ఏపీలో మరో 7 జిల్లాల్లో వంటగ్యాస్ సబ్సిడీ | 7 more districts come under direct transfer of LPG subsidy | Sakshi
Sakshi News home page

ఏపీలో మరో 7 జిల్లాల్లో వంటగ్యాస్ సబ్సిడీ

Published Tue, Aug 13 2013 1:44 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM

7 more districts come under direct transfer of LPG subsidy

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఐదు జిల్లాల్లో అమలవుతున్న వంట గ్యాస్ సిలిండర్‌కు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం  సెప్టెంబర్ 1 నుంచి మరో 7 జిల్లాల్లో అమలు కానుంది. ఏపీలో ప్రస్తుతం అనంతపురం, చిత్తూరు, రంగారెడ్డి, తూర్పు గోదావరి, హైదరాబాద్ జిల్లాల్లో ఈ పథకం అమలవుతుండగా వచ్చే నెల నుంచి శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా, ఆదిలాబాద్, వైఎస్సార్, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమల్లోకి రానుంది.
 
  ఏపీతోపాటు గోవా, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్‌లలోని మరో 35 జిల్లాల్లో ఈ పథకం అమలుకు కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఆమోదం తెలిపినట్లు ఆ మంత్రిత్వశాఖ సోమవారం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ పథకం అమలయ్యే జిల్లాల సంఖ్య 55కు చేరనుంది. ఈ పథకం కింద సిలిండర్లపై సబ్సిడీని ఆధార్‌తో అనుసంధానించిన వినియోగదారుల బ్యాంకు ఖాతాలకే జమ చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement