అభిప్రాయం
చంద్రబాబు నాయుడు (సీబీఎన్) ముఖ్యమంత్రి అయిన నాలుగేళ్ళకే కేంద్ర ‘ప్లానింగ్ కమిషన్’ను నిబంధనలు అధిగ మించి ‘ఇరవై ఏళ్ల నా విజన్ –2020’ అంటూ ఒక ‘డాక్యుమెంట్’ను ‘మెకెన్సీ’ కన్సల్టెన్సీ కంపె నీతో రాయించుకున్నారు. 30 ఏళ్ల క్రితం మొదలయిన ‘సరళీకరణ’, ‘ప్రైవేటీకరణ’లను ఆయన అలా మలుచుకున్నారు. ఐదేళ్ల కాలానికి మించి ‘ప్లానింగ్’ అనేది అప్పటికి ప్రభుత్వ విధానంగా లేదు.
కానీ జరిగింది ఏమిటి? ‘విజన్ డాక్యుమెంట్’లో ముందుగా చెప్పని రాష్ట్ర విభజన జరిగింది. రెండు కొత్త ప్రాంతీయ పార్టీలు ఏర్పడి, అవి అధికారంలోకి కూడా వచ్చాయి. విభజన తర్వాత ఒక ‘టర్మ్’ ప్రభుత్వంలో ఉన్నా... ఓడి మరో ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి, మళ్ళీ ఇప్పుడు గెలిచి సీఎం అయ్యారు. అయితే అందుకు ఆయన పలు రాజీలు పడ్డారు.
ఇలా ‘విజన్ డాక్యుమెంట్’ ఒక్కటే కాదు, ఆయనది మొదటి నుంచీ ఎప్పుడూ ఏవో కొన్ని ‘టూల్స్’ దన్నుతో నెట్టుకొచ్చే నిలకడలేని సందిగ్ధ స్థితి. ఆయనకు ఆ హోదా సిద్ధాన్నం (‘టిన్ ఫుడ్’) కావడంతో... ఆ ‘పోస్టు’కు ఉండే సహజ పోటీలో నెగ్గుకుని రావడం కోసం మొదట్లోనే – ‘మేనేజిరియల్ స్కిల్స్’తో ప్రజల దృష్టి మళ్ళించ గలిగిన కొందరు ‘బ్యురోక్రాట్ల’ను, ‘మీడి యా’ను ఆయన దగ్గరకు తీశారు.
‘విన్–విన్’ అంటూ పరస్పర ప్రాయోజిత మార్గం ‘రిఫార్మ్స్’ కాలంలో అలా కలిసి వచ్చింది. అలా ఆయన ‘సీటు’లోకి వచ్చిన ఏడాదికే ‘కొరియన్ మోడల్’ అంటూ ‘జన్మభూమి’ని తెచ్చి దానికి సొంతూరు ‘సెంటిమెంట్’ ప్రచారం కల్పించారు. చివరికి ‘జన్మభూమి’ అంటే... అదొక పార్టీ ‘స్టిక్కర్’లా మారింది.
నిజానికి ఇవి పాత విషయాలు. అయితే ఇక్కడ వీటిని గుర్తు చేయడానికి కారణం ఉంది. గతంలో సీబీఎన్ నిర్ణయాత్మకతలోని సందిగ్ధ స్థితిని ‘కవర్’ చేసి మునుపటిలా ఆయన్ని ‘బ్రాండింగ్’ చేయడం 2025 నాటికి సదరు తల నెరిసిన ‘మీడియా మేనేజర్ల’కు సైతం ఇప్పుడు అలవి కావడం లేదు.
కారణం ఒకప్పుడు ఆ బాధ్యత అవలీలగా చేసిన ప్రధాన ‘మీడియా’తో సమాంతరంగా ‘సోషల్ మీడియా’ వచ్చిన ఫలితంగా వాళ్ళు ఇపుడు తరచూ గందరగోళానికి గురవడమే! వాళ్ల నోటికి నిబంధనలతో కూడిన ‘బుక్’ అంటూ ఏమీ ఉండదు కనుక, చివరికి వాళ్ళు ‘అధికారులకు కళ్ళు నెత్తికెక్కాయి... గతంలో ఇలా లేదు.
జగన్ మోహన్ రెడ్డి అంటే వాళ్ళు భయపడేవారు...’ అంటూ కూడా మాట్లా డుతున్నారు. చివరికి దీన్ని ఇద్దరు నాయకుల యుద్ధ భూమిగా మార్చి ప్రభుత్వంలో ‘ఎగ్జిక్యూటివ్’ (కార్య నిర్వాహకవర్గం) అనుసరించాల్సిన ‘బుక్’ ఉంటుంది, ‘జ్యుడిషియరీ’ (న్యాయవ్యవస్థ)కి వాళ్ళు జవాబుదారీ అవుతారనే ఇంగితం లేకుండా వీరి ప్రహసనం సాగు తున్నది.
అనివార్యంగా రాజ్యనీతిలోకి చొచ్చుకొచ్చిన సరళీ కరణ–ప్రైవేటీకరణల ప్రభావం, నైసర్గికంగా రాష్ట్రం విభజన జరగడం ఈ సందర్భంగా గమనార్హం. అది రాష్ట్రమైనా, సమాజమైనా ఒక కోత (కట్)కు గురైన ప్పుడు, మునుపు చూడని కొత్త పార్శా్వలు, వాటికి మొలిచే కొత్త మొలకలు అనేకం బయటకు వస్తాయి.
ఆ దశలో పాలనకు అవి విసిరే సవాళ్ళను ఎదుర్కొని వాటి పర్యవసానాలను రాజ్యంగ స్ఫూర్తికి లోబడి పరిష్కరించే అధికార యంత్రాంగాన్ని ‘రాజ్యం’ ప్రభుత్వ పరిధిలో ఉండే ‘ఎగ్జిక్యూటివ్’ నుంచి సిద్ధం చేసుకోవాలి. అది వారి ‘సర్వీసు’లకు తగిన రక్షణ ఇవ్వాలి.
రాజకీయాల కోసం వాళ్ళను బలిచేస్తే, నష్టపోయేది రాష్ట్రమే! దాన్ని అర్థం చేసుకునే దార్శనికత ‘లెజిస్లేచర్’ (శాసన వ్యవస్థ)కు ఉండాలి. విభజనతో ఏర్పడిన కొత్త రాష్ట్రంలో ఇంకా ‘రాజ్యం’ వైపు ప్రాథమిక అవసరాల కోసం చూసే నిర్లక్షిత సమాజాల అవసరాల పట్ల కనీస స్పృహ ఎగ్జిక్యూటివ్ – లెజిస్లేచర్‌లు ఇద్దరికీ ఉండాలి.
కానీ సంస్కరణల మొదట్లో ‘సమ్మిళిత వృద్ధి’ (ఇంక్లూజివ్ గ్రోత్) అంటూ హామీ ఇచ్చి, ఇప్పుడు దాన్ని అటకెక్కించి ‘సంక్షేమాన్ని’ సమీక్షించే బాధ్యతను నోరున్న ప్రతి ఒక్కరూ తీసుకోవడం, వైసీపీ ప్రభుత్వం తర్వాత కొత్తగా చూస్తున్నాం. కేవలం తాము ‘లెజి స్లేచర్’ పక్షం ‘మీడియా’ అనే ఒకే ఒక్క ఆధిక్యతతో ‘ప్రైవేటు’గా ప్రభుత్వ పాలనలోకి చొరబడి, ‘ఎగ్జిక్యూ టివ్’ మీదికి ఎక్కేస్తున్న విపరీత ధోరణిని 2024 ఎన్ని కలు తర్వాత కొత్తగా చూస్తున్నాము.
ప్రభుత్వ వ్యవస్థలు, శాఖలు ఆధునిక ‘టెక్నాలజీ’తో తమ నిధులకు గండి పడకుండా ‘లీకేజీ’లను కట్టడి చేస్తుంటే, ప్రకృతికి ఏ కంచె లేదని సహజ వనరులు తవ్వుకుంటూ సొమ్ము చేసుకుంటుంటే... దాన్ని వదిలి పేదలకు సంక్షేమ పథ కాల అవసరాన్ని ప్రశ్నించడానికి ఈ ‘మేనేజర్లు’ బరి తెగిస్తున్నారు.
ఈ కొత్త ధోరణిపై చర్చ మొదలు కాకపోతే కొన్నాళ్ళకు ‘ప్రైవేటు’ శక్తులు తమ పరిధి దాటి ప్రభుత్వ జాగాలోకి చొచ్చుకు వస్తాయి. సీబీఎన్ రాజకీయాలకు మొదటి నుంచి తనదైన ‘పబ్లిక్ పాలసీ’ అంటూ ఒకటి లేక, ‘ట్రెండ్స్’ను బట్టి అది మారడం వల్ల, గడచిన పదే ళ్ళలో ఆయన స్వీయ సమాచార వ్యవస్థ ‘టెర్మినల్స్’కు చేరింది.
అందుకే ఆ ‘క్యాంప్’ నుంచి పరస్పర విరుద్ధ ప్రకటనలు చూస్తున్నాం. జరిగిన రెండు కలెక్టర్ల సమా వేశాల్లోనూ, ఈ నెల కుప్పం పర్యటనలోనూ సీబీఎన్– ‘నాది పొలిటికల్ గవర్నెన్స్’ అంటుంటే, ఆయన ‘మీడియా మేనేజర్లు’ మాత్రం – ‘బాబు గారూ! మీరు ఎప్పటిలా మళ్ళీ ‘సీఈఓ’ అయ్యారు. అలా వద్దు సార్! మీరు రాజకీయాలు మాత్రమే చేయండి’ అనడం ఈ గందరగోళానికి పరాకాష్ఠ!
జాన్‌సన్ చోరగుడి
వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment