సీఎం చంద్రబాబు నాయుడు దుబార ఖర్చుతోనే రాష్ట్రంలో ఆర్థికలోటు ఏర్పడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు డీఎన్ కృష్ణ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పరిస్థితి మెరుగుపడాలంటే రూ. 65వేల కోట్లు కావాలని 15వ ఆర్థిక సంఘాన్ని కోరినట్లు చెప్పారు. 15వ ఆర్థిక సంఘానికి తమ పార్టీ తరపున పలు అంశాలను తీసుకెళ్లామన్నారు. హైదరాబాద్‌ను కోల్పోయిన నవ్యాంధ్రప్రదేశ్‌కు అధిక నిధులు కేటాయించాలని కోరామన్నారు.