న్యూఢిల్లీ : ప్రణాళిక సంఘం పేరును కేంద్ర ప్రభుత్వం ' నీతి ఆయోగ్'గా మార్చింది. హిందీలో నీతి అంటే విధానం... ఆయోగ్ అంటే కమిటీ. మన తెలుగులో చెప్పాలంటే విధాన కమిటీ. ప్రణాళిక సంఘం పేరు మార్పుపై ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఢిల్లీలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాలంలో ప్రణాళిక సంఘం అవశ్యకత, బాధ్యతల మార్పు తదితర అంశాలపై గత కొద్ది రోజులుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ప్రణాళిక సంఘం పేరు మార్పును తన తొలి స్వాతంత్ర్య దిన సందేశంలోనే మోదీ వెల్లడించారు.
భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మానస పుతిక్ర ప్రణాళిక సంఘం. ప్రభుత్వ తీర్మానం ద్వారా 1950 మార్చి 15న దీన్ని ఏర్పాటు చేశారు. చట్టబద్ధసంస్థ అయినప్పటికీ దీనికి రాజ్యాంగబద్ధత లేదు. అందుకే పేరు మార్పు చాలా సులభంగా జరిగిపోయింది. దేశ స్వాతంత్ర్యానికి పూర్వమే ప్రణాళిక సంఘంపై చర్చ జరిగింది. రష్యా ప్రణాళిక విధానానికి ముగ్ధడైన నెహ్రూ భారత్‌లోనూ కచ్చితంగా ప్రణాళిక వ్యవస్థ ఉండాలని భావించారు.
1931 కరాచీలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో తొలిసారి ప్రణాళిక విధానంపై చర్చించారు. 1940లో రెండు సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం రాక ముందే అక్టోబర్ 1946లోనే ప్రణాళిక సలహా మండలి ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడి నెహ్రూయే. ఆ తర్వాత ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రధాని దానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని ప్రకటించారు.
ఇక నుంచి...'నీతి ఆయోగ్'
Published Thu, Jan 1 2015 12:07 PM | Last Updated on Sat, Oct 20 2018 5:49 PM
Advertisement