కేంద్రం నుంచి రాష్ట్రాలకు సక్రమంగా నిధుల బదిలీ జరగడం లేదని చాలాకాలంగా రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. నిధుల బదిలీలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ రాష్ట్రాలు నిరసన గళం వినిపిస్తున్నాయి.
పన్నులు, సెస్సుల రూపంలో కేంద్రం ఎక్కువ ఆదాయం ఆర్జిస్తోందని కథనాలు వస్తున్నాయి. పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ మొత్తం పన్ను వసూళ్లలో సెస్సుల ద్వారా సమకూరిన వాటా 18 శాతం. తాజాగా ఇప్పుడది 30శాతానికి పెరిగినట్లు కొన్ని కథనాల ద్వారా తెలిసింది.
కేంద్రానికి పెరిగిన ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకోవడం లేదనే వాదనలున్నాయి. నిబంధనల ప్రకారం సెస్సుల ఆదాయంలోనూ రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మొత్తం పన్ను వసూళ్లలో 50శాతాన్ని రాష్ట్రాలకు పంచాలి. మిగిలిన 50శాతం నిధుల్లో 10శాతాన్ని వివిధ రాష్ట్రాల్లో జాతీయ ప్రాజెక్టులపై వెచ్చించాలి.
ఇదీ చదవండి: ఒకసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ టు శ్రీకాకుళం!
ఓటు బ్యాంకు రాజకీయాలు, ఉచిత వరాలు చాలా రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. పెట్టుబడులకు వాటి వద్ద నిధులు ఉండటం లేదు. ఉత్పత్తి పెంపుదల, ఉపాధిపట్ల అధిక దృష్టి సారించే రాష్ట్రాలకు నిధుల బదిలీలో ఆర్థిక సంఘం ప్రాధాన్యమివ్వాలని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment