కేకేఆర్ ప్రతిపాదనలకు కేంద్రం ఓకే | Cabinet clears KKR's $400 million pharma FDI proposal | Sakshi
Sakshi News home page

కేకేఆర్ ప్రతిపాదనలకు కేంద్రం ఓకే

Published Wed, May 14 2014 12:16 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

కేకేఆర్ ప్రతిపాదనలకు కేంద్రం ఓకే - Sakshi

కేకేఆర్ ప్రతిపాదనలకు కేంద్రం ఓకే

న్యూఢిల్లీ: రెండు ఫార్మా కంపెనీల్లో రూ.1,434 కోట్లతో వాటాల కొనుగోలుకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ చేసిన ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. హైదరాబాద్ కేంద్రంగాగల గ్లాండ్ ఫార్మాలో 37.98%, గ్లాండ్ సెల్సస్ బయోకెమికల్స్‌లో 24.9% వాటాల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలివి. ఈ కొనుగోళ్లకు కాంపిటీషన్ కమిషన్ గత జనవరిలోనే ఆమోదం తెలిపింది.

 భెల్‌లో 4.66 శాతం వాటా విక్రయంపై...
 విద్యుత్ పరికరాల సంస్థ భెల్‌లో 4.66 శాతం వాటాను బ్లాక్ డీల్ రూట్లో విక్రయించాలన్న నిర్ణయానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మన్మోహన్ సింగ్ సారథ్యంలోని సీసీఈఏ ఈ నిర్ణయాన్ని మంగళవారం ఆమోదించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement