LPG
-
అతి పొడవైన ఎల్పీజీ పైప్‌లైన్ త్వరలోనే ..
ప్రపంచంలోనే అతి పొడవైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ( LPG ) పైప్‌లైన్ భారత్ నిర్మించనుంది. పశ్చిమ తీరంలోని కాండ్లా నుంచి ఉత్తరాన గోరఖ్‌పూర్ వరకు 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 2025 జూన్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. 1.3 బిలియన్ డాలర్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ రవాణా ఖర్చులను, ఎల్పీజీ రవాణా సంబంధిత రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించనుంది.8.3 మిలియన్ టన్నుల ఎల్పీజీ రవాణా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ పైప్‌లైన్ ద్వారా ఏటా 8.3 మిలియన్ టన్నుల ఎల్పీజీ రవాణా కానుంది. ఇది భారతదేశ మొత్తం ఎల్పీజీ డిమాండ్‌లో సుమారు 25% ఉంటుంది. ఈ పైప్‌లైన్ అందుబాటులోకి వస్తే ట్రక్కులపై ఆధారపడటం రహదారి రవాణాపై ఒత్తిడి తగ్గిపోతుంది.ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలుఎల్పీజీ పైప్‌లైన్ నిర్మాణం గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను తీసుకువస్తుందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీని రవాణా చేయడానికి వందలాది ట్రక్కుల అవసరం లేకుండా పైప్‌లైన్ రవాణా ఖర్చులను తగ్గిస్తుంది. సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్వచ్ఛమైన వంట ఇంధనాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో ఎల్పీజీకి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో పైప్‌లైన్ నిర్మాణం కీలకం కానుంది.భద్రత, ప్రమాద నివారణపైప్లైన్ అత్యంత ముఖ్యమైన ప్రయోజనాలలో ఒకటి రోడ్డు ప్రమాదాలను తగ్గించడం. రోడ్డు మార్గం ద్వారా ఎల్పీజీ రవాణా ప్రమాదాలతో నిండి ఉంటుంది. ఇది గతంలో అనేక ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసింది. పైప్‌లైన్ సురక్షితమైన, మరింత విశ్వసనీయమైన రవాణా విధానాన్ని అందించడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గిస్తుంది. రోడ్డు భద్రతను పెంపొందించడానికి ఈ పరిణామం ఒక కీలకమైన అడుగు.సవాళ్లు, భవిష్యత్తు అవకాశాలుఆశాజనక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆలస్యం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల సరఫరా గొలుసు అంతరాయాలతో సహా ఈ ప్రాజెక్ట్ అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఏదేమైనా, పైప్‌లైన్ విజయవంతంగా పూర్తవడం భారతదేశ ఇంధన రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. భవిష్యత్తు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బెంచ్‌మార్క్‌ను ఏర్పరుస్తుంది. -
సామాన్యుడి జేబుకి చిల్లు!: రేపటి నుంచి కొత్త రూల్స్..
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2025-26 బడ్జెట్‌తో అనేక మార్పులు జరగనున్నాయి. అవి మాత్రమే కాకుండా ప్రతి నెలా పలు విభాగాల్లో రూల్స్ మారుతూ ఉంటాయి. గ్యాస్ సిలిండర్ ధరలు, యూపీఐ లావాదేవీలు వంటివాటితో పాటు మారుతి సుజుకి కంపెనీ తన వాహనాల ధరలను కూడా పెంచనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.ఎల్పీజీ సిలిండర్ ధరలుఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెల 1వ తేదీన మారుతూ ఉంటాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ల ధరలను అప్డేట్ చేస్తూ ఉంటాయి. సిలిండర్ ధరలలో జరిగే మార్పులు నేరుగా ప్రజలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి రేపు (శనివారం) సిలిండర్ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అనే విషయం తెలియాల్సి ఉంది.యూపీఐ లావాదేవీలుఫిబ్రవరి 1వ తేదీన యూపీఐ నిబంధలనలకు సమందించిన కీలక మార్పులు రానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్దిష్ట UPI లావాదేవీలను బ్లాక్ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్క్యులర్ కూడా విడుదలైంది. కాబట్టి కొత్త రూల్స్ రేపటి నుంచే అమలులోకి రానున్నాయి.తాజా ఆదేశాల ప్రకారం ప్రత్యేక అక్షరాలను(స్పెషల్ క్యారెక్టర్లు) కలిగిన యూపీఐ ఐడీ (@, #, $, %, &, మొదలైనవి)ల ద్వారా చేసే లావాదేవీలను కేంద్ర వ్యవస్థ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికీ యూపీఐ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.కార్ల ధరలుదిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL), తన వాహన ధరలను గణనీయంగా పెంచనుంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ధరలను పెంచనున్నట్లు.. పెరిగిన ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కంపెనీ ఆల్టో కే10, ఎస్ ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా, ఈకో, ఇగ్నిస్, బాలెనో, సియాజ్, ఎక్స్ఎల్6, ఫ్రాంక్స్, ఇన్విక్టో, జిమ్నీ, గ్రాండ్ విటారా మొదలైన కార్ల ధరలను పెంచనుంది.బ్యాంకింగ్ రూల్స్కోటక్ మహీంద్రా బ్యాంక్ తన సాధారణ సర్వీస్.. చార్జీలలో మార్పులు తీసుకురానుంది. ఈ మార్పుల గురించి తన వినియోగదారులకు తెలియజేసింది. కాబట్టి కొత్త నియమాలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇందులో ఉచిత ఏటీఎమ్ లావాదేవీల పరిమితికి తగ్గించడం.. బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన చార్జీలను పెంచడం వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: అయ్య బాబోయ్.. ఇక బంగారం కొనలేం!ఏటీఎఫ్ ధరలుఫిబ్రవరి 1 నుంచి విమాన ఇంధనం, ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరల్లో మార్పు జరిగే అవకాశం ఉంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన విమాన ఇంధన ధరలను సవరిస్తాయి. కాబట్టి, ఫిబ్రవరి 1వ తేదీన ధరలలో మార్పు జరిగితే, అది నేరుగా విమాన ప్రయాణికులపై ప్రభావం చూపుతుంది. -
జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పులు ఇవే..
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. ఈ రోజు జనవరి 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా కొన్ని అంశాల్లో మార్పులు అమలు అవుతున్నాయి. ఈపీఎఫ్ఓ, యూఎస్ వీసా, ఎల్పీజీ సిలిండర్ ధరలు, కార్ల ధరలు, రేషన్ కార్డులకు కేవైసీ నమోదు చేయడం వంటి వాటిలో మార్పులు వచ్చాయి. ఈమేరకు ఇప్పటికే ఆయా విభాగాలు ప్రకటనలు విడుదల చేశాయి. అందులో కొన్ని ముఖ్యమైన వాటి వివరాలు తెలుసుకుందాం.ఎల్పీజీ సిలిండర్ ధరలుజనవరి 1, 2025 నుంచి ప్రధాన నగరాల్లో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు తగ్గాయి. మారిన ధరలు కింది విధంగా ఉన్నాయి.ఢిల్లీ: రూ.1,804 (రూ.14.5 తగ్గింది)ముంబై: రూ.1,756 (రూ.15 తగ్గుదల)కోల్‌కతా: రూ.1,911 (రూ.16 తగ్గింది)చెన్నై: రూ.1,966 (రూ.14.5 తగ్గింది)14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర స్థిరంగా ఢిల్లీలో రూ.803, కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50గా ఉంది.కార్ల ధరలుమారుతి సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, బీఎండబ్ల్యూ(BMW) వంటి ప్రధాన ఆటో కంపెనీలు కార్ల ధరలను 3% వరకు పెంచాయి.రేషన్ కార్డులకు ఈ-కేవైసీరేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ(e-KYC) తప్పనిసరి. 2024 డిసెంబర్ 31లోగా ఈ-కేవైసీ పూర్తి చేయని రేషన్‌కార్డులు రద్దవుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.పెన్షన్ ఉపసంహరణ నిబంధనలుపెన్షనర్లు అదనంగా ఎలాంటి ధ్రువీకరణ అవసరం లేకుండా ఏదైనా బ్యాంకు నుంచి పెన్షన్‌ను ఉపసంహరించుకోవడానికి ఈపీఎఫ్ఓ అనుమతించింది.ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్డ్రాసులభంగా పీఎఫ్(PF) ఖాతాలోని నగదును ఉపసంహరించుకోవడానికి ఏటీఎం కార్డు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది.ఇదీ చదవండి: ఏడాది మొదటిరోజు తులం బంగారం ఎంతంటే..యూపీఐ పరిమితి పెంపుయూపీఐ 123పే కింద ఫీచర్ ఫోన్ యూజర్లకు చెల్లింపు పరిమితిని రూ.10,000కు కేంద్రం పెంచింది. ఇది గతంలో రూ.5,000గా ఉండేది. జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది.యూఎస్ వీసా రూల్స్నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా(Visa) దరఖాస్తుదారులు జనవరి 1 నుంచి ఒకసారి ఉచితంగా అపాయింట్మెంట్ను రీషెడ్యూల్ చేసుకోవచ్చు. -
జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతున్నాయ్!
2024 సంవత్సరానికి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. త్వరలో 2025 వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి LPG సిలిండర్ ధరలు, వీసా నిబంధనలు, ఫిక్స్డ్ డిపాజిట్ నియమాలు మాత్రమే కాకుండా కార్ల ధరలలో కూడా మార్పులు జరగనున్నాయి.అమెజాన్ ప్రైమ్జనవరి 1 నుంచే డివైజ్‌ల వాడకంపై అమెజాన్ ప్రైమ్ పరిమితులను విధించనుంది. అంటే కొత్త రూల్స్ ప్రకారం.. ఐదు డివైజ్‌లలో.. ఏ డివైజ్ అన్నదానితో సంబంధం లేకుండా.. ఒకసారికి రెండు టీవీలలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోలను చూడవచ్చు. దీనికి సంబంధించిన వివరాలను యూజర్లు ఈమెయిల్స్ ద్వారా అందుకుంటారు. అయితే సెట్టింగ్స్ పేజీలోని మేనేజ్ ఆప్షన్ ద్వారా డివైజ్‌లను సెట్ చేసుకోవచ్చు.ఈ మొబైల్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు2025 జనవరి 1 నుంచి పాత వెర్షన్స్ అయిన.. శాంసంగ్ గెలాక్సీ ఎస్3, గెలాక్సీ ఎస్ 3, గెలాక్సీ ఎస్4 మినీ, హెచ్‌టీసీ వన్ ఎక్స్, వన్ ఎక్స్ ప్లస్, సోనీ ఎక్స్‌పీరియా జెడ్, ఎక్స్‌పీరియా టీ, ఎల్జీ ఆప్టిమస్ జీ, నెక్సస్ 4, మోటో జీ, మోటో ఈ 2014 వంటి వాటిలో వాట్సాప్ పనిచేయదు.కార్ల ధరల పెంపు2025 జనవరి 1 నుంచే కార్ల ధరలు సమంత పెరగనున్నాయి. ఈ జాబితాలో మారుతీ సుజుకీ, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి, హ్యుందాయ్, మహీంద్రా మొదలైన కంపెనీలు ఉన్నాయి. కార్ల ధరలు 3 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం.థాయిలాండ్ ఈ-వీసా1 జనవరి 2025 నుంచి ప్రపంచంలోని ఏ దేశం నుంచి అయినా సందర్శకులు అధికారిక థాయిలాండ్ వీసా వెబ్సైట్ ద్వారా ఈ వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. దీంతో థాయిలాండ్ దేశానికి వెళ్లే సందర్శకుల సంఖ్య బాగా పెరుగుతుంది. ఎందుకంటే థాయిలాండ్ వీసా మరింత సులభమైపోతోంది.యూఎస్ వీసా నిబంధనల్లో మార్పులుచదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్లే వ్యక్తులు కొత్త వీసా నిబంధనల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. 2025 జనవరి 1 నుంచి భారతదేశంలోని యూఎస్ ఎంబసీలో.. వీసా అపాయింట్మెంట్ల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి అనేక మార్పులు చేయనున్నారు. అంతే కాకుండా యూఎస్ 'డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ' కూడా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో పెద్ద మార్పును తీసుకురానున్నట్లు సమాచారం. యూఎస్ వీసా నిబంధనల్లో మార్పుల గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.LPG సిలిండర్ ధరలుచమురు కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన సిలిండర్ ధరల సమాచారాన్ని అప్డేట్ చేస్తాయి. గత 5 నెలలుగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.RBI ఫిక్స్డ్ డిపాజిట్ నియమాలలో మార్పులురిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 జనవరి 1 నుంచి ఎన్బీఎఫ్సీలు & హెచ్ఎఫ్సీల ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన పాలసీని మార్చింది. ఇందులో ప్రజల నుంచి డిపాజిట్లను తీసుకునే నియమాలను మార్చే ప్రక్రియ, లిక్విడ్ ఆస్తులపై ఉంచే శాతం, డిపాజిట్ల బీమాకు సంబంధించిన నియమాలు ఉంటాయి.యూపీఐ 123 పేరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 9న 'యూపీఐ 123 పే' (UPI 123Pay) పరిచయం చేస్తూ.. లావాదేవీల పరిమితులను కూడా రూ.5,000 నుంచి రూ. 10,000లకు పొడిగించింది. ఇది స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా ఫీచర్ ఫోన్లలో కూడా పనిచేస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. -
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?
