ఎకానమీ ‘యూ’ టర్న్‌! | Indian economy has bottomed out, formal sector may get back | Sakshi
Sakshi News home page

ఎకానమీ ‘యూ’ టర్న్‌!

Published Fri, Sep 24 2021 6:40 AM | Last Updated on Fri, Sep 24 2021 6:40 AM

Indian economy has bottomed out, formal sector may get back - Sakshi

న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఇంతకన్నా మరింత నష్టానికి గురయ్యే అవకాశాలు లేవని ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్‌ మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియా పేర్కొన్నారు. సంఘటిత రంగం 2021 ముగింపుకల్లా కోవిడ్‌–19 ముందస్తు స్థాయికి చేరుకునే అవకాశం ఉందని కూడా ఆయన విశ్లేíÙంచారు. అయితే ఈ రికవరీ ఆయా రంగాలను బట్టి విభిన్నంగా ఉంటుందని అంచనావేశారు. గత యూపీఏ ప్రభుత్వంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థలో కీలకప్రాత పోషించిన అహ్లూవాలియా తాజాగా ఒక వెర్చువల్‌ కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యంశాలను పరిశీలిస్తే...

► సంఘటిత రంగం తొలత పురోగమిస్తే, దానిని అసంఘటిత రంగం అనుసరిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుంది. ఆయా పరిస్థితుల్లో ప్రైవేటు రంగంలో పెట్టుబడులు కూడా పెరుగుతాయి.  ఇది ఎకానమీ పురోగతిలో కీలకం

► వ్యవసాయ రంగంలో ఆధునికీకరణ అవసరం ఉంది. అయితే దానిని ఎలా నిర్వహించాలన్న అంశం కీలకం. చట్టాల అమలు(కేంద్రం ఇటీవలి మూడు చట్టాల అమలు) విషయంలో రైతుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి.పంజాబ్, హర్యానా, పశి్చమ ఉత్తరప్రదేశ్‌లకు చెందిన వందలాది మంది రైతులు గత ఏడాది నుంచీ ఢిల్లీ సరిహద్దుల సమీపంలో ఆందోళనలు చేస్తూ, మూడు చట్టాల రద్దును కోరుతున్న సంగతి తెలిసిందే.


ఎన్‌ఎంపీ ప్రయోజనకరమే:
కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించిన నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపీ) విధానానికి యూపీఏ ప్రభుత్వంలో ఎకానమీలో కీలక బాధ్యతలు పోషించిన అహ్లూవాలియా మద్దతు పలకడం గమనార్హం. ప్రభుత్వ ఆస్తుల లీజు ద్వారా నిధుల సమీకరణకు సంబంధించి కేంద్రం ఆవిష్కరించిన ఆరు లక్షల కోట్ల రూపాయల నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపీ) విధానం వల్ల విద్యుత్‌ రంగం నుంచి రోడ్లు, రైల్వేల వరకూ వివిధ రంగాల్లో మౌలిక రంగం ఆస్తుల విలువలు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్‌ఎంపీకి తాను అనుకూలమని ఆయన స్పష్టం చేశారు.

ఇది సరిగా అమలు చేస్తే ఆర్థిక వ్యవస్థకు మంచే జరుగుతుందని వివరించారు. బృహత్తర జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ కార్యక్రమం కింద.. కేంద్రం ప్యాసింజర్‌ రైళ్లు మొదలుకుని, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రహదారులు, స్టేడియంలు ఇలా పలు మౌలిక రంగాల్లో అసెట్స్‌లో లీజుకివ్వడం తదితర మార్గాల్లో ‘మానిటైజ్‌’ చేయనుంది. ఇప్పటికే పూర్తయి నిరుపయోగంగా పడి ఉన్నవి లేదా పూర్తి స్థాయిలో వినియోగంలో లేనివి, పూర్తి స్థాయిలో విలువను అందించలేకపోతున్న బ్రౌన్‌ఫీల్డ్‌ ఇన్‌ఫ్రా అసెట్స్‌ మాత్రమే ఎన్‌ఎంపీ పరిమితం. ఇందులో యాజమాన్య హక్కులు లేదా స్థలం బదలాయింపు ఉండదు.

ప్రైవేట్‌ రంగం పాలుపంచుకునేందుకు అవకాశం కలి్పంచడం ద్వారా ఆయా ఆస్తుల నుంచి మరింత విలువను రాబట్టడానికి వీలవుతుందని, అలాగే మానిటైజేషన్‌ ద్వారా వచి్చన నిధులను మౌలిక సదుపాయాల కల్పనపై ఇన్వెస్ట్‌ చేయడానికి సాధ్యపడుతుందని కేంద్రం పేర్కొంది. అయితే 70 యేళ్లపాటు కూడబెట్టిన ప్రజల ఆస్తులను అమ్మేస్తున్నారని ఈ విధానాన్ని ఉటంకిస్తూ, రాహుల్‌ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ విమర్శపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గతంలో స్పందిస్తూ, ‘‘అసలు ఆయన (రాహుల్‌ గాం«దీ) మోనిటైజేషన్‌ అంటే ఏమిటో అర్థం చేసుకున్నారా?’’ అని ఆర్థికమంత్రి ప్రశ్నించారు. ప్రైవేటుకు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణను మాత్రమే అప్పగిస్తున్నామని, యజమాని ప్రభుత్వమేనని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement