ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు పక్కపక్కనే కూర్చుకున్నారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు పక్కపక్కనే కూర్చుకున్నారు. మధ్యాహ్న భోజన సమయంలోనూ ఇరువురు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే కేసీఆర్, చంద్రబాబు పక్కనే కూర్చోవడం.. మాట్లాడుకోవడం రాజకీయ వర్గాలకు ఆసక్తి కలిగించింది.
కాగా కేంద్ర పథకాలను నిధులను నేరుగా రాష్ట్రాలకు ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరినట్టు చంద్రబాబు తెలిపారు. పెన్షన్లకు ఆధార్ కార్డు అనుసంధానం, ఇసుక రీచ్ లను డ్వాక్రా మహిళలకు అప్పగించిన విషయాన్ని ప్రధానికి చెప్పానని వెల్లడించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చర్చించలేదని, రాజధాని అంశంపై మాట్లాడానని చెప్పారు.