subsidy cylinder
-
గ్యాస్ రాయితీకి మంగళం
పెరుగుతున్న గ్యాస్ ధరలతో బెంబేలెత్తుతున్న వినియోగదారునికి మరో షాక్. గ్యాస్ రాయితీకి కేంద్రం మంగళం పాడటం..ఆచరణలో అమలు కావడంతో వినియోగ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే రాయితీ రూ.200లు ఇస్తామని ప్రకటించగా మిగతా వంటగ్యాస్ వినియోగదారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కూరగాయల ధరలు, పెట్రోలు ధరలు పెరగగా తాజాగా గ్యాస్ రాయితీకి రాంరాం చెప్పడం ఆందోళనకర పరిణామం. –కరీంనగర్ అర్బన్ లక్ష్యం చేరలే.. గుర్తించినోళ్లకు ఇవ్వలే ♦ జిల్లా జనాభా 10,29,078 కాగా 3,18,562 కుటుంబాలున్నాయి. ♦నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలవాలని, కాలుష్యరహిత వాతావరణంకోసం ఉజ్వల పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టగా లక్ష్యానికి ఆమడదూరంలో ఉండటం మన జిల్లాకే చెల్లు. ♦ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు దన్నుగా నిలవాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా..ని కాగితాల్లోనే మూలుగుతోంది. ♦ఆర్భాటంగా దరఖాస్తులను స్వీకరించారే తప్పా అమలులో మాత్రం శీతకన్ను ప్రదర్శిస్తున్నారు. ♦ జిల్లాలో 16 మండలాలకు గానూ ఎక్కడా లక్ష్యాన్ని చేరకపోవడం ఆరోపణలకు తావిస్తోంది. ♦ ఉజ్వల్ పథకం ప్రారంభంలో జిల్లాకు 52,278 కనెక్షన్లు మంజూరు చేశారు. 27,444 మంది లబ్ధిదారులున్నారని గుర్తించగా 16,480 మందికి గ్యాస్ కనెక్షన్లు గ్రౌండింగ్ చేశారని సమాచారం. ♦ అయితే గుర్తించిన సంఖ్య ప్రకారం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ♦ ఒక్కో గ్యాస్ కనెక్షన్‌కు రూ.1650 ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఇందులో 14.2 కిలోల సిలిండర్, డిపాజిట్, రెగ్యులేటర్, సురక్ష పైపు, పాస్‌పుస్తకం, నిర్వహణ ఛార్జీలు తదితర వాటికి చెల్లిస్తుంది. ♦ స్టవ్, మొదటి సిలిండర్ కొనుగోలు కొరకు వడ్డీలేని రుణాన్ని వివిధ ప్రభుత్వరంగ చమురు కంపెనీలు లబ్ధిదారులకు ఇస్తాయి. ♦ దీన్ని మళ్లీ వినియోగదారులు గ్యాస్ వినియోగించే సమయంలో విడుదలయ్యే రాయితీ ఏడో సిలిండర్ నుంచి మినహాయించుకుంటాయి. ♦ రేషన్‌కార్డు ఉండి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబంలో గతంలో గ్యాస్ కనెక్షన్ పొందనివారు ఈ పథకానికి అర్హులు. ♦ కానీ జిల్లాలో కనెక్షన్ మంజూరు, గ్రౌండింగ్‌లో వెనుకబడి ఉండటంతో రాయితీకి దూరమవుతున్నారు. క్రమేణా రాయితీ మాయం ♦ 2010 వరకు ఎలాంటి రాయితీ లేదు. ఆ తరువాత సిలిండర్ ధర రూ.340 నుంచి ఒక్కసారిగా రూ.425కి పెంచారు. ♦ దీంతో కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.85 రా యితీ ఇస్తున్నట్లు ప్రకటించి అమలు చేసింది. ♦ క్రమక్రమంగా గ్యాస్ ధర పెరిగినప్పుడల్లా స్టాండర్డ్ రేటును నిర్ణయించుకొని మిగతా సొమ్మును ప్రభుత్వం వినియోగదారులకు రాయితీ ఇస్తూ వస్తోంది. ♦ కోవిడ్ సమయంలో రెండేళ్ల కిందటి నుంచి వంట గ్యాస్‌పై ఇచ్చే రాయితీని క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చారు. ♦ చివరికి ప్రభుత్వం ఒక్క ఉజ్వల పథకం సిలిండర్లకు మాత్రమే రూ.200 రాయితీ ఇస్తూ మిగతా అన్ని సిలిండర్లకు రాయితీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వంట గ్యాస్ ప్రస్తుత ధర – రూ.1,075 వాణిజ్య సిలిండర్ ధర – రూ.2,464 ఉజ్వల కనెక్షన్దారుకు గ్యాస్ – రూ.1,075 రాయితీ – రూ.200 చెల్లించాల్సింది – రూ.875 ఉజ్వల కనెక్షన్ల పరిస్థితి గణాంకాల్లో జిల్లాకు మంజూరైన ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు: 52,278 గుర్తించిన లబ్ధిదారుల సంఖ్య: 27,444 గ్రౌండింగ్ అయిన కనెక్షన్లు: 16,480 -
వంట గ్యాస్ మంట.. హైదరాబాద్‌లో సిలిండర్ రూ.1002
న్యూఢిల్లీ: ఐదురాష్ట్రాల ఎన్నికల ప్రభావంతో దాదాపు ఐదు నెలలుగా గ్యాస్, పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచకుండా ఉన్న కంపెనీలు మంగళవారం జూలు విదిల్చాయి. వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ఎల్పీజీ సిలిండర్ ధర జీవితకాల గరిష్టానికి చేరింది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం భారీగా పెంచకుండా లీటరుకు దాదాపు 80పైసలతో సరిపెట్టాయి. తాజా పెరుగుదలతో ఒక్కసారిగా ద్రవ్యోల్బణ భయాలు పెరిగాయి. కొత్త ధరల ప్రకారం సబ్సిడీఏతర ఎల్పీజీ సిలిండర్ (14.2 కిలోలు) ధర ఢిల్లీ, ముంబైలో 949.50 రూపాయలకు చేరింది. గతేడాది అక్టోబర్ తర్వాత ఎల్పీజీ రేట్లు సవరించడం ఇదే ప్రథమం. గతేడాది జూలై, అక్టోబర్ మధ్య కాలంలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 100 మేర పెరిగింది. ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్ ధర సైతం నాన్ సబ్సిడీ సిలిండర్ ధరంత పలుకుతోంది. గతంలో ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.600 వరకు సాయం అందించేది. 2020 నుంచి ఈ సబ్సిడీని తొలగించారు. పెంచిన ధరల ప్రకారం 5 కిలోల గ్యాస్ íసిలిండర్ ధర రూ. 349కి, 10కిలోల íసిలిండర్ ధర రూ. 669కి చేరింది. మరోవైపు దేశ రాజధానిలో లీటర్ పెట్రోలు ధర రూ. 95.41 నుంచి 96.21కి, డీజిల్ ధర రూ. 86.67 నుంచి 87.47కు పెరిగింది. ఇతర నగరాల్లో స్థానిక పన్నులు కలుపుకొని ధరలు పెరిగాయి. ప్రభుత్వం సిలిండర్ ధర రూ. వెయ్యికి చేర్చాలని కంకణం కట్టుకుందని విపక్షాలు దుయ్యబట్టాయి. పార్లమెంట్లో ఈ విషయమై నిరసనకు దిగాయి. అంతర్జాతీయంగా ఉక్రెయిన్ సంక్షోభ కారణంగా ఇంధన ధరలు పెరగడంతో దేశీయంగా ధరలు పెంచాల్సివచ్చిందని ఇంధన సంస్థలు తెలిపాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 119 డాలర్ల వద్ద కదలాడుతోంది. భారత్ తన ఇంధన అవసరాల్లో 85 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర పెరిగితే భారత్‌పై భారం పడుతోంది. నిజానికి తాజా రేట్ల ప్రకారం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 15– 25 చొప్పున పెంచాల్సిఉందని, కానీ కంపెనీలు ఆ మొత్తాన్ని తామే భరిస్తున్నాయని అధికారులు తెలిపారు. విజయవాడలో సిలిండర్ రూ. 972 విజయవాడలో గ్యాస్ íసిలిండర్ ధర రూ. 50 పెరిగి రూ. 972కు చేరింది. కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,185ను తాకింది. ఇతర ప్రధాన నగరాల్లో కూడా గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 మేర పెరిగింది. విజయవాడలో పెట్రోల్ ధర లీటరుకు 0.96పైసలు(స్థానిక పన్నులు కలుపుకొని) పెరిగి రూ. 110.89కి చేరింది. డీజిల్ 83పైసలు పెరిగి రూ. 96.89కి చేరింది. విశాఖ పట్నంలో పెట్రోల్ ధర రూ. 110. 01కు, డీజిల్ ధర రూ. 96.02కు, తిరుపతిలో పెట్రోల్ధర రూ. 112.02కు, డీజిల్ ధర రూ. 98.00కు చేరాయి. హైదరాబాద్‌లో సిలిండర్ రూ.1002 తెలంగాణలో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర 90 పైసలు, డీజిల్ ధర 88 పైసలు (స్థానిక పన్నులు కలుపుకొని) చొప్పున పెరిగాయి. వంట గ్యాస్ ధర రూ. 50 పెరిగడంతో 14.2 కిలోల గృహావసర వంట గ్యాస్ సిలిండర్ ధర రాష్ట్రంలో పన్నులు కలుపుకొని రూ. 1000 దాటింది. సిలిండర్ ధర తెలంగాణలో ఆదిలాబాద్‌లో అత్యధికంగా రూ. 1,026కు చేరింది. రాష్ట్రంలో 1.18 కోట్ల గృహావసర సిలిండర్లు వినియోగంలో ఉండగా, ప్రతిరోజూ సగటున 1.20 లక్షల సిలిండర్లను డెలివరీ చేస్తున్నారు. సగటున రాష్ట్రంలో పెట్రోల్‌వినియోగం నెలకు 15 కోట్ల లీటర్లుండగా, సగటు డీజిల్ వినియోగం 25 కోట్ల లీటర్లుంది. -
ఏడాదికి పన్నెండు!
సబ్సిడీ సిలిండర్ల పరిమితి పెంపును పరిశీలించనున్న ప్రభుత్వం న్యూఢిల్లీ: ప్రస్తుతం ఏడాదికి 9 మాత్రమే ఉన్న సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల పరిమితిని 12కు పెంచాలన్న డిమాండును పరిశీలించనున్నట్లు గురువారం కేంద్రం వెల్లడించింది. సబ్సిడీయేతర సిలిండర్ల ధర ను ఒకేసారి ఏకంగా రూ.220 మేరకు పెంచిన మరునాడే ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. సబ్సిడీ సిలిండర్ల పరిమితిని పన్నెండుకు పెంచాలని పలువురు ముఖ్యమంత్రులు సహా పలు వర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు.మరోవైపు, సబ్సిడీయేతర సిలిం డర్ల ధరను రూ.220 మేరకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్లు కూడా వస్తున్నాయి. సబ్సిడీ కోటా సిలిండర్లను వాడేసుకున్న వినియోగదారులు ఆ తర్వాత కొనుగోలు చేసే సిలిండర్లపై పెంచిన ధరను చెల్లించాలి. ఢిల్లీలో ప్రస్తుతం సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.1,241. సబ్సిడీయేతర సిలిండర్ల ధర పెంపును పెట్రోలియం శాఖ అమల్లోకి తెచ్చిందో లేదో తనకు తెలియదని, అయితే, సబ్సిడీ సిలిండర్ల పరిమితిని పన్నెండుకు పెంచాలనే ప్రతిపాదనను, సబ్సిడీయేతర సిలిండర్ల ధర పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న ప్రతిపాదనను పరిశీలించనున్నామని చిదంబరం చెప్పారు. చమురు సంస్థలు సిలిండర్‌పై రూ.762.70 మేరకు నష్టపోతున్నాయని, ధర పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటే, ప్రభుత్వం సబ్సిడీని పెంచాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
పెరిగిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం బండ బాదుడు బాదుతోంది. వినియోగదారులపై మోయలేని భారం వేస్తోంది. నెల కిందటే సబ్సిడీ సిలిండర్ (14.2 కేజీ) ధర పెరిగింది. మరోమారు గ్యాస్ ధర పెంచాయి. రూ.1,112 నుంచి రూ.1,327కు పెరిగింది. దీం తో వినియోగదారుడు మొదట సి లిండర్ తీసుకునేటప్పుడు రూ.215 అదనంగా చెల్లించాలి. అదే సమయంలో బ్యాంకులో జమయ్యే సబ్సిడీ రూ.633 నుంచి రూ.843 కు పెరిగింది. సబ్సిడీ రూ.210 పెంచారు. ఈ లెక్కన వినియోగదారునిపై రూ.5 అదనపు భారం పడుతోంది. తొమ్మిది సిలిండర్లు దాటిన పక్షంలో అదనపు భారం మోయలేని పరిస్థితి. జిల్లావాసులపై ఏడాదికి రూ.1.50 కోట్ల వడ్డన జిల్లాలో 3,36,272 గ్యాస్ కనెక్షన్లు ఉన్నా యి. పెరిగిన రూ.5 లెక్కన సుమారుగా ఏడాదికి దాదాపు రూ.1.50 కోట్లపైన భా రం వినియోగదారులపై పడనుంది. సబ్సి డీ సిలిండర్లు ఏడాదికి తొమ్మిదే పరిమితి ఉండడంతో ఆ తర్వాత తీసుకునే సిలిండ ర్ పరంగా కష్టాలు తప్పవు. పెరిగిన మొత్తం ధర భరించాలి. ఆ విధంగా చూస్తే ప్రజలకు ఇది భారమే. రూ.215 పెంచడం ద్వారా జిల్లాలోని కనెక్షన్ల సంఖ్యను బట్టి ప్రతీసారి అదనంగా తీసుకునే సిలిండర్‌ను బట్టి రూ.6.45 కోట్ల భారం వినియోగదారుడు భరించాల్సి వస్తుంది. ముగిసిన సీడింగ్ గడువు.. వంట గ్యాస్ వినియోగదారులకు ఆధార్ ముడిపెట్ట వద్దని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించినా ప్రభుత్వం మొండి పంతం వీడడం లేదు. బ్యాంక్ ఖాత, గ్యాస్ కనెక్షన్లు ఆధార్‌కు అనుసంధానం చేయించుకొని వినియోగదారులకు జనవరి 1 నుంచి సబ్సిడీయేతర ధరకే కొనక తప్పదు. నగదు బదిలీ పథకంలో భాగంగా గ్యాస్ కనెక్షన్ ఆధార్ కార్డు ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి విధితమే. బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసిన వినియోగదారులకు ఇప్పటికే నగదు బదిలీ పథకం అ మల్లోకి వచ్చింది. తాజాగా గడువును పెం చలేదు. ఇప్పటికీ సిలిండర్ తీసుకునేటప్పు డు సబ్సిడీ పోనూ మిగితా మొత్తంను కట్టి వినియోగదారులు తీసుకునేవారు. ఆ అవకాశం ఇకపై ఉండదు. పూర్తిస్థాయి సిలిండర్ ధరను చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ఆధార్‌ను అనుసంధానం చేసుకున్న పక్షంలో వారికి సబ్సిడీ బ్యాంకులో జమ అయ్యే పరిస్థితి ఉంటుంది.