగ్‌కు పెద్ద తేడా లేదనిపిస్తుంది. లోగడ ఉన్న ప్రణాళికా సంఘం ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉన్న జాతీయాభివృద్ధి మండలి(ఎన్డీసీ)కి జవాబుదారీగా ఉండేది. ఎన్డీసీ స్థానంలో ఇప్పుడు సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు ఉండే పాలకమండలి ఏర్పడింది. అయితే, ‘సహకార సమాఖ్య’కు ప్రతీకగా ఉండబోయే నీతి ఆయోగ్ తొలి సమావేశాలకు వచ్చిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు పాత పద్ధతిలోనే నిధుల గురించి, ఇతర సమస్యల గురించి కేంద్రానికి వినతులు చేసుకోవాల్సివచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంతవరకూ ప్రత్యేక హోదా విషయంలోనూ, ఆర్థిక లోటును భరించే విషయంలోనూ కేంద్రం పార్లమెంటు వేదికగా ఎన్నో హామీలు ఇచ్చివున్నది. అప్పట్లో విపక్షంలో ఉన్న బీజేపీ కూడా అందుకు పట్టుబట్టింది. తీరా అధికారంలోకొచ్చాక ఆ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నది. ఒకపక్క సహకార సమాఖ్య వ్యవస్థ గురించి మాట్లాడుతూనే రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అంతులేని జాప్యాన్ని ప్రదర్శించడాన్ని ఎలా అర్ధంచేసుకోవాలి? ఒక మెరుగైన వ్యవస్థ గురించి ఆలోచన చేస్తున్నవారు ఇలాంటి అంశాల్లో ఇంకా మూస వైఖరినే అవలంబించడం సరైంది కాదు. అటు తెలంగాణ సైతం వచ్చే వేసవి కాలంనాటికి రాష్ట్రం ఎదుర్కోబోయే విద్యుత్ సమస్యల గురించి ప్రస్తావించింది. ఆదుకోవాలని కోరింది. ఇక కేంద్రం ఆధ్వర్యంలో ఉండే పథకాలు నానాటికీ చిక్కిపోయి ఇప్పటికి 66 మిగిలితే వాటిని కూడా సాధ్యమైనంతవరకూ కుదించబోతున్నారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకం అటకెక్కడం ఖాయమని కథనాలు వెలువడుతున్నాయి. ఉదారవాద ఆర్థిక విధానాల అమలు తర్వాత చాలా పథకాలు కనుమరుగయ్యాయి. సామాజిక బాధ్యతలను క్రమేపీ తగ్గించుకోవాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పథకాల్లో ఎన్ని మిగులుతాయో అనుమానమే. పేదరికం, నిరక్షరాస్యత, పౌష్టికాహారలోపం, అనారోగ్యంవంటివి ఇంకా సమస్యలుగానే మిగిలివున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం వంటివి కుదిస్తే దాని ప్రభావం గ్రామీణ పేదలపై తీవ్రంగా ఉంటుంది. నీతి ఆయోగ్ ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అధికార వికేంద్రీకరణ గురించి సమీక్షించేటపుడు స్థానిక సంస్థల అధికారాల గురించి పట్టించుకోవాలి. అప్పుడు మాత్రమే నిజమైన అర్ధంలో నూతన వ్యవస్థ ఆవిర్భవించిందన్న అభిప్రాయం కలుగుతుంది. లేనట్టయితే పేరులో తప్ప, పథకాల కోతలో తప్ప మిగిలిందంతా ఒకటేనన్న భావన ఏర్పడుతుంది. -
వచ్చే వారం నుంచి ‘నీతి’ షురూ!
త్వరలో వైస్ చైర్మన్, సభ్యుల నియామకం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు న్యూఢిల్లీ: ప్రణాళికా సంఘం స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ‘నీతి (నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా) ఆయోగ్’ వచ్చే వారం నుంచి కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపాదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నేతృత్వంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ‘నీతి ఆయోగ్’ వ్యవస్థను గురువారం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొద్దిగంటల్లోనే.. ఇప్పటివరకు ప్రణాళికా సంఘం కొనసాగిన ఢిల్లీలోని సంసద్ మార్గ్‌లో ఉన్న యోజన భవన్ వద్ద బోర్డుపై పేరును ‘నీతి ఆయోగ్’గా మార్చారు. ఇందులో నియామకం కాబోయే అధికారులకు అనుగుణంగా గదులను, కార్యాలయాలను సిద్ధం చేస్తున్నారు. నీతి ఆయోగ్‌కు త్వరలోనే వైస్ చైర్మన్, సభ్యులను నియమించనున్న నేపథ్యంలో... వారికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి తొలి వైఎస్ చైర్మన్‌గా ప్రముఖ ఆర్థిక వేత్త అరవింద్ పనగారియాను నియమించనున్నట్లుగా వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఐదుగురు శాశ్వత సభ్యుల నియామకం త్వరలోనే జరుగనుందని.. వారంతా వచ్చేవారం విధుల్లో చేరే అవకాశముందని కేంద్ర అధికార వర్గాల సమాచారం. -
ప్రణాళికా సంఘం పరిసమాప్తం
న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్రానంతరం 65 ఏళ్లపాటు కొనసాగిన ప్రణాళికా సంఘం గత చరిత్రగా మారిపోయింది. ఈ కాలంలో రూ. 200 లక్షల కోట్లకు పైగా నిధులతో మొత్తం 12 పంచవర్ష ప్రణాళికలు, ఆరు వార్షిక ప్రణాళికలను అందించిన ఈ సోవియట్ కాలపు సంస్థ గురువారంతో రద్దయిపోయింది. దీని స్థానంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫామింగ్ ఇండియా - నీతి ఆయోగ్ (భారత్ పరిణామానికి జాతీయ సంస్థ)ను కేంద్రం నెలకొల్పింది. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు ప్రణాళికల కోసం... భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌నెహ్రూ ప్రణాళికా సంఘాన్ని (యోజనా ఆయోగ్) నెలకొల్పారు. 1950 మార్చి 15న సాధారణ ప్రభుత్వ తీర్మానంతో ఏర్పాటైన ఈ సంఘం అనంతర కాలంలో ఎన్నో రాజకీయ, ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది. వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రజల జీవన ప్రమాణాలను వేగంగా పెంపొందించటం, ఉత్పత్తిని పెంచటం, ఉపాధి అవకాశాలను అందించటం అనే ప్రభుత్వ ప్రకటిత లక్ష్యాలను సాధించటంలో భాగంగా ఈ సంస్థను నెలకొల్పారు. దేశంలోని వనరులన్నిటినీ అంచనా వేయటం, లోటు ఉన్న వనరులను పెంపొందించటం, వనరులను అత్యంత సమర్థవంతంగా, సమతౌల్యంగా వినియోగించుకునేందుకు ప్రణాళికలను రూపొందించటం, ప్రాధాన్యాలను నిర్ణయించటం తదితర బాధ్యతలను ఈ సంస్థకు అప్పగించారు. ప్రణాళికాసంఘం ఏర్పాటైనప్పటి నుంచీ అది అనేక విధాలుగా రూపాంతరం చెందింది. ప్రణాళికలు రచించే సాధారణ సంస్థగా మొదలైన ఈ సంఘం ఆ తర్వాత శక్తిమంతమైన నియంత్రణ సంఘంగా, ఆర్థిక వికేంద్రీకరణ సాధనంగా, అధికారిక మేధోమథన బృందంగా రూపాంతరం చెందింది. నిజానికి.. ప్రణాళికాసంఘాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనపై నెహ్రూ స్వయంగా వ్యతిరేకతను ఎదుర్కొన్నట్లు చెప్తారు. అయినా అనేక ప్రభుత్వాలు ఆర్థిక విధానాలను, ఇతర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి, అమలు చేసేందుకు ఈ సంఘం ప్రధాన సంస్థగా కొనసాగింది. ఈ సంస్థ తొలి పంచవర్ష ప్రణాళికను రూ. 2,000 కోట్ల కేటాయింపులతో 1951లో ప్రారంభించింది. 1965 వరకూ మరో రెండు పంచవర్ష ప్రణాళికలను రూపొందించింది. 1966 నుంచి 1969 మధ్య మూడు వార్షిక ప్రణాళికలను అమలు చేశారు. అనంతరం 1969లో నాలుగో పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు. 1990లో కేంద్రంలో వేగంగా మారిపోయిన రాజకీయ పరిణామాల కారణంగా ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక ప్రారంభం కాలేదు. 1992లో ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక, 1997లో తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక మొదలయింది. ప్రణాళికా సంఘం మొత్తం 12 పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టింది. స్థాపితమైంది : 1950 మార్చి 15 కేంద్ర ప్రభుత్వ తీర్మానంతో ఇప్పటివరకూ : 12 పంచవర్ష ప్రణాళికలు, 6 వార్షిక ప్రణాళికలు ఎంత నిధులు : 200 లక్షల కోట్ల రూపాయలు లక్ష్యాలు : ప్రజల జీవన ప్రమాణాలను, ఉత్పత్తిని, ఉపాధి అవకాశాలను పెంపొందించటం బాధ్యతలు : వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే ప్రణాళికల రూపకల్పన, ప్రాధాన్యాల నిర్ణయం రద్దయింది : 2015 జనవరి 1న ‘నీతి ఆయోగ్’ ఏర్పాటుతో -
నెహ్రూ విధానాలకు తూట్లు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రణాళికా సంఘం పేరును నీతి ఆయోగ్‌గా మార్చడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. దీని వెనుక నెహ్రూ, కాంగ్రెస్ వ్యతిరేక విధానమే కనిపిస్తోందని ఆ పార్టీ పేర్కొంది. నిజంగా సంస్కరణలు తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రణాళికా సంఘం పేరును యోజనా ఆయోగ్ నుంచి నీతి ఆయోగ్‌గా మార్చితే తమకు అభ్యంతరం లేదని, అయితే ప్రభుత్వ ఉద్దేశం వేరుగా ఉందని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వి గురువారం ట్వీటర్లో పేర్కొన్నారు. మరో కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ కూడా ఈ నిర్ణయంపై మండిపడ్డారు. నెహ్రూ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని ఆయన విమర్శించారు. 1950లో ఏర్పాటైన ప్రణాళికా సంఘం పేరు మార్చడాన్ని ఇతర విపక్షాలు కూడా తప్పుబట్టాయి. ప్రభుత్వ నిర్ణయంపై సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. దీనివల్ల రాష్ట్రాలపై వివక్ష చూపే అవకాశం ఉంటుందని, అలాగే కార్పొరేట్ సంస్థలకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రణాళికా సంఘాన్ని మార్చి కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని సీపీఐ సీనియర్ నేత గురుదాస్ దాస్‌గుప్తా అభిప్రాయపడ్డారు. -
ఇక నుంచి...'నీతి ఆయోగ్'
-
ఇక నుంచి...'నీతి ఆయోగ్'
