
ఆధార్ లేకుండా గ్యాస్
చిత్తూరు (జిల్లాపరిషత్), న్యూస్‌లైన్ : వినియోగదారులకు ఆధార్‌కార్డుతో సంబంధం లేకుండా గ్యాస్ సిలెం డర్లు రాయితీ ధరపై సరఫరా చేయాలని భారత ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో ఆధార్ అమలవుతున్న చిత్తూరు, అనంతపురం, రంగారెడ్డి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వినియోగదారులకు సుమారు రూ.450లకే సిలెండర్ పంపిణీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం.
జిల్లాలోని 7లక్షలకు పైగా ఉన్న వినియోగదారులకు రాయితీ డబ్బు బ్యాంకులో పడిందా లేదా అనే బాధ తప్పుతుంది. దీని అమలుకు మూడు రోజులు పడుతుందని ఏజెన్సీలు చెబుతున్నా యి. సిలెండర్ ఎంతకు అమ్మాలి ? అనే విషయూనికి సంబంధించి ఎల్‌పీజీ కంపెనీల నుంచి తమకు ఇంకా సమాచారం రాలేదని జిల్లా ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ కార్యదర్శి కిశోర్‌రెడ్డి పేర్కొన్నారు.