Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Amritsar Blackout: Pakistan Violates Ceasefire Again1
మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్‌

పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌, పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లాలో దూసుకొచ్చిన పాకిస్థాన్‌ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. జమ్మూ, రాజస్థాన్‌, పంజాబ్‌లోని పలు జిల్లాల్లో అధికారులు బ్లాక్అవుట్‌ అమలు చేస్తున్నారు.ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత పాకిస్థాన్‌ రెచ్చిపోయింది. వాస్తవాధీన రేఖ వెంట పాక్‌ కాల్పులకు తెగబడింది. డ్రోన్లను భారత్‌ ఎయిర్‌ డిఫెన్స్‌‌ సిస్టమ్‌ పేల్చివేసింది. హోషియార్‌పూర్‌లో సైరన్లు మోగాయి. సాంబా, ఆర్నియాలో డ్రోన్‌ కదలికలను గుర్తించారు. #WATCH | J&K: Red streaks seen and explosions heard as India's air defence intercepts Pakistani drones amid blackout in Samba.(Visuals deferred by unspecified time) pic.twitter.com/EyiBfKg6hs— ANI (@ANI) May 12, 2025

Operation Sindoor: Live Updates as PM Modi to Address the Nation at 8 PM2
ఉగ్రవాదం,వాణిజ్యం కలిసి సాగలేవు: పీఎం మోదీ

ఢిల్లీ : ‘మా తల్లుల నుదుటున సిందూరం చెరిపేస్తే ఏం జరుగుతుందో చేసి చూపించాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై తొలిసారి ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం 8గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. మోదీ తన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కౌంటర్‌ ఇచ్చారు. ఉగ్రవాదం,వాణిజ్యం కలిసి సాగలేవు’ అని స్పష్టం చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌లో మన బలగాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయి.భారత సైన్యానికి,సైంటిస్టులకు నా సెల్యూట్‌. పహల్గాంలో ఉగ్రవాదుల అరాచకం ప్రపంచాన్ని కలిచి వేసింది. పహల్గాం ఘటన నన్ను వ్యక్తి గతం కలిచివేసింది. మా తల్లుల నుదుటున సిందూరం చెరిపేస్తే ఏం జరుగుతుందో చేసి చూపించాం.ఉగ్రవాదులు కలలో కూడా దాడిని ఊహించి ఉండరుపహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకుల్నిటార్గెట్‌ చేశారు. ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేసేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం.ఆపరేషన్‌ సిందూర్‌ అంటే పేరు కాదు, ఆవేదన. ఆపరేషన్‌ సిందూర్‌ అంటే ప్రతిజ్ఞ. ఏడో తేదీన తెల్లవారున ఈ ప్రతిజ్ఞ నెరవేరడం ప్రపంచమంతా చూసింది. పహల్గాం ఘటన తర్వాత దేశం మొత్తం ఒక్కటైంది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టింది. వందమంది కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపాంభారత సైన్యం ఉగ్రవాదుల ట్రైనింగ్‌ సెంటర్లను ధ్వంసం చేసింది. భారత డ్రోన్లు ఉగ్రవాదుల స్థావరాల్ని మట్టిలో కలిపేశాయి. వందమంది కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపాం. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని పెంచిపోషించింది. ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బకు పాక్‌ బెంబేలెత్తిపోయింది. పాక్‌ గుండెలపై భారత సైన్యం దాడి చేసింది. భయంతో,రక్షణ కోసం పాకిస్తాన్‌ ప్రపంచ దేశాలను ఆశ్రయించిందిపాక్‌ శరణు గోరిందిఈ నెల 10 భారత్‌ డీజీఎంవోను పాక్‌ శరణు గోరింది. మరోసారి ఉగ్రవాద చర్యలకు పాల్పడబోమని,సైన్యంపై కాల్పులు జరపొద్దని ప్రాధేయపడింది. 3రోజుల్లో పాక్‌పై ఊహకందని విధంగా దాడి చేశాం. ఎడారి,కొండలు,ఆకాశంలో పాక్‌ను వదిలిపెట్టలేదు. యుద్ధరంగంలో ప్రతిసారి పాక్‌ను మట్టి కరిపించాం. ఇప్పుడు ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌ను ఓడించాం.ఆపరేషన్‌ సిందూర్‌ను నిలిపివేశాంఅణ్వాయుధాల బ్లాక్‌ మెయిల్‌ను ఇక సహించేది లేదు. పాక్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది.. అదే ఉగ్రవాదం చేతిలో అంతమవుతుంది. ఈ యుద్ధంలో మేకిన్‌ ఇండియా ఆయుధాలు బాగా పనిచేశాయి. చనిపోయిన ఉగ్రవాదుల్ని చూసి పాక్‌ ఆర్మీ ఆఫీసర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీన్ని బట్టి పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్‌ ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారని అర్ధమవుతుంది. ఆపరేషన్‌ సిందూర్‌ను నిలిపివేశాం. భవిష్యత్‌లో పాక్‌ చర్యను బట్టి భారత్‌ అదే స్థాయిలో స్పందిస్తోంది.నీరు,రక్తం కలిసి పారలేవు ఉగ్రవాదం,వాణిజ్యం కలిసి సాగలేవు. నీరు,రక్తం కలిసి పారలేవు. పాక్‌తో చర్చించాల్సింది పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పైనే. మన ఐక్యతే.. మన శక్తి.ఈ రోజు బుద్ధపూర్ణిమ. బుద్ధుడు మనకు శాంతి మార్గాన్ని చూపాడు.అదే మనకు ఆదర్శం అంటూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. ఆపరేషన్‌ సిందూర్‌ను పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత్‌ -పాకిస్తాన్‌ల మధ్య మూడురోజుల పాటు భీకర కాల్పులు జరిపాయి. భారత్‌ జరిపిన భీకర దాడులకు పాకిస్తాన్‌ తోక ముడిచింది. కాల్పులు జరపొద్దంటూ భారత్‌ను ప్రాధేయపడింది. కాల్పుల విరమణతో ఇరుదేశాల మధ్య దాడులు ఆగిపోయాయి. Prime Minister Narendra Modi will address the nation at around 8 PM today. pic.twitter.com/NobQiY66Nh— ANI (@ANI) May 12, 2025ఆపరేషన్‌ సిందూర్‌ జరుగుతున్న సమయంలో ప్రధాని మోదీ వరుస సమావేశాలు నిర్వహించారు. రక్షణ శాఖ,విదేశాంగ శాఖ, త్రివిధ దళాదిపతులతో ఆపరేషన్‌ సిందూర్‌ గురించి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

Sakshi Guest Column On Chandrababu Govt In Andhra Pradesh3
ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే...

ఈ ఏడాది ఉగాది నుంచి ‘స్వర్ణాంధ్ర–2047’ విజన్‌లో భాగంగా రాష్ట్రంలోని అత్యంత నిరుపేదలను ఆదుకోవడానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ‘ప్రభుత్వ–ప్రైవేటు–ప్రజల భాగ స్వామ్యం’ (పీ4). మరింత వివరంగా చెప్పాలంటే, అత్యంత పేదరికం (జీరో పావర్టీ)తో మగ్గిపోతున్న 20 శాతం కుటుంబాలను అత్యున్నత స్థాయిలో ఆర్థికంగా నిలదొక్కుకున్న 10 శాతం మంది మార్గదర్శకులు పేదరికం నుండి విముక్తి చేసే బాధ్యతను చేపట్టాలని చంద్రబాబు నిర్దేశి స్తున్నారు. ఈ పథకంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించటం సాధ్యమేనా? 1991 తర్వాత దేశంలో ప్రవేశపెట్టబడిన సరళీకృత ఆర్థిక విధానాలు ఏ వర్గాలకు ఉపయోగపడ్డాయి? ఈ విధానాలు ఆశ్రిత పెట్టు బడిదారీ వర్గం పెరగడానికి తోడ్పడ్డాయి. కనుకనే జాతీయ ఆర్థిక అభివృద్ధి పెరిగినట్లు కనిపిస్తోంది కానీ పేదరికం తగ్గలేదు. ఫలితంగా భారత దేశం ఆకలి సూచీలో 150వ స్థానానికి దిగజారింది. ఈ అసలు వాస్తవా లను మరుగుపరిచి చంద్రబాబు ‘పీ4’ పథకంతో పేదరికాన్ని నిర్మూలి స్తానని చెప్పటం వృథా ప్రయాస.వాస్తవానికి ఈ పీ4 విధానం చంద్ర బాబు కొత్తగా కనిపెట్టినది ఏమీ కాదు! ఏనాడో గాంధీ ప్రబోధించిన ధర్మకర్తృత్వ సిద్ధాంతంలో భాగంగా వచ్చినదే. 2013లో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే నూతన ఆర్థిక సంస్కరణల అమలులో భాగంగా కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సి బిలిటీ (సీఎస్‌ఆర్‌) పథకాన్ని చట్టం రూపంలోకి తీసుకొచ్చారు. కార్పొరేట్‌ సంస్థలు రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టులు చేపట్టినా, పెట్టు బడులు పెట్టినా ఓ ప్రాంతాన్ని లేదా మండలాన్ని లేదా గ్రామాన్ని దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అభివృద్ధి చేయడమే కాదు, ప్రజలను కూడా పేదరికం నుంచి గట్టెక్కించాలి. సింపుల్‌గా ఇదే పీ4 కాన్సెప్ట్‌. టాటాలు మొదలుకొని మైక్రోసాఫ్ట్‌ అధినేతల వరకు అనేక ట్రస్టుల పేరులతో కొన్ని వేల కోట్ల రూపాయల వరకు వివిధ రూపాలలో సామా జిక అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. అయినా దేశ సామాజిక చిత్రంలో మౌలిక మార్పులు జరిగాయా! లేకపోగా దేశ సామాజిక చిత్రపటం మరింతగా మసకబారి పోయింది. ఈ వాస్తవాల నేపథ్యంలో చూసిన ప్పుడు పీ4 పథకంతో పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యమేనా? అసలు పీ4 పథకంలో ప్రకటించిన మార్గదర్శకులు ఎవరు? నూతన ఆర్థిక విధానాలలో భాగమైన ప్రైవేటీకరణకు పుట్టిన బిడ్డలే కదా! సహ జంగా ఈ సమాజంలో నెలకొన్న జీవ కారుణ్య సిద్ధాంతాలలో భాగంగా ధనవంతులు పేదవారికి సహాయం చేస్తున్నారు. కానీ చంద్రబాబు అమలు చేస్తున్న ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా లాభం పొందిన పెట్టుబడిదారులకు ‘మార్గదర్శకులు’ అని పేరు పెట్టడం అన్యాయం. వివిధ రాయితీల రూపంలో ప్రజల ఆస్తులను చౌకగా కట్టబెట్టిన పెట్టు బడిదారుల చేత సహాయం చేయించి, పేదరికాన్ని నిర్మూలించాలను కోవడం ఎవరి ప్రయోజనాలను కాపాడటం కోసం? సామాజిక వ్యవస్థలో నానాటికీ పెరుగుతున్న ఆర్థిక అసమానతల ఫలితంగా ఉద్య మాలవైపు ఆకర్షితులవుతున్న ప్రజల్ని పేదరిక నిర్మూలన జరుగుతుందనే ఊహాజనిత భ్రమల్లో ముంచడానికి ప్రపంచ బ్యాంకు నిర్దేశిత పథకాల్లో ఒకటైన పీ4 పథకాన్ని ప్రజలపై ప్రయోగించటానికి పూనుకున్నారు చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ పథకాన్ని కొత్తరూపంలో ప్రవేశపెట్టిందే పీ4 పథకం! ఉత్పత్తి సాధనాలపై ప్రజల యాజమాన్యంలో భాగంగా ‘దున్నే వానికే భూమి’, అటవీ ప్రాంతాల్లో అపారంగా ఉన్న ఖనిజ వనరులపై ఆదివాసులకు పూర్తి హక్కులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పటం, ప్రైవేటీకరణ విధానా లను విడనాడి ప్రభుత్వ రంగంలో అన్ని రంగాల పరిశ్రమలనూ నెలకొల్పడం లాంటి విధానపరమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాల బాట పడుతున్న ప్రజల్ని ఉద్య మాల బాట వైపు వెళ్లకుండా నిరోధించటా నికి, అంతిమంగా ప్రజలు తమ పట్ల విధేయ తాభావంతో ఉండి తమను నాలుగు కాలాల పాటు అధికారంలో కొనసాగేలా, తమను ప్రజల పాలిట ధర్మ ప్రభువులుగా పొగిడేలా చేసుకోవడానికి ఈ పథకం ప్రవేశపెట్టారన్నది అసలు రహస్యం. ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి, ప్రజల ఓట్లను కొల్ల గొట్టడానికి ఆచరణ సాధ్యం కానీ ‘సూపర్‌ సిక్స్‌’ హామీలు ఇచ్చి, ఆ పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చటంలో తమ ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై విసురుతున్న ‘పీ4’ లాంటి మాయా పథకాలను ఈ దృక్కోణంతోనే చూడాలి. ప్రజలను ఆ భ్రమల్లో పడనీయకుండా చైతన్య పరుస్తూ, ప్రజా పోరాటాలను ఉద్ధృతం చేయాలి! – ముప్పాళ్ళ భార్గవ శ్రీసీపీఐ ఎంఎల్‌ నాయకులు ‘ 98481 20105

Sakshi Guest Column On India Pakistan Issues4
ముక్కలు చేయడమే మార్గం!

క్రమం తప్పకుండా జరుగుతున్న భారీ ఉగ్ర వాద దాడులు భారత్, పాకిస్తాన్‌ సంబంధాలను ఘోరంగా దెబ్బతీశాయి. సాధారణంగా, ప్రతి పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ పదవీకాలంలో కనీసం ఒక్కసారైనా ఇలాంటి దాడులు జరుగుతాయి. ఎక్కువకాలం సైనిక నాయకత్వ స్థానంలో ఉన్న వ్యక్తి, పౌర అధికారంపై మరింతగా నియంత్రణ సాధించాల్సిన అవసరం ఉందని భావించినప్పుడు లేదా అతని బలగాలు దేశంలో గౌరవాన్ని కోల్పోతున్నప్పుడు ఉగ్రవాద దాడులు చోటు చేసుకుంటాయి. భారతదేశం నుండి సైనిక ముప్పు ఉందన్న ప్రచారం కంటే పాకిస్తాన్‌ ప్రజలను మరేదీ కలిపి ఉంచదు. పైగా వరదలు, కరవులు, ఉగ్రవాద ఘటనలతో సహా పాకిస్తాన్‌ లో జరిగే ప్రతిదానికీ భారతదేశంపైనే నిందలు మోపుతూ వస్తారు.భారతదేశం మన పాకిస్తాన్‌ను నాలుగు ముక్కలు చేయాలని చూస్తోందనీ, దాన్ని రక్షించే ఏౖకైక శక్తి పాక్‌ సైన్యమే అనీ పాక్‌ ప్రజలకు తొలి నుంచీ నేర్పించారు. భారత్‌ సహన పరిమితిని దాటిన ప్రతి ఉగ్రవాద ఘటన తర్వాత, పాకిస్తాన్‌ సాధారణ వ్యాఖ్యలను పునరావృతం చేస్తుంటుంది. వారి మంత్రులు దీనిని భారతదేశం ప్రారంభించిన ‘తప్పుడు’ ఆపరేషన్‌ అని, లేదంటే ఇది కశ్మీర్‌ ‘స్వాతంత్య్ర సమరయోధుల’ పని అని గావుకేకలు పెడతారు. తమ గడ్డపైనే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నామనే ఆరోపణను వారు నిరంతరం తిరస్కరిస్తారు. పైగా ఉగ్రవాదానికి అత్యంత ప్రభావి తమైన దేశం తమదే అని వాపోతుంటారు. అయితే దాదాపు ప్రతి ప్రపంచ స్థాయి ఉగ్రవాద ఘటనకూ పాకిస్తాన్‌తో సంబంధం ఉందనీ, ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాదులలో అత్యధికులు పాక్‌లోనే ఆశ్రయం పొందారనీ ప్రపంచానికి తెలుసు.ఎన్నని సహిస్తాం?కథ పునరావృతమవుతుంది. పైగా విసుగు పుట్టిస్తుంది. బహిరంగ అంతర్జాతీయ దర్యాప్తునకు పాక్‌ వైపు నుంచి ఎప్పుడూ హామీ ఉంటుంది, కానీ ఈ ప్రతిపాదనను ఎవరూ నమ్మరు. ముంబై ఉగ్ర దాడి సూత్రధారులలో ఒకరైన తహవ్వుర్‌ రానాను అమెరికా ఇటీవలే భారతదేశానికి అప్పగించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా ముంబై ఉగ్రవాద దాడులపై ఇంకా దర్యాప్తు చేయవలసి వస్తోంది. ఉగ్రవాద నాయకులపై పాకిస్తాన్‌ ఎప్పటికీ చర్య తీసు కోదు. ఎందుకంటే వారే పాక్‌ ప్రధాన ఆస్తులు. పహల్‌గామ్‌ ఉగ్ర దాడిపై దర్యాప్తు కూడా దశాబ్దాలుగా నిగూఢంగా ఉండిపోతుంది. దావూద్‌ ఇబ్రహీమ్‌ ఉనికిని అది ఎల్లప్పుడూ ఖండిస్తూ వచ్చింది. అయినప్పటికీ ప్రతి ప్రపంచ సంస్థకూ పాకిస్తాన్‌ లో అతని బహుళ నివాసాల గురించి తెలుసు. దీనికి విరుద్ధంగా, ప్రతీకారం తీర్చు కుంటామని ఇండియా బెదిరిస్తే, వారు అకస్మాత్తుగా తమ భూ భాగంపై ఉగ్రవాద కార్యకలాపాలలో భారతదేశ ప్రమేయం ఉందని ఇష్టారాజ్యంగా అబద్ధాలాడతారు.ప్రజల మద్దతు పొందాలనే ఆశతో, సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడంపై భారతదేశాన్ని పాక్‌ బెదిరించడం ప్రారంభించింది. దాని ఆనకట్టలు భారతీయ రక్తంతో నిండిపోతా యని రెచ్చ గొట్టేంత వరకు వెళ్ళింది. చరిత్ర గమనిస్తే, భారత ప్రభు త్వాలు రావల్పిండిని నియంత్రించడంపై ప్రపంచ మద్దతు కోరుతూ పాకిస్తాన్‌ ఉగ్రవాద దాడులపై తీవ్ర విమర్శ చేస్తూ వచ్చాయి. కానీ అది ఎప్పుడూ పని చేయలేదు. దీనికి విరుద్ధంగా, తరచుగా విరామాలతో కూడిన ఉగ్రవాద దాడులకు పాక్‌ తలుపులు తీసింది. 2001 అక్టోబర్‌లో జమ్మూ–కశ్మీర్‌ శాసనసభపై దాడి, ఆ తర్వాత అదే సంవత్సరం డిసెంబర్‌లో పార్లమెంటుపై దాడి, 2002 సెప్టెంబర్‌లో అక్షరధామ్‌పై దాడి, 2003 ఆగస్టులో ముంబై బాంబు దాడులు, ఆ తర్వాత 2005 అక్టోబర్‌లో ఢిల్లీలో బహుళ బాంబు దాడులు, 2006 జూలైలో ముంబై రైలు దాడులు, 2008 నవంబర్‌లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి కొన్ని ఉదాహరణలు. బాలాకోట్‌పై జరిగిన దాడి తర్వాత మాత్రమే భారత్‌ సందేశం అంతటా వినిపించింది. కానీ సరిహద్దులు దాటి భారత్‌ చేసిన బాలాకోట్‌ సర్జికల్‌ దాడి కూడా పాకిస్తాన్‌ను నిరోధించడంలో విఫలమైంది. ఎందుకంటే భారత్‌ దాడిలో సంభవించిన ప్రాణనష్టాన్ని పాక్‌ దాచగలిగింది. కారణం... హతమార్చబడిన వారు ఉగ్రవాదులు!పెద్ద మార్పు ఉండదు!సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసిన ప్రభావం ఇస్లామాబాద్‌కు బాగా తెలుసు. వారి నాయకత్వాన్ని అది భయ పెట్టింది. కానీ, ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని చెప్పడం తప్ప వారికి వేరే పరిష్కారం లేదు. భారతదేశం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని వారు ఇక ఒప్పించలేరు. రెండు దేశాల మధ్య సంబంధాలు శాంతియుతంగా ఉండాలనే ముందస్తు షరతు పైనే ఈ ఒప్పందంపై సంతకం చేశారనేది వాస్తవం. మరోవైపున అఫ్గానిస్తాన్‌కు భారతదేశం సన్నిహితం కావడం పాకిస్తాన్‌లో ఆందోళనలను మరింత పెంచింది. ముఖ్యంగా పాకిస్తాన్‌ తన బలగాలను భారత సరిహద్దుకు తరలించినప్పుడల్లా బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ, తెహ్రీక్‌ ఎ తాలిబన్‌ పాకిస్తాన్‌ ఈ అంతరాన్ని బాగా ఉపయోగించు కుంటాయి. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంట పాకి స్తాన్‌ తన సైన్యాన్ని మోహరించి ఉంచినంత కాలం, వారి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే భారత్‌ ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే, అది ఏ సైనిక చర్య తీసుకున్నా, పెద్దగా మార్పు ఉండదు. పాక్‌లో కొత్త ఆర్మీ చీఫ్‌ వచ్చి తనవంతుగా ఏదైనా చేయాలని భావించే వరకు, పాకిస్తాన్‌ ఉగ్రవాదానికి తక్కువ స్థాయిలో మద్దతు ఇస్తూనే ఉంటుంది. తర్వాత, మరొక ఘటన జరుగుతుంది. కథ పునరావృతమవుతూ ఉంటుంది. పాకిస్తాన్‌ ప్రాయోజిత ఉగ్రవాదం నుండి భారతదేశాన్ని రక్షించడానికి ఏకైక పరిష్కారం దాని బాల్కనైజేషన్‌ మాత్రమే (అంటే ఒక దేశం లేదా ప్రాంతాన్ని బహుళ చిన్న, శత్రు యూనిట్లుగా విభజించే ప్రక్రియ). దీని కోసం, పాకిస్తాన్‌ నుండి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సమూహాలకు భారతదేశం తన మద్దతును ఇవ్వాలి.హర్ష కక్కడ్‌ వ్యాసకర్త భారత సైన్యంలో రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌(‘ద స్టేట్స్‌మన్‌’ సౌజన్యంతో)

Sakshi Editorial On PM Narendra Modi Comments about Pakistan5
దృఢనిశ్చయం

ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి శషభిషలూ లేకుండా కుండబద్దలు కొట్టారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వాణిజ్యం అంటే కుదరదని, ఉగ్రవాదానికి ఊతమిస్తూ నీళ్లు కావాలంటే చెల్లదని, ఉగ్రవాదానికి అండదండలందిస్తూ చర్చలంటే అంగీకరించబోమని, అణు బెదిరింపులు తమను భయపెట్టలేవని మోదీ పంపిన సందేశంతోనైనా పాకిస్తాన్‌ ఇకపై బుద్ధెరిగి ప్రవర్తించాలి. జాతినుద్దేశించి సోమవారం ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతమూ కశ్మీర్‌ విషయంలో పాక్‌ తీరుతెన్నులపై భారత్‌ వైఖరిలో వచ్చిన మార్పునకు అద్దం పట్టింది. ఒక కొత్త క్రమం బయల్దేరిందన్న సంకేతాన్నిచ్చింది. ఇకపై ఉగ్రవాదులనూ, వారికి సాయం చేసే ప్రభుత్వాన్నీ వేర్వేరుగా పరిగణించబోమని ఆయన ప్రకటించటం ఒక్క పాకిస్తాన్‌ మాత్రమే కాదు...ప్రపంచ దేశాలన్నీ గమనించాల్సిన అత్యంత కీలక అంశం. కాల్పుల విరమణ తాత్కాలిక దశేనని, ఉగ్రవాదం శిరసెత్తినప్పుడల్లా ‘ఆపరే షన్‌ సిందూర్‌’ కొనసాగుతూనే వుంటుందని మోదీ చెప్పటం గమనార్హం. ఉగ్రవాదం విషయంలో అమెరికా నిర్లిప్తంగా ఉంటున్నది. 2001లో తమ దేశంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ‘ఉగ్ర వాదంపై యుద్ధం’ పేరిట ప్రపంచంలో ఎక్కడున్నా ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని ప్రక టించిన అమెరికా... కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌ను ఎప్పటికప్పుడు వెనకేసు కొస్తోంది. మొన్నటికి మొన్న పాక్‌కు ఐఎంఎఫ్‌ అప్పు పుట్టడంలో యథోచితంగా సహకరించింది. దాని చీకటి వ్యవహారాలు తెలియనట్టే ప్రవర్తిస్తూ ఎప్పటికప్పుడు నిధులూ, ఆయుధాలూ ఉదారంగా అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొనసాగుతుందని మోదీ ప్రకటించాల్సి వచ్చింది. దారుణ ఉదంతాలు జరిగినప్పుడల్లా ఏదో కారణం చూపి పాకిస్తాన్‌ను గట్టెక్కి స్తున్న దేశాలు ఇకముందు దీన్ని గమనించుకోక తప్పదు. ఎంతటి క్లిష్టసమయాల్లోనైనా పట్టువిడుపులు ప్రదర్శించటంలోనే పరిణతి వ్యక్తమవుతుంది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో పాకిస్తాన్‌లోని ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేయటంలోనూ, అక్కడి సైన్యం ప్రతిఘటనను తిప్పికొట్టడంలోనూ తెగువనూ, సాహసాన్నీ చూపిన భారత్‌... లక్ష్యసాధన పూర్తికాగానే కాల్పుల విరమణకు కూడా సిద్ధపడి తన పరిణతిని తెలియజెప్పింది. కానీ విఫల రాజ్యం అనే పేరును సార్థకం చేసుకుంటూ కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్టే ఒప్పుకుని ఆ వెంటనే ఉల్లంఘించి పాక్‌ తన నైజాన్ని చాటుకుంది. ఆ దేశంలో రాజకీయ నాయకత్వానికీ, సైన్యానికీ ఎప్పుడూ సరైన సంబంధాలు ఉండవన్నది ప్రపంచానికి తెలిసిన సత్యం. కానీ సైనిక దళాలు సైతం ముఠాలుగా చీలివున్నాయని, వాటిపై ఎవరికీ అదుపులేదని తాజా పరిణామాలు నిరూపించాయి. ఈ నిజాన్ని గ్రహించకుండా, పాకిస్తాన్‌కు చీవాట్లు పెట్టకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అణు యుద్ధాన్ని నివారించామని స్వోత్కర్షకు పోవటం... భారత్, పాక్‌లను ఒకే గాటన కట్టడం ఆశ్చర్య కరం. పాకిస్తాన్‌ చర్యల పర్యవసానం తమ వరకూ రానేరాదన్న భ్రమేదో ఆయనకున్నట్టుంది. కానీ ఉగ్రవాదాన్ని దుంపనాశనం చేయకపోతే అది ఏ దేశాన్నీ విడవకుండా మింగేస్తుందని ట్రంప్‌ గ్రహించటం అవసరం. ఉగ్రముఠాలను ప్రోత్సహించి ఊచకోతలను సాగిస్తున్న దేశాన్ని ఎవరైనా ఎలా ఉపేక్షించగలరు? దాని దగ్గర అణ్వాయుధాలున్నాయనీ, అది ముప్పు కలిగిస్తుందనీ... కనుక నోర్మూసుకు పడివుండాలనీ ట్రంప్‌ చెప్పదల్చుకున్నారా? వాణిజ్యాన్ని ఆపేస్తానని బెదిరించటంవల్ల రెండు దేశాలూ దారికొచ్చి కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని ఆయన అనటం కూడా అత్యంత అభ్యంతరకరమైంది. ఇలాంటి తర్కంతో ప్రోత్సహిస్తున్నదెవరినో గమనించుకుంటున్నారా? తాను ప్రపంచ దేశాలతో అధిక సుంకాల పేరిట యుద్ధం సాగిస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్‌ను నియంత్రించటం లేదు. అక్కడి మారణకాండను ఆపటం లేదు. మరి భారత్‌–పాక్‌ విషయంలో ఇంత ఆత్రుత దేనికో? ఎవరూ కోరకుండానే కశ్మీర్‌ సమస్యలో వేలెడతానని ఆయన తనకు తానుగా ఎలా చెప్పుకుంటారు? 2019లో సైతం ట్రంప్‌ ఇవే తరహా మాటలు మాట్లాడారు. ఆ తర్వాత జ్ఞానో దయమై ఆ సమస్యను రెండు దేశాలూ చర్చించి పరిష్కరించుకుంటాయని స్వరం మార్చారు. మళ్లీ ఇప్పుడేమైంది? తాజా ఘర్షణలకు మూలం ఎక్కడున్నదో ఆయన గ్రహించలేకపోయారని ట్రంప్‌ మాటలు గమనిస్తే తెలుస్తుంది. పహల్గామ్‌లో 26మంది పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ని ప్రారంభించింది. పాక్‌లోని 24చోట్ల ఉగ్రముఠాల స్థావ రాలను ధ్వంసం చేసింది. వందమంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. కశ్మీర్‌లో ఉగ్రవాదులు చేసిన దాడికిది ప్రతీకారమే తప్ప కశ్మీర్‌ సమస్య పరిష్కారాన్ని ఉద్దేశించి మొదలెట్టిన దాడులు కాదు. అమెరికాకు చిత్తశుద్ధి ఉంటే ఉగ్రవాదులకు ప్రోత్సాహం అందించినంతకాలమూ తమ వైపుగా ఎలాంటి సాయమూ అందబోదని పాకిస్తాన్‌కు చెప్పాలి. ఆ దేశంతో సంబంధ బాంధవ్యాలు కొన సాగించే దేశాలపై కూడా ఆంక్షలుంటాయని ప్రకటించాలి. కానీ అందుకు విరుద్ధంగా ఆ దేశం కారణంగా నష్టపోతున్న భారత్‌నూ, దాన్నీ ఒకే గాటన కట్టడం ఎలాంటి సందేశం పంపుతుంది? ఇరు దేశాల మధ్యా చర్చలంటూ ఉంటే అది కేవలం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పైనా, ఉగ్రవాదుల అప్పగింతపైనా మాత్రమే ఉంటాయని తన సందేశంలో మోదీ చెప్పటం ప్రశంసించదగ్గది. అమెరికా పోకడలు గమనిస్తే వర్తమాన ప్రపంచంలో ఎలాంటి న్యాయం అమలవుతున్నదో స్పష్టంగానే అర్థమవుతుంది. దశాబ్దాలుగా చీకాకు పెడుతున్న ఉగ్రవాద సమస్యపై మోదీ దృఢ నిశ్చయాన్ని ప్రకటించటం ఈ తరహా న్యాయాన్ని ప్రశ్నించటమే!

Donald Trump Comments On India-Pakistan Nuclear Conflict6
భారత్‌-పాక్‌ మధ్య అణుయుద్ధాన్ని నేనే ఆపా: ట్రంప్‌

వాషింగ్టన్‌: భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య అణు యుద్ధాన్ని నేనే ఆపా. అణుయుద్ధం జరిగి ఉంటే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేవారు. అందుకే అణుయుద్ధాన్ని ఆపేలా భారత్‌-పాక్‌లపై ఒత్తిడి తెచ్చా. యుద్ధం కొనసాగిస్తామంటే మీతో వ్యాపారం చేయనని చెప్పా. దీంతో ఆ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దాయాది దేశాల కాల్పుల విరమణ క్రెడిట్‌ నాదే’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు యుద్ధం విషయంలో ప్రస్తుతం భారత్‌తో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్‌ చెప్పారు. త్వరలో పాక్‌తో కూడా మాట్లాడుతానని వివరించారు. #WATCH | US President Donald Trump says, "...I'm very proud to let you know that the leadership of Indian and Pakistan was unwavering and powerful, but unwavering in both cases - they really were from the standpoint of having the strength and the wisdom and fortitude to fully… pic.twitter.com/rFbznHMJDF— ANI (@ANI) May 12, 2025

IPL 2025 Cricket reschedule announced7
ఐపీఎల్ రీ షెడ్యూల్ ప్రకటన...

ఈనెల 17 నుంచి ఐపీఎల్ పునర్ ప్రారంభం..ఈ నెల 29 న IPL క్యాలిఫై మ్యాచ్..ఈనెల 30 న ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్..క్యాలిఫై 2 జూన్ 1..ఆరు వేదికల్లో మిగిలిన 17 మ్యాచులు..జూన్ 3 న ఫైనల్ మ్యాచ్.హైదరాబాద్ లో మిగిలిన ఒక్క లీగ్ మ్యాచ్ ఢిల్లీకి తరలింపుక్వాలిఫైయర్ మ్యాచ్ లు రెండు హైదరాబాద్ లో జరగాల్సింది తరవాత నిర్ణయిస్తారు

Gold Price Down After US China Trade Deal8
అమెరికా, చైనా డీల్: ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు

అమెరికా ప్రతీకగా సుంకాల కారణంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి, బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. దేశంలో గోల్డ్ రేటు ఏకంగా లక్ష మార్కును దాటేసింది. అయితే తాజాగా జరిగిన అమెరికా - చైనా దేశాలను టారిఫ్స్ కొంత తగ్గిస్తున్నట్లు.. ఇవి 90 రోజులు అమల్లో ఉంటాయని ప్రకటించాయి. దీంతో పసిడి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్లో 3400 డాలర్ల కంటే ఎగువన ట్రేడ్ అయిన ఔన్స్ బంగారం ధర.. ఏకంగా 3218 డాలర్లకు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగానే భారతదేశంలో కూడా గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. వెండి ధరలు కూడా బంగారం బాటలో పయనించిందా అన్నట్లు.. తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం మొత్తం మీద బంగారం, వెండి ధరలు తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.అమెరికా దిగుమతులపైన చైనా విధించిన 125 శాతం సుంకాలలో 10 శాతం తగ్గించింది. అదే సమయంలో అమెరికా కూడా చైనా దిగుమతుల మీద విధించిన 145 శాతం సుంకాలలో 30 శాతం తగ్గించించింది.ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?ఇరు దేశాలు (చైనా, అమెరికా) కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఈ సుంకాల తగ్గింపు 90 రోజులు మాత్రమే అమలులో ఉంటాయని తెలుస్తోంది. కొత్త సుంకాలు మే 14 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ తరువాత తగ్గింపు సుంకాలే కొనసాగుతాయా?, ముందుకు విధించిన సుంకాలు కొనసాగుతాయా?, అనే విషయం తెలియాల్సి ఉంది.

Delhi Coach Sarandeep Singh Shocking Reveal: Spoke To Virat Kohli, He Wanted 4, 5 Tons In ENG9
కోహ్లి రిటైర్మెంట్‌పై ఢిల్లీ రంజీ కోచ్‌ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి టెస్ట్‌ క్రికెట్‌కు ఇవాళ (మే 12) ఉదయం రిటైర్మెంట్‌ ప్రకటించాడు. విరాట్‌ నుంచి వచ్చిన ఈ అనూహ్య ప్రకటనపై క్రికెట్‌ ప్రపంచమంతా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విరాట్‌ ఫిట్‌నెస్‌, ఫామ్‌ చూసి టెస్ట్‌ల్లో మరో రెండు మూడేళ్లు కొనసాగుతాడని చాలా మంది అనుకున్నారు. అయితే విరాట్‌ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టెస్ట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.విరాట్‌ ఆకస్మిక టెస్ట్‌ రిటైర్మెంట్‌ ప్రకటనపై అందరిలాగే ఢిల్లీ రంజీ జట్టు కోచ్‌ శరణ్‌దీప్‌ సింగ్‌ కూడా ఆశ్చర్యం వ్య​క్తం చేశాడు. విరాట్‌ రిటైర్మెంట్‌ నేపథ్యంలో ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు.స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ శరణ్‌దీప్‌ సింగ్‌ ఇలా అన్నాడు. కొద్ది రోజుల కిందట (ఈ ఏడాది జనవరిలో రంజీ ట్రోఫీ సమయంలో) విరాట్‌ టెస్ట్‌ భవిష్యత్తుపై నాతో చర్చించాడు. ఇంగ్లండ్‌తో జరుగబోయే సిరీస్‌ కోసం ఆతృతగా ఎదరుచూస్తున్నానని చెప్పాడు. ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు కౌంటీలు ఆడతావా అని విరాట్‌ను అడిగాను.అయితే విరాట్‌ లేదని చెప్పాడు. కౌంటీలకు బదులుగా ఇండియా-ఏ తరఫున రెండు ​మ్యాచ్‌లు (ఇంగ్లండ్‌-ఏతో) ఆడతానని అన్నాడు. 2018 తరహాలో ఈసారి కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఈసారి ఇంగ్లండ్‌ సిరీస్‌లో నాలుగైదు సెంచరీలు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే ఏం జరిగిందో ఏమో తేలీదు కానీ, విరాట్‌ మూడు నెలల్లో మనసు మార్చకున్నాడు. విరాట్‌ రిటైర్మెంట్‌ వార్త వినగానే షాకయ్యానని తెలిపాడు.శరణ్‌దీప్‌ సింగ్‌ చెప్పిన ఈ విషయాలను బట్టి చూస్తే విరాట్‌ ఆకస్మిక రిటైర్మెంట్‌ ప్రకటన వెనుక ఏదో జరిగినట్లు తెలుస్తుంది. విరాట్‌కు గత కొన్నేళ్లుగా బీసీసీఐ పెద్దలతో పొసగడం లేదు. అందుకే అతను చాలా సిరీస్‌లకు ఏదో ఒక కారణం చెప్పి దూరంగా ఉంటూ వస్తున్నాడు.‍ గత రెండు మూడేళ్ల కాలంలో విరాట్‌ కేవలం మెగా టోర్నీల్లో మాత్రమే పాల్గొన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఉన్న సమయం నుంచి విరాట్‌కు బోర్డుతో విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుత టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌తో కూడా విరాట్‌కు సత్సంబంధాలు లేవు. పైకి ఇద్దరూ ఏమీ లేదని నటిస్తున్నప్పటికీ.. ఏదో మూలన ఏదో రగులుతూ ఉంది. ఇటీవలికాలంలో సీనియర్‌ ఆటగాళ్ల పట్ల బోర్డు తీరు కూడా సరిగా లేదని విమర్శలు వస్తున్నాయి. అందుకే సీనియర్లు చెప్పాపెట్టకుండా రిటైర్మెంట్‌ నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. 2024-25 బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ సందర్భంగా అశ్విన్‌ ఆకస్మిక రిటైర్మెంట్‌ ప్రకటనే ఇందుకు ఉదాహరణ.టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత రోహిత్‌, జడేజా, కోహ్లి ఒకేసారి పొట్టి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు రోహిత్‌ టెస్ట్‌ రిటైర్మెంట్‌ ప్రకటన చేసిన వారం రోజుల్లోపే విరాట్‌ కూడా టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పాడు. ​

Woman Selfie Video In Ntr District10
ఎన్టీఆర్‌ జిల్లా: టీడీపీ కార్యకర్త వేధింపులు.. మహిళ బలి

సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ కార్యకర్త వేధింపులకు ఓ మహిళ బలైన ఘటన చందర్లపాడు మండలం విభరింతలపాడు గ్రామంలో జరిగింది. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న అబ్బూరి మాధురిని టీడీపీ కార్యకర్త, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మైలా రవితేజ నోటికొచ్చినట్లు తీవ్ర దుర్భాషలాడారు. అందరి ముందూ దూషించడంతో పాటు దౌర్జన్యం చేయడంతో తీవ్ర మనోవేదనకు గురైన మాధురి.. రవితేజ చేసిన అవమానాన్ని భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో విడుదల చేసింది.తనపై తీవ్ర దుర్భాషలాడుతూ.. దౌర్జన్యం చేస్తున్నా కానీ ఎవరూ అడ్డుకోలేదని మాధురి ఆవేదన వ్యక్తం చేసింది. తన చావుకు ఫీల్డ్ అసిస్టెంట్ రవితేజ కారణమంటూ మాధురి వీడియోలో పేర్కొంది. తనకు జరిగిన అన్యాయం మరొక మహిళకు జరగకూడదంటూ తన ఆవేదన వెల్లబుచ్చిన మాధురి.. తాను చచ్చిపోతున్నానని.. మరో మహిళకు ఇలాంటి అవమానం జరగకూడదంటూ పేర్కొంది. తనకు న్యాయం చేయాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలను సెల్ఫీ వీడియోలో మాధురి వేడుకుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement