Gas price hike
-
వంట గ్యాస్ ధరలు పెంపు
దేశవ్యాప్తంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరిగాయి. కమర్షియల్ గ్యాస్ 19 కేజీల సిలిండర్ రిటైల్ ధరలను ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు డిసెంబరు 1 నుండి రూ. 16.5 చొప్పున పెంచాయి.ధరల పెంపు తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1802 నుంచి రూ.1818.50కి పెరిగింది. గత నెల (నవంబర్)లో ఈ సిలిండర్ ధర రూ.62 పెరిగింది. గత ఆరు నెలలుగా వాణిజ్య సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు వరుసగా పెంచుతూ వస్తున్నాయి.ఇదీ చదవండి: ఇక సబ్బులు మరింత ఖరీదుఐవోసీఎల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. తాజా సవరణ తర్వాత హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2044 వద్దకు చేరింది. విజయవాడలో ఇది రూ.1990 వద్ద ఉంది. ఇక గృహావసరాలకు వినియోగించే 14.2 కేజీల ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఆగస్టు నుండి ఇవి స్థిరంగా ఉన్నాయి. -
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. ఎంతంటే..
భారత్‌లోని మెట్రోనగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన వంట గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. అందులో భాగంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ.100కు పెంచాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో 19 కిలోల కమర్షియల్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి. పెరిగిన ధర నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. తాజా ధరల సవరణతో దిల్లీలో 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,833గా ఉంది. కోల్‌కతాలో రూ.1,943, ముంబైలో రూ.1,785, బెంగళూరులో రూ.1,914.50, చెన్నైలో రూ.1,999.50గా ఉంది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి. అక్టోబర్‌లో వీటి ధరను రూ.209కి పెంచారు. అయితే ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను యథాతథంగా ఉంచాయి. వీటి ధర దిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, బెంగళూరులో రూ.905, చెన్నైలో రూ.918.50 ఉంది. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా ప్రతి నెల మొదటి తేదీన వంట గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ వాతావరణాన్ని మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నందున యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు గ్లోబల్ చమురు ధరలు బుధవారం పెరిగాయి. -
గ్యాస్ ధర పెంపు.. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ ప్రకటన
కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధరను పెంచింది. జులైలో ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (mBtu)కు 7.48 (సుమారు రూ. 615) డాలర్లు ఉన్న ధరను ఆగస్టులో 7.85 (సుమారు రూ. 645) డాలర్లకు పెంచింది. అయితే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థలకు చెందిన నామినేషన్ ఫీల్డ్‌ల నుంచి ఉత్పత్తి చేసిన గ్యాస్ మాత్రం గరిష్టంగా ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 6.50 డాలర్లు ఉంటుందని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ నోటిఫికేషన్ పేర్కొంటోంది. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ గత ఏప్రిల్ 8న ఓఎన్జీసీ, ఓఐఎల్, ఇతర లైసెన్సింగ్ పాలసీ బ్లాక్‌ల లెగసీ నామినేషన్ ఫీల్డ్‌ల నుంచి ఉత్పత్తి చేసిన నేచురల్ గ్యాస్ ధరను భారత క్రూడ్ బాస్కెట్‌కు లింక్ చేసింది. ఈ క్షేత్రాల నుంచి ఉత్పత్తయ్యే నేచురల్ గ్యాస్ ధరను ఇండియన్ క్రూడ్ బాస్కెట్ నెలవారీ సగటులో 10 శాతంగా నిర్ణయించారు. అంతకుముందు 2014 డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ప్రైసింగ్ కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం గ్యాస్ ధరలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షించేవారు. నాలుగు గ్లోబల్ గ్యాస్ ట్రేడింగ్ హబ్‌లలో ఉన్న వాల్యూమ్-వెయిటెడ్ ధరల ఆధారంగా ఈ గ్యాస్ ధరలు ఉండేవి. గ్యాస్ ధరల సమీక్షలో జాప్యం, ధరలలో అధిక అస్థిరత కారణంగా పాత మార్గదర్శకాలను సవరించారు. నేచురల్ గ్యాస్ అనేది శిలాజ ఇంధనం. ఇది సేంద్రీయ పదార్ధాల పొరలు (ప్రధానంగా సముద్ర సూక్ష్మజీవులు) వాయురహిత పరిస్థితులలో కుళ్లిపోయినప్పుడు, మిలియన్ల సంవత్సరాలుగా భూగర్భంలో తీవ్రమైన వేడి, ఒత్తిడికి లోనవుతున్నప్పుడు ఏర్పడుతుంది. ఈ నేచురల్ గ్యాస్‌ను వంటకు, విద్యుత్ ఉత్పత్తికి , ప్లాస్టిక్ తయారీకి వినియోగిస్తారు. దీంతో పాటు వాహనాల్లో ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు. -
ఇలా ఎంత వరకు పెంచుకుంటూ పోతారో ముందే చెపితే..
ఇలా ఎంత వరకు పెంచుకుంటూ పోతారో ముందే చెపితే గ్యాస్‌కు ప్రత్యామ్నాయం ఆలోచించుకుంటారట సార్! -
ధరల దెబ్బ..! దేశంలో భారీగా పడిపోతున్న పెట్రోల్, డీజిల్ అమ్మకాలు!
ఆదాయం..ఆవ గింజలా ఉంటే.. ఖర్చు కొండలా మారింది. దీంతో తోడు పెరిగిపోతున్న నిత్యవసర ధరలతో పాటు..సరుకు రవాణాకు లింకై ఉండడంతో పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. అందుకే సామాన్యులు ఒక్కోరూపాయి లెక్కలేసుకొని మరి ఖర్చు చేస్తున్నారు. దీంతో గత నెల తొలి 16 రోజులతో పోల్చితే ఈ నెలలో 10 శాతం పెట్రోల్ వినియోగం తగ్గాయి. డీజిల్ వినియోగం 15.6 శాతం, వంటగ్యాస్ వినియోగం 1.7 శాతం తగ్గింది. అలాగే మహమ్మారి సమయంలో గ్యాస్ వినియోగం వృద్ధి పెరిగింది. అయినప్పటికీ తాజాగా గ్యాస్ డిమాండ్ తగ్గింది. వంట గ్యాస్ ఏప్రిల్ 1 నుంచి 15 రోజుల వినియోగంలో నెలవారీగా 1.7శాతం క్షీణించింది.పెరుగుతున్న ధరలతో ఏప్రిల్ 1 నుండి 15 వరకు ప్రాథమికంగా, ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థల పెట్రోలు అమ్మకాలు 1.12 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 12.1శాతం అధికంగా ఉంది. అలాగే 2019 కాలంతో పోలిస్తే 19.6శాతం అయితే, మార్చి 2022 మొదటి 15 రోజుల్లో నమోదైన 1.24 మిలియన్ టన్నుల అమ్మకాలతో పోలిస్తే పెట్రోల్ వినియోగం 9.7శాతం తగ్గింది. ఇంకా, దేశంలో అత్యధికంగా ఉపయోగించే డీజిల్ ఏప్రిల్ మొదటి 15రోజుల వరకు 7.4 అమ్మకాలను నమోదు చేసి సుమారు 3 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది కూడా 2019లో ఇదే కాలం కంటే 4.8% ఎక్కువ. అయితే ఈ ఇంధన వినియోగం మార్చి 1 నుంచి 15 రోజుల మధ్య 3.53 మిలియన్ టన్నుల వినియోగంతో పోలిస్తే 15.6 శాతానికి పడిపోయింది. -
Photo Feature: కట్టెల కాలం..!
వ్యవసాయ భూములు, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడ ఎండు కర్రలు, చెట్లు ఎండిపోయి కనిపించినా వాటి కర్రలు పోగు చేసుకుని.. మోపులు కడుతున్నారు. ఇలా మోపులు నెత్తిన పెట్టుకొని ఇళ్లకు పయనమవుతున్నారు. ఇదంతా గ్యాస్ ధరలు పెరగడంతో పల్లె జనం కిలోమీటర్ల దూరం వెళ్లి చేస్తున్న పని. రహదారుల వెంట కట్టెలు మోసుకొస్తున్న దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. –సాక్షి, రాయపర్తి -
సాక్షి కార్టున్ 23-03-2022
-
భారీగా పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధర!
న్యూఢిల్లీ: నేడు (ఆగస్టు 1) పెట్రోలియం, గ్యాస్ రిటైలింగ్ సంస్థలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.73.5 పెంచాయి. 14.2 కిలోల దేశీయ సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పులేదు. నేటి నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. తాజా ధరల పెరుగుదలతో 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.1623.00గా ఉంది. అలాగే, వాణిజ్య సిలిండర్ ధర ముంబైలో రూ.1579.50కు పెరిగింది. కోల్ కతా, చెన్నైలో 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు వరుసగా రూ.1629.00, రూ.1761.00గా ఉన్నాయి. చమురు & గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి. దేశీయ గృహ ఎల్పీజీ సిలిండర్ ధరలను 2021 ఆగస్టులో మార్పులు చేయలేదు. గత నెల జూలై 1న ధరలను రూ.25.50 పెంచారు. జూలైలో ధరల పెరుగుదలతో 14.2 కిలోల దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.834.50, ముంబైలో రూ.834.50, కోల్ కతాలో రూ.861, చెన్నైలో రూ.850.50, హైదరాబాద్‌లో రూ.887లుగా ఉంది. 2021లోనే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.138.50 పెంచారు. జనవరి 1, 2021న 14.2 కిలోల దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.694 వద్ద ఉంది. అంతేగాక, గత ఏడు సంవత్సరాలలో గ్యాస్ సిలిండర్ ధర రెట్టింపు అయింది. ఉదాహరణకు, 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర 2014 మార్చి 1న రూ.410.50గా ఉంది. అయితే, ఇన్ని సంవత్సరాల్లో నిరంతర ధరల పెరుగుదలతో 14.2 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు దేశ రాజధానిలో రూ.834.50 వద్ద ఉంది. -
రెండేళ్ల గరిష్టానికి గ్యాస్ ధరలు పెంపు
న్యూఢిల్లీ : దేశీయంగా నేచురల్ గ్యాస్ ధర రెండేళ్ల గరిష్టానికి పెరుగబోతోంది. వచ్చే వారంలో ప్రభుత్వం ఈ పెంపుపై నిర్ణయం ప్రకటించబోతుంది. ఈ ప్రభావం సీఎన్జీ ధర, ఎలక్ట్రిసిటీ, యూరియా ఉత్పత్తి వ్యయాలపై కూడా పడనుంది. ఏప్రిల్ 1 నుంచి దేశీయంగా ఉత్పత్తి అయ్యే నేచురల్ గ్యాస్ ధర ఒక్కో మిలియన్ బ్రిటన్ థర్మల్ యూనిట్‌కు 3.06 డాలర్లకు పెరుగనుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఈ ధర 2.89 డాలర్లుగా ఉంది. ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి ఈ ధరలను నిర్ణయిస్తారు. దేశీయ రేటు కంటే కూడా భారత్ దిగుమతి చేసుకునే గ్యాస్‌పైనే ఎక్కువగా వ్యయమవుతోంది. ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలల పాటు ఒక్కో ఎంఎంబీటీయూ రేటు 3.06 డాలర్లుగా ఉండబోతుంది. 2016 ఏప్రిల్-సెప్టెంబర్ నుంచి ఇదే అత్యధిక స్థాయి. ఈ ధరల పెంపుతో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రొడ్యూసర్లకు భారీగా రెవెన్యూలు రానున్నాయి. దీంతో సీఎన్జీ ధర పెరగడంతో నాటు, యూరియ, పవర్ ఉత్పత్తి వ్యయాలను పెంపుకు దోహదం చేయనుంది. గత ఆరు నెలల కాలం 2017 అక్టోబర్ నుంచి 2018 మార్చి వరకు ఒక్కో ఎంఎంబీటీయూ ధర 2.89 డాలర్లుగా ఉంది. 2.48 డాలర్ల నుంచి అక్టోబర్‌లో ఈ మేరకు పెంచారు. ఐదు సార్లు తగ్గింపు అనంతరం అక్టోబర్‌లో ఈ పెంపు చేపట్టారు. -
మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర
-
ఏసీబీకి దర్యాప్తు అధికారం లేదు
గ్యాస్ ధర నిర్ణయంలో అవకతవకల కేసు కోర్టుకు తెలియజేసిన ఢిల్లీ సర్కారు సాక్షి, న్యూఢిల్లీ: కేజీ బేసిన్లో లభించే గ్యాస్ ధర పెంపులో అవకతవకలకు సంబంధించి దర్యాప్తు జరిపే అధికారంఅవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)కి లేదని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. కేంద్రం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషతో ఏసీబీ ఈఅధికారాన్ని కోల్పోయిందని ఢిల్లీ ప్రభుత్వం,ఏసీబీ తరపున న్యాయస్థానానికి హాజరైన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తెలిపారు. ‘జూలై 23వ తేదీన కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన ప్రకారం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసే అధికారం ఏసీబీకి లేదు. అవినీతి కేసుల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులపై దర్యాప్తు జరిపే అధికారాన్ని ఈ నోటిఫికేషన్ ఏసీబీ పరిధి నుంచి తొలగించింది. ఢిల్లీ ప్రభుత్వ అధికారులు, ఉ ద్యోగులపై దర్యాప్తు జరిపే అధికారాన్ని మాత్రమే ఏసీబీకి మిగిల్చింది’ అని సింగ్ న్యాయస్థానానికి తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ నవంబర్ 8, 1993న జారీ చేసిన నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ సవరించింది. తాజా నోటిఫికేషన్ ఏసీబీ దర్యాప్తు అధికారాన్ని ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేసింది. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ నేపథ్యంలో తాజా సమాధానం ఇవ్వడానికి తనకు మరికొంత సమయం కావాలని ఏసీబీ... న్యాయస్థానాన్ని కోరింది. తాజా పరిణామాల నేపథ్యంలో కొత్తగా సమాధానాన్ని ఇవ్వడానికి ఏసీబీకి, ఢిల్లీ ప్రభుత్వానికి సమయాన్ని ఇస్తూ న్యాయమూర్తి వీకే శాలి నేతృత్వంలోని ధర్మాసనం కేసుపై విచారణను అక్టోబర్ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీ ప్రభుత్వం ఏసీబీ సమాధానాలకు రిలయెన్స్, ఇతరులు తదుపరి విచారణ తేదీలోగా సమాధానాలు సమర్పించాల్సి ఉంటుంది. ఫిర్యాదుదారుల తరపున న్యాయస్థానానికి హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ దాని దృష్ట్యా టెరిటోరియల్ జ్యురిస్డిక్షన్ పరంగా తన పరిధిలో జరిగిన అవినీతి కేసులపై దర్యాప్తు జరిపే అధికారం ఏసీబీకి ఉందని వాదించారు. గ్యాస్ ధర పెంపులో అవకతవకలు జరిగాయనే ఫిర్యాదుల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని అప్పటి ఢిల్లీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా ఏసీబీని ఆదేశించింది. తనపై అవినీతి ఆరోపణలు దురుద్దేశంతో కూడినవని, అటువంటి ఆరోపణలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసే అధికారం ఏసీబీకి లేదని, అందువల్ల ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని రిలయెన్స్ అంతకుముందు న్యామస్థానాన్ని కోరింది. అయితే గ్యాస్ధరల పెంపులో అవకతవకల కేసులో మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీతో పాటు రిలయెన్స్పైనా, ఇతరులపైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేసే అధికారం తనకు ఉందని ఏసీబీ న్యాయస్థానానికి తెలియజేసింది. అవమానకరమైన రాజీయే ఏసీబీ విచారణ పరిధి అంశంపై ఆప్ న్యూఢిల్లీ: ఏసీబీ పరిధి వ్యవహారంలో ఢిల్లీ ప్రభుత్వ వైఖరికి సంబంధించి బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తప్పుపట్టింది. ఇది అవినీతితో అవమానకరమైన రీతిలో రాజీపడడమేనని అభివర్ణించింది. రిలయన్స్ సంస్థతోపాటు యూపీఏ మాజీ మంత్రులను కాపాడే ప్రయత్నమని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించింది. ఏసీబీ అధికార పరిధుల విషయంలో బీజేపీ నియంత్రింత ఢిల్లీ ప్రభుత ్వం హైకోర్టుకు ఇచ్చిన జవాబు... అవినీతితో రాజీకి ఉదాహరణగా అభివర్ణించింది. ఉద్దేశపూర్వకంగానే ఏసీబీ అధికారాలకు కత్తెర వేస్తున్నారని ఆరోపించింది. అర్థరహితమైన వ్యవస్థగా ఏసీబీని మార్చేందుకు జరుగుతున్న కుట్రగా అభివ ర్ణించింది. రూ. 54 వేల కోట్ల ఈ భారీ కుంభకోణంలో యూపీఏ మాజీ మంత్రుల హస్తముందని ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించి సమగ్ర దర్యాప్తు అవసరమని ఏసీబీ తన 32 పేజీల అఫిడవిట్లో కోర్టుకు నివేదించిందని, ఇటువంటి పరిస్థితుల్లో దాని అధికారాలకు పరిమితులు విధించడం అర్థరహితమని పేర్కొంది. -
కేంద్రానికి రిలయన్స్ ఆర్బిట్రేషన్ నోటీసు
న్యూఢిల్లీ: ఇప్పటికే చాలా జాప్యమైన సహజవాయువు ధర పెంపును వెంటనే అమలు చేయాలంటూ ప్రభుత్వానికి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), భాగస్వామ్య సంస్థలు బ్రిటిష్ పెట్రోలియం(బీపీ), నికో రిసోర్సెస్‌లు ఆర్బిట్రేషన్ నోటీసు జారీ చేశాయి. గత ప్రభుత్వం ఆమోదించిన గడువు తేదీ అయిన ఏప్రిల్ 1 నుంచి రేటు పెంపు అమలుకాకపోవడం వల్ల సుమారు 4 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు నిలిచిపోయేందుకు దారితీస్తోందని మే 9న జారీ చేసిన ప్రీ-ఆర్బిట్రేషన్ నోటీసులో ఈ 3 కంపెనీలు పేర్కొన్నాయి. లండన్‌కు చెందిన సర్ డేవిడ్ స్టీల్‌ను తమ తరఫున ఆర్బిట్రేటర్‌గా పేర్కొంటూ ఆర్బిట్రేషన్ నోటీసును జూన్ 17న జారీ చేసినట్లు సమాచారం. గ్యాస్ రేటును 4.2 డాలర్ల నుంచి(ఒక్కో యూనిట్‌కు) రెట్టింపునకు పైగా పెంచుతూ(8.8 డాలర్లకు) గతేడాది కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని ఈ ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని కూడా పేర్కొందని... దీనికి కట్టుబడి ఉండాలని ప్రభుత్వాన్ని రిలయన్స్-బీపీ-నికో పేర్కొన్నాయి. వాస్తవానికి ఏప్రిల్ 1 నుంచి రేటు పెంచుతూ జనవరి10న గత యూపీఏ సర్కారు కొత్త గ్యాస్ ధర ఫార్ములాను నోటిఫై చేసింది. అయితే, సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకిరావడంతో అమలు జూలై 1 వరకూ వాయిదా పడింది. అయితే, రంగరాజన్ కమిటీ రూపొందించిన ఫార్ములా ప్రకారం రేటు పెంపుపై తాజాగా మోడీ నేతృత్వంలోని సెప్టెంబర్ నెలాఖరు వరకూ పెంపును వాయిదా వేసింది. -
రిలయన్స్ గ్యాస్ షాక్!
న్యూఢిల్లీ: అసలే గ్యాస్ ధర రెట్టింపు కావడంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్... మరింత ఆజ్యంపోసే చర్యలకు తెరతీసింది. కేజీ-డీ6 క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ సరఫరా కాంట్రాక్టుల్లో భారీ మార్పులు చేపట్టింది. దీంతో గ్యాస్ ధర కొత్త రేటు కంటే 10% పెరిగేందుకు దారితీయనుంది. ప్రస్తుతం దేశీ సహజవాయువు రేటు ఒకో బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ)కు 4.2 డాలర్లుకాగా, ఏప్రిల్ 1 నుంచి ఇది రెట్టింపుస్థాయిలో 8.3 డాలర్లకు పెరగనున్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల సరఫరా కాంట్రాక్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో కొత్త గ్యాస్ విక్రయ-కొనుగోలు ఒప్పందాలను(జీఎస్‌పీఏ) ఎరువుల తయారీ ప్లాంట్లకు ఆర్ఐఎల్ పంపింది. ఇందులో బిల్లింగ్ విధానాన్ని పూర్తిగా మార్చివేసేలా ప్రతిపాదనలు చేసింది. ఇప్పుడు యూనిట్ గ్యాస్‌కు 4.205 డాలర్ల ధరపై నికర కెలోరిఫిక్ విలువ(ఎన్సీవీ) ప్రాతిపదికన బిల్లింగ్ జరుగుతుండగా... ప్రభుత్వం నిర్ధారించిన కొత్త రేటుపై స్థూల కెలోరిఫిక్ విలువ(జీసీవీ) ఆధారంగా బిల్లింగ్ చేసేలా రిలయన్స్ జీఎస్పీఏలో మార్పులు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సహజవాయువును మండించడం ద్వారా వచ్చే ఉష్ణాన్ని కెలోరిఫిక్ విలువల్లో కొలుస్తారు. ఒక జీసీవీ అంటే 0.9 ఎన్‌సీవీకి సమానం. ఇప్పుడు కొత్త ధర 8.3 డాలర్లపై ఎన్సీవీ ఆధారిత బిల్లింగ్‌ను అమలు చేస్తే యూరియా ప్లాంట్లకు ఒక్కో ఎంబీటీయూ రేటు 9.13 డాలర్లకు ఎగబాకనుంది. యూరియా ప్లాంట్ల గగ్గోలు... ఇప్పటికే రెట్టింపు గ్యాస్ ధర కారణంగా తమపై తీవ్ర భారం పడుతుందని గగ్గోలు పెడుతున్న యూరియా ప్లాంట్లకు రిలయన్స్ మరో 10 శాతం రేటు పెంపు ప్రతిపాదనలు శరాఘాతంగా మారనున్నాయి. ఆర్ఐఎల్ రేటు పెంపు ప్రతిపాదనపై ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఏఐ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ అభ్యంతరాలను తెలియజేస్తూ ఎరువుల శాఖకు లేఖ కూడా రాసింది. దీంతో ఆర్ఐఎల్ కొత్త జీఎస్పీఏల్లో చేపట్టిన మార్పుల అంశాన్ని చమురు శాఖకు నివేదించామని ఎరువుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. యూరియా ఉత్పత్తి వ్యయంలో దాదాపు 80% గ్యాస్‌దే. యూనిట్ గ్యాస్ ధర 1 డాలరు పెరిగితే ఉత్పత్తి వ్యయం టన్నుకు రూ.1,369 చొప్పున ఎగబాకుతుంది. ప్రస్తుతం గ్యాస్ ద్వారా ఉత్పత్తి అవుతున్న 1.8 కోట్ల టన్నుల యూరియాకు దీన్ని లెక్కగడితే ఒక డాలరు రేటు పెంపు వల్ల రూ.2,465 కోట్ల అదనపు భారం పడుతుంది. గ్యాస్ ధర రెట్టింపు కావడంతో యూరియా ప్లాంట్లకు ఉత్పత్తి వ్యయం రూ.9,860 కోట్లు పెరిగిపోనుంది. రిలయన్స్ జీసీవీ విధానం వల్ల దీనికి మరో రూ.2,046 కోట్ల భారం జతకానుంది. -
గ్యాస్ ధర పెంపు పేదలకు భారం
టీనగర్, న్యూస్‌లైన్: సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ల ధర పెంపు పేద ప్రజలకు భారంగా పరిణమిస్తుందని కేంద్ర నౌకాయాన శాఖా మంత్రి జీకే వాసన్ వ్యక్తం చేశారు. చెన్నై పోర్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో పోర్టు ట్రస్ట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఉచిత వైద్య శిబిరం శనివారం జరిగింది. ఈ శిబిరాన్ని జీకే వాసన్ ప్రారంభించారు. పోర్టుట్రస్ట్ చైర్మన్ అతుల్య మిశ్రా, పోర్టుట్రస్ట్ ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ లలితా గణపతి పాల్గొన్నారు. ఈ శిబిరంలో రూ.2వేల మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంతో పాటు మాజీ స్పీకర్ చెల్లపాండియన్ 101 జయంతి వేడుకలు జరిగాయి. చెల్లపాండియన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులు 20 మందికి మంత్రి పరికరాలను అందజేశారు. దీనికి సంబంధిం చిన ఏర్పాట్లను చెల్లపాండియన్ కుమారు డు, ట్రస్ట్ చైర్మన్ ఎ.పిచ్చై చేశారు. విలేకరులతో వాసన్ మాట్లాడుతూ పోర్టు ట్రస్ట్ వైద్య శిబిరం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పోర్టుట్రస్ట్లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ల ధర పెంపు పేద ప్రజలను తీవ్రంగా బాధిస్తుందన్నారు. ఈ ధర పెంపును పునఃపరిశీలించాలని తెలిపారు. సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తొమ్మిది నుంచి 12కు పెంచాలని పెట్రోలియం శాఖా మంత్రిని కోరుతున్నట్లు తెలి పారు. జాలర్ల సమస్యపై ఇరు దేశాల జాలర్ల సంఘాల ప్రతినిధులతో జనవరి 20వ తేదీన సమావేశం ఏర్పాటుకానుందన్నారు. కాంగ్రెస్ నాయకత్వా న్ని బలపరిచే పార్టీలతోనే పొత్తులు ఉంటాయని తెలి పారు. గెలుపు కూటమిని త్వరలో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటిస్తుందని తెలిపారు. -
గ్యాస్ భారంపై కన్నెర్ర
హాలియా, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో హాలియాలో నిరసర ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నర ఏళ్లలో యూపీఏ ప్రభుత్వం ఎనిమిదిసార్లు వంట గ్యాస్ ధరలను పెంచిందని విమర్శించారు. భవిష్యత్‌లో వంట గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం ముందుకు సాగుతుందన్నారు. మహానేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వంట గ్యాస్‌పై కేంద్ర ప్రభుత్వం ధర పెంచినా దాని భారం రాష్ట్ర ప్రజలపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ నాగార్జునసాగర్ నియోజకవర్గ కన్వీనర్ మల్లు రవిందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరి గిన కార్యక్రమంలో హాలియా, త్రిపురారం మండల శాఖ కన్వీనర్లు మల్లు అశోక్‌రెడ్డి, కందుకూరి అంజ య్య, రమావత్ జవహర్‌నాయక్, యువజన విభాగం నియోజకవర్గ నాయకుడు జానీ, కూన్‌రెడ్డి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. గ్యాస్ భారంపై కన్నెర్ర సాక్షి, నల్లగొండ: గ్యాస్ ధరల పెంపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కన్నెర్ర జేశారు. గ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నల్లగొండ, సూర్యాపేట, నకిరేకల్, హాలియా, యాదగిరిగుట్ట, మఠంపల్లి, కోదాడలలో ధర్నాలు, ప్రదర్శనలు, రాస్తారోకోలు చేశారు. -
ప్రజల పై గ్యాస్ భారం
-
పెంచిన ధరను తగ్గించాలని డిమాండ్
-
గ్యాస్ ధర పెంపుపై భగ్గు
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: వంట గ్యాస్ సిలిండర్ల ధర పెంపును నిరసిస్తూ సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాల్లో యూపీఏ ప్రభుత్వం దిష్టిబొమ్మలను దహనం చేశారు. సంగారెడ్డిలో సీపీఎం కార్యాలయం నుంచి కొత్త బస్టాండు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.మల్లేశ్ డిమాండు చేశారు. సిద్దిపేటలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఐటీ యూ నాయకులు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసన కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రేవంత్‌కుమార్, సతీష్, పురుషోత్తం పాల్గొన్నారు. చిన్నకోడూరు మండల కేంద్రంలో సీఐటీయూ నాయకులు తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత తహశీల్దార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. పటాన్చెరులో బస్టాండు ఎదుట సీఐటీయూ నాయకులు నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. జహీరాబాద్‌లో సీపీఎం నాయకులు గ్యాస్ధరను తగ్గించాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు రాంచందర్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. నారాయణఖేడ్‌లో సీఐటీయూ నాయకులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ ధర్నాలో డివిజన్ నాయకులు కె.నర్సమ్మ, చిరంజీవి, సంగమేశ్వర్, మోహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. దుబ్బాకలో బస్టాండు ఎదురుగా సీఐటీయూ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగులబెట్టారు. జోగిపేటలో డివిజన్ కార్యదర్శి మొగులయ్య ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. గజ్వేల్‌లో సీపీఎం నాయకులు స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. నర్సాపూర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో బస్టాండు సమీపంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. వెల్దుర్తిలో సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. -
పెరిగిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం బండ బాదుడు బాదుతోంది. వినియోగదారులపై మోయలేని భారం వేస్తోంది. నెల కిందటే సబ్సిడీ సిలిండర్ (14.2 కేజీ) ధర పెరిగింది. మరోమారు గ్యాస్ ధర పెంచాయి. రూ.1,112 నుంచి రూ.1,327కు పెరిగింది. దీం తో వినియోగదారుడు మొదట సి లిండర్ తీసుకునేటప్పుడు రూ.215 అదనంగా చెల్లించాలి. అదే సమయంలో బ్యాంకులో జమయ్యే సబ్సిడీ రూ.633 నుంచి రూ.843 కు పెరిగింది. సబ్సిడీ రూ.210 పెంచారు. ఈ లెక్కన వినియోగదారునిపై రూ.5 అదనపు భారం పడుతోంది. తొమ్మిది సిలిండర్లు దాటిన పక్షంలో అదనపు భారం మోయలేని పరిస్థితి. జిల్లావాసులపై ఏడాదికి రూ.1.50 కోట్ల వడ్డన జిల్లాలో 3,36,272 గ్యాస్ కనెక్షన్లు ఉన్నా యి. పెరిగిన రూ.5 లెక్కన సుమారుగా ఏడాదికి దాదాపు రూ.1.50 కోట్లపైన భా రం వినియోగదారులపై పడనుంది. సబ్సి డీ సిలిండర్లు ఏడాదికి తొమ్మిదే పరిమితి ఉండడంతో ఆ తర్వాత తీసుకునే సిలిండ ర్ పరంగా కష్టాలు తప్పవు. పెరిగిన మొత్తం ధర భరించాలి. ఆ విధంగా చూస్తే ప్రజలకు ఇది భారమే. రూ.215 పెంచడం ద్వారా జిల్లాలోని కనెక్షన్ల సంఖ్యను బట్టి ప్రతీసారి అదనంగా తీసుకునే సిలిండర్‌ను బట్టి రూ.6.45 కోట్ల భారం వినియోగదారుడు భరించాల్సి వస్తుంది. ముగిసిన సీడింగ్ గడువు.. వంట గ్యాస్ వినియోగదారులకు ఆధార్ ముడిపెట్ట వద్దని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించినా ప్రభుత్వం మొండి పంతం వీడడం లేదు. బ్యాంక్ ఖాత, గ్యాస్ కనెక్షన్లు ఆధార్‌కు అనుసంధానం చేయించుకొని వినియోగదారులకు జనవరి 1 నుంచి సబ్సిడీయేతర ధరకే కొనక తప్పదు. నగదు బదిలీ పథకంలో భాగంగా గ్యాస్ కనెక్షన్ ఆధార్ కార్డు ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి విధితమే. బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసిన వినియోగదారులకు ఇప్పటికే నగదు బదిలీ పథకం అ మల్లోకి వచ్చింది. తాజాగా గడువును పెం చలేదు. ఇప్పటికీ సిలిండర్ తీసుకునేటప్పు డు సబ్సిడీ పోనూ మిగితా మొత్తంను కట్టి వినియోగదారులు తీసుకునేవారు. ఆ అవకాశం ఇకపై ఉండదు. పూర్తిస్థాయి సిలిండర్ ధరను చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ఆధార్‌ను అనుసంధానం చేసుకున్న పక్షంలో వారికి సబ్సిడీ బ్యాంకులో జమ అయ్యే పరిస్థితి ఉంటుంది. -
`పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి`
హైదరాబాద్: గ్యాస్ ధరను ప్రభుత్వం అమాంతంగా పెంచడం దారుణమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం కొత్త సంవత్సరం మొదటిరోజే సామాన్యుడి నడ్డివిరిచిందని ఉమ్మారెడ్డి విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పడూ ఏరోజూ గ్యాస్ ధరలు పెరగలేదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గుర్తుచేశారు. కాగా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కోర్టుల్లో స్టేలు తెచ్చుకుని విచారణ జరగకుండా కాలం వెల్లబుచ్చుతున్నారని ఉమ్మారెడ్డి ఆరోపించారు. అవినీతి గురించి చంద్రబాబు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఆయన హితవు పలికారు. టీడీపీ నేతలు చౌకబారు సవాళ్లు విసరడం సమన్యసం కాదని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తీసుకున్న ప్రతీ నిర్ణయంపై టీడీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఘాటుగా ప్రశ్నించారు. ఈ విషయంలో వైఎస్సార్సీపీ బహిరంగ చర్చకు సిద్ధంగా ఉందంటూ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సవాల్ విసిరారు. -
గ్యాస్ ధర పెంపు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : చమురు కంపెనీలు గ్యాస్ సిలిండ ర్ ధరను పెంచాయి. వినియోగదారులపై కొరడా ఝుళిపించాయి. ఇటీవల డీజిల్ ధరను పెంచిన విషయం మరువక ముందే సిలిండర్ ధరను పెంచి భారం మోపాయి. ఆదిలాబాద్‌లో రూ.1,041 నుంచి రూ.1,107 కు పెంచారు. సబ్సిడీ సిలెండర్లతోపాటు వాణిజ్య సిలిండర్ల ధర కూడా పెంచారు. పెంచిన ధరలు ఈనెల 1వ తేదీ నుంచి అమలలోకి వచ్చాయి. వినియోగదారుడు సిలిండర్ తీసుకునేటప్పుడు అదనంగా రూ.66 చెల్లించాలి. కాగా వినియోగదారుడు సిలిండర్ తీసుకున్న తర్వాత బ్యాంకులో జమయ్యే సబ్సిడీ రూ.575 నుంచి రూ.633కు పెరిగింది. సబ్సిడీ రూ.58 పెరిగింది. తద్వారా పెంచిన సబ్సిడీ సిలిండర్ ధర కారణంగా వినియోగదారునిపై సుమారు రూ.8 భారం పడనుంది. నెలకు సుమారు రూ.22 లక్షలు, ఏడాదికి రూ. 2.50 కోట్లు అదనంగా వినియోగదారులు చెల్లించాలి. సబ్సిడీ సిలిండర్లు ఏడాదికి తొమ్మిదే పరిమితి ఉండడంతో ఆ తర్వాత తీసుకునే సిలిండర్ పరంగా వినియోగదారునికి కష్టాలు తప్పవు. పెరిగిన మొత్తం ధర భరించాల్సి వస్తుంది. ఆ విధంగా చూస్తే ప్రజలకు ఇది భారమే. కాగా వాణిజ్య సిలిండర్(19 కేజీ) ధరను రూ.1,773 నుంచి రూ.1,883కు పెంచారు. రూ.110 పెరగడంతో వాణిజ్య సిలిండర్ వినియోగదారులపై భారం పెరిగింది. 75 శాతం ఆధార్ సీడింగ్ పూర్తి జిల్లాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) 9 ఏజెన్సీలు, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్పీసీ) 12 ఏజెన్సీలు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీ) 11 ఏజెన్సీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 75 శాతం ఆధార్ సీడింగ్ పూర్తయింది. ఆధార్ సీడింగ్ కాని సబ్సిడీ సిలిండర్ వినియోగదారులకు సబ్సిడీ మినహాయించి నేరుగా వచ్చే ధరకే సిలిండర్ ఇస్తున్నారు. ఈ వినియోగదారులకు ఇదివరకు రూ.415 పై సబ్సిడీ సిలిండర్ ఇస్తుండగా ప్రస్తుతం రూ.419కి పెంచారు. ఇది ఆధార్ నమోదు చేసుకున్న వారికి, నమోదు చేసుకోని వారికి ధరల పరంగా వ్యత్యాసం ఉండడంతో వినియోగదారుల్లో గందరగోళం వ్యక్తమవుతోంది. కట్టెల పొయ్యే దిక్కు.. నా పేరు లక్ష్మి, మాది ఆదిలాబాద్ పట్టణంలోని పీహెచ్ కాలనీ. సర్కారు గ్యాస్ ధర పెంచిందని వినడంతో గుండె దడేల్ మంది. ఇప్పటికే కరెంటు, నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సతమతం అవుతున్నాము. ఇప్పుడు ప్రభుత్వం గ్యాస్ ధర పెంచి మరోమారు భారం వేసింది. వంటింట్లోకి వెళ్లాలంటేనే భయమవుతుంది. గ్యాస్ వాడకం కష్టమే. ఇక కట్టెల పొయ్యే మేలు.