
న్యూఢిల్లీ : దేశీయంగా నేచురల్ గ్యాస్ ధర రెండేళ్ల గరిష్టానికి పెరుగబోతోంది. వచ్చే వారంలో ప్రభుత్వం ఈ పెంపుపై నిర్ణయం ప్రకటించబోతుంది. ఈ ప్రభావం సీఎన్‌జీ ధర, ఎలక్ట్రిసిటీ, యూరియా ఉత్పత్తి వ్యయాలపై కూడా పడనుంది. ఏప్రిల్ 1 నుంచి దేశీయంగా ఉత్పత్తి అయ్యే నేచురల్ గ్యాస్ ధర ఒక్కో మిలియన్ బ్రిటన్ థర్మల్ యూనిట్‌కు 3.06 డాలర్లకు పెరుగనుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఈ ధర 2.89 డాలర్లుగా ఉంది. ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి ఈ ధరలను నిర్ణయిస్తారు. దేశీయ రేటు కంటే కూడా భారత్ దిగుమతి చేసుకునే గ్యాస్‌పైనే ఎక్కువగా వ్యయమవుతోంది.
ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలల పాటు ఒక్కో ఎంఎంబీటీయూ రేటు 3.06 డాలర్లుగా ఉండబోతుంది. 2016 ఏప్రిల్-సెప్టెంబర్ నుంచి ఇదే అత్యధిక స్థాయి. ఈ ధరల పెంపుతో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రొడ్యూసర్లకు భారీగా రెవెన్యూలు రానున్నాయి. దీంతో సీఎన్‌జీ ధర పెరగడంతో నాటు, యూరియ, పవర్ ఉత్పత్తి వ్యయాలను పెంపుకు దోహదం చేయనుంది. గత ఆరు నెలల కాలం 2017 అక్టోబర్ నుంచి 2018 మార్చి వరకు ఒక్కో ఎంఎంబీటీయూ ధర 2.89 డాలర్లుగా ఉంది. 2.48 డాలర్ల నుంచి అక్టోబర్‌లో ఈ మేరకు పెంచారు. ఐదు సార్లు తగ్గింపు అనంతరం అక్టోబర్‌లో ఈ పెంపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment