
న్యూఢిల్లీ: దేశంలో వంట గ్యాస్ ధరలు మరోసారి మంటెత్తాయి. అంతర్జాతీయ ఇంధన ధరల పెరుగుదలకు అనుగుణంగా దేశీయ వంట గ్యాస్ ధర మంగళవారం సిలిండర్‌కు రూ.50 చొప్పున పెరిగింది. దీంతో 14.2 కిలోల నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.949.50గా ఉంది. గత సంవత్సరం అక్టోబర్ తర్వాత ఎల్పీజీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ముడిసరుకు ధరలు పెరుగుతున్నప్పటికీ అక్టోబర్ ప్రారంభం నుంచి గ్యాస్ ధరలు పెంచలేదు.
పెంచిన ధరలతో 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 349 కాగా, 10 కిలోల కాంపోజిట్ బాటిల్ రూ. 669గా ఉంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2003.50గా ఉంది. పెరిగిన గ్యాస్ ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. పెంచిన ధరలతో తెలంగాణలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1000 దాటింది.
Comments
Please login to add a commentAdd a comment