ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై అనవసర ఆందోళనలు వద్దని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సూచించారు.
విశాఖ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై అనవసర ఆందోళనలు వద్దని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. గత ప్రభుత్వం లేనప్పుడు ప్రణాళికా సంఘం ఎలా ఉంటుందని ఆయన శనివారమిక్కడ విలేకర్ల సమావేశంలో ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ప్రణాళిక సంఘం తీర్మానం చేయాలని కోరామని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పట్లో ఆ సూచనను కాంగ్రెస్ విస్మరించిందని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని వెంకయ్య నాయుడు మరోసారి స్పష్టం చేశారు. విశాఖను అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. రైల్వే జోన్ ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించినట్లు వెంకయ్య తెలిపారు. కాగా వెంకయ్యను ఉత్తారంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘనంగా సన్మానించారు.