న్యూఢిల్లీ : ప్రణాళిక సంఘం పేరును కేంద్ర ప్రభుత్వం ' నీతి ఆయోగ్'గా మార్చింది. హిందీలో నీతి అంటే విధానం... ఆయోగ్ అంటే కమిటీ. మన తెలుగులో చెప్పాలంటే విధాన కమిటీ. ప్రణాళిక సంఘం పేరు మార్పుపై ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఢిల్లీలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాలంలో ప్రణాళిక సంఘం అవశ్యకత, బాధ్యతల మార్పు తదితర అంశాలపై గత కొద్ది రోజులుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ప్రణాళిక సంఘం పేరు మార్పును తన తొలి స్వాతంత్ర్య దిన సందేశంలోనే మోదీ వెల్లడించారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మానస పుతిక్ర ప్రణాళిక సంఘం. ప్రభుత్వ తీర్మానం ద్వారా 1950 మార్చి 15న దీన్ని ఏర్పాటు చేశారు. చట్టబద్ధసంస్థ అయినప్పటికీ దీనికి రాజ్యాంగబద్ధత లేదు. అందుకే పేరు మార్పు చాలా సులభంగా జరిగిపోయింది. దేశ స్వాతంత్ర్యానికి పూర్వమే ప్రణాళిక సంఘంపై చర్చ జరిగింది. రష్యా ప్రణాళిక విధానానికి ముగ్ధడైన నెహ్రూ భారత్‌లోనూ కచ్చితంగా ప్రణాళిక వ్యవస్థ ఉండాలని భావించారు. 1931 కరాచీలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో తొలిసారి ప్రణాళిక విధానంపై చర్చించారు. 1940లో రెండు సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం రాక ముందే అక్టోబర్ 1946లోనే ప్రణాళిక సలహా మండలి ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడి నెహ్రూయే. ఆ తర్వాత ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రధాని దానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని ప్రకటించారు. -
రాష్ట్రాల భిన్నాభిప్రాయాలు
న్యూఢిల్లీ: ప్రణాళికా సంఘం స్థానంలో నూతన సంస్థ ఏర్పాటుపై రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రధాని నిర్వహించిన సీఎంల సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల సీఎంలు కేంద్రం ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చగా బీజేపీ పాలిత, ఇతర పార్టీలపాలిత రాష్ట్రాలు స్వాగతించాయి. సమావేశంలో వివిధ రాష్ట్రాల సీఎంలు ఏమన్నారంటే. రాష్ట్రాలపై కేంద్రం ఆర్థిక భారం: అఖిలేష్ రాజ్యాంగం నిర్వచించిన ‘రాష్ర్ట జాబితా’ పరిధిలోని అంశాలపై కేంద్ర పథకాలను రూపొందిస్తూ రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపుతోందని ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. కేంద్ర పథకాల వల్ల రాష్ట్రాల ఆర్థిక వనరులపై అనవసర ఒత్తిడి పెరుగుతోందన్నారు. రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులను అమలు చేసుకునేలా పూర్తి స్వేచ్ఛను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సమాఖ్యను నిర్లక్ష్యం చేయడమే: చాందీ జాతీయ అభివృద్ధి మండలి సమావేశం ఏర్పాటు చేయకుండా, రాష్ట్రాలను సంప్రదించకుండా ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తూ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం సమాఖ్య వ్యవస్థను నిర్లక్ష్యం చేయడమేనని కేరళ సీఎం చాందీ మండిపడ్డారు. కొత్త సంస్థ ఏర్పాటు ప్రతిపాదనను తెలివితక్కువ చర్యగా అభివర్ణించారు. కొత్త సంస్థ అవసరంలేదు: సిద్ధరామయ్య కాలానుగుణంగా మార్పులకు తట్టుకొని నిలబడ్డ ప్రణాళికా సంఘాన్ని రద్దుచేయాల్సిన అవసరం ఏముందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. రాబోయే సంస్థలో రాష్ట్రాల సీఎంలకు ప్రాతినిధ్యం కల్పించాలని తమిళనాడు సీఎం పన్నీర్‌సెల్వం డిమాండ్ చేశారు.దేశ ఆర్థిక అవసరాలకు తగిన నూతన వ్యవస్థను రూపొందించకుండానే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం వల్ల మంచికన్నా చెడు ఎక్కువ జరిగే ప్రమాదం ఉందని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త సంస్థకు మద్దతిస్తాం: రమణ్‌సింగ్ కొత్త సంస్థ మద్దతిస్తామని ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ తెలిపారు. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఈశాన్య ప్రాంతీయ మండళ్ల ఏర్పాటును మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ప్రతిపాదించారు. నూతన సలహా మండలిని ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సూచించారు. కాగా, భేటీకీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత తోపాటు మిజోరం సీఎం లాల్ తన్హావ్లా, జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గైర్హాజరయ్యారు. -
‘ప్లానింగ్’కు పాతర
ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మానసపుత్రిక ప్రణాళికా సంఘం చరిత్ర పుటల్లో చేరిపోయే ఘడియలు సమీపించాయి. సంఘం భవితవ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రుల సదస్సులో చాలామంది వర్తమాన అవసరాలను తీర్చే ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటుకు మొగ్గు చూపారని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పడాన్నిబట్టి చూస్తే దాని ముగింపు ఇక లాంఛనప్రాయమేనని అర్థమవుతుంది. వాస్తవానికి మోదీ ఎన్నికల సమయంలోనే ప్రణాళికా సంఘం వ్యవహార శైలిపై నిశిత విమర్శలుచేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తొలిసారి ఎర్రకోట బురుజులపై నుంచి చేసిన ప్రసంగంలో సంఘానికి వీడ్కోలు పలకబోతున్నట్టు ప్రకటించి, దాని స్థానంలో ఏర్పాటుచేయబోయే సంస్థ ఎలా ఉండాలో సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. అందుకోసం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటుచేశారు. పాత కాలానికి పనికొచ్చిన సంఘం వర్తమాన సవాళ్లను ఎదుర్కొనడంలో విఫలమవుతున్నదన్నదే మోదీ ప్రధాన విమర్శ. అంతేకాదు...సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేశారు గనుక ప్రణాళికా సంఘం రాష్ట్రాల ఆకాంక్షలనూ, అవసరాలనూ పట్టించుకోవడంలో విఫలమైందన్న అభిప్రాయమూ ఆయనకు ఉన్నది. మోదీ వరకూ ఎందుకు...దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కూడా ప్రణాళికా సంఘం ‘పనిపట్టాలని’ చూశారు. 2010లోనే అందుకు సంబంధించిన లాంఛనా లను ప్రారంభించినా ఎందుకనో దాన్ని తుదికంటా తీసుకెళ్లలేకపోయారు. వాస్తవానికి ప్రణాళికా సంఘం నెలకొల్పడం వెనకున్న ఉద్దేశాలను ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే ఆ సంస్థ ఇన్నాళ్లపాటు బతికి బట్టకట్టడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వరంగ సంస్థలకు కీలకమైన పాత్రనిచ్చి,వాటిని అభివృద్ధిపరచడం... కేంద్ర ప్రభుత్వ పూర్తి నియంత్రణలో దేశంలో సమతులాభివృద్ధిని సాధించడం, ప్రాంతీయ ఆర్థిక అసమానతలను రూపు మాపడం దాని లక్ష్యాలు. పూర్వపు సోవియెట్ యూనియన్ అనుసరించిన ప్రణాళికాబద్ధ అభివృద్ధి నమూనాను చూసి ముచ్చటపడి...దాన్ని అనుసరించాలని 1950లో నెహ్రూ సంకల్పించారు. స్వేచ్ఛా విపణి ఆర్థిక విధానాలను అవలంబించి పాశ్చాత్య ప్రపంచం 150 ఏళ్లలో సాధించిన అభివృద్ధి స్థాయికి సోవియెట్ యూనియన్ కేవలం మూడు దశాబ్దాల్లో చేరడం సాధ్యమైన తీరు ఆయన ను సంభ్రమపరిచింది. ప్రణాళికా సంఘం ఇప్పటివరకూ 12 పంచవర్ష ప్రణాళికలను దేశానికి అందించింది. ప్రభుత్వ రంగంలో ఇటు మౌలిక పరిశ్రమలూ, అటు భారీ పరిశ్రమలూ నెలకొల్పడానికి అవసరమైన వనరుల సమీకరణపై కీలక సూచనలు చేసింది. అయితే, ఇదంతా మొదటి ఎనిమిది పంచవర్ష ప్రణాళికల వరకే. 1997లో ప్రారంభమైన తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక మొదలుకొని సంఘంలో పబ్లిక్ రంగ సంస్థల ప్రాధాన్యత తగ్గిపోయింది. అంతకు నాలుగైదేళ్లక్రితమే ఆర్థిక సంస్కరణలు మొదలై, లెసైన్స్ రాజ్ ప్రభావం క్రమేపీ తగ్గుతూ... ప్రైవేటు రంగం శక్తి సంతరించుకుంటున్న దశ అది. పబ్లిక్ రంగానికి దీటుగా పెట్టుబడులు పెట్టడానికి సాహసించే కొత్త తరం మదుపుదార్లు ముందుకొచ్చిన సమయమది. మరోపక్క అభివృద్ధి కోసమని ప్రపంచబ్యాంకుతో సహా ఎక్కడైనా రుణం తెచ్చుకోవడానికి వెసులుబాటు కలిగిన తరుణంలో ప్రణాళికా సంఘం నియంత్రణలేమిటని రాష్ట్రాలు విసుక్కోవడం మొదలైంది. వాస్తవానికి ఏడో పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను 1985లో సంఘం ఆనాటి వైస్ చైర్మన్ మన్మోహన్సింగ్ సమర్పించినప్పుడు ప్రణాళిక సంఘం సభ్యుల్ని అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ‘జోకర్ల గుంపు’గా అభివర్ణించి తన అసహనాన్ని వ్యక్తంచేశారు. తాననుకున్న బుల్లెట్ రైళ్లు, షాపింగ్ మాల్స్, ఎక్స్‌ప్రెస్ హైవేలు, వినోదాత్మక నైపుణ్యకేంద్రాలు, భారీ ఆవాస సముదాయాలు ప్రణాళిక సంఘం ముసాయిదాలో లేనందుకు ఆయనకు ఎక్కడలేని ఆగ్రహమూ కలిగింది. సంఘం ప్రమేయం లేకుండానే వాటిల్లో కొన్ని సాకారమై, మరికొన్ని దరిదాపుల్లోకి వస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రణాళికా సంఘం ‘చాదస్తాన్ని’ భరించే ఓపిక ఇక ఎవరికుంటుంది? కనుకనే నరేంద్ర మోదీ ప్రతిపాదనకు రాష్ట్రాలనుంచి గట్టి మద్దతే లభించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కొన్ని వ్యతిరేకించినా పార్టీవ్రత్యంతోనే అవి ఆ పని చేశాయనుకోవాలి. ఎందుకంటే కేటాయింపులపై అజ్మాయిషీ చేస్తూ, వ్యయంపై నియంత్రణలు విధిస్తూ, తాము రూపొందించిన ప్రాజెక్టుల అమలుపై లక్ష్య నిర్దేశం చేస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తున్న ప్రణాళికా సంఘం తీరు ఏ ముఖ్యమంత్రికీ నచ్చడంలేదన్నది బహిరంగ రహస్యం. అయితే, ఇన్ని నియంత్రణలున్నా దేశంలో అక్షరాస్యత, శిశుమరణాల నియంత్రణ, ప్రజారోగ్య పరిరక్షణ సాధ్యంకావడం లేదు. ఆకలిచావులు, మహిళలపై దాడులు ఆగడం లేదు. సామాజిక అసమాన తలు తగ్గిన దాఖలాలు లేవు. పేదరిక నిర్మూలనలోనూ వైఫల్యమే. ఇప్పటికీ పల్లె సీమలు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. దేశంలో మెజారిటీ జనాభా కు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయరంగం నానాటికీ కుంచించుకుపోతున్నది. ఇలాంటి తరుణంలో రాష్ట్రాలకు ప్రాధాన్యం పెరిగేలా, వాటి మనోభావాలకు పెద్దపీట వేసేలా అసలైన ఫెడరలిజాన్ని ప్రతిబింబించేలా కొత్త సంస్థను ఏర్పాటు చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండనవసరం లేదు. అధికారమూ, ప్రణాళికా వికేంద్రీకరించాలన్న సంకల్పమూ మంచిదే. అయితే ఈ వికేంద్రీకరణ... సామాజిక బాధ్యతలనుంచి ప్రభుత్వాలు వైదొలగడానికి సాధనగా మారితే అది సామాన్యులకు శరాఘాతమవుతుంది. కొత్త సంస్థ ఏర్పాటులో ఈ విషయమై తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని పాలకులు గుర్తుంచుకోవాలి. -
