Cooking gas price
-
ఏప్రిల్ 1 నుంచి రూ.500లకే గ్యాస్ సిలిండర్!
జైపూర్: దేశంలో వంట గ్యాస్ ధరలు ఆకాశన్నంటుతూ సామాన్యుడికి పెనుభారంగా మారిన వేళ తమ రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి సిలిండర్ ధరను రూ.500లకు తగ్గిస్తామని ప్రకటించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ఉజ్వల పథకంలో నమోదు చేసుకున్న వారికి ఈ రాయితీ అందిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఈ ప్రకటన చేశారు ముఖ్యమంత్రి. బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం సన్నద్ధమవుతున్నాం. ఇప్పుడు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఉజ్వల స్కీంలో పేదలకు ప్రధాని మోదీ ఎల్పీజీ కనెక్షన్లు, స్టౌవ్ ఇచ్చారు. కానీ, సిలిండర్లు ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే ధరలు రూ.400 నుంచి రూ.1,040 మధ్య ఉండటమే. ఉజ్వల స్కీంలో నమోదు చేసుకున్న నిరుపేదలకు రూ.500లకే ఏడాదికి 12 సిలిండర్లు అందిస్తాం.’ అని పేర్కొన్నారు. మరోవైపు.. వచ్చే ఏడాదిలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రజలపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపిస్తున్నట్లు విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదీ చదవండి: కర్ణాటక అసెంబ్లీ తొలిరోజున సరిహద్దులో ఉద్రిక్తత.. బెళగావిలో 144 సెక్షన్ అమలు -
Bharat Jodo Yatra: దేశ పునర్నిర్మాణం కోసమే ‘జోడో’
త్రిసూర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లాలోని తిరూర్ నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. వందలాది మంది కార్యకర్తలు ఆయన వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఉదయం వడక్కంచెరీలో పాదయాత్ర ముగిసిన తర్వాత రాహుల్ హెలికాప్టర్లో నీలంబూర్‌కు చేరుకున్నారు. అక్కడ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత అర్యదన్ మొహమ్మద్(87)కు నివాళులర్పించారు. మొహమ్మద్ ఆదివారం మృతిచెందారు. పార్టీకి ఆయన అందించిన సేవలను రాహుల్ గుర్తుచేసుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడానికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. దేశ పునర్నిర్మాణం కోసం తాము చేపట్టిన చరిత్రాత్మక భారత్ జోడోయాత్రలో ప్రజలంతా పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. బలమైన, స్వావలంబన భారత్ మనకు కావాలని పేర్కొంది. ఆదివారం రాహుల్ గాంధీ పాదయాత్రకు విశేషమైన ప్రజా స్పందన లభించింది. మహిళలు, పిల్లలు సెక్యూరిటీ వలయాన్ని చేధించుకొని రాహుల్ వద్దకు చేరుకున్నారు. ఆయనతో కలిసి ఫొటోలు తీసుకున్నారు. -
LPG Gas: వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన వంటగ్యాస్ ధర
న్యూఢిల్లీ: దేశంలో వంట గ్యాస్ ధరలు మరోసారి మంటెత్తాయి. అంతర్జాతీయ ఇంధన ధరల పెరుగుదలకు అనుగుణంగా దేశీయ వంట గ్యాస్ ధర మంగళవారం సిలిండర్‌కు రూ.50 చొప్పున పెరిగింది. దీంతో 14.2 కిలోల నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.949.50గా ఉంది. గత సంవత్సరం అక్టోబర్ తర్వాత ఎల్పీజీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ముడిసరుకు ధరలు పెరుగుతున్నప్పటికీ అక్టోబర్ ప్రారంభం నుంచి గ్యాస్ ధరలు పెంచలేదు. పెంచిన ధరలతో 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 349 కాగా, 10 కిలోల కాంపోజిట్ బాటిల్ రూ. 669గా ఉంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2003.50గా ఉంది. పెరిగిన గ్యాస్ ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. పెంచిన ధరలతో తెలంగాణలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1000 దాటింది. -
గ్యాస్ ‘బండ’ భారం.. మరో రూ.25 పెంపు
సాక్షి, హైదరాబాద్: ఒక పక్క పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతుంటే, మరో పక్క గృహావసర గ్యాస్ సిలిండర్ ధర కూడా వాటితో పోటీ పడుతోంది. ఈ నెలలోనే సిలిండర్‌పై రూ.75 మేర పెంచిన ఆయిల్ కంపెనీలు గురువారం మళ్లీ మరో రూ.25 మేర పెంచేశాయి. దీంతో హైదరాబాద్‌లో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.846.50కి చేరింది. ఒక్క నెలలోనే సిలిండర్ ధర ఏకంగా రూ.100 మేర పెరిగిపోవడంతో సామాన్యుడికి చుక్కలు కనపడుతున్నాయి. 3 నెలల వ్యవధిలో రూ. 200 పెంపు నవంబర్‌లో సిలిండర్ ధర రూ.646.50 ఉండగా, డిసెంబర్లో ఏకంగా రూ.100 మేర పెరిగిపోయింది. దీంతో ధర రూ.746.50కి చేరింది. జన వరిలో ఈ ధరలు స్థిరంగా కొనసాగినా, ఫిబ్రవరి 4న రూ.25, 15న మరోసారి రూ.50 చొప్పున ఆయిల్ కంపెనీలు బాదేశాయి. దీంతో సిలిండర్ ధర రూ.821.50కి చేరింది. తాజాగా మళ్లీ రూ.25 పెంచడంతో అదికాస్తా రూ.846.50 అయ్యింది. ఇలా ఈ మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా రూ.200 మేర పెరిగిపోయిం దన్నమాట. రాష్ట్రంలో ప్రస్తుతం 1.18 కోట్ల గృహా వసర సిలిండర్లు వినియోగంలో ఉండగా ప్రతిరోజూ సగటున 1.20 లక్షల సిలిండర్లు డెలివరీ చేస్తున్నారు. ఈ సిలిండర్‌పై ఇవ్వాల్సిన సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం క్రమంగా కోత పెడుతూ వస్తోంది. గత ఏడాది మార్చి ముందు వరకు ఒక్కో సిలిండర్‌పై రూ.220 వరకు సబ్సిడీ జమ చేసిన కేంద్రం.. ప్రస్తుతం కేవలం రూ.40 మాత్రమే జమ చేస్తోంది. అంటే వినియోగదారుడిపై సబ్సిడీ కోత భారం ప్రస్తుతం ఒక్కో సిలిండర్‌కు రూ.180 పడుతోందన్నమాట. దీనికి ఈ మూడు నెలల్లో పెరిగిన ధరల భారం రూ.200 కలిపితే మొత్తం రూ.380 మేర గ్యాస్ భారం పడినట్లయింది. ఓ పక్క సబ్సిడీలో కోతలు, మరోపక్క ధర పెంపు వాతలతో గృహ వినియోగదారులు లబోదిబోమంటున్నారు. -
మోతెక్కిన వంట గ్యాస్..
సాక్షి, న్యూఢిల్లీ : మెట్రో నగరాల్లో సబ్సిడీయేతర వంట గ్యాస్ ధర సిలిండర్‌కు రూ 37 చొప్పున పెరిగింది. వరుసగా మూడు నెలలు వంట గ్యాస్ ధర దిగివచ్చినా జూన్ 1 నుంచి ఎల్పీజీ ధరలు భారమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధర పెరగడంతో సిలిండర ధరలను స్వల్పంగా పెంచామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) వెల్లడించింది. అంతర్జాతీయ ధరలు, డాలర్-రూపాయి మారకం రేటు వంటి అంశాల ఆధారంగా ఎల్పీజీ ధరలను ప్రతి నెల ఆరంభంలో సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ 636కు పెరిగింది. ఇక ఢిల్లీలో సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధర రూ 593కు చేరగా, కోల్‌కతాలో రూ 616, ముంబైలో రూ 590, చెన్నైలో రూ 606కు ఎగబాకింది. చదవండి : దిగొచ్చిన గ్యాస్ ధర..! -
ఏటీఎఫ్, వంట గ్యాస్ ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలతోపాటు, వంటగ్యాస్‌కు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు రేట్లను సవరించాయి. ఫలితంగా ఢిల్లీలో ఏటీఎఫ్ కిలో లీటర్ ధర రూ.1,637 పెరిగి రూ.64,324 అయింది. నెల వ్యవధిలో ఏటీఎఫ్ ధరలను పెంచడం రెండోసారి. డిసెంబర్ 1న కూడా కిలోలీటర్‌పై రూ.14 వరకు పెరిగింది. తాజా సవరణతో ఏటీఎఫ్ ధరలు 2019 జూన్ తర్వాత గరిష్ట స్థాయికి చేరాయి. తీవ్ర పోటీ వాతావరణం, టికెట్ చార్జీల పెంపు విషయంలో పరిమితులతో నష్టాలను చవిచూస్తున్న ఎయిర్‌లైన్స్ కంపెనీలకు ఇంధన ధరల పెరుగుదల ప్రతికూలం కానుంది. రూ.714కు ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీ లేని 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.695 నుంచి రూ.714కు ఆయిల్ సంస్థలు పెంచేశాయి. గత సెప్టెంబర్ నుంచి వరుసగా నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర పెరుగుతూనే ఉండడం గమనార్హం. గడిచిన ఐదు నెలల్లో సబ్సిడీ లేని ఒక్కో సిలిండర్ ధర నికరంగా రూ.139.50 పెరిగింది. ఒక ఏడాదిలో ఒక వినియోగదారుడు 12 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లకు అర్హులు. ఆ తర్వాత కొనుగోలు చేసే సిలిండర్లకు మార్కెట్ ధరను చెల్లించాల్సి ఉంటుంది. గడిచిన నెలలో అంతర్జాతీయ రేట్ల సగటు ఆధారంగా మరుసటి నెల మొదటి తారీఖున ఏటీఎఫ్, ఎల్పీజీ ధరలను పెంచడం జరుగుతోంది. ఇక ప్రజా పంపిణీ ద్వారా సరఫరా చేసే లీటర్ కిరోసిన్ ధర 26 పైసలు పెరిగి ముంబైలో రూ.35.58కు చేరింది. కిరోసిన్‌పై సబ్సిడీ పూర్తిగా తొలగిపోయే వరకు ప్రతీ నెలా 26 పైసల పెంపునకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విషయం గమనార్హం. -
అక్టోబర్‌కు ముందే గ్యాస్ రేటుపై నిర్ణయం
న్యూఢిల్లీ: సహజ వాయువు (నాచురల్ గ్యాస్) ధరల సవరణ అంశంపై అక్టోబర్ 1 కన్నా ముందే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తెలిపారు. పరిశ్రమ వర్గాలు, నిపుణులతో చర్చించేందుకే ఈ అంశాన్ని గతంలో వాయిదా వేసినట్లు వివరించారు. ప్రతిపాదిత రంగరాజన్ ఫార్ములాలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వీటిని సరిచేస్తామన్నారు. ప్రస్తుతం యూనిట్‌కి 4.2 డాలర్లుగా ఉన్న గ్యాస్ ధర.. రంగరాజన్ ఫార్ములా అమలు చేస్తే రెట్టింపై దాదాపు 8.8 డాలర్లకు పెరుగుతుంది. ఫలితంగా గ్యాస్‌ను ముడిసరుకుగా ఉపయోగించే ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోనున్నాయి. గ్యాస్ ధర డాలర్ పెరిగితే ఎరువుల ఉత్పత్తి వ్యయం టన్నుకు రూ. 1,370, విద్యుత్ టారిఫ్‌లు యూనిట్‌కు 45 పైసల మేర పెరుగుతాయని అంచనా. వంటగ్యాస్ రేటు పెంచం.. వంటగ్యాస్, కిరోసిన్ రేట్లను తక్షణమే పెంచే యోచనేదీ లేదని ప్రధాన్ స్పష్టం చేశారు. డీజిల్ రేటు ప్రతి నెలా లీటరుకు 50 పైసల మేర పెంపు కొనసాగుతుందన్నారు. డీజిల్ విక్రయాలపై ఆదాయ నష్టాలు పూర్తిగా భర్తీ అయిపోయిన తర్వాత పెట్రోల్ తరహాలోనే ఈ ఇంధనం రేట్లపై కూడా నియంత్రణ ఎత్తివేస్తామని ప్రధాన్ చెప్పారు. కష్టాల్లో ఆర్థిక రంగం: రాజ్‌నాథ్ కాగా, లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారత్ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందన్నారు. పరిస్థితి చక్కదిద్దడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇందుకు మరికొంత సమయం పడుతుందని వివరించారు. -
వంట గ్యాస్ ధర పెంపు వాయిదా
న్యూఢిల్లీ: వంటగ్యాస్ ధర పెంపును వాయిదా వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ రోజు ఇక్కడ జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వరికి మద్దతు ధర 50 రూపాయలు పెంచారు. దాంతో క్వింటాలు ధర 1360 రూపాయలకు చేరుతుంది. పత్తి, పప్పుధాన్యాల మద్దతు ధరను కూడా పెంచారు. ఇండస్ట్రియల్ పార్క్‌ల నిర్మాణానికి చైనాతో భాగస్వామ్య ఒప్పందం చేసుకోవాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఇదిలా ఉండగా, వరికి పెంచిన మద్దతు ధర చాలా స్వల్పం అని పలువురు రైతు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే మద్దతు ధరను ఇంకా ఎక్కవ పెంచితే ఎక్కువ మంది రైతులు వరిని పండించడానికే ఆసక్తి కనబరుస్తారని కేంద్రం చెబుతోంది. అందువల్ల ఇతర పంటల ఉత్పత్తి తగ్గుతుందని కేంద్రం అభిప్రాయపడుతోంది. ఆ కారణంగానే మద్దతు ధర ఎక్కవగా పెంచలేదని కేంద్రం తెలిపింది.