'నా ఇంట్లో సీబీఐ దాడులు చేస్తే.. మప్లర్లే దొరుకుతాయి' | If CBI Raids My House It Will Only Find Unaccounted Mufflers: Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

'నా ఇంట్లో సీబీఐ దాడులు చేస్తే.. మప్లర్లే దొరుకుతాయి'

Published Sun, Dec 27 2015 6:20 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

'నా ఇంట్లో సీబీఐ దాడులు చేస్తే.. మప్లర్లే దొరుకుతాయి' - Sakshi

'నా ఇంట్లో సీబీఐ దాడులు చేస్తే.. మప్లర్లే దొరుకుతాయి'

న్యూఢిల్లీ: సీబీఐ అధికారులు తన నివాసంలో సోదాలు చేస్తే.. మఫ్లర్లు మాత్రమే దొరుకుతాయని ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. సీబీఐ అధికారులతో దాడులు చేయించిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహారం కంటితడుపు చర్యగా ఆయన పేర్కొన్నారు. ఈ నెల 15న ఢిల్లీలో సీఎం కార్యాలయంపై సీబీఐ దాడులు చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవల రవాణశాఖలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ ముగ్గురు అధికారులను సస్పెండ్‌ చేసిన విషయంపై ఆయన ఆదివారం మాట్లాడారు. ఈ కేసులపై విచారించాల్సిందిగా సీబీఐ అధికారులకు ఢిల్లీ ప్రభుత్వం సూచిస్తుందని కేజ్రీవాల్‌ అన్నారు. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి 'మప్లర్‌' ధరించి వెళ్లిన కేజ్రీవాల్‌ ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిరోహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement