మోదీ ఆలోచనకు కేసీఆర్ మద్దతు
న్యూఢిల్లీ: ప్రణాళిక సంఘంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు పలికారు. ప్రణాళిక సంఘం స్థానే ఏర్పాటు చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రుల మండలి సమర్థవంతంగా పనిచేసేందుకు ప్రత్యేక సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని సూచించారు.
సారుప్యత ఉన్న సమస్యలపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉప సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. పంచవర్ష ప్రణాళికల స్థానంలో పది పదిహేనేళ్ల ప్రణాళికలు రూపొందించాలన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న మనఊరు మనప్రణాళికను ప్రధాని మోదీకి వివరించినట్టు కేసీఆర్ తెలిపారు.