CBI attacks
-
ఏ ప్రభుత్వమైనా ఇదే తంతు!
నిష్పక్షపాతంగా ఉండాల్సిన దర్యాప్తు సంస్థలు పాలకుల చేతి చిలకలుగా ఉంటున్నాయన్న ఆరోపణలు కొత్తవి కాదు. ఈ సంస్కృతికి ఏ ఒక్క పార్టీనో నిందించి ప్రయోజనం లేదు. సీబీఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారుల చేతులు మెలిపెట్టి వారిని వాడుకోవడంలోనూ; రాజనీతికి, దేశ విశిష్ట రాజ్యాంగ చట్ట నిబంధనలకు యథేచ్ఛగా తిలోదకాలివ్వడంలోనూ పాలకుల మధ్య ఎత్తుగడలలో తేడాలే తప్ప వ్యవహారం మొత్తం ఒకే రకం. అలాగే ఇవాళ ప్రతిపక్ష నాయకుల్ని, పాత్రికేయుల్ని, ప్రజా సమస్యలకు న్యాయమైన పరిష్కారాన్ని కోరుతూ ఉద్యమాలు నిర్వహిస్తున్న పౌర హక్కుల ఉద్యమకారులపై పోలీసు జులుం వినియోగించే సంస్కృతికి కూడా పాలక పార్టీలు సమాన స్థాయిలో మూల విరాట్టులేనని మరచిపోరాదు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన సంస్థలను కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందన్న రొడ్డ కొట్టుడు ప్రకటనలను ప్రజలు వినలేక చస్తున్నారు. ఎందుకంటే,‘అందరూ శాకాహారులే అయితే రొయ్యల బుట్ట కాస్తా ఎలా ఖాళీ అయిపోయిం’దన్న ప్రశ్నకు సమాధానం వారికి ఇంతవరకూ దొరక లేదు కాబట్టి! దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న ముహూర్త కాలంలో కూడా ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఎందుకని? నాయకులకన్నా స్వాతంత్య్రం కోసం ఆస్తులు, ప్రాణాలు సహా దేశ ప్రజా బాహుళ్యం అనంతమైన త్యాగాలు చేసి ఉన్నారు గనుక. ఇవాళ ప్రతిపక్ష నాయకుల్ని, వారి అనుయాయుల్ని, పాత్రికే యుల్ని, పౌర సమాజాన్ని, ప్రజా సమస్యలకు న్యాయమైన పరిష్కా రాన్ని కోరుతూ ఉద్యమాలు నిర్వహిస్తున్న పౌర హక్కుల ఉద్యమ కారులను హింసిస్తూ, వారిపై పోలీసు జులుం వినియోగించే పాలక సంస్కృతికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సమాన స్థాయిలో మూల విరాట్టులేనని మరచిపోరాదు. అంతేగాదు, కోర్టుల్ని ధిక్కరించి, వాటి చేతుల్ని మెలిపెట్టి పనులు నిర్వహించుకునే సంస్కృతికి తెరలేపినవీ కూడా ఈ రెండు పార్టీలేనని నిద్రలోనూ మరవరాదు. అలహాబాద్ హైకోర్టు సాహసించి ఇందిరాగాంధీ ‘ఎమర్జెన్సీ రాకెట్’ బాగోతాన్ని బట్టబయలు చేస్తూ శఠిస్తూ చెప్పిన చరిత్రాత్మక తీర్పును ఆమోదిస్తూనే సుప్రీంకోర్టు ప్రసిద్ధ న్యాయమూర్తి కృష్ణయ్యర్ ఉదార దృక్పథంతో ఇందిరా గాంధీ ‘విషయాన్ని చక్కబెట్టుకోవడానికి’ వెసులుబాటు కల్పించబట్టి తక్షణం ఆమె రాజీనామా వాయిదాపడింది. సీబీఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారుల చేతులు మెలిపెట్టి వారిని వాడుకోవడంలోనూ; రాజనీతికి, దేశ విశిష్ట రాజ్యాంగ చట్ట నిబంధనలకు యథేచ్ఛగా తిలోదకాలివ్వడంలోనూ కాంగ్రెస్, బీజేపీ పాలకుల మధ్య ఎత్తుగడలలో తేడాపాడాలే తప్ప వ్యవహారం మొత్తం ఒకే రకం. ప్రజాబాహుళ్యాన్ని, వారి సంక్షేమాన్ని ప్రజాస్వామిక పద్ధతుల్లో తీర్చిదిద్దుతూ వచ్చిన ఉదాహరణలు తక్కువ. స్వతంత్ర సంస్థలుగా ఉండవలసిన సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖలను గతంలో ‘చేతివాటు’ పనిముట్లుగా వాడుకున్న తీరు చివరికి సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లడమూ, కోర్టు సీబీఐ, ఈడీ అధికారు లను చీవాట్లు పెడుతూ, ఇకమీదట ‘మీరు కేంద్ర ప్రభుత్వానికే కాదు, సుప్రీం న్యాయస్థానానికి బాధ్యులై ఉండాల’ని కఠినంగా ఆదేశించడమూ జరిగింది. బహుశా ఈ పరిణామాలను గమనించిన తరువాతనే కేంద్ర సీబీఐ మాజీ ఉన్నతాధికారి, గూఢచార శాఖ మాజీ అధిపతి రామేశ్వర్ నాథ్ కావ్ కూడా పాలకుల ప్రలోభాల ఫలితంగా గూఢచార శాఖ అధికారులు చూచి రమ్మంటే కాల్చి వచ్చే బాపతులుగా తయారు కావడం విచారకరమని ఒక పుస్తకమే రాసి విడుదల చేశారు. ఈ బాగోతం ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ఇలాంటి ఉదాహరణలను పెక్కింటిని ‘హిందూ’ దినపత్రిక మేటి పక్ష పత్రిక అయిన ‘ఫ్రంట్ లైన్’ ప్రత్యేక ప్రతినిధి, విశిష్ట విశ్లేషకుడైన ఆశుతోష్ శర్మ పేర్కొన్నారు: ‘‘రూ. 300 కోట్ల మనీ లాండరింగ్ కుంభకోణం కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి నారాయణ్ రానే, అధికార పక్షంలో చేరడంతోనే అతనిపై అంతకుముందున్న కేసు కాస్తా మాఫీ అయిపోయింది. అదే తరహాలో పశ్చిమ బెంగాల్లో ‘నారదా’ కుంభ కోణంలో నిందితుడైన సువేందు అధికారిపై విచారణ కాస్తా రద్దయిపోయింది. మధ్యప్రదేశ్ షిండే సేనకు చెందిన భావనా గవ్లీకి ‘ఈడీ’ జారీ చేసిన అయిదు సమన్లను ఖాతరు చేయకపోయినా ప్రస్తుత లోక్‌సభలో ‘షిండే సేన’కు ఛీఫ్ విప్‌గా ఉన్నారు. అలాగే, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్ట (ఫెమా) ఉల్లంఘన కేసులో ఈడీ విచారణలో ఉన్న యశ్వంత్ యాదవ్, ఎమ్మెల్యే యామినీ యాదవ్ దంపతులిద్దరూ ఇప్పుడు ‘షిండే సేన’లో సభ్యులుగా ఉన్నారు. మనీ లాండరింగ్ కేసులో శివ సేన సభ్యుడుగా ఉన్న ప్రతాప్ సర్ నాయిక్‌పై ‘ఈడీ’ సోదా నిర్వహించితే ఇప్పుడతను షిండే సేనలోకి చేరడంతోనే కేసు కాస్తా మాఫీ అయిపోయింది. ఈ సందర్భంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి, ‘ఆప్’ జాతీయ నాయకు డైన అరవింద కేజ్రీవాల్ (మార్చి 1న) ఒక ప్రశ్న సంధిస్తూ ‘ఈ రోజున ఆప్ మంత్రి మనీష్ సిసోడియా బీజేపీలో చేరితే, రేపంటే రేపే విడుదలైపోడా?’ అని ఓ జోక్ వదిలారు. అంతేగాదు, సుప్రీంకోర్టు న్యాయవాది కాళీశ్వరం రాజ్ – ‘భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందంటే, కోర్టు నిర్ణయించిన న్యాయమూర్తుల నియా మకాల్ని కూడా తిమ్మినిబమ్మిని చేసి తారుమారు చేయగల శక్తి పాలక వర్గానికి ఉందని అర్థమవుతోంది’ అని చురక వేశారు. అయితే, ఎప్పు డయితే సుప్రీం కోర్టుకు ప్రగతిశీల ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ పదవీ స్వీకారం చేశారో అప్పటినుంచీ సుప్రీంకోర్టు నుంచి వెలువడుతున్న ప్రజాహిత నిర్ణయాలు దేశ ప్రజలకు మంగళకర సూచనగా భావించాలి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలనా కాలంలో సుప్రీం న్యాయమూర్తి హోదాలో జస్టిస్ ఖన్నా దేశవ్యాప్తంగా పౌర హక్కుల వినాశానికి, పాలక నియంతృత్వ ధోరణులకు ‘ఫుల్ స్టాప్’ పెట్టించి రాజకీయ ఖైదీల విడుదలకు ఉత్తర్వులు జరూరుగా జారీ చేసి, దేశంలోనూ, విదేశాలలోనూ ఖ్యాతి గడించారు. తాను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కానున్న సమయంలో ఆ పదవిని త్యాగం చేసిన జస్టిస్ ఖన్నాను విదేశాలు మరచిపోలేదుగానీ, మన దేశంలో అలాంటి న్యాయమూర్తికి ఏటా నివాళులర్పించగల కనీస సంస్కారం కూడా మనలో కరువై పోయింది. ఒక దేశం, ఒకే ఎన్నిక, ఒకే నాయకుడు అన్న ధోరణి రాజ్యాంగం నిర్దేశించి, గ్యారంటీ చేసిన ఫెడరల్ (సమాఖ్య) వ్యవస్థకు చేటు కల్గి స్తుందని దేశ ప్రజలు స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఈ సందర్భంగా కవయిత్రి మాయా ఏంజెలో (శివలక్ష్మి అనువాదం) స్వేచ్ఛా పక్షికీ, ‘పంజరంలోని పక్షి’కీ గల తేడాను వర్ణిస్తూ చెప్పిన మాటల్ని విందాం: ‘‘స్వేచ్ఛా పక్షి తన శక్తి మేరకు ఆకాశాన్ని సైతం శుభ్రం చేయడానికి ధైర్యం చేస్తుంది... పంజరంలో పక్షి భయంకరంగా వణికే గొంతుతో పాడుతుంది కానీ, చాలాకాలంగా సుదూరపు కొండలనుంచి శ్రుతి తప్పిన రాగం అస్పష్టంగా పంజరం నుంచి విముక్తి కోసం పక్షి స్వర రాగం విషాదంగా వినపడుతూనే ఉంటుంది స్వేచ్ఛా పక్షులు ఆహ్లాదకరమైన ఇతర పక్షుల గురించి ఆలోచిస్తాయి చెట్లు వదిలే వాణిజ్య వాయువుల్ని మృదువుగా ఆస్వాదిస్తాయి ఆ పక్షులు ఆకాశానికి తమ పేరు పెట్టుకుంటాయి! కానీ పంజరంలోని పక్షి తన కలల సమాధిపై నిలబడి ఉంటుంది ఆ పక్షి రెక్కలు కత్తిరించబడ్డాయి, పాదాలు కట్టివేయబడ్డాయి కాబట్టి పంజరంలో పక్షి పాడటానికి తన గొంతు సవరించుకుంటుంది పంజరంలో పక్షి పాడుతుంది భయకంపితమైన స్వరంతో తన స్వేచ్ఛను ఎలుగెత్తి చాటే పక్షి స్వర రాగం విషాదంగా వినబడుతూనే ఉంది!’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఎఫ్ఎంజీ నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం బట్టబయలు
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): దేశంలో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్ఎంజీ) ఫేక్ సర్టిఫికెట్ల కుంభకోణం వెలుగు చూసింది. దాంతో సీబీఐ మన రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని 91 నగరాలు, పట్టణాల్లో గురువారం విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఎఫ్ఎంజీ ఫేక్ సర్టిఫికెట్లకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించింది. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన భారతీయ విద్యార్థులు మనదేశంలో వైద్యవృత్తి చేపట్టాలంటే ఎఫ్ఎంజీ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) ఈ పరీక్ష నిర్వహిస్తుంది. కాగా, ఇందులో ఉత్తీర్ణులు కాకుండానే ఉత్తీర్ణులైనట్టుగా దేశంలో 73మంది ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించినట్టు సీబీఐ గుర్తించింది. ఆ ఫేక్ సర్టిఫికెట్లను ఆయా రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లు సైతం ఆమోదించడం గమనార్హం. దీనిపై సీబీఐ ఈ నెల 22న కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా గురువారం దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. ఈ ఫేక్ సర్టిఫికెట్లతో ప్రమేయం ఉన్న పలువురు ఎఫ్ఎంజీ గ్రాడ్యుయేట్లు, అందుకు సహకరించిన మెడికల్ కౌన్సిళ్లు, వైద్య సంస్థలను గుర్తించింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తామని సీబీఐ ప్రకటించింది. మన రాష్ట్రంలోనూ నకిలీ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్ ఎఫ్ఎంజీ ఫేక్ సర్టిఫికెట్ల కుంభకోణానికి సంబంధించి విజయవాడలోని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ కార్యాలయంలో సీబీఐ అధికారులు ఈ నెల 23న తనిఖీలు నిర్వహించారు. 12 గంటలపాటు ఏకబిగిన కొనసాగిన ఈ సోదాల్లో 2014 నుంచి 18 మధ్య విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకున్న వైద్యుల వివరాలను పరిశీలించారు. ఇతర రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలు కొనసాగుతున్నంతసేపు కార్యాలయంలో అధికారులు, సిబ్బందిని బయటకు కూడా పంపించలేదు. కాగా గురువారం విజయవాడలోని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌తోపాటు విశాఖపట్నంలోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది. -
ఆపరేషన్ గరుడ: డ్రగ్స్ ముఠాలపై సీబీ‘ఐ’.. 175 మంది అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: మత్తుపదార్థాల(డ్రగ్స్) దందా నిర్వహిస్తున్న ముఠాలపై ఉక్కుపాదం మోపుతోంది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఇంటర్‌పోల్, రాష్ట్రాల పోలీసుల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టింది. అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు నెరుపుతూ దేశంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారిపై కేసులు, అరెస్టులు చేపట్టింది. ఆపరేషన్ గరుడలో భాగంగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 127 కేసులు నమోదు చేసి 175 మందిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ గరుడ ఏమిటి? అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు పెట్టుకుని డ్రగ్స్ దందా చేస్తున్న నెట్‌వర్క్‌లను నిరోధించేందుకు ఆపరేషన్ గరుడ పేరుతో పలు దఫాలుగా తనిఖీలు చేపట్టింది సీబీఐ. ఇంటర్‌పోల్ ద్వారా క్రిమినల్ ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించి డ్రగ్ ట్రాఫికింగ్లను గుర్తించేందుకు ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తోంది. ఇంటర్‌పోల్ ద్వారా అంతర్జాతీయ చట్టాల పరిధిలోనూ ఈ తనిఖీలు చేపట్టింది. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీబీఐ తెలిపింది. ఇంటర్‌పోల్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)ల సమన్వయంతో గ్లోబల్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ముఠాలతో లింక్స్ ఉన్న నెట్వర్క్లే లక్ష్యంగా ఈ ఆపరేషన్ గరుడ కొనసాగిస్తోంది సీబీఐ. దీని ద్వారా డ్రగ్స్ నిర్వహణ, సరఫరా, తయారీ జోన్స్, వారికి మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసు బలగాల సమన్వయంతో సమాచారం సేకరించి డ్రగ్స్ ముఠాలపై చర్యలు చేపట్టింది. 6600 అనుమానితులపై.. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ దాడులు నిర్వహించింది సీబీఐ. సుమారు 6600 అనుమానిత వ్యక్తులను తనిఖీ చేసింది. 127 కొత్త కేసులు నమోదు చేసి.. 175 మందిని అరెస్ట్ చేసింది. అందులో పరారీలో ఉన్న ఆరుగురు నిందితులు సైతం ఉన్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా 5.1 కిలోల హెరాయిన్, 33.4 కిలోల మరిజున, 3.29 కిలోల చరాస్, 1365 గ్రాముల మెఫెడ్రోన్, 33.8 గ్రాముల స్మాక్, బుప్రెనోర్ఫిన్కు చెందిన 87 సిరంజీలు, 122 ఇంజెక్షన్లు, 87 ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకుంది. అలాగే 946 అల్ప్రాజోలమ్ ట్యాబ్లెట్లు, 106 కిలోల ట్రామడోల్, 10 గ్రాముల హాష్ ఆయిల్, 0.9 గ్రాముల ఎక్స్టాసీ పిల్స్, 1.15 కిలోల ఓపియమ్, 30 కిలోల పప్పీ హక్, 1.43 కిలోల ఇటోక్సికాంట్ పౌండర్, 11039 పిల్, క్యాప్సల్స్ సీజ్ చేసింది. ఇదీ చదవండి: పెళ్లితో సంబంధం లేదు.. అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
మా ప్రభుత్వాన్ని కూల్చే యత్నం
న్యూఢిల్లీ: ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారంటూ ఆప్ సంచలన ఆరోపణలు చేసింది. ‘‘బీజేపీలో చేరాల్సిందిగా నలుగురు ఎమ్మెల్యేలు అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమనాథ్ భారతి, కుల్దీప్ కుమార్‌లను ఆ పార్టీ నేతలు ఒత్తిడి చేశారు. లేదంటే మనీశ్ సిసోడియా మాదిరిగా తప్పుడు కేసులు, సీబీఐ, ఈడీ దాడులు తప్పవంటూ బెదిరించారు. ఒక్కొక్కరికీ రూ.20 కోట్లు ఆఫర్ చేశారు. తమతో పాటు మరో ఎమ్మెల్యేను కూడా తీసుకొచ్చిన వారికి రూ.25 కోట్లు ఇస్తామన్నారు’’ అని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నయానో భయానో తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తుండటం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. మహారాష్ట్రలో శివసేనను చీల్చిన వ్యూహాన్నే తమ పార్టీపైనా ప్రయోగిస్తోందని ఆరోపించారు. ‘‘వాళ్ల ప్రలోభాలకు సిసోడియా లొంగకపోవడంతో ఇతర ఎమ్మెల్యేలపై పడ్డారు. కానీ వాళ్లంతా ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చారు. బెదిరింపులకు లొంగే, అమ్ముడుపోయే రకం కాదు’’ అన్నారు. ప్రాణాలైనా ఇస్తాం గానీ పార్టీకి ద్రోహం చేయబోమని సిసోడియా ట్వీట్ చేశారు. ‘‘మేమంతా కేజ్రీవాల్ సైనికులం. భగత్‌సింగ్ అనుయాయులం. మీ సీబీఐ, ఈడీ మమ్మల్నేమీ చేయలేవు’’ అన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయమంటూ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు ముగిసేదాకా తమపై సీబీఐ, ఈడీ దాడులు జరుగుతూనే ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ నివాసంలో ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. విపక్షాలను లేకుండా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ దుయ్యబట్టింది. శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరపాలని నిర్ణయించింది. ఈ ప్రశ్నలకు బదులివ్వండి: బీజేపీ ఆప్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. మద్యం పాలసీలో అవినీతి బట్టబయలు కావడంతో శిక్ష తప్పదనే అసహనంతోనే ఆ పార్టీ నేతలు ఇలాంటి తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత పాత్రా విమర్శించారు. వాళ్లకు దమ్ముంటే డబ్బులు ఆఫర్ చేసిన బీజేపీ నేతల పేర్లు చెప్పాలని సవాలు విసిరారు. ‘‘ఆప్‌కు భారీ కమీషన్లు ముట్టజెప్పిన వాళ్లకే కేజ్రీవాల్ సర్కారు మద్యం లైసెన్సులు కట్టబెట్టింది. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే. విచారణను తప్పించుకునేందుకు వ్యూహాత్మకంగా ఒక్క ఫైలుపై తన సంతకం లేకుండా జాగ్రత్త పడ్డారు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంపై తమ ప్రశ్నలకు బదులివ్వలేక ఆప్ ఇలా తప్పుడు ఆరోపణలకు దిగిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ఆరోపించారు. ‘నిపుణుల కమిటీ వద్దన్నా వినకుండా హోల్‌సేల్ మద్యం వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యక్తులపరం చేశారు. భారీగా లంచాలు తీసుకుని బ్లాక్ లిస్టెడ్ కంపెనీలకూ లైసెన్సులిచ్చారు’ అని అన్నారు. కేజ్రీవాల్ అండ్ కో నిజాయతీ, పారదర్శకతలకు పాతరేసి చూస్తుండగానే అవినీతిలో కూరుకుపోయిందంటూ కాంగ్రెస్ కూడా దుమ్మెత్తిపోసింది. -
కేంద్రం, ఆప్ కుస్తీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ఉదంతం కేంద్రానికి, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య మరోసారి చిచ్చు రాజేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దేశ రాజధానిలోని ఆప్ నేత, ఢిల్లీ విద్యా, ఎక్సైజ్ శాఖల మంత్రి మనీశ్ సిసోడియా నివాసంపై సీబీఐ శుక్రవారం దాడులు చేసింది. గురుగ్రాం, చండీగఢ్, ముంబై, హైదరాబాద్, లఖ్‌నవూ, బెంగళూరు... ఇలా దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 31 చోట్ల ఉదయం 8 గంటల నుంచి రాత్రి దాకా ఏకకాలంలో దాడులు చేసింది. మాజీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణతో పాటు పలువురు అధికారులు, వ్యాపారవేత్తలు, మద్యం వ్యాపారులు తదితరుల నివాసాల్లో సోదాలు చేసింది. రాత్రి 11 గంటల దాకా సిసోడియా నివాసంలో సోదాలు కొనసాగాయి. తన లాప్టాప్, ఫోన్ తీసుకెళ్లారని ఆయన మీడియాకు తెలిపారు. పలు పత్రాలు, డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ తెలిపింది. ఈ ఉదంతంపై బుధవారమే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సిసోడియా, నలుగురు ప్రభుత్వాధికారులతో పాటు మొత్తం 15 మందిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సీబీఐ అభియోగాలు మోపింది. ‘‘సిసోడియా తదితరులు నిబంధనలకు విరుద్ధంగా ఎక్సైజ్ పాలసీలో పలు మార్పులు చేశారు. తద్వారా లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి చేకూర్చారు. ఖజానాకు రూ.144.36 కోట్ల మేరకు నష్టం చేకూర్చారు. బదులుగా భారీగా ముడుపులు అందుకున్నారు’’ అని ఆరోపించిది. ఈ ఉదంతంపై ఆప్ మండిపడింది. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే దాడులు జరిగాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. విద్య, ఆరోగ్య రంగాల్లో ఢిల్లీ సర్కారుకు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వస్తుండటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. అందుకే ఢిల్లీ విద్యా విధానాన్ని ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజీలో కథనం ప్రచురించిన రోజే సీబీఐని ఉసిగొల్పారన్నారు. ‘‘స్వతంత్ర భారతదేశంలోనే అత్యుత్తమ విద్యా శాఖ మంత్రిపై కక్షపూరిత చర్యలకు దిగారు. సీబీఐకి మేం పూర్తిగా సహకరిస్తాం. మా మంత్రులపై గతంలో చేసిన దాడుల్లో తేలిందేమీ లేదు. ఇప్పుడూ తేలేదేమీ లేదు’’ అంటూ ట్వీట్ చేశారు. న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని జత చేశారు. ‘‘మంచి చేయబోయిన వారందరినీ 75 ఏళ్లుగా ఇలాగే వెనక్కు లాగుతున్నారు. ఇందుకే దేశం వెనకబడింది. ఎవరేం చేసినా ఢిల్లీలో మాత్రం అభివృద్ధి ఆగదు’’ అన్నారు. ఇలాంటి దాడులకు బెదిరేది లేదని సిసోడియా అన్నారు. ‘‘సీబీఐకి స్వాగతం. ఈ కుట్రలు నన్నేమీ చేయలేవు. నిజం నిలకడ మీద తేలుతుంది’’ అంటూ ట్వీట్ చేశారు. మోదీ సర్కారుకు దడ కేజ్రీవాల్‌కు, ఆయన ఢిల్లీ మోడల్ పాలనకు సర్వత్రా పెరుగుతున్న పాపులారిటీని చూసి మోదీ ప్రభుత్వం బెదిరిపోతోందని ఆప్ ఆరోపించింది. సిసోడియా ఇంట్లో సీబీఐకి జామెట్రీ బాక్సులు, పెన్సిళ్లు తప్ప మరేమీ దొరకవంటూ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా చెణుకులు విసిరారు. సిసోడియాను ఎలాగైనా కటకటాల్లోకి నెట్టాలని సీబీఐకి ఆదేశాలున్నాయని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ ఆరోపించారు. వీటిని బీజేపీ తిప్పికొట్టింది. ఎక్సైజ్ మంత్రి కాస్తా ఎక్స్క్యూజ్ మంత్రిగా మారారంటూ కేంద్ర సమాచార మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ను మే 30న ఈడీ అరెస్టు చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కస్టడీలో ఉన్నారు. ఏమిటీ కేసు? 2021 నవంబర్‌లో కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది. లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి కలిగేలా గోల్మాల్ చేశారంటూ ఆరోపణలొచ్చాయి. వీటికి సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలున్నట్టు ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదించారు. దాంతో సీబీఐ దర్యాప్తుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జూలైలో ఆదేశించారు. పలువురు అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త పాలసీని గత నెలలో ఢిల్లీ సర్కారు పక్కన పెట్టింది. ఎఫ్ఐఆర్లో ఏముందంటే... ► లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండానే లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి కలిగే పలు నిర్ణయాలను ఎక్సైజ్ మంత్రి సిసోడియా తీసుకున్నారు. ► కరోనాతో అమ్మకాలు తగ్గాయనే సాకుతో లైసెన్సు ఫీజులో ఏకంగా రూ.144.36 కోట్ల మేరకు రాయితీ ఇచ్చారు. ► లైసెన్స్ ఫీజు రాయితీ/తగ్గింపు, అనుమతి లేకుండానే ఎల్–1 లైసన్సు పొడిగింపు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ► ఈ గోల్‌మాల్‌లో విజయ్‌నాయర్, మనోజ్ రాయ్, పెర్నాడ్రిచర్డ్, అమన్‌దీప్ ధాల్, సమీర్ మహేంద్రు తదితర మద్యం లైసెన్సుదారులు, వ్యాపారుల పాత్ర ఉంది. ► వారి నుంచి సిసోడియా సన్నిహితులకు నుంచి కోట్లలో ముడుపులందాయి. మహేంద్రు వారికి రెండు విడతల్లో కోట్లు చెల్లించారు. ► సిసోడియాకు అతి సన్నిహితులైన అమిత్ అరోరా, దినేశ్ అరోరా, అర్జున్ పాండే వసూళ్లకు పాల్పడ్డారు. ► దినేశ్ అరోరాకు చెందిన రాధా అసోసియేట్స్ కు మహేంద్రు నుంచి రూ.కోటి అందింది. ► విజయ్ నాయర్ తరఫున మహేంద్రు నుంచి పాండే కూడా రూ.2 నుంచి 4 కోట్ల దాకా వసూలు చేశారు. ► మహేంద్రు నుంచి అరుణ్ రామచంద్ర పిళ్లై లంచాలు వసూలు చేసి నిబంధనల తారుమారుకు సాయపడ్డ ప్రభుత్వాధికారులకు ఇచ్చారు. హైదరాబాద్ వ్యాపారిపైనా.. సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసాలు, కార్యాలయాల్లోనూ సీబీఐ దాడులు చేసింది. హైదరాబాద్ కోకాపేటతో పాటు బెంగళూరులో ఉన్న ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు జరిపింది. అరుణ్ రామచంద్ర పిళ్లై బెంగళూరు కేంద్రంగా స్పిరిట్, డిస్టిలరీస్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఆయనపైనా ఆరోపణలున్నాయి. కాకరేపిన కథనం ఢిల్లీ విద్యా విధానాన్ని ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక గురువారం తన అంతర్జాతీయ ఎడిషన్‌లో మొదటి పేజీలో ప్రముఖంగా కథనం ప్రచురించింది. ‘‘ఆప్ పాలనలో ఢిల్లీ విద్యా విధానంలో సమూలమైన మౌలిక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. వాటిలో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు’’ అంటూ ప్రశంసించింది. ఇతర రాష్ట్రాలు కూడా ఢిల్లీ మోడల్ విద్యా విధానంపై దృష్టి పెట్టాయని పేర్కొంది. విద్యార్థినులతో సిసోడియా ఉన్న ఫొటోను కూడా ప్రచురించింది. ఆకస్మిక పర్యటనలు తదితరాల ద్వారా విద్యా మంత్రిగా ఆయన బాగా పని చేస్తున్నారని రాసింది. బీజేపీ, ఆప్ మాటల యుద్ధానికి ఈ కథనమే ప్రధాన ఆయుధంగా మారింది. అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కడాన్ని ఓర్వలేకే సిసోడియాపైకి మోదీ ఇలా సీబీఐని ఉసిగొల్పారని ఆప్ నేతలంతా ఆరోపించారు. ‘‘సిసోడియా ఫొటోను న్యూయార్క్ టైమ్స్ ఫస్ట్ పేజీలో వేసి మెచ్చుకుంది. కేంద్రం వెంటనే ఆయన ఇంటికి సీబీఐని పంపింది’’ అంటూ కేజ్రీవాల్ మండిపడ్డారు. మోదీ తీరు సిగ్గుచేటని ఆప్ నేత సంజయ్ సింగ్ అన్నారు. బీజీపీ మాత్రం ఇది కచ్చితంగా ఆప్ డబ్బులిచ్చి రాయించుకున్న కథనమేనంటూ ఎదురుదాడికి దిగింది. ప్రచారం కోసం ప్రజా ధనాన్ని వృథా చేస్తోందని ఆరోపించింది. ‘‘ఆప్ సర్కారు కీర్తి కండూతికి న్యూయార్క్ టైమ్స్ కథనమే తాజా ఉదాహరణ. ఈ కథనం అదే రోజు ఖలీజ్ టైమ్స్ అనే పత్రికలోనూ యథాతథంగా వచ్చింది’’ అంటూ బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. పెయిడ్ ఆర్టికల్ కాదు: న్యూయార్క్ టైమ్స్ పెయిడ్ ఆర్టికల్ ఆరోపణలను న్యూయార్క్ టైమ్స్ శుక్రవారం తీవ్రంగా ఖండించింది. అది తాము క్షేత్రస్థాయిలో పరిశోధించి పూర్తి నిష్పాక్షికంగా రాసిన కథనమని స్పష్టం చేసింది. ఇదే కథనాన్ని ఖలీజ్ టైమ్స్ వార్తా పత్రిక కూడా అదే రోజు యథాతథంగా ప్రచురించడంపై బీజేపీ లేవనెత్తిన అనుమానాలను కొట్టిపారేసింది. ‘‘మా లైసెన్సున్న పలు వార్తా సంస్థలు మా కథనాలను ప్రచురించుకోవడం మామూలే’’ అని పేర్కొంది. -
అక్కడ వారికి పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్‌లు మాత్రమే దొరుకుతాయి!
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంపై సీబీఐ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. గతంలో కూడా ఇలాంటి దాడులే జరిగాయని, ఏమి కనగొనలేకపోయారని అన్నారు. అమెరికా ప్రసిద్ధ వార్త పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఆయన పనితీరుని ప్రశంసించి ఫ్రంట్ పేజీలో ప్రచురిస్తే... కేంద్ర ప్రభుత్వం సీబీఐ దాడులు నిర్వహిస్తుందని పెద్ద ఎత్తున్న ఆరోపణలు చేశారు. అయినా మనీష్ సిసోడియా ఇంట్లో కేవలం పుస్తకాలు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు మాత్రేమ కనిపిస్తాయని ఆప్ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు సుమారు వంద మందికి పైగా ఆప్ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని, ప్రతికేసులో ఒక్కొక్కరిగా తాము కేసు నుంచి బయటపడ్డామని రాఘవా అన్నారు. ఐతే సీబీఐ విద్య, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా తొమ్మిది నెలలుగా అమలు చేసిన కొత్త మద్యం పాలసీపై విచారణ జరుపుతోంది. ఢిల్లీలో కేంద్ర ప్రతినిధిగా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా మద్యం విక్రయించడానికి ఎవరికి అనుమతి ఇవ్వాలనే దానిపై సిసోడియా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారని సీబీఐ పేర్కొంది. అంతేకాదు లైసెన్సులతో మధ్యం విక్రయించుకునేలా ప్రైవేట్ వ్యక్తులకే అధిక సంఖ్యలో కట్టబెట్టేందుకు చూసిందని సీబీఐ ఆరోపిస్తోంది. ఐతే అవినీతిని అరికట్టేందుకు, శక్తివంతమైన మద్యం మాఫియాపై పోరాడేందుకు ఈ విధానాన్ని ఉద్దేశించినట్లు సిసోడియా చెబుతుండటం గమనార్హం. (చదవండి: సీబీఐ దాడుల మధ్య కేజ్రీవాల్ ‘మిస్డ్ కాల్’ క్యాంపెయిన్) -
ఎన్నికలొస్తున్నాయిగా..మీకోసమే ఐయామ్.. వెయిటింగ్
‘బీజేపీ.. అచ్చంగా కాంగ్రెస్ బాటలోనే నడుస్తోంది. అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ ఎవరినైనా భయపెట్టాలనుకుంటే వారిపైకి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ప్రయోగించేది. ఈ రోజు బీజేపీ అదే చేస్తోంది’ లక్నో/రాయ్‌బరేలి: ఎన్నికలు సమీపించగానే.. రాజకీయ ప్రత్యర్థులపైకి బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఆదాయ పన్ను శాఖ (ఐటీ)ను ఉసిగొల్పుతుందని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో శనివారం అఖిలేశ్ సన్నిహితులు ముగ్గురిపై ఐటీ దాడులు జరిగాయి. దీనిపై ఎస్పీ చీఫ్ స్పందిస్తూ... ‘నేను ముందు నుంచీ చెబుతున్నాను. ఎన్నికలు దగ్గరపడగానే.. ప్రత్యర్థులపై కేంద్ర ఏజెన్సీల దాడులు మొదలవుతాయని. ఇప్పుడు ఐటీ వాళ్లొచ్చారు. తర్వాత సీబీఐ, ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్)లు రంగంలోకి దిగుతాయి. వారి రాకకోసం ఎదురుచూస్తున్నా. వాళ్లు ఏంచేసినా సైకిల్ (ఎస్పీ ఎన్నికల చిహ్నం) ఆగదు... ఇదే వేగంతో ముందుకెళతాం. రథయాత్ర, పార్టీ తీసుకున్న ఇతర కార్యక్రమాలు యథాప్రకారం కొనసాగుతాయి. యూపీలో బీజేపీకి భంగపాటు తప్పదు. ఇలాంటి వాటితో రాష్ట్ర ప్రజలను మాయ చేయలేరు. రాజీవ్ రాయ్‌పై ఇవే ఐటీ దాడులు నెల కిందట ఎందుకు జరగలేదు. ఇప్పుడెందుకు జరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి. బీజేపీకి ఓటమి భయం పెరిగేకొద్దీ ఈ దాడులూ పెరుగుతాయి’ అని కాషాయదళంపై ధ్వజమెత్తారు. రాజీవ్ రాయ్ ఎస్పీ జాతీయ కార్యదర్శి, అధికార ప్రతినిధి. కర్ణాటకలో పలు విద్యాసంస్థలను నడిపే గ్రూపునకు యజమాని. అఖిలేశ్ వ్యక్తిగత కార్యదర్శి జ్ఞానేంద్ర యాదవ్, ఎస్పీకి కంచుకోట నిలుస్తున్న మెయిన్‌పూరికి చెందిన వ్యాపారవేత్త (ఆర్సీఎల్ గ్రూపు యజమాని), అఖిలేశ్‌కు సన్నిహితుడైన మనోజ్ యాదవ్‌లపై కూడా శనివారం ఐటీ దాడులు జరిగాయి. రెండూ ఒకటే.. లఖీంపూర్ ఖేరిలో రైతులపై హింసాకాండను జలియన్‌వాలా భాగ్ ఊచకోతతో పోల్చారు అఖిలేశ్. ‘జలియన్‌వాలా భాగ్‌లో బ్రిటిషర్లు ప్రజలను ముందు నుంచి కాల్చారు.. లఖీంపూర్‌లో బీజేపీ నేతలు వెనకనుంచి రైతులపైకి జీపును తోలార’ని రాయ్‌బరేలీలో రథయాత్ర సందర్భంగా విలేకరులతో అన్నారు. -
కోస్టల్ ప్రాజెక్ట్స్ సురేంద్రపై సీబీఐ కొరడా
సాక్షి, అమరావతి: బ్యాంకులను బురిడీ కొట్టించి వేల కోట్లు కొల్లగొట్టిన మరో బడా సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థ కొరడా ఝుళిపించింది. పవర్ ప్రాజెక్టులు, మినీ డ్యామ్‌లు, వాటర్ సప్లయి స్కీమ్స్, రహదారులు వంటి నిర్మాణాలు చేపట్టే ప్రముఖ సంస్థ అయిన కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌పై సీబీఐ దాడులు నిర్వహించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కన్సార్టియం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీబీఐ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సోదాలు జరిపింది. ప్రధానంగా విజయవాడ, హైదరాబాద్‌లలో శనివారం, ఆదివారం దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు, పలు ముఖ్యమైన ఆధారాలు సేకరించింది. వివరాలివీ.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ కేంద్రంగా ఉన్న కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ.. ఎస్బీఐ నేతృత్వంలోని ఐడీబీఐ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూబీఐ, ఎగ్జిమ్ బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.4,736.57 కోట్లు రుణం తీసుకుంది. వీటిని తిరిగి చెల్లించకుండా అవకతవకలకు పాల్పడింది. ఈ సంస్థ కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరుల సహకారంతో పథకం ప్రకారం బ్యాంకుల కన్సార్టియంను మోసం చేసింది. 2013 అక్టోబర్ 28 నుంచి అక్రమాలకు తెరలేపింది. 2013–18 మధ్య కాలంలో తప్పుడు లెక్కలు, నకిలీ పత్రాలు, ఫేక్ ఖాతాలతో మోసాలకు పాల్పడడమే కాక తీసుకున్న రుణాలను తప్పుడు మార్గంలో ఇతర ఖాతాలకు మళ్లించిందని సీబీఐ తెలిపింది. కాగా, సంస్థ చైర్మన్ సబ్బినేని సురేంద్రతోపాటు మేనేజింగ్ డైరెక్టర్ హరిహరరావు, డైరెక్టర్లు శ్రీధర్ చంద్రశేఖరన్, శరద్ తదితరులపై కేసు నమోదు చేశారు. -
బొగ్గు కుంభకోణంలో సీబీఐ దాడులు
సాక్షి, హైదరాబాద్: నాగ్‌పూర్‌లో వెలుగుచూసిన బొగ్గు కుంభకోణానికి సంబంధించి సికింద్రాబాద్‌లో సీబీఐ దాడులు నిర్వహించింది. ఎస్డీ రోడ్‌లోని సూర్యలక్ష్మి కాటన్ మిల్స్ ప్రధాన కార్యాలయంలో, నాగ్‌పూర్‌లోని రాంతెక్ శాఖ కార్యాలయంలో సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సూర్యలక్ష్మి కాటన్ మిల్స్ (ఎస్‌సీఎమ్‌ఎల్)యార్న్, డెనిమ్ వస్త్రాలను ఉత్పత్తి చేస్తుంది. ఎస్‌సీఎమ్‌ఎల్ నాగ్‌పూర్‌లోని రాంతెక్ కాటన్ మిల్లు కోసం 2008లో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది. 2014 వరకు 4,968 టన్నుల బొగ్గును సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ముగియగానే 2014 సెప్టెంబర్‌లో మరోసారి వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్‌తో 1,13,000 మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా కోసం ఒప్పందం చేసుకుంది. సూర్యలక్ష్మి కంపెనీకి ఈ సమయంలో తాము సరఫరా చేసిన బొగ్గును బహిరంగ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్నారని వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ అంతర్గత విచారణలో తేలింది. ఈ మేరకు ఎస్‌సీఎమ్‌ఎల్ కంపెనీ, చైర్మన్ ఎల్.ఎన్ అగర్వాల్, ఎండీ పరితోష్ అగర్వాల్, గుర్తు తెలియని వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ ఉద్యోగులపై సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. ఈ కంపెనీలో తెలంగాణకు చెందిన ఓ మాజీ ఎంపీ, ఆంధ్రాకు చెందిన ఓ మాజీ ఎంపీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉండటం గమనార్హం. -
పోంజి స్కామ్.. కర్ణాటకలో సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లోని పలువు రు సీనియర్ అధికారుల నివాసాలు, కార్యాల యాలపై సీబీఐ శుక్రవారం దాడులు నిర్వహించింది. ఐఎమ్ఏ (ఐ–మానిటరీ అడ్వైజరీ) పోంజి స్కామ్‌తో సంబంధం ఉన్న అధికారుల ఇళ్లపై సోదాలు జరిపింది. బెంగళూరులోని 11 ప్రాంతాలు, మాండ్య, రామనగరా, బెల్గాంలలో ఒక్కో ప్రాంతంతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సోదాలు నిర్వహించింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్లో ఎకనామిక్స్ అఫెన్సెస్ విభాగం ఐజీ హేమంత్ నింబాల్కర్, డీఎస్పీ ఈబీ శ్రీధర, ఈస్ట్ బెంగళూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజయ్ హిలోరీ సహా పలువురు అధికారుల నివాసాలపై సీబీఐ శుక్రవారం సోదాలు జరిపింది. -
టీడీపీ ఎమ్మెల్సీ ఇంట్లో సీబీఐ సోదాలు
-
ఎమ్మెల్సీ వాకాటి ఇంట్లో సీబీఐ సోదాలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంట్లో బుధవారం బెంగళూరుకు చెందిన సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో దాదాపు నాలుగు గంటలకుపైగా సీబీఐ అధికారులతో పాటు బ్యాంకు అధికారులూ సోదాల్లో పాల్గొన్నారు. ఇప్పటికే ఆర్థిక నేరారోపణల నేపథ్యంలో ఆయనను సీబీఐ అధికారులు గతేడాది జనవరి 21న అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి బెంగళూరు జైలులో ఆయన రిమాండ్‌లో ఉన్నారు. కర్ణాటక హైకోర్టులో పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలుచేయగా.. బెయిల్ మంజూరుకు కోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న దీనిపై సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున బెంగళూరు సీబీఐ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు నెల్లూరుకు చేరుకున్నారు. వాకాటి పీఏ రామకృష్ణకు ఫోన్ చేయగా.. తాను తిరుపతిలో ఉన్నానని చెప్పడంతో అధికారులు ఇద్దరు బ్యాంకు ప్రతినిధులను వెంటబెట్టుకుని వాకాటి గృహానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని బెంగళూరుకు వెళ్లిపోయారు. వివరాలు చెప్పేందుకు వారు నిరాకరించారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన వాకాటì.. వీఎన్ఆర్ ఇన్ఫ్రా, వీఎన్ఆర్ రైల్, లాజిస్టిక్స్ తదితర కంపెనీలు నిర్వహిస్తున్నారు. 2014లో హైదరాబాద్ షామీర్పేటలోని రూ.12 కోట్ల విలువైన భవనానికి నకిలీ డాక్యుమెంట్ల ద్వారా విలువ పెంచి రూ.250 కోట్ల రుణం కోరుతూ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్సీఐ)కు దరఖాస్తు చేసుకోగా.. రూ.190 కోట్ల రుణం మంజూరు చేసింది. అసలు, వడ్డీ చెల్లించకపోవడంతో వాకాటి ఆస్తుల జప్తుపై ఫైనాన్స్ కార్పొరేషన్ దృష్టి సారించిన క్రమంలో డాక్యుమెంట్లు నకిలీవని తేలింది. దీంతో 2017 మే 5న కార్పొరేషన్ ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. 2017 మే 12న నెల్లూరు నగరంతో పాటు హైదరాబాద్, బెంగళూరులోని ఆయన కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించి 99 కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. -
జైసింగ్ దంపతుల ఇళ్లపై సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: ప్రముఖ సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ ఇందిరా జైసింగ్, ఆమె భర్త ఆనంద్ గ్రోవర్‌లపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) దాడులు నిర్వహించింది. విదేశీ నిధుల చట్టం నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి. గురువారం తెల్లవారుజామున 5గంటలకు ఢిల్లీలోని ఇందిరా జైసింగ్ ఇల్లు, జంగ్‌పురాలో లాయర్స్ కలెక్టివ్ స్వచ్ఛంద సంస్థ ఆఫీస్, ముంబైలోని మరో ఆఫీస్‌లో దాడులు నిర్వహించినట్లు సీబీఐ ప్రకటించింది. ఆనంద్ గ్రోవర్ తన ఆధ్వర్యంలో నడుస్తోన్న లాయర్స్ కలెక్టివ్ స్వచ్ఛంద సంస్థకు వచ్చిన విదేశీ విరాళాలను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. 2006 నుంచి 2014 మధ్య ఆనంద్ గ్రోవర్ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా రూ.32.39 కోట్లకుపైగా అవకతవకలకు పాల్పడ్డారని హోం శాఖ ఫిర్యాదిచ్చింది. దీంతో సంస్థ అధ్యక్షుడు గ్రోవర్‌పై విదేశీ సహకార నియంత్రణ చట్టాన్ని(ఎఫ్సీఆర్ఎ) ఉల్లంఘించారన్న ఆరోపణల కింద సీబీఐ కేసు నమోదు చేసింది. దీనిలో భాగంగానే గురువారం సోదాలు నిర్వహించింది. ఫిర్యాదులో ఇందిరను నిందితురాలిగా పేర్కొనలేదు. 2009–14లో అదనపు సొలిసిటర్ జనరల్‌గా ఇందిర పనిచేశారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ ఇందిర, గ్రోవర్, లాయర్స్ కలెక్టివ్ తరఫున ఓ ప్రకటన వెలువడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఓ మాజీ ఉద్యోగి చేసిన లైంగిక ఆరోపణల కేసును ఇందిర వాదిస్తుండడంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని సంయుక్త ప్రకటన పేర్కొంది. ఖండించిన రాజకీయ పార్టీలు.. సీబీఐ దాడులు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. సీబీఐ దాడులను టీఎంసీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎంలకు చెందిన ఎంపీలు మూకుమ్మడిగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను పూర్తిస్థాయిలో దుర్వినియోగం చేస్తోందన్నారు. ఈ మేరకు వారంతా ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. -
దేశవ్యాప్తంగా 110 ప్రాంతాల్లో సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: సీబీఐ అధికారులు మంగళవారం రికార్డు స్థాయిలో సోదాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌సహా దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 110 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను ప్రధాని మోదీ హయాంలో అవినీతిపై చేపట్టిన అతిపెద్ద చర్యగా భావిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న రూ.250 కోట్ల స్కాలర్ షిప్ కుంభకోణానికి సంబంధించి పలు విద్యా సంస్థలపై దాడులు జరిపింది. అదేవిధంగా, యూపీలో రద్దయిన నోట్ల చెలామణీ ఆరోపణలపై నాలుగుచోట్ల సోదాలు జరిపింది. రూర్కెలాలోని బోకారో స్టీల్ ప్లాంట్‌లో అవినీతి కేసులో రాంచీ, బొకారో, కోల్‌కతాలోని అధికారుల ఇళ్లపై దాడులు చేసింది. ఈ సందర్భంగా సీబీఐ.. అవినీతి, నేర పూరిత ప్రవర్తన, ఆయుధాల స్మగ్లింగ్ తదితర నేరాలకు సంబంధించి 30 కేసులు నమోదు చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఆయుధాల లైసెన్స్ జారీలో అక్రమాలకు సంబంధించి 13 చోట్ల సోదాలు చేశామని సీబీఐ తెలిపింది. మంగళవారం ఉదయం ఏకకాలంలో ప్రారంభమైన ఈ సోదాల్లో 500 మంది అధికారులు పాల్గొన్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా నగదు, నగలతోపాటు పలు బ్యాంకు పత్రాలు, స్థిరాస్తులు, మ్యూచువల్ ఫండ్స్ పత్రాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. రూ.1,139 కోట్ల బ్యాంకింగ్ కుంభకోణానికి సంబంధించి సీబీఐ గత వారం 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50 చోట్ల తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. -
బయటపడ్డ బొల్లినేని శ్రీనివాస్ అక్రమాస్తులు
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ సీనియర్ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్ కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్నా ఆరోపణలతో అధికారులు తొలుత ఆయనపై కేసు నమోదు చేసి.. దాడులు చేపట్టారు. రూ. 200 కోట్లు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని ఆయనపై అభియోగాలు మోపబడ్డాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన శ్రీనివాస్.. పదేళ్లకు పైగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లో పనిచేసిన అనుభవం ఉంది. ప్రసుత్తం ఆయన జీఎస్టీ సీనియర్ అధికారిగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన వద్ద నాలుగు కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. గాంధీతో పాటు ఆయన భార్య బొల్లినేని శిరీషపై కూడా కేసు నమోదు చేశారు. రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరీకి సంబంధించిన కేసును విచారణ చేసిన గాంధీ.. చంద్రబాబు సూచనల మేరకు పలు ఫైళ్లల్లో మార్పులు చేసినట్టు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆయనపై ఈడీ, కేంద్ర ఆర్థిక శాఖ, పీఎంవో కార్యాలయం నుంచి అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సీబీఐ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. గతంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం నుంచి బదిలీ అయినా.. అనధికారికంగా నెలరోజుల పాటు విధుల్లో కొనసాగారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో అనేక మంది టీడీపీ నేతలకు అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకోడానికి సహకరించినట్లు ఆయనపై అభియోగాలు మోపబడ్డాయి. భారీగా అక్రమాస్తుల గుర్తింపు.. ఆయనపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఐపీసీ సెక్షన్ 109,13(2),13(1బీ) ప్రకారం అధికారులు కేసు నమోదు చేశారు. హోదాను అడ్డుపెట్టుకుని అక్రమాస్తులు సంపాదించినట్లు విచారణలో తెలుస్తోంది. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌లో భారీగా ఆస్తులు ఉన్నట్లు తెలుసింది. అధికారులు ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల వివరాలు... కంకిపాడులో మూడు స్థలాలు, ప్రొద్దుటూరులో ఇళ్లు, కానూరులో 360 గజాల స్థలం, రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్‌లో 300 గజాల స్థలం, మరో రెండు స్థలాలు, మదీనా గూడలో పది కుంటలు, విజయవాడ కంకిపాడులో 43 సెంట్లు, తుళ్లూరులో 42 సెంట్ల స్థలం, కంకిపాడులో 2.96 సెంట్ల స్థలం, బ్యాంకు ఖాతాలో భారీగా నగదును గుర్తించారు. కూకట్పల్లి యాక్సిస్ బ్యాంక్ అకౌంట్లో రూ.20 లక్షలు, బంధువులు నరసింహారావు,శ్రీలత ఖాతాలో పదిలక్షల నగదు, కుంటుబ సభ్యులపై ఫిక్సడ్ డిపాజిట్లు చేసినట్లు తెలిసింది. సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 1992లో విధుల్లో చేరిన గాంధీ.. 2002లో సూపరింటెండెండ్‌గా ప్రమోషన్ రావడంతో హైదరాబాద్ కమిషనరేట్‌లో చేరారు. 2003లో డీఆర్ఐలో చేరారు. 2004 నుంచి 2017 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో పని చేశారు. ప్రసుత్తం ఆయన జీఎస్టీ సీనియర్ అధికారిగా కొనసాగుతున్నారు. -
షెల్ కంపెనీలపై ఆరా?...
-
రెండో రోజూ ‘సుజనా’పై సీబీఐ దాడులు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిపై సీబీఐ దాడులు రెండోరోజు ఆదివారం కూడా కొనసాగాయి. శనివారం దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో 12 చోట్ల దాడులు నిర్వహించి పలు కీలక పత్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం రాత్రి సీబీఐ అధికారులు సీజ్ చేసిన నాగార్జున హిల్స్‌లోని సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కార్యాలయంతోపాటు, సుజనా నివాసంలో ఆదివారం కూడా సోదాలు కొనసాగాయి. ముందురోజు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల తాలూకు వివరాలపై కంపెనీలోని పలువురు డైరెక్టర్లను ప్రశ్నించినట్లు తెలిసింది. ఆదివారం తనిఖీల్లో బ్యాంకింగ్ ఫ్రాడ్ సెల్ టీం సభ్యులు కూడా పాల్గొన్నారు. బెంగళూరు, ఢిల్లీ నుంచి వచ్చిన దాదాపు 30 మందికిపైగా అధికారులు ఈ సోదాల్లో పాల్`గొన్నారు. షెల్ కంపెనీలపై ఆరా?... సుజనా గ్రూపునకు చెందిన షెల్ కంపెనీలపై సీబీఐ ఆరా తీసినట్లు తెలిసింది. బెస్ట్ క్రాంప్ట్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీఈపీఎల్) కంపెనీ, సుజనా గ్రూప్‌నకు చెందింది. దీన్ని సుజనా చౌదరి సీబీఐ మాజీ చీఫ్ విజయరామారావు కుమారుడితో కలసి ఏర్పాటు చేశారు. 2010 నుంచి 2013 మధ్య బ్యాంకుల కన్సార్టియం నుంచి దాదాపుగా రూ.315 కోట్ల మేర రుణం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మొత్తంలో ఆంధ్రాబ్యాంకు రూ.71 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు రూ.120 కోట్లు, సెంట్రల్ బ్యాంకు రూ.124 కోట్ల చొప్పున రుణాలు మంజూరు చేశాయి. గంగాస్టీల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ లిమిటెడ్, తేజస్విని ఇంజనీరింగ్ లిమిటెడ్, ఫ్యూచర్‌టెక్ ఇండస్ట్రీస్ కంపెనీల పేర ఈ రుణాలు తీసుకున్నట్లు సమాచారం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి అయితే, వాటి నుంచి వివిధ డొల్ల కంపెనీలకు రుణాలు మళ్లించినట్లు గుర్తించిన సీబీఐ వాటి చిరునామాలపై ఆరా తీసిందని తెలిసింది. వాటి యజమానులు, చిరునామాలు, ఆఫీసు కార్యాలయాలు ఎక్కడున్నాయి? అన్న సమాచారం కోసం ప్రయత్నించినట్లు సమాచారం. ఆంధ్రాబ్యాంకు తమకు రావాల్సిన రూ.71 కోట్ల కేసులో చేసిన ఫిర్యాదు ఆధారంగా తాజాగా దాడులు జరిగాయి. ఇదే వ్యవహారంలో మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై ఏప్రిల్‌లో దాడులు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ.315 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. -
చైన్నైలో పలు ప్రాంతాల్లో సీబీఐ దాడులు
-
డీకే ఆప్తుల ఇళ్లపై సీబీఐ దాడులు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ సన్నిహితుల ఇళ్లు, ఆఫీసులపై గురువారం సీబీఐ దాడులు చేపట్టింది. బెంగళూరు, రామనగర ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో అక్రమంగా నోట్లను మార్చినట్లు డీకేపై ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. 2016 నవంబర్ 14న కొందరు రూ.10 లక్షల పాత నోట్లను అక్రమంగా రామనగరలోని కార్పొరేషన్ బ్యాంకులో మార్చారని సీబీఐ ఆరోపిస్తోంది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను చూపించకుండా కొత్త రూ.2 వేలు, రూ.500 నోట్లను డీకే సోదరుల ఆప్తులు మార్చుకున్నట్లు 2017లో కేసు దాఖలైంది. దీనిపై కోర్టు వారెంటుతో వచ్చిన సీబీఐ అధికారులు డీకే సోదరుల సన్నిహితులైన శివానంద, నంజప్ప, పద్మనాభయ్యల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. సీబీఐ సోదాలపై ఎమ్మెల్యే డీకే శివకుమార్ మాట్లాడుతూ ఇలాంటి వాటికి భయపడనన్నారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసి లొంగదీసుకోవాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని, ఎవరూ ఎక్కువ కాలం అధికారంలో ఉండబోరని చెప్పారు. -
మన్మోహన్ మౌనాన్ని ప్రశ్నించిన రాజా
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో అప్పటి టెలికం పాలసీని సమర్థించకుండా మాజీ ప్రధాని మన్మోహన్ ఉద్దేశపూర్వక మౌనం వహించడాన్ని టెలికం మాజీ మంత్రి ఏ.రాజా ప్రశ్నించారు. 2జీ కుంభకోణం వాస్తవాల పేరిట ఆయన రాసిన పుసక్తం ‘2జీ సాగా అన్పోల్డ్స్’లో పలు కీలక విషయాల్ని ప్రస్తావించారు. కేసు విచారణ సమయంలో రాసిన ఈ పుసక్తంలో అప్పటి కాగ్ వినోద్ రాయ్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఈ పుసక్తం విడుదల కావాల్సి ఉంది. స్పెక్ట్రం కేటాయింపులపై సీబీఐ దాడులకు సంబంధించి మన్మోహన్‌కు కూడా ఎలాంటి సమాచారం లేదని రాజా తెలిపారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం వినోద్ రాయ్‌తో రాజీపడి పనిచేసిందని, స్పెక్ట్రం కేటాయింపుల ఖాతాల తనిఖీ సందర్భంగా వేరే ఉద్దేశాలు పెట్టుకుని రాజ్యాంగ విధుల నిర్వహణలో రాయ్ అతిగా వ్యవహరించారని రాజా ఆరోపించారు. కొత్త వారికి లైసెన్స్‌లివ్వడం టెలికం లాబీలకు ఇష్టం లేదని తెలిపారు. -
వాకాటి నారాయణరెడ్డి వాకింట్లో సీబీఐ దాడులు
-
టీడీపీ ఎమ్మెల్సీ ఇంటిపై సీబీఐ దాడులు
శుక్రవారం తెల్లవారుజాము నుంచి రాత్రి 9 గంటలదాకా కొనసాగిన సోదాలు.. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి నివాసంపై సీబీఐ అధికారుల బృందం దాడులు జరిపింది. శుక్రవారం తెల్లవారు జామున నెల్లూరు వేదాయపాలెంలోని వాకాటి ఇంటికి చేరుకున్న ఈ బృందం అప్పటినుంచి రాత్రి 9 గంటల వరకు సోదాలు నిర్వహించింది. బ్యాంకులను మోసం చేసిన కేసుకు సంబం ధించి సీబీఐ ఈ దాడులు జరిపింది. ఈ సందర్భంగా పలు పత్రాలను స్వాధీనం చేసు కుంది. 99 అగ్రిమెంట్ దస్తావేజులు ఇందులో ఉన్నట్టు సమాచారం. సోదాల నేపథ్యంలో సీబీఐ అధికారుల బృందం వాకాటిని ప్రశ్నిం చింది.మరోవైపు వాకాటికి చెందిన హైదరాబాద్‌లోని వీఎన్ఆర్ ఇన్ఫ్రా కార్యాలయంలోనూ సీబీఐ అధికారుల బృందం సోదాలు జరిపింది. నెల్లూరులోని వాకాటి నివాసంలో రాత్రి 9 గంటలకు సోదాలు ముగిశాయి. ఈ దాడులపై వివరణ కోరేందుకు మీడియా ప్రయత్నించగా.. వివరాలు చెప్పేందుకు సీబీఐ అధికారులు నిరాకరించారు. వ్యాపారాల్లో సహజమే..:వాకాటి సీబీఐ దాడుల అనంతరం వాకాటి విలేకరుల తో మాట్లాడుతూ.. వ్యాపార లావాదేవీలు, బ్యాంకు అగ్రిమెంట్లకు సంబంధించిన విచార ణ నిమిత్తం సీబీఐ అధికారులు వచ్చారని తెలిపారు. అనేక అంశాలపై తన నుంచి వివరణ తీసుకున్నారని చెప్పారు. వ్యాపారాల్లో ఇదంతా సహజమేనని, దానిపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఆయన ముక్తాయించారు. పూర్వాపరాలివీ..: వీఎన్ఆర్ ఇన్ఫ్రా, పవర్‌టెక్ లాజిస్టిక్స్ సంస్థల పేరుతో నారా యణరెడ్డి నిర్మాణ రంగం, ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. 2014లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీ న్ బ్యాంకుల నుంచి ఆయన రూ.443.27 కోట్ల మేర రుణాలు తీసుకు న్నారు. బకాయి పడిన మొత్తం వడ్డీతో సహా చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని ఇటీవల బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి.దీంతో వాకాటిపైన చీటింగ్‌తో పాటు పలు కేసులు నమోదయ్యా యి. మరో వైపు నకిలీ డాక్యుమెంట్లతో వాకాటి తమ నుంచి రూ.190 కోట్ల రుణం తీసుకు న్నారని ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. -
'నా ఇంట్లో సీబీఐ దాడులు చేస్తే.. మప్లర్లే దొరుకుతాయి'
న్యూఢిల్లీ: సీబీఐ అధికారులు తన నివాసంలో సోదాలు చేస్తే.. మఫ్లర్లు మాత్రమే దొరుకుతాయని ఆమ్ఆద్మీపార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. సీబీఐ అధికారులతో దాడులు చేయించిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహారం కంటితడుపు చర్యగా ఆయన పేర్కొన్నారు. ఈ నెల 15న ఢిల్లీలో సీఎం కార్యాలయంపై సీబీఐ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల రవాణశాఖలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసిన విషయంపై ఆయన ఆదివారం మాట్లాడారు. ఈ కేసులపై విచారించాల్సిందిగా సీబీఐ అధికారులకు ఢిల్లీ ప్రభుత్వం సూచిస్తుందని కేజ్రీవాల్ అన్నారు. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి 'మప్లర్' ధరించి వెళ్లిన కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిరోహించారు. -
కేజ్రీవాల్ దుమారం
అరుణ్ జైట్లీ తప్పుకో: పార్లమెంటులో కాంగ్రెస్, ఆప్, టీఎంసీ డిమాండ్ న్యూఢిల్లీ: ఢిల్లీలో సీఎం కార్యాలయంపై సీబీఐ దాడుల దుమారం గురువారమూ కొనసాగింది. డీడీసీఏ ఫైలు కోసమే ఢిల్లీ సీఎంవోపై సీబీఐ దాడులు జరిగాయని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. కాగా, డీడీసీఏలో నిధుల అవకతవకల కేసులో జైట్లీ రాజీనామా చేయాలంటూ.. ఆప్, కాంగ్రెస్ పార్లమెంటులో నిరసన చేపట్టాయి. ఈ కేసులో అవినీతి జరిగినట్లు ఢిల్లీ ప్రభుత్వం గుర్తించినందున జైట్లీ పదవినుంచి తప్పుకోవాలని డిమాండ్‌చేశాయి. డీడీసీఏ వివాదంలో విచారణకోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆప్ కూడా పార్లమెంటు లోపలా బయటా మోదీ సర్కారుపై విమర్శలు చేసింది. అటు, తృణమూల్ కాంగ్రెస్.. ఆప్ ఆందోళనకు మద్దతు పలికింది. మోదీ పాలనతో సీబీఐ, జీబీఐ (గుజరాత్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)గా మారిందని టీఎంసీ పక్షనేత సుదీప్ బందోపాధ్యాయ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా టీఎంసీ సభనుంచి వాకౌట్ చేసింది. అయితే సీబీఐ.. ఢిల్లీ సీఎంవో దాడి చేయలేదని మంత్రి వెంకయ్య తెలిపారు. ‘ఏ ముఖ్యమంత్రైనా నోటికి వచ్చినట్లు మాట్లాడతారా? ఆయన (కేజ్రీవాల్) రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు’ అన్నారు. అయితే.. విపక్షాలు లేవనెత్తుతున్న అస్పష్టమైన అంశాలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని.. అవినీతి చర్చను పక్కదారి పట్టించేందుకే ఆప్, కాంగ్రెస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని జైట్లీ అన్నారు. గురువారం కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్‌ను సీబీఐ 9 గంటలపాటు ప్రశ్నించింది. డీడీసీఏ ఫైలు కోసమే..: కేజ్రీవాల్ డీడీసీఏ కేసుతోపాటు ఢిల్లీ కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన పలు ఫైళ్లనూ అధికారులు సీజ్ చేశారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సీఎంవోపై సీబీఐ దాడులు జరగలేదని వ్యాఖ్యానించిన జైట్లీ పార్లమెంటును తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ‘ నా కార్యాలయంలో సీబీఐ అధికారులు డీడీసీఏ ఫైలును చదివారు. నేను మీడియాలో ఈ విషయం చెప్పటంతో.. ఆ ఫైలును అక్కడే వదిలేశారు’ అని కేజ్రీవాల్ ఆరోపించారు. జైట్లీ ఆర్థిక మంత్రి సీట్లో ఉంటే నిష్పాక్షిక విచారణ జరగదని అందుకే ఆయన పదవినుంచి తప్పుకోవాలన్నారు. ఆప్ ఎంపీకి నీళ్లిచ్చిన ప్రధాని జైట్లీ రాజీనామా చేయాలంటూ లోక్‌సభ వెల్‌లో ఆందోళన చేస్తున్న సమయంలో ఆప్ ఎంపీ భగవంత్ మన్కు నిరసం వచ్చింది. ఈ సమయంలో ఆయన నీళ్ల కోసం లోక్‌సభ సెక్రటేరియట్ అధికారుల బెంచీలపై నీటికోసం చూశారు. దీన్ని గుర్తించిన ప్రధాని మోదీ.. చిరునవ్వుతో తన టేబుల్‌పై ఉన్న నీటిని ఆప్ ఎంపీకి ఇచ్చారు. నీళ్లు తాగిన ఎంపీ.. చిరునవ్వుతో ఆ గ్లాసును టేబుల్‌పై పెట్టి ప్రధాని ముఖంలోకి చూస్తూ నవ్వారు. ఆ తర్వాత ఎంపీ వెల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేశారు. -
హిమాచల్ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు
* తన కుమార్తె వివాహం కోసం ఆలయానికి వెళ్లిన వీరభద్రసింగ్ * తర్వాత కొద్ది నిమిషాలకే అధికారిక నివాసం సహా 12 చోట్ల తనిఖీలు * ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలతో కేసు నమోదు సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ నివాసంపై శనివారం ఉదయం సీబీఐ దాడులు చేసింది. తన రెండో కుమార్తె వివాహం కోసం వీరభద్రసింగ్ సిమ్లాలోని ఓ గుడికి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఈ తనిఖీలు జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఆయన ఇంటితోపాటు బంధువులు, స్నేహితులకు చెందిన 12 చోట్ల అధికారులు దాడులు చేశారు. హిమాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర మంత్రులంతా ఉమ్మడి ప్రకటన జారీ చేసిన మరునాడే... సీఎం వీరభద్రసింగ్‌పై సీబీఐ దాడులు జరగడం గమనార్హం. 2009-11 మధ్యలో కేంద్రంలోని యూపీఏ కేబినెట్లో కేంద్ర ఉక్కు మంత్రిగా పనిచేసినప్పుడు వీరభద్రసింగ్ ఆదాయానికి మించి రూ. 6.1 కోట్ల ఆస్తులు కూడబెట్టారని... ఈ సొమ్మును కుటుంబ సభ్యుల పేరిట ఎల్ఐసీ పాలసీలలో మదుపు చేశారని ఆరోపణలున్నాయి. దీనిపై ప్రాథమిక విచారణ నివేదిక నమోదు చేసిన సీబీఐ... కొద్దిరోజుల కిందే దానిని అవినీతి నిరోధక చట్టం కింద కేసుగా మార్చింది. వీరభద్రతోపాటు ఆయన భార్య ప్రతిభ, మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి.. శనివారం దాడులు చేసింది. ఉదయం 7.30 సమయంలో తన రెండో కుమార్తె పెళ్లి నిమిత్తం వీరభద్ర సిమ్లాలోని సంకట్ మోచన్ ఆలయానికి బయలుదేరారు. కొద్దిసేపటికే సీఎం అధికారిక నివాసంపై 18 మంది సీబీఐ అధికారుల బృందం దాడులు చేసింది. దీంతో పాటు మరో రెండు ఇళ్లు, ఢిల్లీలోని అధికారిక నివాసం, ఫామ్‌హౌజ్‌పై, ఆయన స్నేహితులు ఆనంద్ చౌహాన్, చున్నిలాల్‌లకు చెందిన ఐదు నివాసాల్లో తనిఖీలు చేశారు. అయితే వివాహం అనంతరం వీరభద్రసింగ్ కుటుంబం 11గంటలకు నివాసానికి తిరిగి వచ్చింది. కాగా, మోదీ ప్రభుత్వం సీబీఐని ఉపయోగించి విపక్షాలపై కక్ష సాధిస్తోందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అధికార దుర్వినియోగానికి పాల్పడిన వీరభద్రసింగ్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.