
వ్యవసాయ భూములు, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడ ఎండు కర్రలు, చెట్లు ఎండిపోయి కనిపించినా వాటి కర్రలు పోగు చేసుకుని.. మోపులు కడుతున్నారు. ఇలా మోపులు నెత్తిన పెట్టుకొని ఇళ్లకు పయనమవుతున్నారు. ఇదంతా గ్యాస్ ధరలు పెరగడంతో పల్లె జనం కిలోమీటర్ల దూరం వెళ్లి చేస్తున్న పని. రహదారుల వెంట కట్టెలు మోసుకొస్తున్న దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది.
–సాక్షి, రాయపర్తి