గ్యాస్ ధర పెంపు పేదలకు భారం
Published Sun, Jan 5 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
టీనగర్, న్యూస్‌లైన్: సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ల ధర పెంపు పేద ప్రజలకు భారంగా పరిణమిస్తుందని కేంద్ర నౌకాయాన శాఖా మంత్రి జీకే వాసన్ వ్యక్తం చేశారు. చెన్నై పోర్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో పోర్టు ట్రస్ట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఉచిత వైద్య శిబిరం శనివారం జరిగింది. ఈ శిబిరాన్ని జీకే వాసన్ ప్రారంభించారు. పోర్టుట్రస్ట్ చైర్మన్ అతుల్య మిశ్రా, పోర్టుట్రస్ట్ ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ లలితా గణపతి పాల్గొన్నారు. ఈ శిబిరంలో రూ.2వేల మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంతో పాటు మాజీ స్పీకర్ చెల్లపాండియన్ 101 జయంతి వేడుకలు జరిగాయి. చెల్లపాండియన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులు 20 మందికి మంత్రి పరికరాలను అందజేశారు.
దీనికి సంబంధిం చిన ఏర్పాట్లను చెల్లపాండియన్ కుమారు డు, ట్రస్ట్ చైర్మన్ ఎ.పిచ్చై చేశారు. విలేకరులతో వాసన్ మాట్లాడుతూ పోర్టు ట్రస్ట్ వైద్య శిబిరం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పోర్టుట్రస్ట్‌లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ల ధర పెంపు పేద ప్రజలను తీవ్రంగా బాధిస్తుందన్నారు. ఈ ధర పెంపును పునఃపరిశీలించాలని తెలిపారు. సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తొమ్మిది నుంచి 12కు పెంచాలని పెట్రోలియం శాఖా మంత్రిని కోరుతున్నట్లు తెలి పారు. జాలర్ల సమస్యపై ఇరు దేశాల జాలర్ల సంఘాల ప్రతినిధులతో జనవరి 20వ తేదీన సమావేశం ఏర్పాటుకానుందన్నారు. కాంగ్రెస్ నాయకత్వా న్ని బలపరిచే పార్టీలతోనే పొత్తులు ఉంటాయని తెలి పారు. గెలుపు కూటమిని త్వరలో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటిస్తుందని తెలిపారు.
Advertisement
Advertisement