న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వాన్ని తీవ్రంగా కుదిపేసిన 2జీ స్పెక్టం కుంభకోణంపై పటియాలా హౌజ్ కోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ స్పందించారు. 2జీ స్కాం నేపథ్యంలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ప్రచారమంతా దుష్ప్రచారమేనని ఈ తీర్పు స్పష్టం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా 2జీ స్కాం యూపీఏ సర్కారును అతలాకుతలం చేసింది. ఈ స్కాంలో నిందితుడిగా ఉన్న అప్పటి టెలికం మంత్రి ఏ రాజా, యూపీఏ సర్కారులో భాగస్వామిగా ఉన్న డీఎంకే ఎంపీ కనిమొళితోపాటు ఇతర నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.
'తీర్పు చాలా సుస్పష్టంగా ఉంది. యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన తీవ్రస్థాయిలో చేసిన దుష్ప్రచారమంతా నిరాధారమని తీర్పు స్పష్టం చేసింది' అని మన్మోహన్‌సింగ్ హర్షం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బొగ్గు గనుల కేటాయింపులు, కామన్‌వెల్త్ క్రీడల వంటి విషయాల్లో జరిగిన కుంభకోణాలు యూపీఏ సర్కారును తీవ్రంగా కుదిపేశాయి.
Comments
Please login to add a commentAdd a comment