ముఖ్యమంత్రుల మండలి ఉండాలి: చంద్రబాబు
-
మోదీ ఆలోచనకు కేసీఆర్ మద్దతు
న్యూఢిల్లీ: ప్రణాళిక సంఘంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు పలికారు. ప్రణాళిక సంఘం స్థానే ఏర్పాటు చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రుల మండలి సమర్థవంతంగా పనిచేసేందుకు ప్రత్యేక సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని సూచించారు. సారుప్యత ఉన్న సమస్యలపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉప సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. పంచవర్ష ప్రణాళికల స్థానంలో పది పదిహేనేళ్ల ప్రణాళికలు రూపొందించాలన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న మనఊరు మనప్రణాళికను ప్రధాని మోదీకి వివరించినట్టు కేసీఆర్ తెలిపారు. -
ముఖ్యమంత్రుల మండలి ఉండాలి: చంద్రబాబు
న్యూఢిల్లీ: ప్రణాళిక సంఘం స్థానే ముఖ్యమంత్రుల మండలి ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. ప్రధాని అధ్యక్షతన ఆదివారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రణాళిక సంఘానికి ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం ప్రధాని ఆలోచిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ప్రణాళిక సంఘాన్ని ఒక తంతుగా కింద ఉపయోగించుకునేవారని విమర్శించారు. విజన్- 2050 తయారు చేసుకోవాల్సిన అవసముందన్నారు. రాజకీయాల కంటే అభివృద్ధి ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. -
నేడు సీఎంలతో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న సంస్థ రూపురేఖలు, పనితీరుపై చర్చించేందుకు ప్రధాని మోదీ ఆదివారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. మారిన దేశ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఈ సంస్థ ఎలా ఉండాలన్న అంశంపై సీఎంల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ఈ భేటీలో తొలుత ప్రణాళిక సంఘం కార్యదర్శి సింధుశ్రీ ఖులార్ భవిష్యత్తులో కొత్త సంస్థ నిర్వర్తించబోయే విధుల గురించి వివరిస్తారు. అనంతరం సీఎంలు ప్రసంగిస్తారు. ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేయబోయే సంస్థలో 8 నుంచి 10 మంది సభ్యులు ఉండొచ్చని సమాచారం. కొత్త సంస్థ రాష్ట్రాలను మరింత బలోపేతం చేసేదిగా ఉంటుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. విమర్శనాస్త్రాలతో విపక్షాలు సిద్ధం... ప్రణాళికా సంఘం రద్దుకు ఆతురత పడుతున్న కేంద్రం తీరుపై సీఎంల భేటీలో ఎండగట్టేందుకు విపక్ష సీఎంలు సిద్ధమయ్యారు. ప్రణాళికా సంఘం రద్దు నిర్ణయాన్ని తీసుకున్న తీరుపై తమ సమావేశంలో వ్యతిరేకిస్తుందని జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ వెల్లడించారు. అయితే, ప్రణాళికా వ్యవస్థ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించబోమని, దాని రద్దుకు చేపడుతున్న తొందరపాటు చర్యలనే వ్యతిరేకిస్తామని సమాజ్‌వాదీ పార్టీ తెలిపింది. తృణమూల్ కూడా అసమ్మతి తెలిపే అవకాశముంంది. ప్రస్తుత వ్యవస్థ అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని, కొత్త వ్యవస్థ ఏర్పాటుచేయదలిస్తే అది కేంద్ర, రాష్ట్ర సంబంధాలను బోలోపేతం చేసేలా ఇంకా సమర్థంగా ఉండాలని కేరళ సీఎం ఊమెన్ చాందీ అన్నారు. -
7న సీఎంలతో ప్రధాని సమావేశం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటయ్యే కొత్త వ్యవస్థ రూపు రేఖలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 7వ తేదీన ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. -
అండగా నిలవండి, చేయూతనివ్వండి
-
20,950 కోట్ల గ్రాంట్ ఇవ్వండి
14వ ఆర్థిక సంఘానికి రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదనలు 25 రంగాల్లో చేపట్టే అభివృద్ధి పనులతో వివరణ కొత్తగా ఏర్పడిన రాష్ర్టంలో 25 రంగాల అభివృద్ధికి రూ. 20,950 కోట్లను గ్రాంట్‌గా ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. తద్వారా తన ప్రాధాన్యాలను తెలియజేసింది. ముఖ్యమైన ఈ రంగాల్లో సేవల లోటును పూడ్చడానికి తగిన నిధులిచ్చి సహకరించాలని కోరింది. అలాగే నిధుల విడుదల విషయంలో నిబంధనలను సవరించాలని, జాప్యాన్ని అరికట్టాలని సూచించింది. పేద రాష్ట్రాల విషయంలో షరతులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రం రంగాల వారీగా కోరిన నిధులు, దానిపై వివరణ. - సాక్షి, హైదరాబాద్ ఎస్సీల అభివృద్ధి: రూ. 133.60 కోట్లు ఎస్సీ హాస్టళ్లు కూడా అద్దె భవనాల్లో ఉన్నాయి. ఉన్న హాస్టళ్లకు ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తున్నాం. కొత్త భవనాల నిర్మాణాలకు నిధులు అవసరం. 167 హాస్టల్ భవనాలకు నిధులు కావాలి. రోడ్లు, బ్రిడ్జిల నిర్వహణ: రూ. 1,000 కోట్లు 24,733 కిలోమీటర్ల పొడవున ఉన్న అంతర్రాష్ర్ట రోడ్లు, బ్రిడ్జ్జిల నిర్వహణకు నిధులు కావాలి. 63,341 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. వాటి నిర్వహణతో పాటు శిథిలావస్థకు చేరిన 207 బ్రిడ్జిల మరమ్మతులు, రోడ్డు భద్రతా చర్యలకు నిధులు కావాలి. వెనుకబడిన తరగతుల సంక్షేమం - విద్య, మౌలిక సదుపాయాలు: రూ. 273.70 కోట్లు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. టాయిలెట్లు, ప్రహరీ గోడలు, తాగునీటి సదుపాయాలు సరిగా లేవు. 119 హాస్టల్ భవనాలు నిర్మించాల్సి ఉంది సీడ్ బ్యాంకు పథకం: రూ. 500 కోట్లు దేశంలోనే ప్రముఖ విత్తనాభివృద్ధి కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించాం. విత్తనోత్ప త్తి రంగంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఫిషరీస్ డెవలప్మెంట్: రూ. 23 కోట్లు చేపల చెరువులు, రొయ్యల హేచరీస్‌ల అభివృద్ధికి ఈ నిధులను ఖర్చు చేస్తాం. డైరీ డెవలప్మెంట్ : రూ. 241 కోట్లు పాల సేకరణ పెంచేందుకు చర్యలు చేపడతాం. 10 మెట్రిక్ టన్నుల పాల పౌడర్ ప్లాంటును హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు, నిజమాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మిల్క్ చిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు వెచ్చిస్తాం. జ్యుడీషియల్ అడ్మినిస్ట్రేషన్ : రూ. 977.64 కోట్లు ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు వివిధ రకాల కోర్టుల ఏర్పాటు, భవనాల నిర్మాణాలకు, సదుపాయాల కల్పనకు వెచ్చిస్తాం. పోలీసు శాఖ: రూ. 1,691.75 కోట్లు పోలీసు శాఖ బలోపేతం, హైదరాబాద్‌లో సీసీటీవీల ఏర్పాటు, బలగాల అప్‌గ్రేడేషన్, వసుతుల మెరుగుకు ఖర్చు చేస్తాం. జైళ్ల అభివృద్ధి, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణం, ఆధునీకరణకు రూ. 135.82 కోట్లు కావాలి. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్: 614కోట్లు హైదరాబాద్‌లో అన్ని స్థాయిల్లో ఫైర్ సేవలను అభివృద్ధి చేస్తాం. వేగంగా చర్యలు చేపట్టే విధంగా సదుపాయాలు కల్పిస్తాం. డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్, డీపీసీ: రూ. 250 కోట్లు ప్రణాళిక విభాగాల వికేంద్రీకరణకు, జిల్లాల్లో అభివృద్ధికి ఈ నిధులు అవసరం. పర్యావరణం: రూ. 100 కోట్లు బస్సుల్లో మొబైల్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్లు, అవగాహన కార్యక్రమాలకు, కాజీపల్లి, ఆశని కుంటలో సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్కు వెచ్చిస్తాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి: రూ. 1,091.25 కోట్లు టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ అభివృద్ధి, ఐటీఐఆర్‌లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు, ఇంటర్నెట్ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాల కల్పన టూరిజం, ఆర్కియాలజీ: రూ. 203.05 కోట్లు వారసత్వ సంపదను కాపాడేందుకు, టూరి జాన్ని విస్తరింపజేసేందుకు వీటిని వెచ్చిస్తాం. ప్రోగ్రాం మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అథారిటీకి రూ. 50 కోట్లు మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ చర్యలు చేపడతాం. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థకు: 100 కోట్లు బడ్జెట్, రెవెన్యూ, ఖర్చులు, ఖాతాలు, మానవ వనరుల నిర్వహణకు ఈ నిధులను వెచ్చిస్తాం. గిరిజన సంక్షేమానికి రూ. 355.84 కోట్లు గిరిజన సంక్షేమానికి, విద్యాసంస్థలు, మౌలిక సదుపాయల కల్పన, ట్రైబల్ కల్చర్ రీసర్చ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు నిధులు అవసరం. నీటి రంగం నిర్వహణ, వాటర్ గ్రిడ్‌కు రూ. 7,700 కోట్లు గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, రక్షిత తాగునీటి అవసరాలు, ప్రాజెక్టులు, చెరువులు, కాలువల మరమ్మతులకు వెచ్చిస్తాం. ఆరోగ్య రంగం బలోపేతానికి రూ.500 కోట్లు తెలంగాణలో నిమ్స్ తరహాలో 12 ఆసుపత్రులను అభివృద్ధి చేస్తాం. అడవుల నిర్వహణ, తెలంగాణ హరిత హారం: రూ. 1,046.5 కోట్లు అటవీ అభివృద్ధి, వన్యప్రాణి సంరక్షణ, సామాజిక అడవుల పెంపకం, హరితహారం, అటవీ పరిశోధ న, ఐటీ వినియోగం వంటి కార్యక్రమాలను చేపడుతున్నాం. వచ్చే మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు పెంచుతాం. ఉన్నత విద్య బలోపేతం: రూ. 900 కోట్లు కొత్త యూనివర్సిటీలకు, పీజీ సెంటర్లకు అదనపు నిధులు కావాలి. రాష్ట్రం ఇచ్చే నిధులు వేతనాలు, రోజువారీ నిర్వహణకు సరిపోతున్నాయి. కొత్త భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు నిధులు అవసరం. ప్రాథమిక విద్య (ఎస్ఎస్ఏ): రూ.1,327.38 కోట్లు సర్వశిక్ష అభియాన్ ద్వారా ఇస్తున్న నిధులు సరిపోవడం లేదు. వేతనాల ఖర్చే ఎక్కువగా ఉంది. ప్రతి మూడు నెలలకు 14,277 మంది టీచర్ల వేతనాలకు, యూనిఫారాలకు అదనంగా నిధుల కావాలి. పాడి పరిశ్రమ రంగంలో మౌలికవసతులు: రూ. 106.36 కోట్లు పశుగణాభివృద్ధిలో భాగంగా ఎమర్జెన్సీ వెటర్నరీ ఆంబులెన్స్ సర్వీసుకు, పశువుల వ్యాధి నిర్ధారణ ప్రాంతీయ ల్యాబ్‌లు, జిల్లా స్థాయి ల్యాబ్‌ల ఏర్పాటు, గ్రామాల్లో వెటర్నరీ వసతుల కల్పనకు వెచ్చిస్తాం. ఇండస్ట్రియల్ పార్కుల నిర్వహణ: రూ. 313.36 కోట్లు పాత ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన విద్యుత్ రంగం, వ్యవసాయ ఫీడర్ల విభజన: రూ.1,316 కోట్లు గ్రామీణ గృహాలు, వాణిజ్య కేటగిరీలతో విద్యుత్ సరఫరా. వ్యవసాయానికి 7 గంట ల ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలి. ఇందుకోసం వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను విభజించాల్సి ఉంది. -
వడదెబ్బ, పిడుగుపాటు మరణాలకూ పరిహారం ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: వడదెబ్బ, పిడుగుపాట్లతో సంభవిస్తున్న మరణాలను ప్రకృతి వైపరీత్యాలుగానే పరిగణించి ప్రకృతి విపత్తుల సహాయ నిధి(ఎస్డీఆర్ఎఫ్) కింద ఆదుకోవాలని 14వ ఆర్థికసంఘాన్ని రాష్ట్రప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్న ఈ తరహా మరణాలకు ఎస్డీఆర్ఎఫ్ వర్తించని కారణంగా బాధిత కుటుంబాలకు సరైన పరిహారం అందడం లేదని తెలిపింది. శుక్రవారం 14వ ఆర్థికసంఘంతో జరిగిన సమావేశంలో ప్రకృతి విపత్తుల కారణంగా రాష్ట్రానికి జరుగుతున్న నష్టం, దీని నివారణకు కేంద్రం పెంచాల్సిన సాయం తదితరాలపై ప్రభుత్వం నివేదించింది. రాష్ట్రంలో గత ఐదేళ్లలో వరుస కరువు, అకాలవర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాడ్పడ్డారని పేర్కొంది. పంటనష్టం 50 శాతం, అంతకంటే ఎక్కువ ఉంటేనే ఇన్పుట్ సబ్సిడీ వర్తిస్తుందన్న కేంద్రనిబంధన రైతాంగానికి ప్రతికూలంగా మారిందని రాష్ట్రప్రభుత్వం వివరించింది. అందువల్ల ఇన్పుట్ సబ్సిడీకి పంట నష్టం అర్హతని 50శాతం నుంచి 25శాతానికి తగ్గించాలంది. దెబ్బతిన్న పంట విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని సబ్సిడీని నిర్ణయించాలని విజ్ఞప్తి చేసింది. 2007 నుంచి 2013 వరకు ఎస్డీఆర్ఎఫ్ కింద మొత్తంగా రూ.4,676.61కోట్లు కేటాయించినప్పటికీ.. ఒకే ఏడాదిలో విపత్తులు ఎక్కువగా వచ్చినందున రూ.2,160కోట్లు ఎక్కువగా అంటే రూ.6.836.97కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపింది. రాష్ట్రం అదనంగా ఖర్చు చేసిన మొత్తాన్ని కేంద్రం 75:25 నిష్పత్తిలో భరించాలని కోరింది. 1997 నుంచి ఆత్మహత్యలు 3,317.. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ప్రతిఏటా సగటు వర్షపాతంతో పోలిస్తే 18 నుంచి 24శాతం తక్కువ వర్షపాతం నమోదవుతోందని వాతావరణ శాఖ తేల్చిందని,తక్కువ వర్షపాతం కారణంగా కరవు రాష్ట్రాల్లో రాజస్థాన్ తర్వాత తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉందని తెలిపింది. 1997 నుంచి 2013 వరకు రాష్ట్రం వరుసగా పది ఏడాదుల్లో కరవును ఎదుర్కొనగా, 2009 నుంచి వరుసగా కరువు ఏర్పడింది. దీంతో 1997 నుంచి 2011 వరకు 3,317మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. -
కేసీఆర్ ప్రస్తావించిన పలు అంశాలు
కేంద్రానికి పన్నేతర ఆదాయం విపరీతంగా పెరుగుతోంది. సముద్రతీర రాయల్టీ, స్పెక్ట్రమ్ అమ్మకం, పెట్టుబడుల ఉపసంహరణతో భారీ ఆదాయం లభిస్తోంది. వీటన్నింటిలో రాష్ట్రానికి వాటాను పంచాలి. సెస్సు, సర్‌చార్జీలు విధించడం వల్ల వచ్చే ఆదాయాన్ని కూడా రాష్ట్రాలకు ఇవ్వాలి. 40 శాతం కేంద్ర పన్నులను రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల.. కేంద్ర వ్యయంలో కేవలం ఐదు శాతం మాత్రమే తగ్గుతుంది. ఈక్విటీ పారామీటర్లలో ఎక్కువ వెయిటేజీ ఇవ్వడం వల్ల మధ్యాదాయ రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాలో భారీగా కోతపడుతోంది. రాష్ట్రాల ద్రవ్య, రెవెన్యూ లోటు పరిమితిని కేంద్రంతో సమానంగా రాష్ట్రాలకు ఇవ్వాలి. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని రాష్ట్రాలపై రుద్దుతున్నారు. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని పాటిస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలివ్వాలి.కొత్త రాష్ట్రాలకు ఈ చట్టంలో మినహాయింపులు ఇవ్వాలి. ఆర్థిక సర్దుబాటును సమర్థంగా అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ జాతీయ సంస్థ(ఎన్ఐపీఎఫ్పీ) అధ్యయనం ప్రకారం 1998-99లో సబ్సిడీల మొత్తం రూ. 2,35,752 కోట్లు కాగా, ఇందులో రాష్ట్రాల మీద పడిన భారం ఏకంగా రూ. 1,55,924 కోట్లు. అంటే 66 శాతం. ఇది రాష్ట్రాలకు ఆర్థికంగా భారంగా మారుతోంది. అందువల్ల సబ్సిడీ భారాన్ని కేంద్రం, రాష్ట్రాల మధ్య సమంగా పంచాలి. అలాగే రాష్ట్రాలు భరించే సబ్సిడీ భారాన్ని కేంద్రం కూడా భరించాలి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రెవెన్యూ మిగులు కష్టం. తద్వారా మూలధన పెట్టుబడి సాధ్యం కాదు. కావున రెవెన్యూ ఖాతాలోకి కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరిగితే తప్ప సాధ్యం కాదు. టోకుమొత్తంలో డీజిల్ కొనుగోలుదార్ల(రైల్వే, ఆర్టీసీ, విద్యుత్ సంస్థలకు)కు మార్కెట్ ధరకు డీజిల్ విక్రయించడం వల్ల.. ప్రజా రవాణా వ్యయం పెరుగుతోంది. ప్రైవేట్ రవాణా పెరిగి కాలుష్యానికి దారితీస్తోంది. ప్రణాళిక పథక రచనలో ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్సుల(నాన్ శాలరీ)ను పరిగణలోకి తీసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్రం ప్రస్తుతం ఇస్తున్న 75 శాతం నష్టపరిహార వాటాను 90 శాతానికి పెంచాలి. సామాజిక న్యాయం మరింత పకడ్బందీగా అమలు కావాలంటే.. రాష్ట్రాలకు నిధులు అధికంగా ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే పౌర సేవల ధర నిర్ణయాధికారంపై కమిషన్ ఎలాంటి నియంత్రణను సిఫారసు చేయొద్దు. -
తెలంగాణలో ఆదాయం అంతగా లేదు!
సమైక్య రాష్ర్టంలో వచ్చినంత ఆదాయం ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టంలో రాదని కేంద్ర ఆర్థిక సంఘానికి రాష్ర్ట ప్రభుత్వం వివరించింది. అందువల్ల సవరించిన ఆదాయాన్నే పరిగణనలోకి తీసుకుని తగినన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ‘‘సమైక్య రాష్ట్రంలో ఎక్కడ అమ్మకాలు జరిగినప్పటికీ హైదరాబాద్‌లోనే విలువ ఆధారిత పన్ను(వ్యాట్) చెల్లించారు. బెవరేజ్ కార్పొరేషన్ కూడా ఇలాగే వ్యాట్ చెల్లించింది. సచివాయలం, అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉండటం... పే అండ్ అకౌంట్స్ ఆఫీసూ ఉండటంతో అన్ని చెల్లింపులు ఇక్కడే జరుగుతూ వచ్చాయి. తద్వారా వ్యాట్ ఆదాయంలో హైదరాబాద్‌కు 80 శాతం వస్తుందని లెక్కలు చెబుతున్నాయి. ఇదే అభిప్రాయమూ ఇప్పుడూ కొనసాగుతోంది. ఆయిల్ కంపెనీలు 30 శాతం వ్యాట్ చెల్లింపులను హైదరాబాద్‌లోనే చేస్తున్నాయి. వాస్తవ వినియోగం మాత్రం 8 శాతం మాత్రమే. 2012-13 ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుంటే ఆయిల్ కంపెనీల నుంచి వచ్చే వ్యాట్ ఆదాయం తెలంగాణలో 48 శాతం కాగా, ఆంధ్రాలో 52 శాతం. బెవరేజ్ కార్పొరేషన్ వాస్తవ అమ్మకాలను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ ఎక్సైజ్ ఆదాయం 45 శాతం మాత్రమే. ఇందులో హైదరాబాద్ వాటా 8 శాతమే. కేవలం 850 ప్రధాన డీలర్లను పరిగణనలోని తీసుకుని మొత్తం వ్యాట్ ఆదాయంలో తెలంగాణ వాటా 53 శాతమని లెక్కించారు. ఇది సరికాదు. వ్యాట్ ఆదాయంలో తెలంగాణ వాటా 42 నుంచి 44 శాతం మాత్రమే ఉంటుంది. పన్నుల ఆదాయంలో దీనినే పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాం. దీని ఆధారంగానే ఐదేళ్ల పాటు రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేయాలని అభ్యర్థిస్తున్నాం’’ అని రాష్ర్ట ప్రభుత్వం మొరపెట్టుకుంది. -
అండగా నిలవండి, చేయూతనివ్వండి
కొత్త రాష్ట్రం.. 9 జిల్లాలు వెనుకబడ్డవే ఆర్థికంగా చేయూతనివ్వండి 14వ కేంద్ర ఆర్థిక సంఘానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలంటే అధిక నిధులివ్వండి అనుకున్న స్థాయిలో హైదరాబాద్ ఆదాయం లేదని వివరణ రాష్ర్టంలో ప్రధాన సమస్యలు, ప్రభుత్వ ప్రాధాన్యతల వెల్లడి రుణమాఫీ, వాటర్ గ్రిడ్, సంక్షేమం తదితర పథకాల ప్రస్తావన 25 రంగాల అభివృద్ధికి రూ.20,950 కోట్ల గ్రాంట్ ఇవ్వాలని వినతి కేంద్ర పన్నుల్లో వాటాను 40 శాతానికి పెంచండి తలసరి ఆదాయం పెరుగుతుంటే నిధులు తగ్గించ డం సరికాదు జనాభాకు 25 శాతం, విస్తీర్ణానికి 30 శాతం వెయిటేజీ ఇవ్వండి కొత్త రాష్ట్రానికి మినహాయింపులు, ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి.. పలు అంశాలపై కేసీఆర్ ప్రజెంటేషన్ సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక సంఘాన్ని రాష్ర్ట ప్రభుత్వం కోరింది. రాష్ర్టం అన్నిట్లో వెనుకబడి ఉందని, ఆర్థికంగా చేయూతనిచ్చి అండగా నిలవాలని విజ్ఞప్తి చేసింది. నూతన రాష్ట్రం కావడంతో ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాల్సి ఉందని, కొత్త పథకాల అమలుకు తగిన సహాయాన్ని అందించాలని విన్నవించింది. ఈ మేరకు సమైక్య రాష్ట్రంలో ఎదుర్కొన్న ఇబ్బందులను పేర్కొనడంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ ఆర్థిక సంఘానికి నివేదిక సమర్పించింది. కీలకమైన 25 రంగాల్లో అభివృద్ధి కోసం రూ. 20,950 కోట్లను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఇవ్వాలని ప్రతిపాదనలు అందించింది. గురువారమే హైదరాబాద్‌కు వచ్చిన 14వ ఆర్థిక సంఘంతో శుక్రవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం సమావేశమైంది. ‘తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలుంటే.. తొమ్మిది జిల్లాలు వెనుకబడే ఉన్నాయి. అన్ని సూచికల్లోనూ వెనుకబడి ఉన్నాం. మాకు అధిక నిధులిచ్చి ఆదుకోండి’ అని ఈ సందర్భంగా కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అలాగే కేంద్ర పన్నుల కేటాయింపులో ఉన్న అసంబద్ధ వెయిటేజీలను మార్చాలని, కేంద్ర పన్నుల్లో ప్రస్తుతం రాష్ట్రాలకు ఇస్తున్న 32 శాతం వాటాను 40 శాతానికి పెంచాలని కూడా డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటిస్తున్న కొత్త పథకాలతో రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరుగుతోందని, మరోవైపు కష్టమైనప్పటికీ ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్ నిర్వహణ(ఎఫ్ఆర్బీఎం) చట్టాన్ని అమలు చేయాల్సి వస్తోందన్నారు. తెలంగాణ ప్రజల కల ఇంతకాలానికి నెరవేరిందని, ఆరు దశాబ్దాలుగా అణచివేతకు గురైన తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఆర్థిక సంఘం నుంచి విరివిగా నిధులిచ్చేందుకు కేంద్రానికి సూచించాలని కేసీఆర్ విన్నవించారు. తెలంగాణను వెనుకబడిన ప్రాంతంగా స్పష్టం చేసిన అనేక నివేదికలు, అభివృద్ధి సూచికలను ఈ సందర్భంగా ఆయన ఆర్థిక సంఘం దృష్టికి తీసుకొచ్చారు. హైదరాబాద్ ఆదాయం కూడా అనుకున్న స్థాయిలో లేదని వివరించారు. ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మెమోరాండం సమర్పిస్తూ పలు అంశాలపై కేసీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు కూడా తమ తమ శాఖల వారీగా ప్రజెంటేషన్ ఇచ్చారు. తలసరి ఆదాయం పెరిగితే... తలసరి ఆదాయం పెరగడానికి ప్రభుత్వాలు చేస్తున్న కృషిని అభినందించాలని, వెయిటేజీ పేరిట తగ్గించడం సరికాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తలసరి ఆదాయానికి ఎక్కువ వెయిటేజీతో రాష్ట్రం నష్టపోతోందన్నారు. కేంద్ర పన్నుల వాటాలో జనాభాకు 25 శాతం, రాష్ట్ర విస్తీర్ణానికి 30 శాతం వెయిటేజీ ఇచ్చి నిధులు కేటాయించాలని కోరారు. ద్రవ్య క్రమశిక్షణకు 27.5 శాతం, ద్రవ్య వ్యత్యాసానికి 17.5 శాతం వెయిటేజి ఇవ్వాలని విన్నవించారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1971 తర్వాత తెలంగాణ ప్రాంతానికి వలసలు భారీగా జరిగాయని తద్వారా జనాభా పెరిగిందన్నారు. అందుకు తగినట్లు మౌలికవసతుల కల్పనకు అధిక నిధులివ్వాల్సిందిపోయి.. కోతపెట్టడం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు. వెనుకబడిన రాష్ట్రాలకు ఇతర మార్గాల ద్వారా నిధులు సర్దుబాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రస్తావించిన పలు అంశాలు ఇలా ఉన్నాయి. - కేంద్రానికి పన్నేతర ఆదాయం విపరీతంగా పెరుగుతోంది. సముద్రతీర రాయల్టీ, స్పెక్ట్రమ్ అమ్మకం, పెట్టుబడుల ఉపసంహరణతో భారీ ఆదాయం లభిస్తోంది. వీటన్నింటిలో రాష్ట్రానికి వాటాను పంచాలి. సెస్సు, సర్ఛార్జీలు విధించడం వల్ల వచ్చే ఆదాయాన్ని కూడా రాష్ట్రాలకు ఇవ్వాలి. - 40 శాతం కేంద్ర పన్నులను రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల.. కేంద్ర వ్యయంలో కేవలం ఐదు శాతం మాత్రమే తగ్గుతుంది. - ఈక్విటీ పారామీటర్లలో ఎక్కువ వెయిటేజీ ఇవ్వడం వల్ల మధ్యాదాయ రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాలో భారీగా కోతపడుతోంది. - రాష్ట్రాల ద్రవ్య, రెవెన్యూ లోటు పరిమితిని కేంద్రంతో సమానంగా రాష్ట్రాలకు ఇవ్వాలి. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని రాష్ట్రాలపై రుద్దుతున్నారు. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని పాటిస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలివ్వాలి.కొత్త రాష్ట్రాలకు ఈ చట్టంలో మినహాయింపులు ఇవ్వాలి. - ఆర్థిక సర్దుబాటును సమర్థంగా అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సహకాలు ఇవ్వాలి. - పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ జాతీయ సంస్థ(ఎన్ఐపీఎఫ్పీ) అధ్యయనం ప్రకారం 1998-99లో సబ్సిడీల మొత్తం రూ. 2,35,752 కోట్లు కాగా, ఇందులో రాష్ట్రాల మీద పడిన భారం ఏకంగా రూ. 1,55,924 కోట్లు. అంటే 66 శాతం. ఇది రాష్ట్రాలకు ఆర్థికంగా భారంగా మారుతోంది. అందువల్ల సబ్సిడీ భారాన్ని కేంద్రం, రాష్ట్రాల మధ్య సమంగా పంచాలి. అలాగే రాష్ట్రాలు భరించే సబ్సిడీ భారాన్ని కేంద్రం కూడా భరించాలి. - కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రెవెన్యూ మిగులు కష్టం. తద్వారా మూలధన పెట్టుబడి సాధ్యం కాదు. కావున రెవెన్యూ ఖాతాలోకి కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరిగితే తప్ప సాధ్యం కాదు. - టోకుమొత్తంలో డీజిల్ కొనుగోలుదార్ల(రైల్వే, ఆర్టీసీ, విద్యుత్ సంస్థలకు)కు మార్కెట్ ధరకు డీజిల్ విక్రయించడం వల్ల.. ప్రజా రవాణా వ్యయం పెరుగుతోంది. ప్రైవేట్ రవాణా పెరిగి కాలుష్యానికి దారితీస్తోంది. - ప్రణాళిక పథక రచనలో ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్సుల(నాన్ సాలరీ)ను పరిగణలోకి తీసుకోవాలి. - పర్యావరణ పరిరక్షణ చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. - ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్రం ప్రస్తుతం ఇస్తున్న 75 శాతం నష్టపరిహార వాటాను 90 శాతానికి పెంచాలి. - సామాజిక న్యాయం మరింత పకడ్బందీగా అమలు కావాలంటే.. రాష్ట్రాలకు నిధులు అధికంగా ఇవ్వాలి. - రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే పౌర సేవల ధర నిర్ణయాధికారంపై కమిషన్ ఎలాంటి నియంత్రను సిఫారసు చేయొద్దు. వెనుకబాటుపై నివేదికలివిగో..! తెలంగాణ వెనుకబడిందని అనేక నివేదికలు తేల్చి చెప్పాయని, మానవాభివృద్ధి సూచిక మొదలు, టాస్క్‌ఫోర్స్ నివేదికలు సైతం తెలంగాణ అత్యంత వెనుకబడిన ప్రాంతమని స్పష్టం చేస్తున్నాయని ఆర్థిక సంఘానికి రాష్ర్ట ప్రభుత్వం తన నివేదికలో వివరించింది. దీని ప్రకారం... - ప్రాంతీయ అసమానతలను పరిష్కరించడంపై ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర మంత్రుల టాస్క్‌ఫోర్స్ దేశవ్యాప్తంగా 170 అత్యంత వెనుకబడిన జిల్లాలను గుర్తించింది. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి మినహా తెలంగాణలోని మిగిలిన ఎనిమిది జిల్లాలు ఉన్నాయి. - వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ ఫండ్ (బీఆర్జీఎఫ్) అమలు కోసం మానవాభివృద్ధి సూచిక తక్కువగా ఉన్న 250 జిల్లాలను కేంద్రం 2007లో గుర్తించింది. ఇందులో తొమ్మిది తెలంగాణ జిల్లాలు ఉన్నాయి. - ఉపాధి హామీ పథకాన్ని దేశం మొత్తం 187 జిల్లాల్లో ప్రాథమికంగా ప్రారంభిస్తే, హైదరాబాద్ మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అమలు చేశారు. - వ్యవసాయ ఉత్పత్తి దారుణంగా ఉన్న 100 జిల్లాలను దేశవ్యాప్తంగా కేంద్రం 2007లో గుర్తించింది. ఇందులో తెలంగాణలోని ఏడు జిల్లాలు ఉన్నాయి. - 12వ పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతల చాప్టర్లో తెలంగాణలోని ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలను ‘అత్యంత ఆకలి జిల్లాలు’గా పేర్కొన్నారు. - తెలంగాణలో వృద్ధిరేటు 2005-06లో 10.5 శాతం నుంచి 2012-13 నాటికి 4.5 శాతానికి పడిపోయింది. పైగా పారిశ్రామిక రంగంలో అభివృద్ధి తిరోగమనదిశలో (నెగటివ్ డెవలప్మెంట్) ఉంది. అయితే 2013-14లో వృద్ధిరేటు కొంచెం పెరిగి 5.5 శాతానికి చేరినప్పటికీ, వ్యవసాయ రంగ అభివృద్ధి మాత్రం 6.2 శాతం నుంచి 4.6 శాతానికి పడిపోయింది. ఇవీ రాష్ర్టంలో సమస్యలు! ఆర్థిక సంఘానికి రాష్ర్ట ప్రభుత్వం పలు ప్రధాన సమస్యలను ఏకరవుపెట్టింది. అవి ఇలా ఉన్నాయి. - సుమారు 60 శాతం భూమికి నీరు అందించే చెరువుల వ్యవస్థ ధ్వంసమైపోయింది. ప్రస్తుతం చెరువుల కింద సాగు 9 శాతం కంటే తక్కువకుపడిపోయింది. - 2001-02 నుంచి 2009-10 వరకు తెలంగాణ, ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు భారీగా విక్రయించారు. దీనివల్ల జిల్లా రైతాంగం తమ జీవనాధారాన్ని కోల్పోయింది. ఈ నష్టాన్ని పూడ్చడం సాధ్యమయ్యే పనికాదు. - రాష్ర్టం 1000 మెగావాట్ల విద్యుత్ లోటును ఎదుర్కొంటోంది. దీన్ని పూడ్చేందుకు భారీగా పెట్టుబడులతో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. - రోడ్లు, పట్టణ మౌలిక సదుపాయాలు, ప్రజా రవాణా కొరకు అనేక ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) ప్రాజెక్టులు అమలవుతున్నాయి. ఇందులో మెట్రోరైలు ప్రాజెక్టు ఒకటి. ఈ ప్రాజెక్టుల వల్ల వచ్చే ఎనిమిదేళ్ల వరకూ ఏటా రూ. 333 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. - 1961-71 మధ్యకాలంలో తెలంగాణలో పట్టణ జనాభా 35.6 శాతం ఉండగా... 2001-11 నాటికి అది 39.1 శాతానికి పెరిగిపోయింది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల నుంచి అనేక మంది రావడం వల్ల పట్టణ జనాభా పెరిగింది. ఈమేరకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. - పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఇవీ రాష్ర్ట ప్రభుత్వ ప్రాధాన్యతలు తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు పథకాలను ఈ సందర్భంగా రాష్ర్ట ప్రభుత్వం తన ప్రాధాన్యతలుగా పేర్కొంటూ ఆర్థిక సంఘం దృష్టికి తెచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. - దేశంలోకెల్లా రైతుల ఆత్మహత్యలు తెలంగాణలోనే అధికం. అందుకే రుణాల ఊబి నుంచి రైతులను బయటపడేసేందుకు వాటిని మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. - ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీల కోసం రూ. 50 వేల కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్నాం. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. బీసీలకు ఐదేళ్ల కాలంలో రూ. 25 వేల కోట్లు వెచ్చించనున్నాం. మైనార్టీలకు రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తాం. - ప్రతీ ఇంటికి మంచినీటి సరఫరా కోసం రూ. 25 వేల కోట్లతో వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. - వచ్చే మూడేళ్లల్లో 230 కోట్ల మొక్కలను నాటాలని ‘తెలంగాణకు హరిత హారం’ కార్యక్రమం ప్రారంభించాం. - శరవేగంగా పారిశ్రామిక అభివృద్ధి కోసం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండే పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తున్నాం. సమస్యలు ఇవీ..! ఆర్థిక సంఘానికి రాష్ర్ట ప్రభుత్వం పలు సమస్యలను ఏకరువు పెట్టింది. అవి ఇలా ఉన్నాయి.్హ సుమారు 60 శాతం భూమికి నీరు అందించే చెరువుల వ్యవస్థ ధ్వంసమైపోయింది. ప్రస్తుతం చెరువుల కింద సాగు 9 శాతం కంటే తక్కువకుపడిపోయింది. 2001-02 నుంచి 2009-10 వరకు తెలంగాణ, ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు భారీగా విక్రయించారు. దీనివల్ల జిల్లా రైతాంగం తమ జీవనాధారాన్ని కోల్పోయింది. ఈ నష్టాన్ని పూడ్చడం సాధ్యమయ్యే పనికాదు. రాష్ర్టం 1,000 మెగావాట్ల విద్యుత్ లోటును ఎదుర్కొంటోంది. దీన్ని పూ డ్చేందుకు భారీ పెట్టుబడులతో విద్యు త్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. రోడ్లు, పట్టణ మౌలిక సదుపాయాలు, ప్రజా రవాణా కొరకు అనేక ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) ప్రాజెక్టులు అమలవుతున్నాయి. ఇందులో మెట్రోరైలు ప్రాజెక్టు ఒకటి. ఈ ప్రాజెక్టుల వల్ల వచ్చే ఎనిమిదేళ్ల వరకూ ఏటా రూ. 333 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. 1961-71 మధ్యకాలంలో తెలంగాణలో పట్టణ జనాభా 35.6 శాతం ఉండగా... 2001-11 నాటికి అది 39.1 శాతానికి పెరిగిపోయింది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల నుంచి అనేక మంది రావడం వల్ల పట్టణ జనాభా పెరిగింది. ఈమేరకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. -
రూ. 23 వేల కోట్ల గ్రాంట్ ఇవ్వండి
-
రూ. 23 వేల కోట్ల గ్రాంట్ ఇవ్వండి
14వ ఆర్థిక సంఘాన్ని కోరనున్న రాష్ర్ట ప్రభుత్వం నేడు సంఘం సభ్యులతో భేటీ కానున్న కేసీఆర్ బృందం రాష్ర్టంలో చేపట్టిన పథకాలకు సాయం చేయాలని విజ్ఞప్తి పలు కార్యాచరణ ప్రణాళికలను వివరించనున్న సీఎం సాక్షి, హైదరాబాద్: రాబోయే ఐదేళ్ల కాలానికి గ్రాంట్ల రూపంలో తెలంగాణకు రూ. 23 వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని 14వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్లు సమాచారం. శుక్రవారంనాడు ఓ స్టార్ హోటల్లో ఆర్థిక సంఘం చైర్మన్ వై.వేణుగోపాల్‌రెడ్డితోపాటు సంఘం సభ్యులు, అధికారులతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు బృందం సమావేశంకానుంది. పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఈ సందర్భంగా ఆర్థిక సంఘానికి నివేదికలు ఇవ్వనున్నారు. ముందుగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం వినూత్న పంథాలో చేపడుతున్న కార్యక్రమాలను కేసీఆర్ వివరించనున్నారు. అలాగే రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల పరిస్థితులను కేంద్ర సంఘం ముందుంచనున్నారు. ప్రభుత్వం చేపట్టే నిర్దిష్ట కార్యక్రమాలను వెల్లడించడంతో పాటు కార్యాచరణ ప్రణాళికల ఆధారంగా వాటిని అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలను కూడా సీఎం వివరిస్తారు. ఆర్థిక సంఘం నుంచి రూ. 23 వేల కోట్లను గ్రాంట్లుగా ఇవ్వాలని, అలాగే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచే వాటాను ప్రస్తుతమున్న 32 శాతం నుంచి మరింత పెంచాలని కోరనున్నారు. అయితే మిగిలిన రాష్ట్రాలు కోరుతున్నట్లుగా 50 శాతం వాటా ఇవ్వాలని అడగాలా? లేక వాస్తవిక కోణంలో ఆలోచించి 40 శాతం కోరాలా అన్న అంశంపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోనున్నారు. 32 శాతం వాటా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన నిధుల వాటా మొత్తం పన్నుల్లో 6.75 శాతంగా ఉంది. ఇందులో తెలంగాణ వాటా 2.87 శాతమే. ఈ నేపథ్యంలో పన్నుల వాటాను పెంచాలని రాష్ర్ట ప్రభుత్వం కోరనుంది. గ్రాంట్ల రూపంలో ప్రభుత్వం కోరనున్న నిధుల్లో 70 శాతం నిధులు ప్రధానంగా స్థానిక సంస్థలకు వెళ్తాయని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇవి కాకుండా తాగునీటి గ్రిడ్, చిన్ననీటి పారుదల, అంతర్గత భద్రత, పోలీస్ వ్యవస్థ ఆధునీకరణ, గ్రామీణ రహదారులు, గిరిజన సంక్షేమానికి అధిక నిధులు ఇవ్వాలని కోరనుంది, అలాగే తలసరి ఆదాయం ఆధారంగా నిధుల కేటాయింపునకు ఇచ్చే వెయిటేజీని 47.5 శాతం నుంచి తగ్గించాలని కూడా ప్రభుత్వం ఈ సందర్భంగా డిమాండ్ చేయనుంది. మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా గ్రామాల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకోవాలని, వయబుల్ గ్యాప్ ఫండ్(వీజీఎఫ్)గా తగిన నిధులు ఇవ్వాలని కోరనుంది. విద్య, విత్తనాభివృద్ధి, గ్రీన్హౌస్ ప్రాజెక్టులకూ నిధులు కేటాయించాలని, ప్రణాళిక శాఖ పరిధిలోని జిల్లాల వినూత్న నిధి, పర్యవేక్షణ, మదింపు ప్రాధికార సంస్థకు నిధులు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేయనుంది. ఆర్థిక సంఘం సభ్యులకు గవర్నర్ విందు పాల్గొన్న సీఎం, ఆర్థిక మంత్రి, ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశమయ్యేందుకు గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న 14వ ఆర్థిక సంఘం బృందానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాత్రి విందు ఇచ్చారు. ఆర్థిక సంఘం చైర్మన్ వై. వేణుగోపాల్‌రెడ్డి, పద్నాలుగు మంది సభ్యులతో పాటు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. దాదాపు గంట పాటు విందు కొనసాగింది. ఆర్థిక సంఘం సభ్యులంతా మధ్యాహ్నమే నగరానికి రాగా.. చైర్మన్ మాత్రం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రి ఈటెల రాజేందర్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. -
రాష్ట్ర ప్రణాళికకు ఆమోదం అవసరం లేకపోవచ్చు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రణాళిక ఆమోదానికి ఢిల్లీ వెళ్లి ప్రణాళిక సంఘంతో ఆమోదం వేయించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలతోపాటు, ముఖ్యమంత్రి చంద్ర శేఖర్‌రావు భావిస్తున్నారు. కేంద్రంలో ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించడం ఒకటైతే.. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు పూర్తయి, ప్రణాళిక ఎంతో తెలిసిన తరువాతే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రణాళిక సంఘంతో సమావేశమై అందుకు ఆమోదం పొందాల్సి ఉంటుంది. కానీ ఈసారి ఆ అవసరం ఉండదని అధికార వర్గాలు వివరించాయి. కాగా, రాష్ట్రాలకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రణాళిక సంఘం వివిధ పథకాల కింద ఇచ్చే ఆర్థికసాయాన్ని ఖరారు చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సాయం, ప్రస్తుత రెవెన్యూ మిగులు వివరాలతోపాటు, కేంద్రం ఇదివరకు అనుమతించిన అప్పులు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, వివిధ పథకాల కింద కేంద్రంనుంచి వచ్చే సాయంపై అంచనా వివరాలందించాలని ప్రణాళిక సంఘం కోరింది. -
సమగ్ర సర్వే గుట్టు విప్పిన కేసీఆర్!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు సమగ్ర సర్వే గుట్టు విప్పారు. గత నెల 19న తెలంగాణవ్యాప్తంగా సమగ్రసర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో నివసించేవారు కూడా పరుగు... పరుగున వచ్చి ఈ సర్వేలో పాల్గొన్నారు. అయితే ఇంతకీ సమగ్ర సర్వే ఎందుకంటే.. ప్లానింగ్ కమిషన్ వేసిన ఓ ప్రశ్నకు సమాధానంగానే కేసీఆర్ ఈ సర్వే చేయించినట్లు సమాచారం. కేసీఆర్‌ను ప్లానింగ్ కమిషన్ అడిగిన ఓ ప్రశ్నకు... ఆయన షేమ్‌గా ఫీలయ్యారట. తెలంగాణలో ఎక్కువ మంది వికలాంగులు ఎందుకు ఉన్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారట. ఆ ప్రశ్నకు సీఎంగారు సమాధానం చెప్పలేకపోయారట. దాంతో హైదరాబాద్ వచ్చిన ఆయన ఫించన్లు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డుల విషయంలో బోగస్‌లను ఎత్తివేసి అసలైన లబ్దిదారులను గుర్తించేలా...సర్వే చేపట్టాలని డిసైడ్ అయ్యారట. ఇందుకోసం ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ ... 'ప్లానింగ్ కమిషన్ అధికారులు అడిగిన ప్రశ్నలకు నేను చాలా అవమానపడ్డాను. కించపరిచేలా ప్రశ్నించారు. మళ్లీ ఇటువంటివి పునరావృతం కాకుండా పట్టిష్టమైన సర్వే చేపట్టేందుకు టైమ్ వచ్చింది' అన్నారట. దాని ఎఫెక్టే 'సమగ్ర కుటుంబ సర్వే' అట. మరోవైపు సమగ్ర సర్వేలో తెలిసిన సమాచారం ప్రకారం కేసీఆర్ మరో సర్వేకి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. -
ప్రణాళికా సంఘం రద్దు!!
జాతీయ, అంతర్జాతీయ రంగాల్లో మారిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రణాళికా సంఘాన్ని రద్దుచేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఎర్రకోట నుంచి చేసిన తన మొట్టమొదటి ప్రసంగంలోనే ఆయనీ విప్లవాత్మక నిర్ణయాన్ని వెలువరించారు. దీని స్థానంలో సరికొత్త సంస్థను తీసుకొస్తామని చెప్పారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే.. రాష్ట్రాలను ముందుకు తీసుకెళ్లాలని, సమాఖ్య నిర్మాణం ప్రాధాన్యం గత 60 ఏళ్లలో కన్నా ఇప్పుడు మరింత ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. ప్రణాళికాసంఘం స్థానంలో కొత్త ఆత్మతో కూడిన కొత్త వ్యవస్థ మనకు అవసరమని అన్నారు. మోడీ నిర్ణయంతో ఆరున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర గల ప్రణాళికాసంఘం త్వరలోనే ‘గత చరిత్ర’గా మారిపోనుంది. 1950లో ఆర్థికవ్యవస్థలో ప్రభుత్వ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిన కాలంలో ప్రణాళికాసంఘాన్ని స్థాపించారు. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. సోవియట్ ప్రభావితమై.. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించేందుకు భారత ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పారు. కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా ఏర్పాటైన ఈ సంఘానికి.. అపరిమిత అధికారం, ఎంతో ప్రతిష్ట ఉండేది. ఇది ఇప్పటివరకూ ప్రధాని అధ్యక్షతనే పనిచేస్తోంది. ఆయా రంగాలవారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించడం, వాటిని సాధించేందుకు వనరులను కేటాయించటం ఈ సంఘం ప్రధాన విధి. ప్రణాళికాసంఘానికి ఉపాధ్యక్షులు పనిచేసిన వారిలో చాలామంది రాజకీయ ఉద్దండులే. ఆ పదవిలో ఉన్నవారికి కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. గుల్జారీలాల్ నందా, టి.టి.కృష్ణమాచారి, సి.సుబ్రమణ్యం, పి.ఎన్.హక్సార్, మన్మోహన్సింగ్, ప్రణబ్‌ముఖర్జీ, కె.సి.పంత్, జశ్వంత్‌సింగ్, మధు దండావతే, మోహన్ ధారియా, ఆర్.కె.హెగ్డే తదితరులు ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. దీనికి చిట్టచివరి ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా. అయితే.. 1990లలో ఆర్థికవ్యవస్థ సరళీకరణ, ప్రపంచీకరణ బాటలో పయనించటం మొదలయ్యాక ప్రణాళికాసంఘం ప్రాధాన్యం కనుమరుగైంది. -
'ప్రత్యేక హోదాపై అనసవర ఆందోళన వద్దు'
విశాఖ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై అనవసర ఆందోళనలు వద్దని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. గత ప్రభుత్వం లేనప్పుడు ప్రణాళికా సంఘం ఎలా ఉంటుందని ఆయన శనివారమిక్కడ విలేకర్ల సమావేశంలో ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ప్రణాళిక సంఘం తీర్మానం చేయాలని కోరామని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పట్లో ఆ సూచనను కాంగ్రెస్ విస్మరించిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని వెంకయ్య నాయుడు మరోసారి స్పష్టం చేశారు. విశాఖను అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. రైల్వే జోన్ ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించినట్లు వెంకయ్య తెలిపారు. కాగా వెంకయ్యను ఉత్తారంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘనంగా సన్మానించారు. -
రెండు రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఎంతివ్వాలి?
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఎంతెంత ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రణాళికా సంఘం గురువారం ఢిల్లీలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఆ సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం అధికారులు పలు కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, రాష్ట్రానికి చెందిన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ. రమేశ్ ఈ సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం ఢిల్లీ వెళ్లారు. రెండు రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పన్ను రాయితీలు ఏ ఏ రంగాల్లో ఏ రాష్ట్రానికి ఎంతెంత ఇవ్వాలి? రెండు రాష్ట్రాలకు అదనపు సాయంగా కేంద్రం ఎన్ని నిధులివ్వాలి? అలాగే ప్రణాళికా సంఘం ద్వారా ఇవ్వాల్సిన నిధులు ఎంత, వివిధ కేంద్రమంత్రిత్వ శాఖల ద్వారా చేయాల్సిన ఆర్థిక సహాయం. 14వ ఆర్థిక సంఘం ద్వారా అందించాల్సిన ఆర్థిక వనరులు ఎంతెంత? తదితర విషయాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రలో ఏర్పాటు చేయాల్సిన ఇన్స్టిట్యూషన్స్కు నిధులు ఎంత అవసరం అవుతాయనే విషయాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా రెండు కొత్త రాష్ట్రాలు ఆర్థిక పరంగా ఏర్పడే ఆటుపోటులను తట్టుకునేందుకు వీలుగా రెండేళ్ల పాటు ఇరు రాష్ట్రాలకు బడ్జెట్ నిర్వహణ ద్రవ్య జవాబుదారీ చట్టం నిబంధనలను సడలించే అంశంపై కూడా కేంద్ర ప్రణాళిక సంఘం సమావేశంలో చర్చించనున్నారు. -
కేకేఆర్ ప్రతిపాదనలకు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: రెండు ఫార్మా కంపెనీల్లో రూ.1,434 కోట్లతో వాటాల కొనుగోలుకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ చేసిన ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. హైదరాబాద్ కేంద్రంగాగల గ్లాండ్ ఫార్మాలో 37.98%, గ్లాండ్ సెల్సస్ బయోకెమికల్స్‌లో 24.9% వాటాల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలివి. ఈ కొనుగోళ్లకు కాంపిటీషన్ కమిషన్ గత జనవరిలోనే ఆమోదం తెలిపింది. భెల్‌లో 4.66 శాతం వాటా విక్రయంపై... విద్యుత్ పరికరాల సంస్థ భెల్‌లో 4.66 శాతం వాటాను బ్లాక్ డీల్ రూట్లో విక్రయించాలన్న నిర్ణయానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మన్మోహన్ సింగ్ సారథ్యంలోని సీసీఈఏ ఈ నిర్ణయాన్ని మంగళవారం ఆమోదించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
కొత్త ప్రభుత్వ విధానాలపై భవిష్యత్ వృద్ధి
న్యూఢిల్లీ: ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వ విధానాలపై దేశ భవిష్యత్ వృద్ధి ఆధారపడి ఉంటుందని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) ఆర్థికాభివృద్ధి బాగుంటుందని ప్రతిఒక్కరూ భావిస్తున్నారని, అయితే ప్రభుత్వం అనుసరించే కొత్త విధానాల ప్రాతిపదికపై ఇది ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ప్రణాళికా సంఘం పూర్తి సమయపు సభ్యుల సమావేశం అనంతరం మాంటెక్ విలేకరులతో మాట్లాడారు. 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో (2012-17) సగటు 8% వృద్ధి లక్ష్యాల సవరణ విషయం గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, రాబోయో కొత్త ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. గడచిన రెండు సంవత్సరాల కాలంలో వృద్ధి సానుకూలంగా లేని సంగతి తెలిసిందే. 2012-13లో ఈ రేటు 4.5%గా ఉంటే, 2013-14లో ఈ పరిమాణం 4.9%గా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5.5% దాటబోదని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 12వ ప్రణాళికలో 8 శాతం వృద్ధి కష్టమన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ ప్రణాళికా సంఘం మదింపు జరుపుతోందని (ప్రణాళిక మధ్యంతర మదింపు- ఎంటీఏ), కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే తాజా సంఘం ఈ ప్రక్రియను మరింత ముందుకు తీసుకువెళుతుందని మాంటెక్ వెల్లడించారు. అక్టోబర్‌లో ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. -
వృద్ధిపథంలో భారత్: ప్రధాని మన్మోహన్
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి పయనం కొనసాగుతోందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. లక్ష్యాలను చేరడానికి మరింత ముందుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రధానిగా తన బాధ్యతల సమయం ముగుస్తున్న నేపథ్యంలో మన్మోహన్ బుధవారం ప్రణాళికా సంఘం పూర్తిస్థాయి సభ్యులతో సమావేశం అయ్యారు. సంఘం చైర్మన్‌గా ప్రణాళికా సంఘానికి వీడ్కోలు ప్రసంగం ఇస్తూ, భారత్ ఆర్థికాభివృద్ధి అంశాలను ప్రస్తావించారు. యూపీఏ పదేళ్ల కాలంలో కమిషన్ పనితీరు చాలా బాగుందని అన్నారు. తాజా ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికా సంఘం పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉందని సైతం సూచించారు. 1991 నుంచి 1996 మధ్యకాలంలో ఆర్థికమంత్రిగా తన పదవీకాలాన్ని కూడా సింగ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా ప్రస్తుత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి తనకు మంచి సహకారం లభించిందని తెలిపారు. దేశాన్ని ఆర్థికంగా మలుపుతిప్పే ఆ కాలంలో ప్రభుత్వం-ప్రణాళికా సంఘం చక్కని సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలను సాధించినట్లు తెలిపారు. ఇదే రకమైన ధోరణి ఇకముందూ కొనసాగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆర్థికాభివృద్ధిలో కొత్త ఆలోచనల సృష్టి, మంత్రిత్వశాఖల మధ్య సమన్వయ సాధన, మౌలిక రంగం ప్రగతికి సంబంధించి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో మంచి ఫలితాలు వంటి అంశాల్లో ప్రణాళికా సంఘం పాత్ర కీలకమని అన్నారు. -
ప్రణాళికా సంఘంలో ‘సీమాంధ్ర’ ప్రత్యేక విభాగం
* ప్రపంచ బ్యాంకు మాజీ అధికారి పి.శ్రీనివాస్ నేతృత్వం * తొలి సమావేశంలో ప్యాకేజీల అమలుపై చర్చ: జైరాం రమేశ్ సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్రకు ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు అభివృద్ధి ప్యాకేజీల అమలుకు ప్రణాళికా సంఘంలో ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. ప్రపంచ బ్యాంకు మాజీ అధికారి పి.శ్రీనివాస్ దీనికి నేతృత్వం వహించనున్నారు. శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా వాస్తవ్యులని సమాచారం. ప్రత్యేక విభాగానికి సంబంధించిన తొలి సమావేశం శుక్రవారం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా నేతృత్వంలో జరిగింది. పి.శ్రీనివాస్‌తోపాటు కేంద్ర మంత్రి జైరాం రమేశ్ కూడా పాల్గొన్నారు. సమావేశం తర్వాత జైరాం మీడియూతో మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీల అమలు, సీమాంధ్రలో నెలకొల్పాల్సిన ఐఐటీ, ఐఐఎం తదితర జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు, వాటికయ్యే వ్యయం తదితర అంశాలపై చర్చించినట్టు చెప్పారు. ప్రత్యేక విభాగం వీటికి సంబంధించిన అంచనాలు రూపొందిస్తుందని తెలిపారు. రాజధాని ఎంపికకు ముగ్గురు సభ్యుల కమిటీ కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని ఎంపిక చేసేందుకు తగిన అధ్యయనం కోసం ముగ్గురు నిపుణులతో కమిటీ ఏర్పాటు కానున్నట్టు జైరాం తెలిపారు. ప్రస్తుతం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అందుబాటులో లేనందున పదో తేదీ తరువాత ఈ విషయం ప్రకటిస్తామని తెలిపారు. పట్టణాభివృద్ధిలో నైపుణ్యం కలిగినవారు సభ్యులుగా ఉంటారని చెప్పారు. ప్రస్తుతం కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో రాజధాని కోసం డిమాండ్లు ఉన్నాయని, వీటితోపాటు ఒక హరితక్షేత్ర ప్రాంతాన్ని (అటవీ నిర్మూలనకు అనుకూలంగా ఉన్నది) కూడా కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. పురందేశ్వరి విశ్వాస ఘాతకురాలు మాజీ మంత్రి పురందేశ్వరి విశ్వాస ఘాతకురాలని జైరాం రమేశ్ విమర్శించారు. ఎనిమిదేళ్ల పాటు కేంద్రమంత్రి పదవి కట్టబెట్టి సోనియాగాంధీ ఆమెను ప్రోత్సహించారని, అరుుతే క్లిష్ట సమయంలో స్వార్థం కోసం పార్టీని విడిచివెళ్లారని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పురందేశ్వరి అడిగిన హైదరాబాద్ యూటీ విషయం మినహా అన్నిటినీ కేంద్రం మన్నించిందన్నారు. కేంద్ర మంత్రులు అందరూ దుగ్గరాజపట్నం నౌకాశ్రయం గురించి అడిగితే ఆమె రామాయపట్నం గురించి అడిగారన్నారు. అక్కడ ఆమెకు స్థలాలు ఉండడంతోనే ఆ విధంగా పట్టుబట్టారనే ఆరోపణ వినిపించిందన్నారు. -
వడివడిగా పడిపోయాం
వైద్యం, విద్య.. కీలక రంగాల్లో రాష్ర్టం వెనుకబడినట్లు ప్రణాళికా సంఘం వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని సర్కారు చెబుతున్నా మరో పక్క కేంద్ర ప్రణాళికా సంఘం మాత్రం కీలకరంగాల్లో రాష్ట్రం తిరోగమనంలో ఉందని స్పష్టంచేసింది. ఇటీవల దేశంలోని 21 రాష్ట్రాల్లో ఆరోగ్యం, విద్య, మౌలిక వసతుల రంగాల్లో ప్రభుత్వాల పనితీరును గతంతో పోల్చుతూ ప్రణాళికా సంఘం అధ్యయనం చేసింది. ఈ మూడు రంగాల్లో 2009-10 ఆర్థిక సంవత్సరం కన్నా ముందున్న ర్యాంకులను, అధ్యయనం తరువాత ర్యాంకులను నివేదికలో పేర్కొంది. అంతే కాకుండా ఆ నివేదికలో ప్రణాళికా సంఘం ఆసక్తికర వ్యాఖ్యలను కూడా చేసింది. ఈ ర్యాంకుల ఆధారంగా ఆయా ప్రభుత్వాల పనితీరును ఓటర్లు అంచనా వేసుకోవచ్చంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ అధ్యయనం చేసింది. ర్యాంకుల వారీగా 21 రాష్ట్రాలను మూడు కేటగిరీలుగా విభజించింది. నివేదికలోని ముఖ్యాంశాలు... - ఆరోగ్యం, విద్య, మౌలిక వసతుల రంగాల్లో ఆంధ్రప్రదేశ్ గతంలో కన్నా వెనకబడిపోయింది. - ఆరోగ్య రంగంలో రెండో కేటగిరి రాష్ట్రాల్లో ఏపీ చోటు దక్కించుకోగా విద్యలో మాత్రం మూడో కేటగిరి రాష్ట్రాల జాబితాల్లోకి వెళ్లింది. - మౌలిక వసతుల్లో రెండో కేటగిరీ రాష్ట్రాల్లో ఏపీ నిలిచింది. - ఆరోగ్య రంగంలో గతంలో రాష్ర్టం 8వ ర్యాంకులో ఉండగా ఇప్పుడు 11కు పడిపోయింది. అయితే ఈ రంగంలో కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒరిస్సా, బీహార్, కర్ణాటకలు తమ స్థానాలను మెరుగుపరుచుకొని ఏపీ కన్నా ముందంజలో ఉన్నాయి. శిశు మరణాలు, వైద్య చికిత్సల అందుబాటు ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. - విద్యలో రాష్ట్రం దారుణంగా దిగజారింది. గతంలో 12వ ర్యాంకులో ఉండగా, ఇప్పుడు 20కి పడిపోయింది. నాణ్యమైన విద్య, ఎన్రోల్మెంట్ శాతం, వసతులు ఆధారంగా అధ్యయనం చేశారు. -మౌలిక వసతుల రంగంలో గతంలో 10వ ర్యాంకులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 14కు దిగజారింది. వ్యవసాయ, విద్యుత్, రవాణా రంగాల్లో వసతుల ఆధారంగా అధ్యయనం చేసి ర్యాంకులు ఇచ్చారు. -
ద్రవ్యోల్బణంపైనే సెంట్రల్ బ్యాంకుల దృష్టి సరికాదు: మాంటెక్
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం కట్టడే ప్రధాన లక్ష్యంగా సెంట్రల్ బ్యాంకులు పనిచేయడం సరికాదని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా సోమవారం పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సెంట్రల్ బ్యాంకులు పలు అంశాలు లక్ష్యంగా పనిచేయాల్సి ఉంటుందన్నది తన అభిప్రాయమని అన్నారు. రఘురామ్ రాజన్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత, ద్రవ్యోల్బణమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ రెండుసార్లు రెపో రేటు పెంచిన నేపథ్యంలో మాంటెక్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. పారిశ్రామిక ఉత్పత్తి క్షీణదశలో నడుస్తున్న నేపథ్యంలో- జనవరి 28వ తేదీన ఆర్బీఐ తన మూడవ త్రైమాసిక పరపతి విధాన సమీక్షను నిర్వహించనుంది. ఆర్థిక రంగంలో సంస్కరణల ప్రక్రియ కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రూపాయి ప్రస్తుతం (సోమవారం 61.52 వద్ద స్థిరపడింది) తన వాస్తవ విలువ దగ్గరగా ఉందని మాంటెక్ తెలిపారు. -
భారీగా వార్షిక ప్రణాళిక!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం (2014-15) రాష్ట్ర వార్షిక ప్రణాళిక భారీగా పెరగనుంది. 66 కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికే ఇచ్చే నిధులను రాష్ట్ర వార్షిక ప్రణాళిక కిందకు తేవడమే ఇందుకు ప్రధాన కారణం. గత ఆర్థిక సంవత్సరం వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు రాష్ట్ర వార్షిక ప్రణాళిలో కాకుండా విడిగా పొందుపరుస్తున్నారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కూడా రాష్ట్ర వార్షిక ప్రణాళిక కిందకు తీసుకొస్తున్నట్టు కేంద్ర ప్రణాళికా సంఘం పేర్కొంది. పస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఎన్ని నిధులు కేటాయిం చారో, అంతే మేర వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికలో పొందుపరచాలని స్పష్టం చేసింది. దీని వల్ల రాష్ట్ర వార్షిక ప్రణాళిక ఏకంగా రూ.20 వేల కోట్ల మేర పెరగనుంది. మరోవైపు ప్రభుత్వం అందించే అన్ని రకాల సేవలకయ్యే మొత్తం వ్యయాన్ని యూజర్ చార్జీల ద్వారా రాబట్టాలని ప్రణాళికా సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సాగు, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, కరెంట్ సరఫరా, రవాణా తదితర రంగాల చార్జీలను సవరించడం ద్వారా ప్రణాళికేతర వ్యయాన్ని రాబట్టాలని పేర్కొంది. పన్నేతర ఆదాయం పెంపుపై ఎక్కువ దృష్టి సారించాలని సూచించింది. కనీసం సాగునీటి రంగం నిర్వహణ వ్యయాన్ని అయినా సరే పన్నేతర ఆదాయం ద్వారా రాబట్టాలని స్పష్టం చేసింది. నిర్ధారించిన నమూనా పత్రాల్లో అంచనా వివరాలను ఈ నెల 10వ తేదీలోగా పంపించాలని సూచించింది. రాష్ట్ర వార్షిక ప్రణాళికపై వచ్చే ఏడాది జనవరి 15 నుంచి రాష్ట్ర అధికారుల స్థాయిలో ప్రణాళికా సంఘం చర్చలు ప్రారంభించనుంది. మార్గదర్శక సూత్రాలివీ... భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా వస్తున్న నీటి చార్జీల ఆదాయంతో పాటు ఆ ప్రాజెక్టుల నిర్వహణకు వెచ్చిస్తున్న వ్యయాన్ని వేర్వేరుగా పొందుపర్చాలి. అలాగే విద్యుత్ సరఫరా, రవాణా రంగాల ద్వారా చార్జీల రూపంలో వస్తున్న ఆదాయాన్ని వేర్వేరుగా పేర్కొనాలి. కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రానికి వచ్చే వాటాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పేర్కొన్న మొత్తాన్నే వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా పేర్కొనాలి. సొంత పన్నుల ఆదాయం ఎంత చూపెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం, అయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి వద్ధి రేటు కన్నా తక్కువగా సొంత పన్నుల ఆదాయం ఉండరాదు. సాధారణ వద్ధి రేటుతో రాష్ట్ర పన్నుల ఆదాయం పెరుగుదలను విడిగాను, పన్ను పెంచడం ద్వారా అదనపు ఆదాయం వస్తుంటే ఆ వివరాలను విడిగాను నమూనా పత్రాల్లో వివరించాలి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఆధారంగా వచ్చే (2014-15) వార్షిక ప్రణాళికకు వనరులను అంచనా వేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్పరం ప్రణాళికలో ఇప్పటి వరకు అయిన వ్యయం, ఆదాయం స్థితిగతుల ఆధారంగా వచ్చే వార్షిక ప్రణాళికకు వనరులను లెక్కగట్టాలి. రాష్ట్ర ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టానికి లోబడి అప్పు, రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి వచ్చే నిధుల ఆధారంగా వార్షిక ప్రణాళికకు వనరులను అంచనా వేయాలి. ఉద్యోగుల జీతాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పించనుకు సంబంధించి రెండు విడతల కరువు భత్యం ఆధారంగా అంచనాలను పొందుపరచాలి. ఉద్యోగులకు సంబంధించి నెల వారీ మొత్తం వేతనాలు ఎంతనే వివరాలను విడిగా పేర్కొనాలి. విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీల పెంపుదల ఉంటే ఆ విషయాన్ని ప్రత్యేకంగా అదనపు ఆదాయ వనరులుగా పొందుపరచాలి. వీలైనంత ఎక్కువ మేర పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా నిర్వహణ వ్యయాన్ని రాబట్టాలి. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి అంతర్గత ఆదాయ వివరాలను, అప్పులను, బడ్జెట్ మద్దతును వేర్వేరు నమూనాల్లో పొందుపరచాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పేర్కొన్న మేరకే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా బహిరంగ మార్కెట్ రుణాలను పరిమితం చేయాలి. విదేశీ పథకాలకు సంబంధించిన సాయాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇస్తున్న మేరకే వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించాలి. అయితే ఈ పథకాలకు గత ఆర్థిక సంవత్సరంలో అయిన వ్యయంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు చేసిన వ్యయాలను ప్రత్యేకంగా పేర్కొంటూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదనలు చేయాలి. -
మోడీవి పగటి కలలు : ఖర్గే
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశ ప్రధాని కావాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పగటి కలలు కంటున్నారని కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. ఇక్కడి కేపీసీసీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోడీ కలలన్నీ కల్లలవుతాయని జోస్యం చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగంపై మోడీ విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు. అభివృద్ధిలో గుజరాత్ దేశంలోనే తొలి స్థానంలో ఉందంటూ మోడీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రణాళికా సంఘం లెక్కల ప్రకారం గుజరాత్ 10-12 స్థానంలో ఉందన్నారు. మహారాష్ర్ట, హర్యానా, కేరళ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని వెల్లడించారు. మోడీ అధిక ప్రసంగాలు మాని, గుజరాత్‌ను అభివృద్ధి పరచిన అనంతరం మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ప్రధాని ప్రసంగంపై ముఖ్యమంత్రులు విమర్శలు చేసే ఆనవాయితీ ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే. అద్వానీ సైతం మోడీ వ్యవహార శైలిని తప్పుబట్టారని గుర్తు చేశారు. అదే పార్టీలో ఉన్న మోడీ ఆ మాత్రం పెద్దరికాన్ని ఎందుకు ప్రదర్శించలేక పోయారని ప్రశ్నించారు. కాగా రాష్ట్రంలో రెండు లోక్‌సభ స్థానాలకు, మూడు శాసన మండలి స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయా నియోజక వర్గాల్లో పార్టీకి అనుకూల వాతావరణం కనిపిస్తోందన్నారు. రెండు రోజుల పాటు తాను కూడా ప్రచారంలో పాల్గొంటానని ఆయన తెలిపారు.