పెరిగిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర | again gas price hike | Sakshi
Sakshi News home page

పెరిగిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర

Published Thu, Jan 2 2014 4:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM

again gas price hike

ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం బండ బాదుడు బాదుతోంది. వినియోగదారులపై మోయలేని భారం వేస్తోంది. నెల కిందటే సబ్సిడీ సిలిండర్ (14.2 కేజీ) ధర పెరిగింది. మరోమారు గ్యాస్ ధర పెంచాయి. రూ.1,112 నుంచి రూ.1,327కు పెరిగింది. దీం తో వినియోగదారుడు మొదట సి లిండర్ తీసుకునేటప్పుడు రూ.215 అదనంగా చెల్లించాలి. అదే సమయంలో బ్యాంకులో జమయ్యే సబ్సిడీ రూ.633 నుంచి రూ.843 కు పెరిగింది. సబ్సిడీ రూ.210 పెంచారు. ఈ లెక్కన వినియోగదారునిపై రూ.5 అదనపు భారం పడుతోంది. తొమ్మిది సిలిండర్లు దాటిన పక్షంలో అదనపు భారం మోయలేని పరిస్థితి.
 జిల్లావాసులపై ఏడాదికి రూ.1.50 కోట్ల వడ్డన
 జిల్లాలో 3,36,272 గ్యాస్ కనెక్షన్‌లు ఉన్నా యి. పెరిగిన రూ.5 లెక్కన సుమారుగా ఏడాదికి దాదాపు రూ.1.50 కోట్లపైన భా రం వినియోగదారులపై పడనుంది. సబ్సి డీ సిలిండర్‌లు ఏడాదికి తొమ్మిదే పరిమితి ఉండడంతో ఆ తర్వాత తీసుకునే సిలిండ ర్ పరంగా కష్టాలు తప్పవు. పెరిగిన మొత్తం ధర భరించాలి. ఆ విధంగా చూస్తే ప్రజలకు ఇది భారమే. రూ.215 పెంచడం ద్వారా జిల్లాలోని కనెక్షన్ల సంఖ్యను బట్టి ప్రతీసారి అదనంగా తీసుకునే సిలిండర్‌ను బట్టి రూ.6.45 కోట్ల భారం వినియోగదారుడు భరించాల్సి వస్తుంది.
 ముగిసిన సీడింగ్ గడువు..
 వంట గ్యాస్ వినియోగదారులకు ఆధార్ ముడిపెట్ట వద్దని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించినా ప్రభుత్వం మొండి పంతం వీడడం లేదు. బ్యాంక్ ఖాత, గ్యాస్ కనెక్షన్‌లు ఆధార్‌కు అనుసంధానం చేయించుకొని వినియోగదారులకు జనవరి 1 నుంచి సబ్సిడీయేతర ధరకే కొనక తప్పదు. నగదు బదిలీ పథకంలో భాగంగా గ్యాస్ కనెక్షన్ ఆధార్ కార్డు ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి విధితమే. బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసిన వినియోగదారులకు ఇప్పటికే నగదు బదిలీ పథకం అ మల్లోకి వచ్చింది. తాజాగా గడువును పెం చలేదు. ఇప్పటికీ సిలిండర్ తీసుకునేటప్పు డు సబ్సిడీ పోనూ మిగితా మొత్తంను కట్టి వినియోగదారులు తీసుకునేవారు. ఆ అవకాశం ఇకపై ఉండదు. పూర్తిస్థాయి సిలిండర్ ధరను చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ఆధార్‌ను అనుసంధానం చేసుకున్న పక్షంలో వారికి సబ్సిడీ బ్యాంకులో జమ అయ్యే పరిస్థితి ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement