
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో అప్పటి టెలికం పాలసీని సమర్థించకుండా మాజీ ప్రధాని మన్మోహన్ ఉద్దేశపూర్వక మౌనం వహించడాన్ని టెలికం మాజీ మంత్రి ఏ.రాజా ప్రశ్నించారు. 2జీ కుంభకోణం వాస్తవాల పేరిట ఆయన రాసిన పుసక్తం ‘2జీ సాగా అన్‌పోల్డ్స్’లో పలు కీలక విషయాల్ని ప్రస్తావించారు. కేసు విచారణ సమయంలో రాసిన ఈ పుసక్తంలో అప్పటి కాగ్ వినోద్ రాయ్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఈ పుసక్తం విడుదల కావాల్సి ఉంది.
స్పెక్ట్రం కేటాయింపులపై సీబీఐ దాడులకు సంబంధించి మన్మోహన్‌కు కూడా ఎలాంటి సమాచారం లేదని రాజా తెలిపారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం వినోద్ రాయ్‌తో రాజీపడి పనిచేసిందని, స్పెక్ట్రం కేటాయింపుల ఖాతాల తనిఖీ సందర్భంగా వేరే ఉద్దేశాలు పెట్టుకుని రాజ్యాంగ విధుల నిర్వహణలో రాయ్ అతిగా వ్యవహరించారని రాజా ఆరోపించారు. కొత్త వారికి లైసెన్స్‌లివ్వడం టెలికం లాబీలకు ఇష్టం లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment