Domestic gas
-
షాక్.. భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు!
నెల ప్రారంభంలో గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. గత కొన్ని నెలలుగా కమర్షియల్ సిలిండర్ ధరల్ని తగ్గిస్తూ వస్తున్న కేంద్రం ఒక్కసారిగా రూ.209లు పెంచింది. అదే సమయంలో గృహ వినియోగదారులకు మాత్రం ధరల పెరుగుదల నుంచి ఊరట లభించింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్ని స్థిరంగా ఉంచింది. నేటి నుంచి పెరిగిన ధరలతో ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1731.50కి చేరింది. కోల్‌కతాలో రూ.1839.50, చెన్నైలో రూ.1898, ముంబైలో రూ.1684గా ఉంది. సిలిండర్ మీద సబ్సిడీ ఈ ఏడాది ప్రారంభంలో, దేశంలోని 330 మిలియన్ల వినియోగదారుల ఎల్పీజీ గ్యాస్ ధరల్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. ఆగస్టు 29న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో ‘ఎల్పీజీ సిలిండర్ల గృహ వినియోగదారులందరికీ సిలిండర్‌కు రూ. 200 సబ్సిడీ లభిస్తుంది. పీఎం ఉజ్వల పథకం కింద ఉన్న వినియోగదారులు ప్రస్తుత సబ్సిడీపై ఈ సబ్సిడీని పొందుతారు, ”అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రక్షా బంధన్, ఓనం కానుకగా ఎల్పీజీ సిలిండర్లపై అదనపు సబ్సిడీ తక్షణమే అమల్లోకి వచ్చిందని అన్నారు. దీంతో ఉజ్వల లబ్ధిదారులకు ఎల్పీజీ సిలిండర్‌పై రూ.400 సబ్సిడీ పొందే అవకాశం లభించినట్లైంది. చదవండి👉 ఎలాన్ మస్క్ క్రియేటర్లకు వందల కోట్లు చెల్లిస్తున్నారు.. మీరు తీసుకున్నారా? -
మూణ్నెళ్లలో ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్ సరఫరా: ఏజీ అండ్ పీ ప్రథాన్
వచ్చే సెప్టెంబరు నెల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తరూ జిల్లా సమీప ప్రాంతాల్లో ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్ సరఫరా ప్రారంభించడానికి కృషి చేస్తున్నామని ప్రముఖ ఇంథన సరఫరా సంస్థ ఏజీ అండ్ పీ ప్రథాన్ రీజనల్ హెడ్ చిరాగ్ ‘సాక్షి’కి తెలిపారు. సింగపూర్ కు చెందిన ఈ కంపెనీ ఇటీవలే కేంద్ర పెట్రోలియం బోర్డ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు పొంది ఇంధన సరఫరా ప్రారంభించనుంది. భవిష్యత్తులో పోర్టబుల్ జనరేటర్స్, ఎయిర్ కంటిషనర్స్ కూడా గ్యాస్‌తో వినియోగించుకునే పరిస్థితి రానుందంటున్న ఆయన సాక్షితో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే... ‘ఆదా’కు ఆదా... భధ్రతకు భరోసా ఈ పైప్‌లైన్ గ్యాస్ ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుత సిలిండర్‌కి సరిపడా గ్యాస్ దీని ద్వారా రూ.750 నుంచి రూ 800 వరకూ ధరలోనే వస్తుంది. అంటే ప్రస్తుతం అవుతున్న ఖర్చులో 10 నుంచి 15శాతం ఆదా అవుతుంది. ఈ పైప్డ్ నేచురల్ గ్యాస్ సంప్రదాయ సిలిండర్ గ్యాస్‌తో పోలిస్తే చవక మాత్రమే కాదు అత్యంత సురక్షితం కూడా. సరఫరా మొత్తం పైప్‌లైన్ సిస్టమ్‌లోనే సాగుతుంది. కాబట్టి ప్రత్యేకించి స్టోరేజ్ అవసరం లేదు. పైప్‌లైన్ ద్వారా ఒక కిచెన్ పాయింట్ అందిస్తాం. అవసరాన్ని బట్టి ఓ అడిషనల్ పాయింట్ కూడా అదే కిచెన్‌లో తీసుకోవచ్చు. బాత్ రూమ్ కోసం కావాలంటే మరో అదనపు పాయింట్ ఇస్తాం. మునిసిపల్ వాటర్ నీటి పంపు తిప్పితే నీళ్లొచ్చినట్టే ఈ గ్యాస్ కూడా వస్తుంది. వినియోగించిన ఇంధనాన్ని లెక్కించేందుకు మీటర్ ఏర్పాటు ఉంటుంది. మీటర్‌ను బట్టి వాడుకున్న ఇంధనానికి బిల్ చెల్లించాల్సి ఉంటుంది. కరెంట్ బిల్లుల్లానే కాకపోతే అందులోలా ఇందులో స్లాబ్స్ ఉండవు. ఇక గ్యాస్ వినియోగదారులకు నిరంతర సేవలు అందించేందుకు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24/7 ఇన్స్టాలేషన్ తర్వాత సర్వీస్ అందిస్తున్నాం. దీని కోసం ఒక పూర్తిస్థాయి టీమ్ పనిచేస్తుంది. రెస్టారెంట్స్‌కు మరింత మేలు... నివాస గృహాలతో పోలిస్తే రెస్టారెంట్స్ లాంటి వ్యాపార సంస్థలకు పైప్‌లైన్ గ్యాస్ ద్వారా ఆదా అయ్యే 10శాతం అంటే చాలా పెద్ద మొత్తం అనే చెప్పాలి. ఇది వారి లాభాలను బాగా పెంచుతుంది. వారాంతాల్లో హోటల్స్ దాబాలు వంటి చోట్ల డిమాండ్ కారణంగా అధిక ఇంధనం కోసం అదనపు సిలిండర్లు మీద ఆధారపడతారు. అయితే ఇక్కడ ఆ కొరత ఉండదు. ఎంత కావాలంటే అంత గ్యాస్ సిద్ధంగా ఉంటుంది. ఈ ఆకర్షణీయమైన ప్రయోజనం కారణంగా భవిష్యత్తులో తిరుపతిలో అన్ని రెస్టారెంట్స్ పైప్డ్ గ్యాస్‌కి కనెక్ట్ అవుతాయి. రాబోయే రోజుల్లో తిరుమలకు కూడా అందించడానికి తితిదేతో చర్చలు నడుస్తున్నాయి. అయితే దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. స్పందన బాగుంది... ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా కోరుతూ ప్రజల నుంచి ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు అందుకున్నాం. కేవలం 4 నెలల్లోనే 2వేల 500 కంటే పైగా అప్లికేషన్స్ వచ్చాయి. స్థానిక సంస్థలు మాకు అవసరమైన విధంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో జారి చేసింది గూడూరు మునిసిపల్ కార్పొరేషన్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్, నాయుడు పేట మునిసిపల్ కార్పొరేషన్.. ల నుంచి పైప్‌లైన్ నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తు చేశాం. ఇన్స్టలేషన్ ప్రారంభించాం... తిరుపతి టౌన్లో కూడా శ్రీనివాసపురం, రోడ్‌నెం 15, 16లలో డొమెస్టిక్ సర్వీసెస్ స్టార్ట్ చేశాం. 300 నివాస గృహాల్లో ఇన్స్టలేషన్ పూర్తయింది. నెల్లూరులో కూడా 450 ఇళ్లకి డొమెస్టిక్ ఇన్స్టలేషన్ పూర్తయింది. పైప్‌లైన్ ప్రోగ్రెస్‌లో ఉంది. వచ్చే 2నెలల్లో పూర్తి అవుతుంది. స్థానిక సరఫరా పైప్‌లైన్ నెట్వర్క్ని నాయుడపేట టౌన్, ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా ప్రారంభించాం. ప్రభుత్వం చెప్పినట్టుగా రిఫండబుల్ డిపాజిట్ రూ.6వేలు తీసుకోవచ్చు కానీ మేం అది తీసుకోకుండానే ప్రస్తుతం కనెక్షన్ వర్క్ పూర్తి చేస్తున్నాం. వాహనాల కోసం సీఎన్జీ పెట్రోల్, డీజిల్ వాహనాలను పిఎన్జి వాహనాలుగా మార్చే రెట్రో ఫిట్మెంట్ సెంటర్స్ ద్వారా సేవలు కూడా అందిస్తున్నాం. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం కడప లాంటి చోట్ల డీజిల్ ఆటోలు బాగా ఎక్కువ వాటిని సీఎన్జీ ఆటోలుగా మార్చవచ్చు. దీని వల్ల పర్యావరణానికి ఎంతో ఉపయక్తం. అంతేకాక ఈ మార్పిడి కోసం అయ్యే ఖర్చు వాహన యజమానులకు కేవలం 6 నెలల్లో రికవరీ చేసుకోవచ్చు. డీజిల్‌తో పోలిస్తే సిఎన్జి వల్ల 30 నుంచి 50శాతం ఇంధన ఖర్చు అంటే కనీసం నెలకు రూ.5వేలు ఆదా అవుతుంది. ఇక భారీ వాహనాలు, ఎక్కువ దూరాలు నడిపేవారికి ఒక్క రోజులోనే భారీ మొత్తంలో ప్రయోజనం కలుగుతుంది. ఇంధనాన్ని నింపుకోవడంలో ఇబ్బందులు రాకుండా ప్రతీ 60 నుంచి 100 కి.మీ లోపు సిఎన్జి స్టేషన్స్ ఉండేలా చూస్తున్నాం. -
Photo Feature: కట్టెల కాలం..!
వ్యవసాయ భూములు, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడ ఎండు కర్రలు, చెట్లు ఎండిపోయి కనిపించినా వాటి కర్రలు పోగు చేసుకుని.. మోపులు కడుతున్నారు. ఇలా మోపులు నెత్తిన పెట్టుకొని ఇళ్లకు పయనమవుతున్నారు. ఇదంతా గ్యాస్ ధరలు పెరగడంతో పల్లె జనం కిలోమీటర్ల దూరం వెళ్లి చేస్తున్న పని. రహదారుల వెంట కట్టెలు మోసుకొస్తున్న దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. –సాక్షి, రాయపర్తి -
LPG Gas: వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన వంటగ్యాస్ ధర
న్యూఢిల్లీ: దేశంలో వంట గ్యాస్ ధరలు మరోసారి మంటెత్తాయి. అంతర్జాతీయ ఇంధన ధరల పెరుగుదలకు అనుగుణంగా దేశీయ వంట గ్యాస్ ధర మంగళవారం సిలిండర్‌కు రూ.50 చొప్పున పెరిగింది. దీంతో 14.2 కిలోల నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.949.50గా ఉంది. గత సంవత్సరం అక్టోబర్ తర్వాత ఎల్పీజీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ముడిసరుకు ధరలు పెరుగుతున్నప్పటికీ అక్టోబర్ ప్రారంభం నుంచి గ్యాస్ ధరలు పెంచలేదు. పెంచిన ధరలతో 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 349 కాగా, 10 కిలోల కాంపోజిట్ బాటిల్ రూ. 669గా ఉంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2003.50గా ఉంది. పెరిగిన గ్యాస్ ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. పెంచిన ధరలతో తెలంగాణలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1000 దాటింది. -
వంటగ్యాస్‌పై వ్యాట్ వాత!
* 32.71 లక్షల వినియోగదారులపై రూ. 7.19 కోట్ల వ్యాట్ భారం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టంలోని మూడు జిల్లాల్లో శనివారం నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. తొలిదశలో పథకం అమలవుతున్న హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని వినియోగదారులు ఇకపై రాయితీయేతర సిలిండర్‌కు రూ. 952 ధర చెల్లించాలి. తర్వాత ప్రభుత్వ సబ్సిడీ వినియోగదారుల ఖాతాలో జమవుతుంది. ఇంతమొత్తాన్ని ఒకేసారి చెల్లించడమే పేద, దిగువ మధ్యతరగతి వినియోగదారులకు తలకు మించిన భారం కాగా, వ్యాట్‌రూపంలో మరో రూ. 22 అదనంగా వడ్డించబోతున్నారు. తొలిదశలో 3 జిల్లా ల్లో ఉన్న 32.71 లక్షల మంది వినియోగదారులపై వ్యాట్ రూపంలో సుమారు రూ. 7.19 కోట్ల భారం పడనుంది. ఈ భారాన్ని భరించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తేనే రాయితీ మొత్తం రూ. 508 వినియోగదారుని ఖాతాలో జమ అవుతుందని, లేకుంటే వ్యాట్ మినహాయించి రూ.486 ఖాతాలో పడుతుందని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. రాయితీరహిత సిలిండర్ ధర రూ. 952లో 5 శాతం అంటే రూ. 45 వరకు వ్యాట్ ఉంటుంది. వినియోగదారుడు చెల్లించే ధర రూ. 444 పోనూ... మిగతా రూ. 508లో వ్యాట్ రూ. 22 వరకు ఉంటుంది. ఈ మొత్తం పోగా మిగిలిన రూ. 486 మాత్రమే వినియోగదారుని ఖాతాలో జమయ్యే అవకాశముంది. అయితే వ్యాట్ ను తెలంగాణ ప్రభుత్వం భరించాలని కోరుతూ సంబంధిత అధికారులకు లేఖ రాసినట్లు చమురు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. దీనిపై శనివారం స్పష్టత వచ్చే అవకాశముంది. ఇప్పటికే నగదు బదిలీ మార్గదర్శకాలను ప్రకటించిన ప్రభుత్వం ఈ పథకానికి ఆధార్ తప్పనిసరి కాదని తెలిపింది. నగదు బదిలీకి బ్యాంకు ఖాతా ఉంటే సరిపోతుందని, ఎల్పీజీ కనెక్షన్‌కు ఖాతాను అనుసంధానం చేస్తే రాయితీ నేరుగా ఆ ఖాతాలో జమవుతుందని వెల్లడించింది. ఫిబ్రవరి 14 వరకు పథకంలో చేరకపోయినా, బ్యాంక్ ఖాతా, ఆధార్ సంఖ్య ఇవ్వకపోయినా.. ఈ 3 నెలలు రాయితీ ధరకే సిలిం డర్ అందిస్తామని ప్రకటించింది. నగదు బదిలీ అమలు కానున్న 3 జిల్లాల పరిధిలో దాదాపు 32.71 లక్షల మంది వినియోగదారులున్నారు. వీరిలో సుమారు 25.04 లక్షల మంది వినియోగదారులకే బ్యాంకు ఖాతాల అనుసంధానం జరి గింది. ఈ లెక్కన 74.9 శాతం మందే శనివారం నుంచి నగదు బదిలీ పరిధిలోకి వస్తారు. మిగతా వారికి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలోనే సబ్సిడీ సిలిండర్‌ను అందజేస్తారు. 3 నెలల్లో వీరు తమ గ్యాస్ కనెక్షన్‌కు బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోవాలి. గ్యాస్ అక్రమ మార్గాలను నివారించేందుకే దీన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం కింద ఆధార్‌తో సంబంధం లేకుండా వినియోగదారులకు బ్యాంక్ ఖాతా ఉంటే సబ్సిడీ నగదు రూపంలో బదిలీ అవుతుందని హెచ్‌పీసీఎల్ సీనియర్ మేనేజర్, రాష్ట్రస్థాయి సమన్వయకర్త శ్రీనివాస్, ఎల్పీజీ ముఖ్య ప్రాంతీయ మేనేజర్ ఎంబీ ఇంగోలే శుక్రవారం స్పష్టం చేశారు. బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకోని వినియోగదారులకు నవంబర్ 15 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకు సబ్సిడీపై సిలిండర్ సరఫరా జరుగుతుందన్నారు. ఆ తర్వాత మరో మూడు మాసాల (మే 14) వరకు అదనపు మినహాయింపుకాలంగా పరిగణిస్తామని వివరించారు. ఆలోగా అందరూ నగదు బదిలీ పథకంలోకి మారాలని కోరారు. -
అధిక ధరతోనే ఉత్పత్తి పెరిగేది...
న్యూఢిల్లీ: సహజవాయువు(గ్యాస్)కు అధిక ధర చెల్లించడం వల్ల దే శీయంగా ఉత్పత్తి పుంజుకుంటుందని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. తద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి గ్యాస్ ధర రెట్టింపుకానున్న నేపథ్యంలో మొయిలీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్ ధరలకు సంబంధించి కొత్త విధానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రైవేట్ రంగ ఆయిల్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కేజీ డీ6లో ఉత్పత్తి చేసే గ్యాస్‌కు సైతం కొన్ని షరతులతో ఇవే నిబంధనలు అమలయ్యేలా కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. గ్యాస్ ధరను పెంచకపోతే దేశీయంగా ఉత్పత్తి నిలిచిపోతుందని మొయిలీ వ్యాఖ్యానించారు. వెరసి దిగుమతుల భారం పెరుగుతుందని పేర్కొన్నారు. ఏఐఎంఏ ఇక్కడ నిర్వహించిన ప్రభుత్వ రంగ సంస్థల మూడో సదస్సుకు ఆయన హాజరయ్యారు. దేశీయ గ్యాస్ అవసరాల్లో సగభాగాన్ని ప్రస్తుతం దిగుమతుల ద్వారా పూరించుకుంటున్నామని తెలిపారు. గ్యాస్ వెలికితీతకు దేశీయంగా పలు అవకాశాలున్నప్పటికీ ఇందుకు భారీ స్థాయిలో నిధులను వె చ్చించాల్సి ఉంటుందని చెప్పారు. తక్కువ ధర వల్లే ప్రస్తుత తక్కువ ధరల కారణంగా ఇప్పటికే మూడు లక్షల ఘనపు మీటర్ల గ్యాస్ నిల్వలను వెలికితీయడం లాభసాటికాదని డీజీహెచ్ పేర్కొన్నదని మొయిలీ వివరించారు. ప్రస్తుతం ఒక ఎంబీటీయూ గ్యాస్‌కు 4.2 డాలర్లను చెల్లిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్) నుంచి ఈ ధర 8.4 డాలర్లకు పెరగనుంది.ఇందువల్లనే ఓఎన్జీసీ, ఆర్ఐఎల్ వంటి సంస్థలకు చెందిన కొన్ని బ్లాకుల్లో గ్యాస్ నిల్వలను వెలికితీయడం లాభసాటికాదని డీజీహెచ్ పేర్కొన్నట్లు తెలిపారు. గ్యాస్‌ను 12-13 డాలర్లకు దిగుమతి చేసుకోవడం లేదా ఇంతకంటే బాగా తక్కువ ధరను చె ల్లించడం ద్వారా దేశీయంగా నిల్వలను వెలికితీయడాన్ని ప్రోత్సహించడమే మనముందున్న ఏకైక అవకాశమని మొయిలీ వ్యాఖ్యానించారు. అయితే దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని ప్రోత్సహించకపోతే పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తుందని వివరించారు. రెండు నెలల్లో డీజిల్‌పై నియంత్రణ ఎత్తివేత రానున్న రెండు నెలల్లో డీజిల్ ధరలపై పూర్తిస్థాయిలో నియంత్రణలను ఎత్తివేయనున్నట్లు మొయిలీ చెప్పారు. ఒక మీడియా సంస్థ ఇక్కడ నిర్వహించిన ఆటోకార్ అవార్డుల కార్యక్రమానికి మొయిలీ హాజరయ్యారు. రానున్న కొద్ది రోజుల్లో డీజిల్‌ను పూర్తిస్థాయిలో డీరెగ్యులేట్ చేయగలమని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. డాలరుతో మారకంలో రూపాయి భారీగా బలహీనపడకపోయి ఉంటే ఈ పాటికే డీజిల్ ధరలపై నియంత్రణలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసి ఉండేదని వివరించారు.