
'రాష్ట్రం పట్ల కాంగ్రెస్ పరిహాసం ఆడుతోంది'
హైదరాబాద్ : దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఆంధ్రప్రదేశ్ పట్ల కాంగ్రెస్ పరిహారం ఆడుతోందని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాటకాలను బీజేపీ ప్రజల్లోకి తీసుకు వెళుతుందని వెంకయ్య అన్నారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేతల వైఖరి అధిష్టాన నాటకంలో భాగమేనని ఆయన ఆరోపించారు.
దేశంలోని సవాళ్లకు కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదని వెంకయ్య అన్నారు. కాంగ్రెస్ ఏ విషయంలోనూ సరైన నిర్ణయం తీసుకోలేకపోయిందన్నారు. తెలంగాణ విషయంలో బీజేపీ సిద్ధాంతం ఎన్నటికి మారదన్నారు. బీజేపీ, నరేంద్ర మోడీని చూస్తే కాంగ్రెస్కు భయం కలుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో మోడీ నాయకత్వంలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని వెంకయ్య ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడకు వెళ్లినా మోడీ ప్రభంజనం వీస్తుందన్నారు. మావోయిస్టుల సమస్య రాష్ట్ర సమస్య కాదని, దేశ సమస్య అని వెంకయ్య పేర్కొన్నారు.