India@75: ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్‌’   | Azadi Ka Amrit Mahotsav NITI Aayog To Replace Planning Commission | Sakshi
Sakshi News home page

India@75: ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్‌’  

Published Mon, Aug 8 2022 7:08 PM | Last Updated on Mon, Aug 8 2022 7:10 PM

Azadi Ka Amrit Mahotsav NITI Aayog To Replace Planning Commission - Sakshi

భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1న సరికొత్త వ్యవస్థ ‘నీతి ఆయోగ్‌’ ఏర్పాటైంది. అంతకు ముందు ఉన్న భారత ప్రణాళికా సంఘం.. కేంద్ర మంత్రిమండలి తీర్మానం ద్వారా 1950 మార్చి 15 న ఏర్పాటైంది. 2014 లో మోడీ తన మొదటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో, ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయాలనే ఉద్దేశ్యాన్ని ప్రకటించారు. తదనుగుణంగా నీతి ఆయోగ్‌ కు రూపకల్పన జరిగింది. 

ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు

  • ఎం.ఎస్‌.నారాయణ, ఆర్‌.కె.లక్ష్మణ్, కేశవరెడ్డి, డి. రామానాయుడు, రాళ్లబండి కవితా ప్రసాద్, నర్రా రాఘవరెడ్డి, షీలా కౌల్‌ (100), ఎం.ఎస్‌. విశ్వనాథన్, వి. రామకృష్ణ, ఏడిద నాగేశ్వరరావు, కళ్లు చిదంబరం, కొండవలస లక్ష్మణరావు, రంగనాథ్‌.. కన్నుమూత. 
  • జాతీయోద్యమ కార్యకర్త మదన్‌ మోహన్‌ మలావ్యాకు మరణానంతర ‘భారత రత్న’.
  • తొలి ‘ఇంటర్నేషనల్‌ యోగా డే’ వేడుకలు.
  • గోదావరి పుష్కరాల్లో భక్తుల తొక్కిసలాట (రాజమండ్రి). 29 మంది మృతి.  

(చదవండి: శతమానం భారతి: లక్ష్యం 2047.. అమృతయాత్ర)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement