
ముఖ్యమంత్రుల మండలి ఉండాలి: చంద్రబాబు
న్యూఢిల్లీ: ప్రణాళిక సంఘం స్థానే ముఖ్యమంత్రుల మండలి ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. ప్రధాని అధ్యక్షతన ఆదివారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రణాళిక సంఘానికి ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం ప్రధాని ఆలోచిస్తున్నారని చంద్రబాబు చెప్పారు.
ప్రణాళిక సంఘాన్ని ఒక తంతుగా కింద ఉపయోగించుకునేవారని విమర్శించారు. విజన్- 2050 తయారు చేసుకోవాల్సిన అవసముందన్నారు. రాజకీయాల కంటే అభివృద్ధి ముఖ్యమని చంద్రబాబు చెప్పారు.