న్యూఢిల్లీ: దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు అక్టోబర్ ఒకటిన ఉదయాన్నే వంటగ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. 19 కిలోల గ్యాస్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.48.50 నుంచి రూ.50కి పెరిగింది.ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఇప్పుడు ఢిల్లీలో 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 1740 రూపాయలకు చేరింది. అయితే డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలో కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. గతంలో మాదిరిగానే ఢిల్లీలో రూ.803కే లభ్యం కానుంది.2024, అక్టోబర్ ఒకటి నుండి, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ముంబైలో రూ. 1,692.50, కోల్‌కతాలో రూ. 1,850.50, చెన్నైలో రూ. 1,903కు చేరింది. దీనికిముందు సెప్టెంబర్‌లో కూడా ఎల్పీజీ సిలిండర్ ధర సుమారు రూ.39 పెరిగి రూ.1,691.50కి చేరింది. దీనికి ముందు రూ.1,652.50గా ఉంది. కోల్‌కతాలో మంగళవారం నుంచి 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.48 పెరిగింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల కారణంగా, రెస్టారెంట్లు, హోటళ్లు, ధాబాలలోని ఆహార ధరలు పెరగనున్నాయి.ఇది కూడా చదవండి: 31నే దీపావళి.. తేల్చిచెప్పిన కాశీ పండితులు -
గ్యాస్ నుంచి ఆధార్ వరకు.. వచ్చే నెలలో మార్పులు
ఆగస్ట్ నెల ముగింపునకు వచ్చేసింది. త్వరలో సెప్టెంబర్ నెల ప్రారంభం కాబోతోంది. ప్రజల ఆర్థిక స్థితిని నేరుగా ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన మార్పులు సెప్టెంబర్ నుండి జరగబోతున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధరల నుండి ఆధార్ అప్డేట్ వరకు రానున్న మార్పులు, కొత్త క్రెడిట్ కార్డ్ నియమాలు మీ బడ్జెట్‌ను ఎలా ప్రభావితం చేస్తాయో ఇక్కడ చూద్దాం..ఎల్పీజీ ధరలుప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీన ఎల్పీజీ ధరలను సవరించడం సర్వసాధారణం. ఈ సర్దుబాట్లు వాణిజ్య, డొమెస్టక్ గ్యాస్ సిలిండర్లపై ప్రభావం చూపుతాయి. గత నెలలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.8.50 పెరిగింది. జూలైలో రూ.30 తగ్గింది. మరోసారి సెప్టెంబర్‌లో ఎల్పీజీ సిలిండర్ల ధర మార్పుపై అంచనాలు ఉన్నాయి.సీఎన్జీ, పీఎన్జీ రేట్లుఎల్పీజీ ధరలతో పాటు, చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF), సీఎన్జీ, పీఎన్జీ ధరలను కూడా సవరిస్తాయి. అందువల్ల, ఈ ఇంధనాల ధరల సవరణలు కూడా సెప్టెంబర్ మొదటి రోజున జరుగుతాయి.ఆధార్ కార్డ్ ఉచిత అప్‌డేట్ఆధార్ కార్డ్‌లను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 14. ఈ తేదీ తర్వాత, ఆధార్ కార్డ్‌లకు నిర్దిష్ట అప్డేట్లు చేసుకునేందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత ఆధార్ అప్డేట్ల కోసం గతంలో జూన్ 14 వరకే గడువు విధించగా దాన్ని సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు.క్రెడిట్ కార్డ్ నియమాలుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ యుటిలిటీ లావాదేవీల ద్వారా ఆర్జించే రివార్డ్ పాయింట్లపై సెప్టెంబర్ 1 నుండి పరిమితిని ప్రవేశపెడుతోంది. ఇకపై ఈ లావాదేవీలపై కస్టమర్లు నెలకు గరిష్టంగా 2,000 పాయింట్లను మాత్రమే పొందగలరు. థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా చేసిన విద్యాపరమైన చెల్లింపులకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ లభించవు.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సెప్టెంబర్ 2024 నుండి క్రెడిట్ కార్డ్‌లపై చెల్లించాల్సిన కనీస చెల్లింపును తగ్గిస్తోంది. అలాగే పేమెంట్ విండో 15 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా, యూపీఐ, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో రూపే క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్లు ఇతర చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్ల మాదిదే రివార్డ్ పాయింట్స్ అందుకుంటారు.మోసపూరిత కాల్స్ నియమాలుమోసపూరిత కాల్స్, సందేశాలపై సెప్టెంబర్ 1 నుండి కఠినమైన నిబంధనలు ఉండవచ్చు. ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ట్రాయ్ టెలికాం కంపెనీలను ఆదేశించింది. 140 మొబైల్ నంబర్ సిరీస్‌తో ప్రారంభమయ్యే టెలిమార్కెటింగ్ కాల్స్, వాణిజ్య సందేశాలను సెప్టెంబర్ 30 నాటికి బ్లాక్‌చెయిన్ ఆధారిత డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (DLT) ప్లాట్‌ఫారమ్‌కి మార్చడానికి ట్రాయ్ కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది.డియర్నెస్ అలవెన్స్కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సెప్టెంబరులో డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును ప్రకటించనుందని ఊహాగానాలు ఉన్నాయి. ప్రభుత్వం డీఏని 3 శాతం పెంచవచ్చు. అంటే ప్రస్తుతం 50% ఉన్న డీఏ 53 శాతానికి పెరిగే అవకాశం ఉంది. -
ఆగస్టు 1 నుంచి మారుతున్న రూల్స్ ఇవే..
జూలై నెల ముగింపునకు వచ్చేసింది. ఆగస్టు నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెలా ఆర్థిక విషయాలకు సంబంధించిన నియమాలలో మార్పు ఉంటుంది. వచ్చే ఆగస్టు నెలలోనూ పలు నిబంధనలు మారనున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చబోతోంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర కూడా మారనుంది. రానున్న మార్పుల గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం..ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెలా ఒకటో తేదీన నిర్ణయిస్తారు. గత నెలలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించింది. ఈసారి కూడా ప్రభుత్వం సిలిండర్ ధరను తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్క్రెడ్, చెక్, మొబిక్విక్, ఫ్రీచార్జ్, ఇతర సేవలను ఉపయోగించి చేసే రెంటల్ చెల్లింపులపై లావాదేవీ మొత్తంపై 1% ఛార్జ్ ఉంటుంది. ఇది గరిష్టంగా రూ.3000 ఉంటుంది. రూ.15,000 లోపు ఫ్యూయల్ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీ ఉండదు. అయితే రూ.15,000 కంటే ఎక్కువ లావాదేవీలపై 1% గరిష్టంగా రూ.3000 ఛార్జీ ఉంటుంది.రూ.50,000 లోపు యుటిలిటీ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీ ఉండదు. రూ.50,000 పైబడిన లావాదేవీలకు 1% గరిష్టంగా రూ.3000 ఛార్జీ విధిస్తారు. బీమా లావాదేవీలకు ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఇచ్చారు. కళాశాల లేదా పాఠశాల వెబ్సైట్లు లేదా వారి పీఓఎస్ మెషీన్ల ద్వారా నేరుగా చేసే చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు ఉండవు. కానీ క్రెడ్, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసే చేస్తే 1% ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.3000 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.ఆలస్య చెల్లింపు ఛార్జీల్లోనూ బ్యాంక్ సవరణలు చేసింది. ఏదైనా ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌లో ఈజీ-ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకుంటే గరిష్టంగా రూ.299 వరకు ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీ ఉంటుంది. అర్హత కలిగిన యూపిఐ చెల్లింపులపై టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు 1.5 శాతం, టాటా న్యూ ప్లస్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు 1 శాతం న్యూకాయిన్స్ లభిస్తాయి. -
గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.. మంత్రి ప్రకటన
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్లకు త్వరలో క్యూఆర్ కోడ్ ఇవ్వాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గ్యాస్ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు, వంట గ్యాస్ సిలిండర్ల ట్రాకింగ్ కోసం, ఏజెన్సీల ఇన్వెంటరీ నిర్వహణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. దాంతో పాటు నివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు పని చేసేలా భద్రతా చర్యల నమూనా రూపొందించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘గ్యాస్ సిలిండర్ల క్యూఆర్ కోడ్ ముసాయిదాను గ్యాస్ సిలిండర్ రూల్స్ (జీసీఆర్)లో పొందుపరిచాం. త్వరలో దీనిపై తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. గ్యాస్ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు, వంట గ్యాస్ సిలిండర్ల ట్రాకింగ్ కోసం ఈ క్యూఆర్ కోడ్ ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘అమెరికా ఇండిపెండెన్స్ డే’.. జుకర్‌బర్గ్ వినూత్న వేడుకలునివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు పని చేసేలా, అవసరమైన భద్రతా చర్యల నమూనా రూపొందించాలని మంత్రి పెసో (పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్)ను ఆదేశించారు. ఇందుకోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. డీపీఐఐటీ (పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం) కింద పని చేసే పెసో, 1884 ఎక్స్‌ప్లోజివ్స్ చట్టం, 1934 పెట్రోలియం చట్టం నిబంధనలను నియంత్రించే కీలక బాధ్యతను పర్యవేక్షిస్తుంది. పెసో మంజూరు చేసిన లైసెన్స్‌ల లైసెన్సింగ్ ఫీజులో మహిళా పారిశ్రామికవేత్తలకు 80 శాతం, ఎంఎస్ఎంఈలకు 50 శాతం రాయితీని ప్రకటిస్తున్నట్లు మంత్రి వివరించారు. -
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గాయి. మెట్రో నగరాలు న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై సహా దేశవ్యాప్తంగా 19 కిలోగ్రాముల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బుధవారం ప్రకటించాయి.ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకారం.. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.19 మేర తగ్గింది. సవరించిన ధరలు తక్షణం అమల్లోకి వచ్చాయి. వాణిజ్య సిలిండర్ కొత్త ధరలు ఢిల్లీలో రూ.1,745.50, ముంబైలో రూ.1,698.50, చెన్నైలో రూ.1,911, కోల్‌కతాలో రూ.1,859 గా ఉన్నాయి. -
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఇవి సాధ్యం!.. చిదంబరం కీలక వ్యాఖ్యలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తూ కేంద్రం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాము. అయితే తమ పార్టీ అధికారంలోకి వస్తే ధర పెంచబోమని ప్రధాని 'నరేంద్ర మోదీ' హామీ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ అధినేత 'రాహుల్ గాంధీ' దేశానికి ఐదు హామీలు ఇచ్చారు. వాటన్నంటిని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు.. చెన్నైలోని కాంగ్రెస్ రాష్ట్ర సత్యమూర్తి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో చిదంబరం పేర్కొన్నారు. 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి కాంగ్రెస్ చర్య తీసుకుంటుందని చిదంబరం వెల్లడించారు. ప్రశ్నాపత్రం లీక్ వంటి చర్యలను అరికట్టడానికి కూడా కొత్త చట్టం అమలు చేయనున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇవన్నీ జరగాలంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. గ్యాస్ ధరలను రూ. 100 తగ్గించిన బీజేపీ ప్రభుత్వం.. ఇంధన ధరల తగ్గింపు, యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు, 15 లక్షల రూపాయలను ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని చిదంబరం మండిపడ్డారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 7 వరకు, తమిళనాడుకు రూ. 17,300 కోట్లతో సహా దేశానికి రూ. 5.90 లక్షల కోట్ల ప్రాజెక్టులను ప్రధాని ప్రకటించారు, వీటి ప్రస్తావన నాకు కనిపించలేదని అన్నారు. -
ఎల్పీజీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఏమిటి?
దేశంలోని దాదాపు ప్రతి ఇంటిలోనూ వంటగ్యాస్ అంటే ఎల్పీజీ కనెక్షన్ ఉంది. గ్రామాల్లో కూడా మట్టి పొయ్యిలకు బదులు గ్యాస్ స్టవ్‌లు వినియోగిస్తున్నారు. అయితే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. ఉజ్వల పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించిన తర్వాత వంటగ్యాస్ వినియోగం మరింతగా పెరిగింది. గత 10 సంవత్సరాలలో ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య 32 కోట్లకు పైగా పెరిగింది. గత ఐదేళ్లలో దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి నాలుగు శాతం పెరిగింది. అయితే వినియోగం 22 శాతం మేరకు పెరిగింది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గ్యాస్‌ను ప్రభుత్వం దిగుమతి చేస్తోంది. గత ఐదేళ్లలో ఎల్పీజీ దిగుమతులు 60 శాతం మేరకు పెరిగాయి. భారతదేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్ నుండి గ్యాస్ సరఫరా అవుతోంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అందించిన డేటా ప్రకారం గత కొన్నేళ్లుగా భారత్.. అమెరికా నుంచి కూడా గ్యాస్ దిగుమతి చేసుకుంటోంది. ఇలా ఎల్పీజీ దిగుమతులు పెరిగిన కారణంగానే వాటి ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. భారతదేశంలో 90 శాతం ఎల్పీజీ గృహ వినియోగం కోసం ఉపయోగిస్తున్నారు. మిగిలిన మొత్తం పారిశ్రామిక, వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారు. దేశంలో ఎల్పీజీ వినియోగంలో 13 శాతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఇది మహారాష్ట్రలో 12 శాతం మేరకు ఉంది. ఈ విషయంలో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. -
బయోమాస్ సేకరణపై ఫోకస్.. ఖర్చు ఎంతంటే..
అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల నిత్యం గ్యాస్ ధరల పెరుగుతున్నాయి. భారత్ విదేశాల నుంచి గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది. దాంతో ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతోంది. చేసేదేమిలేక ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపుతోంది. అయితే దిగుమతి చేసుకునే గ్యాస్ స్థానే స్థానికంగా బయోమాస్‌ను సేకరించి దీన్ని తయారుచేసుకోవాలని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్(ఐబీఏ) సూచించింది. అందుకు అనుగుణంగా బయోమాస్ సేకరణపై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఐబీఏ పేర్కొంది. బయోగ్యాస్ ప్లాంట్లకు బయోమాస్‌ను సప్లయ్ చేయడానికి మెషినరీ, ఎక్విప్మెంట్ల కోసం రూ.30 వేలకోట్ల వరకు పెట్టుబడులు అవసరం అవుతాయని ఐబీఏ అంచనా వేసింది. ఏడాదికి 12 మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) దిగుమతులను తగ్గించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. వరిగడ్డి వంటి అగ్రి వేస్టేజ్‌ను బయోఎనర్జీ ఉత్పత్తికి వాడుకోవాలని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ చైర్మన్ గౌరవ్ కేడియా అన్నారు. అయితే బయోమాస్‌ను సేకరించడంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. దాన్ని సేకరించడం, స్టోర్ చేయడం, రవాణా వంటి వాటికి అధికమొత్తంలో ఖర్చువుతుందని, దీంతో వరిగడ్డి వంటి అగ్రి వేస్ట్‌ను అమ్మడం కంటే తగలబెట్టడానికే రైతులు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం లాజిస్టిక్స్‌ను మెరుగుపరచడం కంటే వరి గడ్డిని సమర్ధవంతంగా సేకరించగలిగే ఎక్విప్మెంట్లను వాడేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇదీ చదవండి: ‘వేర్’వేర్లు..! విభిన్న సాఫ్ట్వేర్లు.. -
గుడ్‌న్యూస్.. వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
కమర్షియల్ వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. అంతర్జాతీయ ధరల పరిస్థితుల్లో సానుకూలతల నేపథ్యంలో దేశంలో చమురు సంస్థలు వాణిజ్య వంటగ్యాస్ ధరను కాస్త తగ్గించాయి. వాణిజ్య వంటగ్యాస్ (LPG) 19 కిలోల సిలిండర్ ధర శుక్రవారం రూ.39.50 తగ్గింది. కమర్షియల్ వంట గ్యాస్ ధర తగ్గింపుతో హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు వీటిని వినియోగించే అనేక వర్గాలకు ఉపశమనం కలిగింది. ధర తగ్గింపు అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1,757 ఉంది. అంతకుముందు రూ. 1,796.50 ఉండేది. ఈ మేరకు చమురు సంస్థలు నోటిఫికేషన్లో తెలిపాయి. ఇదీ చదవండి: Gold Price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చివరిసారిగా డిసెంబర్ 1న వాణిజ్య ఎల్పీజీ ధరను రూ.21 పెంచాయి. కమర్షియల్ వంట గ్యాస్ 19 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం ముంబైలో రూ. 1,710, కోల్‌కతాలో రూ. 1,868.50, చెన్నైలో రూ. 1,929 లుగా ఉంది. స్థానిక పన్నుల ఆధారంగా వీటి ధరలు రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. కాగా గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ ఎల్పీజీ 14.2 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 903 ఉంది. -
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. ఎంతంటే..
భారత్‌లోని మెట్రోనగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన వంట గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. అందులో భాగంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ.100కు పెంచాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో 19 కిలోల కమర్షియల్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి. పెరిగిన ధర నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. తాజా ధరల సవరణతో దిల్లీలో 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,833గా ఉంది. కోల్‌కతాలో రూ.1,943, ముంబైలో రూ.1,785, బెంగళూరులో రూ.1,914.50, చెన్నైలో రూ.1,999.50గా ఉంది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి. అక్టోబర్‌లో వీటి ధరను రూ.209కి పెంచారు. అయితే ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను యథాతథంగా ఉంచాయి. వీటి ధర దిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, బెంగళూరులో రూ.905, చెన్నైలో రూ.918.50 ఉంది. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా ప్రతి నెల మొదటి తేదీన వంట గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ వాతావరణాన్ని మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నందున యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు గ్లోబల్ చమురు ధరలు బుధవారం పెరిగాయి. -
మహిళలకు శుభవార్త! గ్యాస్ స్టవ్‌తో పాటు ఫ్రీ సిలిండర్ పొందండిలా..
గత నెలలో రక్షాబంధన్ సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గించిన కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు మరో శుభవార్త చెప్పింది. రానున్న మూడు సంవత్సరాల్లో 7.5 మిలియన్ల పేదలకు స్టవ్‌తో పాటు ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందించనున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2016లో ప్రారంభమైన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 2026 నాటికి 75 లక్షల LPG కనెక్షన్లు ఉచితంగా అందివ్వడం జరుగుతుందని కేంద్ర మంత్రి 'అనురాగ్ ఠాకూర్' వెల్లడించారు. ఇందులో స్టవ్ మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా లభిస్తాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువున ఉన్న మహిళలు దీనికి అర్హులు. ఈ పథకం అమలు చేయడానికి ఒక్కొక్క కనెక్షన్‌కు రూ. 2200 చొప్పున మొత్తం రూ. 1650 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 2016లో ఉత్తరప్రదేశ్‌లో 80 మిలియన్ల కుటుంబాలకు వంట గ్యాస్ అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైంది. కాగా 2021 నాటికి 10 మిలియన్ కనెక్షన్ల లక్ష్యాన్ని చేరుకుంది. రానున్న రోజుల్లో కేంద్రం ఈ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకునే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి? తెలిస్తే అవాక్కవుతారు! ఈ పథకానికి అప్లై చేసుకోవడం ఎలా? ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి అర్హులైన వారు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి, అందులో డౌన్లోడ్ ఫారమ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. తరువాత మీకు ఒక ఫారమ్ డౌన్లోడ్ అవుతుంది. అందులో అడిగిన వివరాలను ఫిల్ చేయాలి. ఇవన్నీ ఫిల్ చేసిన తరువాత సమీపంలో ఉన్న గ్యాస్ ఏజన్సీలో సమర్పించాలి. దీనికి అవసరమైన రేషన్ కార్డు, ఫోటో, మొబైల్ నెంబర్ వంటివి కూడా అందించాల్సి ఉంటుంది. సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని కరెక్టుగా ఉంటే.. వెరిఫికేషన్ తరువాత కొత్త కనెక్షన్ పొందుతారు. #WATCH | Delhi: Union Minister Anurag Thakur says, "Two decisions were taken today... The first decision is that more 75 Lakh LPG connections would be given free of cost in the next 3 years till 2026... This is an extension of Ujjwala Yojana... The second decision is that the… pic.twitter.com/H0ShPmTt8M — ANI (@ANI) September 13, 2023 -
వినియోగదారులకు శుభవార్త, తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. నేటి నుంచే అమల్లోకి
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు చమురు సంస్థలు శుభవార్త చెప్పాయి. ఆగస్ట్ నెల ప్రారంభం మొదటి రోజు 19 కేజీల సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.99.75 తగ్గింది. తగ్గిన ధరతో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,680కు లభించనుంది. కానీ డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరల్ని చివరి సారి ఈ ఏడాది జూలై 4న చివరిసారిగా సవరించబడ్డాయి. తాజాగా మరోసారి తగ్గించాయి. దీంతో 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర కోల్‌కతాలో రూ.1,895.50, ముంబైలో రూ.1,733.50, చెన్నైలో రూ.1,945కి అందుబాటులో ఉంది. తగ్గని డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు ఇదిలా ఉండగా, ఇంట్లో వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్లు ధరల్ని తగ్గించలేదు. గృహావసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ల ధరలను చివరిసారిగా ఈ ఏడాది మార్చి 1న సవరించారు. సబ్సిడీ లేని 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,103, కోల్‌కతాలో రూ.1,129, ముంబైలో రూ.1,102.50, చెన్నైలో రూ.1,118.50 లభ్యమవుతుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెలా మొదటి తేదీన సవరించబడతాయి. ఏప్రిల్, మే, జూన్లలో ధరలు తగ్గిన తర్వాత జూన్‌లో మొదటిసారిగా ఎల్జీపీ సిలిండర్ రేట్లను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.ఎల్పీజీ సిలిండర్ ధరలను చివరిసారిగా మార్చి 1న సిలిండర్‌కు రూ.50పెంచారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో సిలిండర్‌పై రూ.91.50, మేలో రూ.171.50 చొప్పున తగ్గించారు. జూన్‌లో రూ.83.50 తగ్గింది. -
మళ్ళీ తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు.. ఈ సారి ఎంతంటే?
LPG Cylinder Price: పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు 'ఎల్పీజీ' (LPG) ధరలు కూడా మారుతూ ఉంటాయి. తాజాగా మరో సారి గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. ఎల్పీజీ కొత్త ధరలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఈ రోజు (2023 జూన్ 01) నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు వినియోగదారులకు భారీ ఊరటను కలిగించనున్నాయి. ప్రస్తుతం తగ్గిన గ్యాస్ సిలిండర్ల ధరలు కేవలం కమర్షియల్ గ్యాస్‌కి మాత్రమే వర్తిస్తాయి. కాగా డొమెస్టిక్ గ్యాస్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. (ఇదీ చదవండి: కస్టమర్లకు షాకిచ్చిన ఓలా.. పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు) 14.2 కేజీల గ్యాస్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కావున దీని ధర రూ. 1133 వద్ద స్థిరంగా ఉంది. అదే సమయంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1856.50 వద్ద నుంచి రూ. 1773 కి తగ్గింది. అంటే ఈ ధరలు మునుపటి కంటే రూ. 83 తగ్గినట్లు తెలుస్తోంది. 2023 మే 1న కూడా కమర్షియల్ గ్యాస్ ధరలు ఏకంగా రూ. 171.50 తగ్గాయి. అప్పుడు కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గి, డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో మార్పు లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు కొంత నిరాశ చెందుతున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ఒక్కసారిగా రూ. 171 తగ్గిన గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?
భారతదేశంలో చమురు ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ తరుణంలో ఈ రోజు నుంచి (2023 మే 1) కమర్షియల్ గ్యాస్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ పెట్రోలియం అండ్ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీని ఫలితంగా 19 కేజీల గ్యాస్ సిలిండర్ మీద ఇప్పుడు రూ. 171.50 తగ్గింది. కొత్త ధరలు ఈ రోజు నుంచే అమలులోకి రానున్నాయి. అయితే డొమెస్టిక్ LPG గ్యాస్ ధరలలో ఎటువంటి మార్పులు లేదు. సాధారణంగా కమర్షియల్ సిలిండర్లు హోటల్ వంటి వాణిజ్య వినియోగాలకు మాత్రమే ఉపయోగిస్తారు. కాగా డొమెస్టిక్ సిలిండర్లు కేవలం ఇంటి అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తారు. ధరల తగ్గింపుల తరువాత 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1856.50. అదే సమయంలో కలకత్తాలో దీని ధర రూ. 1960.50కి చేరింది. ముంబై, చెన్నై ప్రాంతాల్లో ఈ ధరలు వరుసగా రూ. 1808 & రూ. 2021కి చేరాయి. నిజానికి డొమెస్టిక్ సిలిండర్ ధరల కంటే కమర్షియల్ గ్యాస్ ధరలు ఎక్కువగా ఉంటాయి. 2022లో ఎల్పీజీ ధరలు నాలుగు సార్లు పెరిగాయి, మూడు సార్లు తగ్గాయి. ఆంటే ఓకే సంవత్సరంలో మొత్తం ఏడు సార్లు ధరలలో మార్పులు జరిగాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గడం నిజంగానే హర్షించదగ్గ విషయం అనే చెప్పాలి. -
ఆటో ఎల్పీజీ కథ ముగిసినట్టే!
న్యూఢిల్లీ: దేశ ఆటోమొబైల్ మార్కెట్ క్రమంగా పర్యావరణ అనుకూల పరిష్కారాల వైపు అడుగులు వేస్తోంది. ఎక్కువ మంది పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాలు, సీఎన్జీ కార్లకు ప్రాధాన్యం ఇస్తుండడంతో.. ఆటోమొబైల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ తర్వాత సీఎన్జీ వాహనాలకే ఎక్కువ డిమాండ్ నెలకొంది. దీంతో ఎల్పీజీ కార్ల విక్రయాలు ఐదేళ్ల కాలంలో (2018–19 నుంచి చూస్తే) 82 శాతం తగ్గిపోయాయి. 2022–23లో కేవలం 23,618 ఎల్పీజీ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కానీ, 2018–19లో 1,28,144 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. కేంద్ర రవాణా శాఖ పరిధిలోని వాహన్ పోర్టల్ గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద 2,22,24,702 యూనిట్ల వాహనాలు అమ్ముడుపోతే, ఇందులో ఎల్పీజీ వాహనాలు కేవలం 0.11 శాతంగా ఉండడం వినియోగదారులు వీటి పట్ల ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అదే సమయంలో సీఎన్జీ వాహన విక్రయాలు ఇందులో 3 శాతంగా ఉంటే, ఎలక్ట్రిక్ వాహనాలు 5 శాతంగా ఉండడం, కస్టమర్లు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నట్టు తెలియజేస్తోంది. ఎగసి పడిన డిమాండ్ ఎల్పీజీ పుష్కలంగా అందుబాటులో ఉండడమే కాదు, ఎక్కువ ఆక్టేన్ కలిగి, చాలా తక్కువ ఉద్గారాలను విడుదల చేసే ఇంధనం కావడంతో.. ఆటోమొబైల్ పరిశ్రమకు ప్రత్యామ్నాయ ఇంధనంగా లోగడ భావించారు. దీంతో ఎల్పీజీ కార్లు, ఎల్పీజీ త్రిచక్ర వాహనాలు 2019లో ఎక్కువగా అమ్ముడుపోయాయి. కానీ, దేశంలో ఎల్పీజీ వాహనాల వినియోగం చట్టబద్ధంగా అమల్లోకి వచ్చిం ది మాత్రం 2020 ఏప్రిల్ నుంచి కావడం గమనార్హం. నాలుగు చక్రాల ప్యాసింజర్ వాహనాలకుతోడు, ఎల్పీజీ త్రిచక్ర వాహనాలు (80 శాతానికి పైగా) 2019లో రికార్డు స్థాయి ఎల్పీజీ వాహన అమ్మకాలకు దోహదపడినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కానీ, 2022–23 సంవత్సరంలో ఎల్పీజీ వాహనాల డిమాండ్ 14 శాతానికి పరిమితమైంది. 2018–19లో ఇది 18 శాతంగా ఉంది. 2022–23లో కేవలం 3,495 ఎల్పీజీ నాలుగు చక్రాల వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. 2018–19లో ఇలా రిజిస్టర్ అయిన నాలుగు చక్రాల వాహనాలు 23,965 యూనిట్లుగా ఉండడం గమనించాలి. ‘‘విక్రయానంతరం ప్యాసింజర్ వాహనాలకు ఉన్న డిమాండ్ ఇది. 2018 నుంచి 2020 వరకు ప్యాసింజర్ వాహన విభాగమే ఎల్పీజీకి పెద్ద మద్దతుగా నిలిచింది. నిబంధనలు అనుకూలంగా లేకపోవడం, కిట్ ఆధారిత అనుమతులకు అధిక వ్యయాలు చేయాల్సి రావడం, ప్రతి మూడేళ్లకోసారి తిరిగి సరి్టఫై చేయించుకోవాల్సి రావడం, ఎల్పీజీ మోడళ్లు పెద్దగా అందుబాటులో లేకపోవడం వినియోగదారుల్లో ఆసక్తి ఆవిరైపోవడానికి కారణం’’అని ఇండియన్ ఆటో ఎల్పీజీ కొయిలిషన్ డైరెక్టర్ జనరల్ సుయాష్ గుప్తా వివరించారు. వసతులు కూడా తక్కువే.. 2023 మార్చి నాటికి దేశవ్యాప్తంగా కేవలం 1,177 ఎల్పీజీ స్టేషన్లే ఉన్నాయి. అదే సీఎన్జీ స్టేషన్లు అయితే 4,600 ఉంటే, ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు 5,200 ఉన్నాయి. పెట్రోల్ పంపులు 80,000 పైగా ఉన్నాయి. అంటే ఎల్పీజీ విషయంలో సరైన రీఫిల్లింగ్ వసతులు కూడా లేవని తెలుస్తోంది. మరోవైపు ధరలు కూడా అనుకూలంగా లేని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో కిలో ఎల్పీజీ ధర లీటర్‌కు రూ.68కి చేరుకోగా, 2019లో రూ.40 మాత్రమే ఉంది. ఇతర రాష్ట్రాల్లో దీని ధర ఇంకా ఎక్కువే. ‘‘ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం కొరవడడంతో వాహన తయారీదారులు ఎల్పీజీ మోడళ్లను తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. నేడు దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా అయితే ఎల్పీజీ కార్ల తయారీని నిలిపివేసింది. ప్రజలు సీఎన్జీ, ఈవీల పట్ల ఆసక్తి చూపిస్తుండడం దేశంలో ఎల్పీజీ వాహన రంగానికి గొడ్డలి పెట్టుగా మారింది’’అని పరిశ్రమకు చెందిన నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. ఈవీ, సీఎన్జీ వాహనాలను కేంద్రం సబ్సిడీలతో ప్రోత్సాహిస్తుండడాన్ని పరిశ్రమ ప్రస్తావిస్తోంది. -
36 శాతం ‘వంట’ చెరకే! తొలి స్థానంలో మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలివే..
సాక్షి, అమరావతి: దేశంలో 62 శాతం మంది వంట కోసం ఎల్పీజీ (గ్యాస్)ని వినియోగిస్తుండగా 36 శాతం ప్రజలు మాత్రం వంట చెరకునే వాడుతున్నట్లు కేంద్ర పర్యావరణ గణాంకాల నివేదిక వెల్లడించింది. 33.8 శాతం మంది కట్టెలు, పొట్టు, పంట అవశేషాలపై ఆధారపడుతుండగా 2.2 శాతం మంది వంట కోసం పిడకలను వినియోగిస్తున్నారు. 1.3 శాతం మంది కిరోసిన్, గోబర్ గ్యాస్, ఎలక్ట్రికల్, బొగ్గుల పొయ్యిపై వంట చేస్తున్నారు. ఇక ఎల్పీజీ వినియోగంలో గ్రామాలకు, పట్టణ ప్రాంతాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కట్టెలు, పొట్టు, పంట అవశేషాలు ఉచితంగా లభిస్తుండటంతోపాటు బూడిదను పంట పొలాలకు ఎరువుగా వాడుతున్నందున వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ఇక భగ్గుమంటున్న గ్యాస్ ధరలు కూడా కారణమే. ఈమేరకు కేంద్ర పర్యావరణ నివేదిక 2023ని గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసింది. ♦ గ్రామీణ ప్రాంతాల్లో 49.4 శాతం మంది ఎల్పీజీ వాడుతుండగా 46.7 శాతం మంది కట్టెలు, పొట్టు, పంట అవశేషాలపై ఆధార పడుతున్నారు. మూడు శాతం మంది పిడకలు, 0.7 శాతం మంది గోబర్ గ్యాస్, కిరోసిన్, ఎలక్ట్రికల్, బొగ్గుల పొయ్యిలను వాడుతున్నారు. ♦ పట్టణ ప్రాంతాల్లో 89 శాతం మంది వంట కోసం ఎల్పీజీ వాడుతుండగా 6.5 శాతం మంది కట్టెలు, పొట్టు, పంట అవశేషాలను వినియోగిస్తున్నారు. 0.3 శాతం మంది పిడకలు, 2.5 శాతం గోబర్ గ్యాస్, ఎలక్ట్రికల్, కిరోసిన్, బొగ్గుల పొయ్యిలను వాడుతున్నారు. ♦ ఛత్తీస్‌గఢ్ గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 84.2 శాతం మంది వంట కోసం కట్టెలు, పొట్టు, పంట అవశేషాలపైనే ఆధారపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో 16.3 శాతం మంది కట్టెలు, పొట్టు, పంట అవశేషాలపై వంట చేస్తుండగా 81.7 శాతం మంది ఎల్పీజీ వినియోగిస్తున్నారు. -
వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!
గ్యాస్ ధరలపై కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2023-2024 ఆర్థిక సంవత్సరం మొదటి రోజునే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించింది. ఏప్రిల్ 1న వంట గ్యాస్ ధరలు దాదాపు రూ.92 తగ్గించింది. అయితే రేట్ల తగ్గింపు కేవలం వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మాత్రమే. గృహోపయోగానికి వినియోగించే డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి తగ్గింపు లేదు. 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వం గత నెలలోనే రూ.50 పెంచిన విషయం తెలిసిందే. అలాగే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను రూ.350 పెంచింది. (Jio offer: జియో అన్లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!) సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున పెట్రోలియం కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను సవరిస్తుంటాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ రేటు భారతదేశంలో ఎల్పీజీ సిలిండర్ ధరలను ప్రభావితం చేసే రెండు కీలక అంశాలు. సవరించిన తర్వాత 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ.2,028, కోల్‌కతాలో రూ.2,132, ముంబైలో రూ.1,980, చెన్నైలో రూ.2192.50 చొప్పున ఉంది. కాగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం గృహ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని ప్రకటించింది. ఈ పథకం కింద 9.59 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రతి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పైనా రూ.200 సబ్సిడీ అందిస్తున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గత నెలలో ప్రకటించారు. డొమెస్టిక్ సిలిండర్లు ఏడాదికి 12 మాత్రమే వినియోగించకునేలా కేంద్ర ప్రభుత్వం పరిమితిని విధించింది. -
సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర!
సామాన్యులకు చమురు కంపెనీలు భారీ షాకిచ్చాయి. వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్‌పై రూ.350.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇక మార్చి 1న పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో వంట గ్యాస్ ధర రూ.1,155 చేరింది. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2119.50కు ఎగబాకింది. కాగా, ఇప్పటికే ఆర్ధిక మాంద్యం భయాలు, పెరిగిపోతున్న వడ్డీ రేట్లు, నిత్యావసర సరకుల పెంపుతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుగుతోంది. తాజాగా పెరిగిన గ్యాస్ ధరలతో ఆ భారం మరింత పెరగనుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో పెరిగిన ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1769 నుంచి రూ.2119.50కి చేరింది. ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1052 నుంచి రూ.1102.5కి పెరిగింది. కోల్‌కతాలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1079 నుంచి రూ.1129కి పెరిగింది. చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1068.50 నుంచి రూ.1118.5కి చేరింది. -
పండుగ కానుక: భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్!
దేశంలో నిత్యవసరాల సరుకులు, ఇంధన ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో పండుగ కానుకగా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు కాస్త ఊరట కలిగిస్తూ చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన కొత్త రేటు ప్రకారం అంటే అక్టోబర్ 1న, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 25.50 తగ్గింది. బిగ్ రిలీఫ్.. భారీ తగ్గింపు! అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదలతో సహజవాయువు ధరలు రికార్డు స్థాయిలో 40 శాతం పెరిగి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగిన ఒక రోజు తర్వాత, దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు జాతీయ రాజధానిలో కమర్షియల్ ఎల్పీజీ (LPG Cylinder) సిలిండర్ల ధరను ₹ 25.50 తగ్గించాయి. ఈ తాజా ధరల సవరణతో, ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,859.50గా ఉండగా అంతకు ముందు రూ. 1,885 ఉంది. కోల్‌కతాలో, దీని ధర రూ.1959కి తగ్గింది. ముంబైలో ప్రస్తుతం దీని ధర రూ. 1811.50గా ఉంది. కమర్షియల్ సిలిండర్ ధర తగ్గించడం ఇది ఆరోసారి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ల విషయంలో ఎలాంటి మార్పు లేదు. కాగా సెప్టెంబర్ 1న, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ యూనిట్ ధర ₹ 91.50 తగ్గింది, ఢిల్లీలో ధర ₹ 1,885 నుంచి ₹ 1,976కి తగ్గిన సంగతి తెలిసిందే. చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త సేవలు రాబోతున్నాయ్! -
LPG Cylinder Price: బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కమర్షియల్ సిలిండర్
న్యూఢిల్లీ: ఇప్పటికే నిత్యవసరాల సరుకులు, ఇంధన ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే వారికి కాస్త ఊరట కలిగించేలా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన కొత్త రేటు ప్రకారం అంటే ఆగస్టు 1న, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 36 తగ్గింది. నెల వ్యవధిలో రేట్లు తగ్గించడం ఇది రెండోసారి. జూలై 6న 19 కేజీల సిలిండర్‌పై రూ.8.50 తగ్గించారు. ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1,976గా ఉండగా అంతకు ముందు రూ. 2,012.50 ఉంది. కోల్‌కతాలో ఈ ధర రూ.2,095.50, ముంబైలో రూ.1,936.50, చెన్నైలో రూ.2,141 ఉంది. కాగా స్థానిక టాక్స్‌ల ఆధారంగా రాష్ట్రానికి రాష్ట్రానికి ఈ సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. చదవండి: ఇలాంటి పాన్ కార్డు మీకుంటే.. రూ.10,000 పెనాల్టీ! -
హైదరాబాద్: గ్యాస్ ధరల పెంపుపై మంత్రి సబితాఇంద్రారెడ్డి ధర్నా
-
LPG Gas: వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన వంటగ్యాస్ ధర
న్యూఢిల్లీ: దేశంలో వంట గ్యాస్ ధరలు మరోసారి మంటెత్తాయి. అంతర్జాతీయ ఇంధన ధరల పెరుగుదలకు అనుగుణంగా దేశీయ వంట గ్యాస్ ధర మంగళవారం సిలిండర్‌కు రూ.50 చొప్పున పెరిగింది. దీంతో 14.2 కిలోల నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.949.50గా ఉంది. గత సంవత్సరం అక్టోబర్ తర్వాత ఎల్పీజీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ముడిసరుకు ధరలు పెరుగుతున్నప్పటికీ అక్టోబర్ ప్రారంభం నుంచి గ్యాస్ ధరలు పెంచలేదు. పెంచిన ధరలతో 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 349 కాగా, 10 కిలోల కాంపోజిట్ బాటిల్ రూ. 669గా ఉంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2003.50గా ఉంది. పెరిగిన గ్యాస్ ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. పెంచిన ధరలతో తెలంగాణలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1000 దాటింది. -
వంటింటిపై ‘గ్యాస్’ బాంబు!
సాక్షి, హైదరాబాద్: నాలుగు నెలల నుంచి స్థిరంగా ఉన్న గృహ వినియోగ గ్యాస్ ధరలు వారం రోజుల్లో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మంగళవారం 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు సంస్థలు ఏకంగా రూ.105 మేరకు పెంచాయి. 5 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.27 పెరిగింది. అయితే ప్రస్తుతానికి గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరను మాత్రం పెంచలేదు. అయితే ఉత్తరప్రదేశ్‌తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల చివరి విడత పోలింగ్ ఈనెల 5న ముగియనున్న నేపథ్యంలో.. వచ్చే వారంలో గృహ వినియోగ గ్యాస్ ధర భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం పచ్చజెండా! ఉక్రెయిన్ , రష్యాల మధ్య యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే దేశంలో బల్క్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. తాజాగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్‌తో పాటు వంట గ్యాస్ ధరలను కూడా చమురు సంస్థలు పెంచుకునేందుకు కేంద్రం పచ్చజెండా ఊపినట్లు మార్కెట్ నిపుణులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సిలిండర్ ధర గణనీయంగా పెరిగింది. 19 కిలోల సిలిండర్ ధరను రూ.105 మేర పెంచగా, 5 కిలోల సిలిండర్‌పై రూ. 27 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.2,086 నుంచి రూ.2,191కి పెరిగింది. ఈ సిలిండర్ల ధరల పెంపు భారం పరోక్షంగా సామాన్యులపై కూడా పడనుంది. నాలుగు నెలలుగా పెండింగ్! చమురు ఉత్పత్తుల ధరల పెంపుదల తథ్యం అని తెలిసినప్పటికీ... ఆయిల్ కంపెనీలు ఎంత మేర ధరలను పెంచుతాయనే దానిపై స్పష్టత లేదు. బల్క్ డీజిల్, కమర్షియల్ గ్యాస్ ధరలను పెంచడం ద్వారా డొమెస్టిక్ గ్యాస్, రిటైల్ ఆయిల్ ధరల పెంపును సైతం ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండా లని కేంద్రం సంకేతాలిచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.952గా ఉంది. ఆదిలాబాద్‌లో రూ.976.50 ఉండగా, ఖమ్మంలో అత్యల్పం గా రూ.939 ఉంది. 2021 అక్టోబర్ 6 నుంచి ఈ డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో మార్పులేదు. తాజా పరిస్థితుల్లో రూ.50కి పైగానే ధర పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
బాబోయ్..మళ్లీ బండ బాదుడు!! రెట్టింపు కానున్న గ్యాస్ ధరలు!
రానున్న రోజుల్లో ఎల్పీజీ గ్యాస్ ధరలు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట స్థాయికి చేరుకోగా..త్వరలో పెరగనున్న వంటగ్యాస్ ధరలు సామాన్యుల పాలిట గుదిబండలా మారనున్నాయి. జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ నుండి వంట గ్యాస్ ధరలు భారీ ఎత్తున పెరగనున్నట్లు తెలుస్తోంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లతో పాటు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), విద్యుత్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా తన కథనాల్లో పేర్కొన్నాయి. సీఎన్జీ, విద్యుత్, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల ప్రధాన కారణం పెరుగుతున్న రవాణా ఖర్చులు, నిర్వహణ ఖర్చులేనని తెలుస్తోంది. దీనికి తోడు రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం సామాన్యుల కష్టాలను మరింత పెంచుతుంది. పెరుగుతున్న గ్యాస్ ధరల ప్రభావం, కోవిడ్-19 మహమ్మారి నుండి పుంజుకుంటున్న దేశాల వృద్ధితో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన అవసరాల్ని తీర్చడంలో వైఫల్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం గ్యాస్, పెట్రోలియం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏప్రిల్ నాటికి వంటగ్యాస్ ధరలను సవరిస్తే 2.9 డాలర్ల నుంచి 6 - 7 వరకు పెరిగే అవకాశం ఉండనుంది. చదవండి: మరో ప్రమాదం అంచున ఉక్రెయిన్, ఇది రష్యా పనేనా?! -
ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!
అమ్మో ఒకటో తారీఖు..! ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంతో పాటు దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల కొన్ని సార్లు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. వచ్చేనెల ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనుండగా పలు రంగాల్లో రానున్న మార్పులను మనం స్వాగతించాల్సి ఉంటుంది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్న బ్యాంకులకు సంబంధించిన కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ► దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్) ఛార్జీలను పెంచనుంది. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో ఐఎంపీఎస్ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ విధించనుంది. ఐఎమ్పిఎస్ లావాదేవీలు చేసేటప్పుడు జీఎస్టీతో పాటు గరిష్టంగా రూ.20 వసూలు చార్జీల రూపంలో చేయనుంది. అక్టోబర్ 2021లో ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితిని ఆర్బిఐ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన విషయం మనకు తెలిసిందే. ► ఫిబ్రవరి 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన చెక్ క్లియరెన్స్‌కు సంబంధించిన నియమ & నిబంధనలు మారనున్నాయి. చెక్ చెల్లింపు కోసం వినియోగదారులు సానుకూల చెల్లింపు విధానాన్ని అనుసరించాలి. ప్రస్తుతం ఖాతాదారులు చెక్ జారీ చేసిన తర్వాత ఆ చెక్కుకు సంబంధించిన వివరాలు బ్యాంక్‌కు పంపాల్సి ఉంటుంది. లేకపోతే ఆ చెక్ క్లియర్ అవ్వదు. ఖాతాదారుల భద్రత దృష్ట్యా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు కేవలం రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న చెక్కుల కోసం ఇలాంటి నిబంధనలు మార్చింది. తక్కువ మొత్తంలో చెక్కులు జారీ చేస్తే మాత్రం ఈ మార్పులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ► పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చే నెల నుంచి చార్జీల బాదుడు షురూ చేయబోతోంది. ఫిబ్రవరి 1 నుంచి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోవడం వల్ల మీ ఇన్స్టాల్మెంట్లు లేదంటే ఈఎంఐ చెల్లింపులు ఫెయిల్ అయితే అప్పుడు బ్యాంక్ రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూ.100 చార్జీ వసూలు చేస్తున్నారు. డిమాండ్ డ్రాఫ్ట్‌ను క్యాన్సిల్ చేయాలన్నా రూ.150 చెల్లించుకోవాలి. ► ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మాదిరిగానే వచ్చేనెల ఫిబ్రవరి 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. ఫిబ్రవరి & మార్చిలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఫిబ్రవరి 1న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వం తగ్గిస్తుందా? లేదా అనేది చూడాలి. (చదవండి: బీఎండబ్ల్యూ అనూహ్య నిర్ణయం...! తొమ్మిదేళ్ల ప్రస్థానానికి ఎండ్ కార్డ్..!) -
ఎల్పీజీ ధరల పెంపుతో... భగ్గుమన్న కజకిస్తాన్
మాస్కో: మధ్య ఆసియా దేశమైన కజకిస్తాన్‌లో ఎల్పీజీ గ్యాస్ ధరల్ని భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు చేస్తున్న నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. దేశంలోని అతి పెద్ద నగరమైన అల్మటీలో నిరసనకారులు ప్రభుత్వ భవనాలపై జరిపిన దాడులు రక్తపాతాన్ని సృష్టించాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందగా, 12 మంది పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఒక పోలీసు అధికారి తల తెగి రోడ్డుపై పడి ఉండడం భయోత్పాతాన్ని రేపింది. అత్యవసర పరిస్థితుల్ని తోసిరాజని బుధవారం రాత్రికి రాత్రి ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి అధ్యక్ష భవనం, ఇతర ప్రభుత్వ భవనాలను ముట్టడించడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు పోలీసు శాఖ పోలీస్ శాఖ తెలిపింది. కజకిస్తాన్ ప్రజలు ఎల్పీజీ గ్యాస్‌ని ఎక్కువగా కార్లలో వినియోగిస్తారు. ఎలక్ట్రానిక్ వాహనాలు వినియోగించాలన్న ఉద్దేశంతో పెట్రో ధరలపై ప్రభుత్వం సబ్సిడీలను ఎత్తేయడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు గత ఆదివారం నుంచి నిరసనలకి దిగారు. పరిస్థితులు చెయ్యి దాటిపోతూ ఉండడంతో టోకయేవ్ రష్యా సాయాన్ని కోరారు. ఆయన అభ్యర్థన మేరకు రష్యా, దాని మిత్ర దేశాలు కజకిస్తాన్‌కు శాంతి బలగాలను పంపించనున్నాయి. -
పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా తగ్గించాలి
బెంగళూరు: పెట్రోల్, డీజిల్ ధరలను ఇంకా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎల్పీజీ ధరలు కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయని, వాటిని కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కేంద్ర సర్కారు లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై 10 రూపాయలు ఎక్సైజ్డ్యూటీ తగ్గించిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ స్పందించారు. శుక్రవారం ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ...‘పెట్రోల్, డీజిల్ ధరలను పెద్దగా ఏం తగ్గించలేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్డ్యూటీ రూ.9.48, డీజిల్‌పై రూ.3.56 ఉండేది. ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని మరింత తగ్గించాలి. ఎల్పీజీ రేట్లు ఇప్పటికీ అధికంగానే ఉన్నాయి. వీటిని తగ్గించాల్సిన అవసరం ఉంది. ధరలు తగ్గించే వరకు ఆందోళన కొనసాగిస్తాం. నవంబర్ 14 నుంచి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామ’ని అన్నారు. (చదవండి: పంజాబ్ కాంగ్రెస్: నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక నిర్ణయం) కాగా, గతకొద్ది రోజులుగా వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వినియోగదారులు సతమతవుతున్నారు. చమురు ధరల అనూహ్య పెరుగుదలతో సామాన్యుడి జీవితం భారంగా మారింది. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర సర్కారు స్వల్పంగా ఎక్సైజ్డ్యూటీ తగ్గించి వినియోగదారులకు ఊరట కల్పించింది. అయితే ఇంకాస్త తగ్గించాలని సామాన్యులు కోరుకుంటున్నారు. (వంటనూనె ధరల్ని తగ్గించిన కేంద్రం.. ఎంతంటే?) -
పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర
దేశంలో వంట గ్యాస్ ధరలు మళ్లీ మంటెత్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలతో సిలిండర్ల ధరలు ఆకాశానికి చేరుతున్నాయి. దీంతో వంట గ్యాస్ సిలిండర్ ధర బుధవారం రూ.15 పెరిగింది. ఢిల్లీలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.899.50చేరింది. కాగా సెప్టెంబర్ నెలలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.25 పెరిగింది. ఈ నెలలో 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.43 పెరగడం సామాన్యులకు పెను భారంగా మారింది. ఇక తాజాగా పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధరతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం గ్యాస్ ధర రూ.190 పెంచినట్లైంది. చమరు కంపెనీలు రెండు నెలల్లో నాన్ సబ్సిడీ గ్యాస్ సిలీండర్ ధరలు అమాంతం పెంచాయి. ఆగస్ట్ 18న నాన్ సబ్సీడీ గ్యాస్ సిలిండర్ ధర ను రూ.25 పెంచగా..సెప్టెంబర్ నెలలో ఇదే నాన్ సబ్సీడీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.25 పెరగడంతో సామాన్యులు లబోదిబో మంటున్నారు. మరింత పెరగనున్న వంట గ్యాస్ ధరలు ఒకవైపు కరోనా..మరో వైపు ఆదాయం లేక సామాన్యుడు అప్పుల ఊబిలో చితికి పోతుంటే పెరుగుతున్న చమురు, గ్యాస్ ధరలు మరింత శాపంగా మారాయి. పెట్రోల్, డీజిల్ వంట నూనెలతో పాటు ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెరగటం.. ఇపుడు గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరగడం మరింత భారం కానుంది. అయితే ఈ పెరుగుతున్న ధరల భారం కొన్ని నెలల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రానున్న రోజుల్లో గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటూ కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఓ నివేదిక ప్రకారం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ కుమార్ మాట్లాడుతూ అక్టోబర్ 2021 నుంచి మార్చి 2022 మధ్య కాలంలో నేచురల్ గ్యాస్ ధర 50 నుంచి 60శాతం పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే గ్యాస్ ధర ఆకాశాన్ని తాకనుంది. చదవండి: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు -
సామాన్యుడికి షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధర.. ఏడాదిలో ఐదోసారి
జీడీపీ లెక్కలు బాగానే ఉన్నాయంటూ కేంద్రం శుభవార్త చెప్పిన మరుసటి రోజు సామాన్యుడికి షాక్ తగిలింది. ఎల్పీజీ గ్యాస్ ధరను చమురు కంపెనీలు మరోసారి పెంచాయి. పెరిగిన ధరతో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.884.50కి చేరుకుంది. రెండు వారాల్లో రెండు సార్లు ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి గ్యాస్ ధరలను చమురు కంపెనీలు సమీక్షిస్తున్నాయి. అందులో భాగంగా మార్కెట్ పరిస్థితులను బట్టి ధరలను స్థిరీకరిస్తున్నాయి. చివరి సారిగా ఆగస్టు 18న గ్యాస్ ధరను రూ. 25 పెంచాయి. రెండు వారాలు తిరిగే సరికి మరోసారి సామాన్యుడి నెత్తిన గ్యాస్ పిడుగు పడింది. దీంతో రెండు వారాల వ్యవధిలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 వరకు పెరిగింది. ఈ ఏడాది పెంపు రూ. 165.50 ఈ ఏడాది ఆరంభంలో రూ.694లుగా ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో, మార్చి, జూన్లలో కూడా ధరలను చమురు కంపెనీలు పెంచాయి. మొత్తంగా ఐదు సార్లు ధర పెరగగా మధ్యలో ఫిబ్రవరి, ఏప్రిల్‌లలో కొద్ది మేరకు ధరలను తగ్గించాయి. మొత్తంగా ఈ ఏడాది 14.2 కేజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.165.50 వరకు ధర పెరిగింది. 2017 నుంచి బాదుడే పెట్రో ఉత్పత్తుల ధరలపై నియంత్రణను 2017లో కేంద్రం ఎత్తివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆధారంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెట్రో ఉత్పత్తి సంస్థలు పెంచేస్తున్నాయి. ఫలితంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. తాజా పెంపుతో దేశంలో 29.11 కోట్ల మంది ఎల్పీజీ కస్టమర్లపై భారం పడనుంది. చదవండి: మిస్డ్ కాల్‌తో గ్యాస్ కనెక్షన్ -
ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!
మీరు ఎక్కువగా బ్యాంకు సంబంధిత లావాదేవీలు చేస్తుంటారా? అయితే, మీకు ఒక ముఖ్య గమనిక. ఆగస్టు 1 నుంచి బ్యాంకుకు సంబంధించిన కొత్త నిబందనలు అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల సామాన్యుల మీద ఎక్కవగా భారం పడనుంది. ఏటీఎం లావాదేవీలు, ఎల్పీజీ ధరలు, వేతనాలు, పెన్షన్లు ఇలా చాలా అంశాలకు సంబంధించి కొత్త మార్పులు ఆగస్టు 1 నుంచి చోటు చేసుకొనున్నాయి. సాధారణంగా ప్రతీ నెల ప్రారంభంలో కొత్త నిబందనలు అమల్లోకి వస్తుంటాయి. మరి ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఏంటీ? అవి మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేయనున్నయో? తెలుసుకోండి. వేతనం, ఈఎమ్ఐ చెల్లింపులు: నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) నిబంధనలలో ఆర్బీఐ మార్పు చేయడం వల్ల సెలవు రోజుల్లో కూడా విద్యుత్, గ్యాస్, టెలిఫోన్, నీరు, జీతం, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ సంబంధిత లావాదేవీలు సెలవు రోజుల్లో కూడా జరగనున్నాయి. ఈ కొత్త మార్పులు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్(ఆర్ టీజిఎస్), ఎన్ఏసిహెచ్ సేవలు 24ఎక్స్7 అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. ఎన్ఏసీహెచ్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ) చేత నిర్వహించబడుతుంది. ఎటిఎమ్ క్యాష్ విత్ డ్రా: జూన్ నెలలో ఆర్బీఐ తీసుకొచ్చిన మరో ఆర్డర్ ప్రకారం, ఆగస్టు 1 నుంచి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్(ఏటీఎం) చార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం కేంద్రాల నిర్వహణ భారంగా మారిందన్న బ్యాంక్ ఆందోళన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఇంటర్ చేంజ్ ఫీజ్ ను ₹2 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా వచ్చే ఆగస్టు 1 నుంచి ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్ధికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు పెరగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు 90 కోట్ల వరకు వాడుకలో ఉన్నాయి. ఐపీపీబీ డోర్ స్టెప్ సేవలు ఖరీదు: ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ సేవలకు ఇక నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలను, సేవింగ్స్ అకౌంట్ల వడ్డీ రేట్లను ఐపీపీబీ సవరించింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలు 01 ఆగస్టు 2021 నుంచి వర్తిస్తాయి. ప్రస్తుతం, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సంబంధించి ఎలాంటి ఛార్జీలు లేవు. ఇక ఆగస్టు 1, 2021 నుంచి ప్రతి కస్టమర్ ఐపీపీబీ డోర్ స్టెప్ అభ్యర్థనకు బ్యాంకింగ్ ఛార్జీల కింద రూ.20 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకే కస్టమర్ ఎక్కువ సార్లు అభ్యర్థనలు చేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ సర్వీస్ ఛార్జీలు: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ తన దేశీయ పొదుపు ఖాతాదారులకు నగదు లావాదేవీలు, ఎటిఎం ఇంటర్ చేంజ్, చెక్ బుక్ ఛార్జీల సవరించిన్నట్లు తెలిపింది. ఈ మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్ సైట్ తెలిపింది. అన్ని నగదు లావాదేవీలపై ఛార్జీల సవరణ వర్తిస్తుంది.ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో నెలకు మొత్తం 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతించింది. ఆ తర్వాత లావాదేవీలకు ఛార్జీలు వర్తిస్తాయి.ప్రతి ఆర్థిక లావాదేవీకి బ్యాంకు ₹20, ఆర్థికేతర లావాదేవీకి ₹8.50 వసూలు చేస్తుంది. ఆగస్టు 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుల హోమ్ బ్రాంచీలో నగదు లావాదేవీ పరిమితి నెలకు రూ.1 లక్ష వరకు ఉచితం. లక్షకు పైగా జరిపే ప్రతి లావాదేవిపై ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది. ఎల్పీజీ ధరలు: ఎల్పీజీ ధరలను గ్యాస్ ఏజెన్సీలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తాయి. జూలై నెల 1 తేదీన ఎల్పీజీ ధరలను రూ. 26 పెంచాయి. మరి ఈ నెల పెరగనున్నాయా? తగ్గనున్నాయా? అనేది ఆగస్టు 1 తేదీన తెలవనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ): 15సీఏ, 15సీబీ ఫామ్స్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ విషయంలో పలు సడలింపులు ఇచ్చింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. గతంలో జూలై 15 వరకు ఉన్న చివరి తేదీని ఆగస్ట్ 15కి పొడిగించింది. -
జూలై 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!
డ్రైవింగ్ లైసెన్స్ నుంచి బ్యాంక్ చార్జీల వరకు జూలై 1, 2021 నుంచి అనేక కొత్త మార్పులు చోటు చేసుకొనున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రేపటి నుంచి ఛార్జీలు పెంచేందుకు సిద్దమవుతుంది. అలాగే ఎల్పీజీ ధరలో కూడా మార్పులు చోటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ కొత్త మార్పుల వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎస్బీఐ బీఎస్‌బీడీ జూలై 1 నుంచి ఎస్బీఐ బీఎస్‌బీడీ ఖాతాదారుల జేబుకు చిల్లు పడనుంది. ఒక నెలలో బ్యాంకు శాఖలు, ఏటీఎంల నుంచి కూడా కలిపి నెలకు ఉచితంగా నాలుగుసార్లు మాత్రమే నగదు తీసుకునే వీలుంటుంది. ఆపై ఒక్కో లావాదేవీపై రూ.15 (జీఎస్టీ అదనం) చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఒక ఆర్ధిక సంవత్సరంలో 10 చెక్స్ మాత్రమే ఉచితంగా అందించనున్నారు. అంతకంటే ఎక్కువ 10 లీఫ్ల చెక్ బుక్కు కోసం అయితే రూ. 40, 25 లీఫ్‌లదైతే రూ.75 చార్జీలు ప్లస్ జీఎస్టీ వర్తిస్తుంది. ఇక అత్యవసర చెక్ బుక్ కోసం రూ. 50 (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. ఎల్పీజీ గ్యాస్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) లేదా కిచెన్ గ్యాస్ రేట్లు కూడా జూలై 1 నుండి సవరించనున్నారు. ప్రతి 5 రోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా చమురు కంపెనీలు ఎల్పీజీ ధరలను సవరిస్తాయి. డ్రైవింగ్ లైసెన్స్ జూలై 1 నుంచి కేంద్రం ఏర్పాటు చేస్తున్న కొత్త సిస్టమ్ ప్రకారం, ఇక నుంచి ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కోసం రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్(ఆర్ టీఓ) ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేంద్రం గుర్తించిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలలో డ్రైవింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత వారు ఆ కేంద్రం నుంచే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. ఐఎఫ్ఎఎస్ సీ కోడ్లు కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌లో విలీనం అయిన సంగతి తెలిసిందే. అయితే, జులై 1 నుంచి సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు కెనరా బ్యాంక్‌కు చెందిన కొత్త ఐఎఫ్ఎఎస్ సీ కోడ్లు వినియోగించాల్సి ఉంటుంది. ఐఎఫ్ఎఎస్ సీ కోడ్ లను కెనరా బ్యాంక్ వెబ్సైట్ ద్వారా పొందొచ్చు. చెక్కు బుక్కులు చెల్లవు మీరు ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ ఖాతాదారులా? అయితే ఇది మీ కోసమే. ఈ రెండు బ్యాంకులు యూనియన్ బ్యాంకులో విలీనం అయిన కారణంగా పాత చెక్కు బుక్కులు జులై 1 నుంచి చెల్లవ్. కొత్త చెక్కు బుక్కులు యూనియన్ బ్యాంకు శాఖల్లో తీసుకోవాల్సి ఉంటుంది. టీడీఎస్ కొత్త రూల్స్ ఇటీవల కేంద్రం అమల్లోకి తెచ్చిన ఫైనాన్స్ యాక్ట్ 2021 ప్రకారం గత రెండేళ్లలో చెల్లించాల్సిన టీడీఎస్, టీసీఎస్ పన్ను రూ.50,000 కంటే ఎక్కువగా ఉంటే వారి నుంచి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలో అధిక శాతంలో పన్ను వసూలు చేయాలని ఆదాయపు పన్ను విభాగం నిర్ణయించింది. ఇది జులై 1 నుంచి అమల్లోకి రానుంది. చదవండి: ఇజ్రాయిల్ తరహా 'ఐరన్ డోమ్'ను భారత్ నిర్మించాలి -
గ్యాస్ షేర్లు గెలాప్!
దేశీయంగా పెరగనున్న గ్యాస్ లభ్యత, పర్యావరణానుకూల శుద్ధ ఇంధనాలకు కనిపిస్తున్న డిమాండ్ తదితర అంశాలు ఎల్ఎన్జీ, సీఎన్జీ, ఎల్పీజీ సంస్థలకు లబ్ధి చేకూర్చనున్నాయి. దేశవ్యాప్తంగా గ్యాస్ రవాణాకు అనువుగా ఏర్పాటవుతున్న మరిన్ని పైప్‌లైన్ నిర్మాణాలు ఇందుకు మద్దతివ్వనున్నాయి. వెరసి భవిష్యత్‌లో గ్యాస్ సంబంధ కంపెనీల షేర్లకు గిరాకీ పెరిగే వీలున్నట్లు స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముంబై: రానున్న కొన్నేళ్లలో పలు పట్టణాలను కలుపుతూ గ్యాస్ రవాణాకు అనువుగా పైప్లైన్లు ఏర్పాటవుతున్నాయి. దీనికితోడు దేశ, విదేశీ మార్కెట్లలో గ్యాస్ లభ్యత పెరగనుంది. అంతేకాకుండా వివిధ ప్రభుత్వాలు పర్యావరణహిత ఇంధనాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. వెరసి ఇకపై అటు గ్యాస్, ఇటు ఇంధన రవాణా కంపెనీలకు డిమాండ్ ఊపందుకోనున్నట్లు విశ్లేషకులు ఊహిస్తున్నారు. రానున్న రెండేళ్లలో అంటే 2023–24కల్లా దేశీయంగా అదనపు గ్యాస్ ఉత్పత్తి గరిష్టంగా రోజుకి 40 మిలియన్ మెట్రిక్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ)కు చేరే వీలున్నట్లు మోతీలా ల్ ఓస్వాల్ రీసెర్చ్ నివేదిక అభిప్రాయపడింది. ఇందుకు కేజీ బేసిన్లో బావుల నుంచి గ్యాస్ ఉత్పాదకత పెరిగే అంచనాలు జత కలిసినట్లు పేర్కొంది. ఆర్ఐఎల్ రెడీ రెండేళ్లలో ప్రైవేట్ రంగ దిగ్గజం ఆర్ఐఎల్ 28 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ఉత్పత్తి చేసే వీలున్నట్లు మోతీలాల్ నివేదిక పేర్కొంది. దీనిలో 12.5 ఎంఎంఎస్‌సీఎండీని వేలం వేయనున్నట్లు తెలియజేసింది. దీనిలో 4.8 ఎంఎంఎస్‌సీఎండీని జామ్‌నగర్ రిఫైనరీలకోసం వినియోగించనున్నట్లు వివరించింది. ఇక మిగిలిన 12 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ ఉత్పత్తి చేసే అవకాశమున్నట్లు నివేదిక పేర్కొంది. రానున్న కాలంలో ప్రధానంగా ఎరువులు, రిఫైనింగ్–పెట్రోకెమికల్స్, సిటీగ్యాస్ పంపిణీ రంగాల నుంచి ఇంధనానికి అధిక డిమాండ్ కనిపించనున్నట్లు అంచనా వేసింది. తాజాగా పెరిగిన జోరు... రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్ఏ నివేదిక ప్రకారం దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి గత రెండు నెలల్లో 6 శాతం అంటే 4.6 ఎంఎంఎస్‌సీఎండీ పుంజుకుని ఈ జనవరికల్లా 82.3 ఎంఎంఎస్‌సీఎండీకి చేరింది. ఇందుకు తూర్పుతీర సముద్ర క్షేత్రాల నుంచి 4.4 ఎంఎంఎస్‌సీఎండీ ఉత్పత్తి పెరగడంతో 5.9 ఎంఎంఎస్‌సీఎండీకి గ్యాస్ లభ్యత చేరింది. ఆర్ఐఎల్–బీపీ క్షేత్రాలు ఇందుకు దోహదపడ్డాయి. ఎల్ఎన్జీ ట్రక్కులు పెరగడం ద్వారా రానున్న దశాబ్ద కాలంలో వార్షికంగా మరో 8–10 మిలియన్ మెట్రిక్ టన్నులకు డిమాండ్ జత కలిసే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. గ్యాస్ లభ్యత, వినియోగం పుంజుకోవడం ద్వారా గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ (జీఎస్పీఎల్), గెయిల్ వంటి ఇంధన రవాణా కంపెనీలకు మేలు చేకూరనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. సామర్థ్యం ఇలా... ప్రస్తుతం వార్షికంగా దేశీ ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ సామర్థ్యం 42.5 ఎంఎంటీపీఏగా నమోదైంది. అయితే 2020లో 30 ఎంఎంటీపీఏ మాత్రమే రీగ్యాసిఫికేషన్ జరిగింది. ఇందుకు కొన్ని తాత్కాలిక అవాంతరాలు ఎదురైనట్లు నిపుణులు వెల్లడించారు. కాగా.. మరోవైపు దహేజ్, ధమ్రా, జైగఢ్ తదితర ప్రాంతాలలో ఏర్పాటవుతున్న టెర్మినళ్ల ద్వారా 24 ఎంఎంటీపీఏ అందుబాటులోకి రానుంది. ఇది పెట్రోనెట్ ఎల్ఎన్జీకి దన్నునివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే అంతిమ వినియోగదారులకు గ్యాస్‌ను అందించవలసి ఉన్నట్లు చె ప్పారు. ఇందుకు అనుగుణంగా జీఎస్పీఎల్ కొన్ని కీలక పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రస్తావించారు. వీటిలో దహేజ్–భాధుట్, అంజార్–చోటిల్లా, అంజార్–పలన్‌పూర్‌ను పేర్కొన్నారు. ఈ బాటలో 2021 జూలైకల్లా సిద్ధంకానున్న మెహశానా –భటిండా పైప్‌లైన్ వల్ల గుజరాత్ వెలుపలి గ్యాస్‌ను రవాణా చేసేందుకు వీలుంటుందని చెప్పారు. -
గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.500 డిస్కౌంట్
న్యూఢిల్లీ: గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే మనకు చాలా వరకు పద్ధతులున్నాయి. గ్యాస్ ఏజెన్సీకి కాల్ చేసి సిలిండర్ బుక్ చేయడం లేదా ఆయిల్ కంపెనీ వెబ్సైట్ లేదా యాప్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. లేదా ఐవీఆర్ఎస్ నెంబర్‌కి కాల్ చేసినా గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది. అలాగే మనకు ఆన్లైన్ లో థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ తో బుక్ చేయడం ద్వారా ఒక్కో సారి క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఇప్పుడు పేటీమ్ లో కూడా ఆఫర్ ఒకటి నడుస్తుంది. మీరు మీ గ్యాస్ సిలిండర్‌ను పేటీమ్ యాప్ లో బుక్ చేసుకుంటే రూ.500 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందవచ్చు.(చదవండి: మోటోరోలా నుంచి ఫ్లాగ్షిప్ ఫోన్) ఈ ఆఫర్‌ను పేటీమ్ యాప్‌లో భారత్ గ్యాస్, హెచ్‌పి గ్యాస్, ఇండేన్ గ్యాస్ యూజర్లు ఉపయోగించుకోవచ్చు. కానీ, ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 31 వరకు పేటీమ్ లో మొదటి సారి బుక్ చేసుకున్న వినియోగదారులకు లభిస్తుంది. ఇందుకోసం వినియోగదారులు FIRSTLPG ప్రోమో కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది. మీకు అదృష్టం ఉంటే రూ.500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మీరు పేటీమ్ యాప్ లో "బుక్ ఏ సిలిండర్" క్లిక్ చేసి తర్వాత గ్యాస్ ప్రొవైడర్ పేరు, ఎల్పీజీ ఐడీ, కస్టమర్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. ఒకసారి వివరాలు సరిచూసుకున్న తర్వాత అప్లై ప్రోమో కోడ్ కింద FIRSTLPG ప్రోమో కోడ్ ఉపయోగించి మొదటిసారి సిలిండర్ బుక్ చేస్తే మీకు రూ.500 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఒక కస్టమర్ ఒక్కసారి మాత్రమే ఈ ప్రోమో కోడ్ వర్తిస్తుంది. -
‘ఎడిటోరియల్స్ బిల్డప్..లోకం నవ్వుతుంది పప్పు’
సాక్షి, అమరావతి : వైఎస్సార్ సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ నాయుకుడు నారా లోకేష్ బాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎల్పీజీ విషయంలో లోకేష్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తప్పుబట్టారు. ఆదివారం ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ లోకేశం.. నేచురల్ గ్యాస్‌కి ఎల్పీజీకి మధ్య తేడా కూడా తెలియదా?.. నేచరుల్ గ్యాస్ వ్యాట్‌లో మార్పులు జరిగితే ఎల్పీజీపై అని దుష్ప్రచారం చేయిస్తావా?.. అసలు ఎల్పీజీపై ట్యాక్స్ రాష్ట్రం పరిధిలోకి వస్తుందా?.. ఇంత అజ్ఞానం పెట్టుకొని మళ్లీ ఎడిటోరియల్స్ రాస్తున్నట్లు బిల్డప్. లోకం నవ్వుతుంది పప్పు’’ అంటూ ఎద్దేవా చేశారు. ( చిట్టీ నాన్నారుని అడుగు చెప్తారు.. ) అంతకు క్రితం ట్వీట్లో.. ’’ చంద్రం..మళ్లీ దళిత రాజకీయం మొదలుపెట్టావా?.. సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన''‘వైఎస్సార్ ఆసరా' నుండి ప్రజల దృష్టి మరల్చడమే మీ కుతంత్రం కదా?.. కానీ మీ కుట్ర విఫలం. ‘వైఎస్సార్ ఆసరా' సఫలం. మళ్లీ వినండి.. మాట నిలబెట్టుకొని తొలి విడతలో రూ.6,792 కోట్లు అక్కచెల్లమ్మల ఖాతాలో జమ చేశారు ముఖ్యమంత్రి జగన్’’ అని పేర్కొన్నారు. -
పెరిగిన వంట గ్యాస్ ధర
సాక్షి, న్యూఢిల్లీ : వంట గ్యాస్ ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం (జూలై1) అమల్లోకి వచ్చేలా మెట్రో నగరాల్లో సిలిండర్‌కు 4.50 రూపాయలకు వరకు పెంచారు. ఎల్పీజీ సిలిండర్ల ధరను వరుసగా రెండవ నెలలోనూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. సబ్సిడీ లేని 14.2 కిలోల సిలిండర్ పై ఢిల్లీలో ఒక రూపాయి, ముంబైలో 3 రూపాయల 50 పైసలు , కోల్‌కతాలో 4.50 రూపాయలు, చెన్నైలో 4 రూపాయలు, హైదరాబాద్ లో 4.50 రూపాయలు చొప్పున పెరిగింది సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ రేట్లు (14.2 కిలోలు) హైదరాబాద్ : 645.50 రూపాయలు ఢిల్లీ : 594 రూపాయలు కోల్‌కతా : 620.50 రూపాయలు ముంబై : 594 రూపాయలు చెన్నై : 610.50రూపాయలు -
సాధారణ స్థాయికి ఎల్పీజీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: దేశీయంగా, రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ నిల్వలకు ఎలాంటి కొరత లేదంటూ ఇండియన్ ఆయిల్ కంపెనీల ప్రకటనల నేపథ్యంలో డిమాండ్ సాధారణ స్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా వంట గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌లు విపరీతంగా పెరగ్గా, ప్రస్తుతం అవి తగ్గుముఖం పట్టాయి. ఎక్కడా కొరత లేకపోవడం, ఆయిల్ కంపెనీలు సైతం బుకింగ్ చేసిన రెండు, మూడు రోజుల్లోనే సరఫరా చేస్తుండటంతో అటు వినియోగదారులు, ఇటు కంపెనీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. రాష్ట్రంలో గత ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చి 21 నుంచి గ్యాస్ బుకింగ్‌లు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ బుకింగ్‌లు 1.75లక్షల నుంచి 1.85లక్షల వరకు ఉంటుండగా, మార్చి నెలాఖరులో అవి ఏకంగా రోజుకు 3లక్షల వరకు పెరిగాయి. వినియోగదారులు అవసరం లేకున్నా అదనపు బుకింగ్‌లు చేస్తుండటంతో అప్రమత్తమైన ఆయిల్ కంపెనీలు ఒక్కో సిలిండర్ బుకింగ్‌కు మధ్య గడువును 14 రోజులకు పెంచాయి. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌తో పాటే ఎల్పీజీ నిల్వలు సరిపడేంతగా ఉన్నాయని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. ఎల్పీజీ సిలిండర్ పూర్తిగా అందుబాటులో ఉండటంతో సోమవారం బుకింగ్‌లు కేవలం 1.08లక్షలు మాత్రమే ఉన్నాయని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. -
ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కారణంగా దేశం మొత్తం కష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం శుభవార్తను అందించింది. సబ్సీడియేతర లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ (14.2 కేజీ) ధరను రూ.65 తగ్గిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ధరలు 55 శాతం మేర పడిపోవడంతో రేట్లు తగ్గించినట్లు ఐఓసీ తెలిపింది. ఈ తగ్గించిన రేట్లు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కానున్నాయి. దీంతో ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ రూ. 744కి లభించనుంది. గత నెలలో ఇది రూ. 805.5 ఉండగా రూ. 61.5 రూపాయలు తగ్గింది. -
సబ్సిడీయేతర వంటగ్యాస్ ధర రూ.53 తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధర పెరిగిందని బెంబేలెత్తుతున్న ప్రజలకు ఊరట లభించింది. సబ్సిడీ లేని వంట గ్యాస్ ధరను ప్రభుత్వం ఆదివారం తగ్గించింది. 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీ, ముంబైల్లో రూ. 53 మేర.. అలాగే 19 కేజీల సిలిండర్ ధర రూ. 84.50 తగ్గిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ఆగష్టు 2019 నుంచి ఫిబ్రవరి 2020 వరకు మధ్య ఎల్పీజీ ధర 50 శాతం పెరిగింది. -
కొత్త ఏడాదిలో వంట గ్యాస్ భారం
సాక్షి, ముంబై: కొత్త ఏడాదిలో వంట గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ బండ భారం పడింది. నాన్ సబ్సిడీ ( సబ్సిడీ లేని) వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తాజాగా ప్రకటించాయి. పెరిగిన ధరలు జనవరి 1నుంచే అమల్లోకి వచ్చాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం14.2 కిలోల సిలిండర్ న్యూఢిల్లీలో రూ. 19, ముంబైలో రూ. 19.50, ఇతర ప్రాంతాల్లో రూ. 20 వరకూ భారం పడనుంది. దీంతో వరుసగా ఐదో నెలలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగినట్లయింది. గత ఏడాది ఆగస్టునుంచి ఈ ఐదు నెలల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 140 పెరిగినట్లయింది. తాజా పెంపు తరువాత ప్రస్తుతం న్యూఢిల్లీలో రూ. 684గా ఉన్న సిలిండర్ ధర రూ. 714కు చేరింది. ముంబైలో రూ. 895కు పెరిగింది. ఇక కోల్‌కతాలో రూ. 747, చెన్నైలో రూ. 734గా వుండనుంది పెంచిన ధరలు తక్షణం అమలులోకి వస్తాయని ఐఓసీఎల్ వెల్లడించింది. ఇదే సమయంలో 19 కిలోల బరువుండే కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1,241, ముంబైలో రూ. 1,190గా ఉందని ఇండియన్ ఆయిల్ పేర్కొంది. -
గడువు దాటిన సిలిండర్లతో పొంచి ఉన్న ముప్పు
నిడమర్రు: వంట గ్యాస్ (ఎల్పీజీ)తో వంట చేసుకోవడం ఎంత సులువో సరైన జాగ్రత్తలు పాటించకపోతే అంతే ప్రమాదం పొంచి ఉంటుంది. మీ డీలర్ çసరఫరా చేసిన వంటగ్యాస్ సిలిండర్‌కు ఎక్స్‌పయిరీ తేదీ ఉంటుంది. ఎక్స్‌పయిరీ తేదీ అంటే ఆ సిలిండర్ వినియోగించడానికి గడువు పూర్తయిందని సూచన. గడువు దాటిన తర్వాత మీ ఇంటికి చేరే సిలిండర్లలో లీకేజీలు ఏర్పడవచ్చు, ప్రమాదం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వంట గ్యాస్ సిలిండర్‌ను ఫిల్లింగ్ చేసే మయంలో నిబంధనలు ఏమిటి..?, సిలిండర్ గడువు తీరిందని ఎలా గుర్తించాలి.. తదితర సమాచారం తెలుసుకుందాం.. సిలిండర్‌కు 10 ఏళ్ల గడువు చట్టప్రకారం వంట గ్యాస్ (ఎల్పీజీ )సిలిండర్ అన్ని భద్రతా ప్రమాణాల పరీక్షలు పూర్తి చేసుకున్న కొత్త సిలిండర్ గడువు 10 ఏళ్ల వరకూ ఉంటుంది. సిలిండర్ తయారీలో ప్రత్యేకమైన ఉక్కుతోనూ, సిలిండర్ లోపల సురక్షితమైన కోటింగ్‌తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాన్డర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాల మేరకు తయారు చేస్తుంటారు. చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ ప్లోజిన్స్, బీఐఎస్ అనుమతులు తప్పని సరిగా తీసుకున్నాకే సిలిండర్ అందుబాటులోకి వస్తుంది. ఒకసారి లోపాలు కనిపించిన వాటిని సరిచేసి బీఐఎస్ ధ్రువీకరణ తీసుకున్న సిలిండర్‌లో మరోసారి పరీక్షల సమయంలో లోపాలు కనిపిస్తే తక్షణం దాన్ని తుక్కు కింద పక్కన పెట్టాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ దానిలో గ్యాస్ నింపకూడదు. గడువు తేదీఎలా తెలుసుకోవాలి..? ఫలానా సంవత్సరం, ఫలానా నెలలో సిలిండర్ పరీక్షలకు వెళ్లాల్సి ఉందన్న సంకేతాన్ని సిలిండర్‌పై గుర్తించడం చాలా సులభం. సిలిండర్‌పై ఉన్న మెటల్ ప్లేట్లలో ఒకదానిపై లోపలివైపు ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు మీ ఇంట్లో సిలిండర్‌పై ఏ17 అని ఉందనుకోండి అదే ఎక్స్‌పయిరీ తేదీ అని గుర్తించాలి. 19 అంకె 2019 సంవత్సరాన్ని, అంగ్ల అక్షరం –ఎ మొదటి త్రైమాసికం అని అర్థం. అంటే 2019 మార్చిలోపు ఈ సిలిండర్ గడువు తేదీ ముగుస్తుంది. నెలను ఇలా గుర్తించాలి. ఎ– ( జనవరి నుంచి మార్చి) బి– (ఏప్రిల్ నుంచి జూన్) సి– (జులై నుంచి డిసెంబర్) మూడు నెలల గ్రేస్ పిరియడ్ ప్రతీ సిలిండర్‌పై ఉన్న గడువు తర్వాత మరో మూడు నెలలు గ్రేస్ పిరియడ్ ఉంటుంది. అంటే వినియోగదారుని దగ్గరకు వెళ్లిన సిలిండర్ తిరిగి డీలర్ వద్దకు చేరి అక్కడి నుంచి గ్యాస్ రీఫిల్లింగ్ స్టేషన్‌కు చేరుకునేందుకు వీలుగా ఈ గ్రేస్ పీరియడ్. అంతేగానీ కస్టమర్ వాడుకునేందుకుకాదు. అంటే ఏ–2019 గడువుతో ఉన్న సిలిండర్‌ను మార్చి నెల తర్వాత గ్యాస్ డీలర్ మీకు పంపిస్తే ఎట్టి పరిస్థితిల్లోనూ దీన్ని తీసుకోవద్దు. మరో సిలిండర్ కోరే హక్కు వినియోగదారుడికి ఉంది. కొంత మంది డీలర్లు గడువు తేదీని పెయింట్‌తో మార్చుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. వాటిని గమనించాలి. వినియోగదారుడి హక్కులు ♦ గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారుడు మరణిస్తే వారి కుటుంబ సభ్యుల పేరిట ఆకనెక్షన్‌ను మార్చుకోవచ్చు. ♦ బుక్ చేసిన ఏడు పనిదినాల్లోపు సిలిండర్‌ను కస్టమర్‌కు అందివ్వాలి ♦ కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే అదే రోజు కనెక్షన్ జారీ చేయాలి. ♦ కొత్తగా కనెక్షన్ తీసుకునే సమయంలో డీలర్ స్టవ్‌ను కూడా తీసుకోవమని అడుగుతుంటాడు. కానీ నిబంధనల ప్రకారం డీలర్ దగ్గరే స్టవ్ తీసుకోవాల్సిన అవసరంలేదు. ♦ వంటగ్యాస్‌ను వాహనాల కోసం వినియోగించడం చట్టరీత్యానేరం. దీనికి బదులు ఆటోగ్యాస్ కోనుగోలు చేసి వాడుకోవాలి. -
ఐఓసీ ఎల్పీజీ ప్రాజెక్ట్‌లో బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు చేరిక
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొ(ఐఓసీ) చేపట్టిన భారీ ఎల్పీజీ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లో బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు కూడా చేతులు కలుపుతున్నాయి. గుజరాత్‌లోని కాండ్లా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వరకూ 2,757 కిమీ ఈ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌ను రూ.9,000 కోట్ల పెట్టుబడులతో ఐఓసీ చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో చెరో 25 శాతం వాటా తీసుకోనున్నట్లు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలు వెల్లడించాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ ఈ మూడు కంపెనీల జాయింట్‌వెంచర్ కానున్నది. 3 రాష్ట్రాలు...22 ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కాండ్లా వద్ద ఎల్పీజీని దిగుమతి చేసుకుంటారు. పశ్చిమ తీర ప్రాంతంలో కొన్ని రిఫైనరీల నుంచి కూడా ఎల్పీజీని తీసుకుంటారు. ఆ తర్వాత దీనిని అహ్మదాబాద్, ఉజ్జయిని, భోపాల్, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, లక్నోలకు పైప్‌లైన్ ద్వారా సరఫరా చేస్తారు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లోని ఈ మూడు కంపెనీలకు చెందిన 22 ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లకు ఈ పైప్‌లైన్‌ను అనుసంధానం చేస్తారు. ఈ ప్రాజెక్ట్ కారణంగా రోడ్డు రవాణా వ్యయాలు కలసిరావడమే కాకుండా, భద్రత పరంగా కూడా మెరుగైనదని నిపుణులంటున్నారు. ఈ పైప్‌లైన్ ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఎల్పీజీని సరఫరా చేస్తుంది. దేశంలో ఇదే అతి పొడవైన ఎల్పీజీ పైప్‌లైన్ ప్రాజెక్ట్ కానున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శంఖుస్థాపన చేశారు. నాలుగేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని అంచనా. ప్రస్తుతం గెయిల్ కంపెనీ గుజరాత్‌లోని జామ్ నగర్ నుంచి న్యూఢిల్లీ సమీపంలోని లోని వరకూ 1,415 కిమీ. ఎల్పీజీ పైప్‌లైన్‌ను నిర్వహిస్తోంది. ఈ పైప్‌లైన్ ద్వారా ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల ఎల్పీజీని సరఫరా చేస్తోంది. -
సబ్సిడీ సిలిండర్‌పై రూ.5.91 కోత
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు ఎల్పీజీ వినియోగదారులకు మరోసారి ఊరటనిచ్చాయి. సబ్సిడీ ఉన్న సిలిండర్‌పై రూ.5.91, సబ్సిడీలేని సిలిండర్‌పై రూ.120.50 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ధరల తగ్గుదల నేపథ్యంలో ఢిల్లీలో 14.2 కేజీల బరువున్న సబ్సిడీ సిలిండర్ రూ.494.99కు, సబ్సిడీలేని సిలిండర్ రూ.689కు అందుబాటులోకి రానుంది. ఈ తగ్గింపు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధనం ధరల్లో తగ్గుదలతో పాటు రూపాయి మారకం విలువ బలపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. -
త్యాగాలు కాంగ్రెస్‌వి..భోగాలు కేసీఆర్‌వి..
సాక్షి,బొమ్మలరామారం : అమరుల ఆత్మ బలిదానాలు, సోనియాగాంధీ చలువతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం భోగాలు అనుభవిస్తుందని డీసీసీ అధ్యక్షుడు బూఢిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో గురువారం జరిగిన గడపగడపకు కాంగ్రెస్‌లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. షామీర్పేట్ చెరువును రిజర్వాయర్‌గా మార్చి బొమ్మలరామారం మండలానికి సాగు నీరు అందిస్తామన్నారు. కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్ రూం ఇళ్లు సంగతి దేవుడెరుగు బాత్ రూం బిల్లులే రావడం లేదన్నారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని, వారి కుటుంభాలకు ముడెకరాల భూ పంపిణీ చేస్తామని మోసం చేసిన కేసీఆర్ దళిత ద్రోహి అన్నారు. ఆలేరు అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో ఏక కాలంలో వ్యవసాయ రుణాలను మాఫీ చేశారన్నారు. రేషన్ కార్డు గల కుటుంబానికి 6 ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు ప్రతి వ్యక్తికి ఏడు కిలోల సన్నబియ్యం ఇస్తామన్నారు. ఐదు లక్షలవ్యయంతో ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు 3 వేల జీవన భృతి అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మోకు మధుసూదన్ రెడ్డి, కట్టా శ్రీకాంత్‌గౌడ్, మర్రి ఆగం రెడ్డి, రామిడి జంగారెడ్డి, బోగ వెంకటేష్, మాందాల రామస్వామి, బండ వెంకటేష్, మోటే గట్టయ్య, మహదేవుని రాజు, మోటే వెంకటేష్, రాజు నాయక్, గుర్రాల సత్తిరెడ్డి, బోయిన్పల్లి రమేష్, శ్రీరాములు నాయక్, బాసారం బాబు,మోహన్ నాయక్, జూపల్లి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెలు
‘నిప్పురవ్వలు పడి మీ బట్టలు కాలిపోయాయి.. క్షమించండంటూ ఇస్త్రీ వాలాల వేడుకోలు, కరెంటు లేదు బట్టలు ఇస్త్రీ చేయడం కుదరలేదనే సమాధానాలను దుస్తులను ఇస్త్రీకి ఇచ్చినప్పుడు మనం నిత్యం వింటూ ఉంటాం. అయితే ఈ సమస్యలేమీ లేకుండా ఇస్త్రీ వాలాలకు ఓ కొత్త పరిష్కారం దొరికింది. అంతేకాదు బొగ్గులతో ఇస్త్రీ చేయడం వల్ల వచ్చే శ్వాసకోశ సంబంధ వ్యాధులూ దూరం కానున్నాయి. కరెంటు, బొగ్గులతో వాడే ఇస్త్రీ పెట్టెలకు ప్రత్యామ్నాయంగా ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అందుబాటులోకి తెచ్చింది. ఇవి ఇస్త్రీ వాలాలకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. 5 కేజీల సిలిండర్‌ను ఉపయోగించి 1,100 దుస్తులు, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల సిలిండర్‌తో 4,500 దుస్తులు ఇస్త్రీ చేయొచ్చు. అయితే ఇప్పటివరకు ఉపయోగిస్తున్న ఇస్త్రీ పెట్టెల కంటే ఇవి కాస్త ఖరీదైనవి. రూ.2,500 నుంచి రూ.7,000 మధ్య వీటి ధర ఉంటుంది. సాధారణ పెట్టెలు ఆరు కేజీల బరువు ఉంటే ఇవి ఆరున్నర కేజీల బరువు ఉంటాయి. పుణే కేంద్రంగా ఉన్న ఓ కంపెనీ వీటిని సరఫరా చేస్తోంది. ఇప్పటికే కేరళ, మహారాష్ట్రలలో వీటిని వినియోగిస్తున్నారు. సిలిండర్ నుంచి పైప్‌ను గ్యాస్ స్టౌవ్‌కు ఎలా అమరుస్తామో ఇస్త్రీ పెట్టెకు కూడా అలాగే గ్యాస్ పైప్‌ను అమరుస్తారు. ఇస్త్రీ పెట్టె వేడిని నియంత్రించేందుకు రెగ్యులేటర్ ఉంటుంది. ఇస్త్రీ పెట్టె లోపలి భాగంలో ఇంధనం మండినా ఇస్త్రీ చేసే వ్యక్తికి ఎలాంటి ప్రమాదమూ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు తయారీదారులు. -
ఇక ‘కుకింగ్’ సబ్సిడీ..!
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న ఎల్పీజీ సబ్సిడీ స్థానంలో కుకింగ్ సబ్సిడీని ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను నీతి ఆయోగ్ పరిశీలిస్తోంది. పైపుల ద్వారా సహజవాయువును వినియోగించేవారు, వంట కోసం బయో ఇంధనాలను వినియోగించే వారికీ సబ్సిడీ ప్రయోజనాలను విస్తరించాలనే ఆలోచనే ఈ ప్రతిపాదనకు ప్రాతిపదిక అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. వంట కోసం వినియోగించే అన్ని ఇంధనాలకు సబ్సిడీ ప్రయోజనాలు వర్తించాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎల్పీజీ వినియోగదారులకే సబ్సిడీ అందుతున్న విషయం తెలిసిందే. ‘‘వంటకు వినియోగించే అన్ని ఇంధనాలకు సబ్సిడీ వర్తించాలి. ఎందుకంటే కొన్ని పట్టణాల్లో పైపుల ద్వారా సహజ వాయువు సరఫరా జరుగుతోంది. అందుకే సబ్సిడీని వారికి కూడా అందించడమే సరైనది’’ అని కుమార్ పేర్కొన్నారు. సబ్సిడీని కేవలం ఎల్పీజీకే పరిమితం చేయడం అన్నది చౌక ఇంధనాలు, గ్రామీణ ప్రాంతాల్లో బయో ఇంధనాలు, పట్టణాల్లో పీఎన్జీ (పైపుల ద్వారా సహజవాయువు) వినియోగాన్ని నిరుత్సాహపరిచే చర్యగా వస్తున్న అభిప్రాయాల నేపథ్యంలో కుమార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. కుకింగ్ సబ్సిడీ ప్రతిపాదన ‘నేషనల్ ఎనర్జీ పాలసీ 2030’ ముసాయిదాతో వెల్లడైంది. గత వారమే దీన్ని ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఇది కేబినెట్ పరిశీలనకు వెళ్లనుంది. చైనా–అమెరికా మధ్య వాణిజ్య ఘర్షణలతో ఎదురయ్యే ప్రభావాన్ని తట్టుకునేందుకు సన్నద్ధమైనట్టు తెలిపారు. స్థూల ఆర్థిక అంశాలు పటిష్టంగా ఉన్నాయని, ప్రైవేటు పెట్టుబడులు కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ 7–7.5 శాతం జీడీపీ వృద్ధి రేటు సాధ్యమేనన్నారు. ఆమర్థ్యసేన్ క్షేత్ర స్థాయికి వెళ్లి చూడాలి... ప్రముఖ ఆర్థిక వేత్త ఆమర్థ్యసేన్ కొంత కాలం పాటు దేశంలో ఉండి మోదీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలను పరిశీలించాలని రాజీవ్ కుమార్ సూచించారు. మోదీ సర్కారు పనితీరును ఆమర్త్యసేన్ తప్పుబట్టిన నేపథ్యంలో కుమార్ ఇలా స్పందించడం గమనార్హం. ‘‘ప్రొఫెసర్ ఆమర్థ్యసేన్ కొంత సమయాన్ని భారత్‌లో వెచ్చించి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కోరుకుంటున్నాను. ఆ విధమైన ప్రకటనలు చేసే ముందు గడిచిన నాలుగేళ్లలో మోదీ సర్కారు చేపట్టిన పనులను సమీక్షించాలి’’ అని కుమార్ పేర్కొన్నారు. -
ప్రేమ్‌చంద్ కథకు ‘ఉజ్వల’ లింకేమిటో?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తన వినూత్న ఉజ్వల పథకం విజయ ప్రస్థానం గురించి దేశ పేద మహిళల ముందు ప్రస్థావిస్తూ ‘పిట్ట’ కథకు బదులుగా ప్రముఖ హిందీ రచయిత ప్రేమ్‌చంద్ రాసిన ‘ఈద్గా’ చిన్న కథ గురించి వివరంగా చెప్పారు. అందులో హమీద్ అనే చిన్న కుర్రాడు చేగోడీలో, పకోడీలో కొనుక్కోకుండా దాచుకున్న తన జేబు డబ్బును తన నానమ్మ రొట్టెలు కాలుస్తున్నప్పుడు చేతులు కాల్చుకోకుండా ఉండేందుకుగాను పటకారు కొంటాడు. ‘నానమ్మ చేతులు కాల్చుకోకుండా ఓ చిన్న కుర్రవాడు చేసినప్పుడు ఈ దేశ ప్రధానిగా ఉన్న నేను ఈ మహిళలకు ఎందుకు చేయలేను’ అన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ వినూత్న ఉజ్వల పథకమని మోదీ సగర్వంగా చెప్పుకోవడమే కాకుండా ముచ్చటగా మురిసిపోయారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో రెండు దశాబ్దాల క్రితమే పేదలకు సబ్సిడీ ఎల్పీజీ స్కీమ్‌ను అమలు చేశారు. తమిళనాడులో 2007లో అప్పటి డీఎంకే ప్రభుత్వం ఎల్పీజీ కనెక్షన్లను, గ్యాస్ స్టవ్‌లను ఉచితంగా అందజేసింది. కేంద్రంలో మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా పేద మహిళలకు సబ్సిడీలపై ఎల్పీజీ కనెక్షన్లను అందజేసింది. ఈ స్కీమ్లకే మన ప్రధాని నరేంద్ర మోదీ ‘ఉజ్వల’గా పేరు మార్చి అమలు చేశారు. ఉత్తరాదిలో చాలా చోట్ల ఇప్పటికే సిలిండర్లు, గ్యాస్ స్టవ్‌లు అటకెక్కగా, కొన్ని చోట్ల సిలిండర్లు పక్కింటికి, స్టవ్‌లు అంగడికి వెళ్లాయి. ఉచితంగా దొరికే వంట చెరకు బదులుగా నెలకు ఐదారు వందల రూపాయలను గ్యాస్ సిలిండర్‌కు ఎందుకు ఖర్చు చేయాలన్న ఆలోచనే అందుకు కారణం. నరేంద్ర మోదీ మాత్రం తాను ‘ఈద్గా’ కథ నుంచి స్ఫూర్తి పొంది ఉజ్వల పథకాన్ని అమలు చేసినట్లు చెబుతున్నారు. ఈ కథను చదువుతున్నప్పుడు ఎవరైనా హమీద్‌కు తన నానమ్మ అమీనా పట్ల ఉన్న అంతులేని అభిమానాన్ని అనుభూతి పొందుతాము. నరేంద్ర మోదీ ఉజ్వల లబ్ధిదారులతో మాట్లాడిన సంభాషణ వింటే మనకు ఎలాంటి అనుభూతి కలగదు. పైగా అర్థరహితంగా కనిపిస్తుంది. ఒడిశాలోని మయూర్భంజ్ నుంచి సుశ్మిత... ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడుతూ ‘ఇంతకుముందు వర్షాకాలంలో వర్షాలు పడ్డప్పడల్లా పొయ్యిలోకి నీళ్లు వచ్చేటివి. పొయ్యి వెలిగేది కాదు. పిల్లలు పస్తులుండేది. ఇక ఆ బాధ ఉండదని అనుకుంటా!’ అని వ్యాఖ్యానించారు. ‘కొత్త స్టవ్ వచ్చిన సందర్భంగా పిల్లలకు నీవు కొత్త వంటకాలు ఏమైనా చేసి పెడుతున్నావా? లేక అదే కట్టెల పొయ్యి మీద చేసినట్లుగా లావు, లావు రొట్టెలు చేసి పెడుతున్నావా?’ అని మోదీ ప్రశ్నించారు. మయూర్భంజ్ ప్రాంతంలో ఎక్కువగా అన్నమే తింటారని, రొట్టెలు చేసుకోరన్న విషయం మన ప్రియతమ ప్రధానికి తెలియదు పాపం! ‘నీవు ఏం బాగా చేస్తావు? నీ పిల్లలకు ఏది ఎక్కువ ఇష్టం? వారికి ఏది చేసి పెడతావు?’ అని కూడా సుశ్మితాను మోదీ ప్రశ్నించారు. అందుకు ఆమె ‘మ్యాగీ’ అంటూ సమాధానమిచ్చారు. నిజంగా మ్యాగి చేస్తారా? అంటూ మోదీ ఆశ్చర్యపోతూ మనల్నీ ఆశ్చర్యంలో పడేశారు. మోదీ మరో లబ్ధిదారు మీనాతో మాట్లాడుతూ ‘ మీ ఇరుగుపొరుగున ధనవంతులున్నారు. వారికి అందమైన ఇళ్లు ఉన్నాయి. కార్లు ఉన్నాయి. స్కూటర్లూ ఉన్నాయి. అన్నింటికన్నా ముందు గ్యాస్ స్టవ్‌లు ఉన్నాయి. మీకు ఇంతకాలం గ్యాస్ స్టవ్ లేదు.....మాకే గ్యాస్ స్టవ్ ఉందంటూ ఇంతకాలం రొమ్ము విరుచుకుని తిరిగాంగానీ ఇప్పుడు ఈ మోదీ వచ్చి ఓ పేదకు గ్యాస్ స్టవ్ ఇచ్చారు. ఇక మమ్మల్ని చూసి ఔరా! అనే వారే ఉండరని వారంటారుగదా!’ అన్న వ్యాఖ్యల్లో ఎవరికి తోచిన అర్థాలు వారు వెతుక్కోవచ్చు! -
మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర
-
మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర
ఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. సుమారు రూ.4.50 పెరగటంతో ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్ ధర రూ.495.69 కాగా, సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.742 అయింది. సరాసరి పెట్రోలియం ధర, ఫారిన్ ఎక్స్ఛేంజ్ రేట్‌ను బట్టి నెలవారీగా పెట్రోలియం మంత్రిత్వశాఖ గ్యాస్ ధరలను నిర్ణయిస్తోంది. ఈ మేరకు గత మే 30వ తేదీ నుంచి నెలకు రూ.4 చొప్పున 19 సార్లు పెరిగి సిలిండర్‌పై రూ.76.51 వరకు చేరుకుంది. దేశంలో సబ్సిడీ వంటగ్యాస్ వినియోగదారులు 18.11 కోట్ల మంది, ప్రధాన్‌మంత్రి ఉజ్వల యోజన కింద ఏడాదిలో ఇచ్చిన మూడు కోట్ల సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లతోపాటు సబ్సిడీయేతర వంటగ్యాస్ వినియోగదారులు 2.66 కోట్ల మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి వినియోగదారుడు 14.2కిలోల గ్యాస్ సిలిండర్లను ఏడాదిలో 12వరకు సబ్సిడీపై వాడుకునే వీలుంటుంది. ఆ తర్వాత వాడుకోవాలంటే మాత్రం సబ్సిడీ వర్తించదు. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ నిబంధనలు కూడా ఉండవు. వంటగ్యాస్‌కు సబ్సిడీయే ఉండదని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. -
బండ మళ్లీ బరువెక్కింది..!
-
బండ మళ్లీ బరువెక్కింది..!
సాక్షి, న్యూఢిల్లీ : గృహ అవసరాల కోసం వినియోగించే గ్యాస్‌పై రూ. 1.50, విమాన ఇంధనంపై 6 శాతం ధరలను పెంచుతున్నట్లు ఇంధన దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకటించింది. అంతర్జాతీయ ఇంధన ధరల ప్రకారమే ధరల్లో మార్పులు చేస్తున్నట్ల ఐఓసీ తెలిపింది. కొత్తగా పెరిగిన ఇంధన ధరల ప్రకారం ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ఢిల్లీలో కిలో లీటర్‌కు రూ.53,045కు చేరింది. గతంలో ఇది రూ.50,020గా ఉండేది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు దిగివస్తున్నా.. విమాన ఇంధనధరలు పెరగడం వరుసగా ఇది మూడోసారి. ఇక గృహ అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ గ్యాస్ ధర రూ.1.50 పెరిగింది. గ్యాస్‌పై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసే క్రమంలో గ్యాస్ ధరలను ప్రతినెలా కేంద్రం పెంచుతూ వస్తోంది. గత ఏడాది నుంచి ఇప్పటివరకూ గ్యాస్ ధరలు.. రూ. 69.50 పెరిగాయి. -
భారీగా పడిపోయిన ఇంధన డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయంగా ఇంధన డిమాండ్ భారీగా పడిపోయింది. 14 ఏళ్లలో అత్యంత కనిష్ట స్థాయిలకు ఈ డిమాండ్ క్షీణించి, ఆగస్టు నెలలో 6.1 శాతాన్ని నమోదుచేసింది. పలు ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టించడంతతో, డీజిల్, గ్యాసోలిన్ డిమాండ్ భారీగా క్షీణించింది. దేశంలో వేగవంతంగా వృద్ధి చెందుతున్న ఆయిల్ కన్జ్యూమర్‌గా పేరున్న భారత్ ఈ ఆగస్టు నెలలో 15.75 మిలియన్ టన్నులను మాత్రమే వినియోగించుకుంది. గతేడాది ఇదే నెలలో 16.78 మిలియన్ టన్నులుగా ఉందని ఆయిల్ మంత్రిత్వశాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ పేర్కొంది. 2003 ఏప్రిల్ నుంచి ఇదే అత్యంత కనిష్ట స్థాయిలు. ఈ ఏడాదిలో ఇంధన డిమాండ్ పడిపోవడం ఇది రెండో సారి. జనవరిలో కూడా వినియోగం 5.9 శాతానికి క్షీణించింది. డీజిల్ డిమాండ్ కూడా 3.7 శాతం పడిపోయి, 5.9 మిలియన్ టన్నులుగా ఉంది. అదేవిధంగా పెట్రోల్ విక్రయం కూడా 0.8 శాతం తక్కువగా 2.19 మిలియన్ టన్నులుగా నమోదైంది. అయితే ఎల్పీజీ అమ్మకాలు మాత్రం 11.8 శాతం పెరిగి 2.06 మిలియన్ టన్నులుగా రికార్డయ్యాయి. కిరోసిన్ వాడకం 41 శాతం పైగా తగ్గింది. -
మళ్లీ పెరిగిన సిలిండర్ ధర
న్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారుడిపై మళ్లీ గ్యాస్ ‘బండ’ భారం పడింది. క్రమంగా వంట గ్యాస్ సబ్సిడీ ఎత్తివేసే పథకాన్ని మరింత వేగవంతం చేసిన కంపెనీలు మరోసారి ధరలను సమీక్షించాయి. ప్రతి నెలా ధరల పెంపు నిర్ణయంలో భాగంగా ఎల్పీజీ సిలిండర్ ధరలను భారీగా పెంచేశాయి. శుక్రవారం ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం నాన్-సబ్సిడీ సిలిండర్ ధర రూ.73.5 , సబ్సిడీ సిలిండర్ రూ. 7 ల మేర పెరగనుంది. ఏవియేషన్ టర్భైన్ ఫ్యూయల్ (ఎటీఎఫ్) ను 4శాతం పెంచింది. అలాగే, ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా అమ్మిన కిరోసిన్ ధరను కూడా లీటరుకు 25 పైసలు చొప్పున పెంచింది. దేశంలోని అతి పెద్ద ఇంధన రిటైలర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం, దీంతో 14.2 కేజీల ఎల్పీజీ సబ్సిడీ సిలిండర్ 487.18గా ఉండనుంది. నాన్- సబ్సిడీ సిలిండర్ ధర రూ. 597.50 గా ఉండనుంది. అయితే గత సంవత్సరం జూలై నుంచి రూ .2 చొప్పున నెలకొల్పిన పాలసీ అమలులో సబ్సిడైజ్డ్ ఎల్పీజీ రేట్లు సిలిండర్‌కు 68 రూపాయల మేరకు పెరిగాయి. జూన్ నెలలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ .419.18 వద్ద ఉంది. ప్రతి నెల సిలిండర్‌పై 4 రూపాయల చొప్పున పెంచుతూ పూర్తిగా సబ్సిడీనీ ఎత్తివేయాలని ప్రభుత్వానికి చెందిన చమురు కంపెనీలను ప్రభుత్వం కోరింది. చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 31 న లోక్‌సభలో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
గ్యాస్ సబ్సిడీపై జీఎస్టీ ‘బండ’
న్యూడిల్లీ: జీఎస్టీ ప్రభావంతో సామాన్యుల నెత్తిన ‘బండ’ పడింది. వస్తు, సేవల పన్ను ప్రభావంతో వంట గ్యాస్‌పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ గణనీయంగా తగ్గనుందని తెలుస్తోంది. వంట గ్యాస్ వినియోగదారులు ఇక నుంచి గ్యాస్ సిలిండర్‌పై ప్రతినెల రూ. 32 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఇకపై రూ.107మాత్రమే సబ్సిడీ రానుందని అఖిల భారత జాతీయ ఎల్పీజీ పంపిణీదారులు ఫెడరేషన్ కార్యదర్శి విపుల్ పురోహిత్ చెప్పారు. ఫలితంగా జూలై నుంచి ప్రతి వంట గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్‌కు 32 రూపాయల వరకు భారం పడనుంది. దీంతోపాటు కొత్త కనెక్షన్లు తీసుకునే వినియోగదారులు రెండు సంవత్సరాల మాండేటరీ ఇన్స్పెక్షన్, ఇన్స్టాలేషన్, అడ్మినిస్ట్రేటివ్ చార్జీలనున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక సెకండ్ సిలిండర్‌కు కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వీటిని 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావడంతో వినియోగదారుల నెత్తిన భారం తప్పేలా కనిపించడం లేదు. జీఎస్టీ ప్రకారం ఎల్పీజీ 5 శాతం పన్ను పరిధిలో ఉంది. గతంలో ఢిల్లీ తదితర కొన్ని రాష్ట్రాలు దీనిపై పన్ను విధించకపోవడంతో వ్యాట్ 2 శాతం నుంచి 4 శాతం మధ్య ఉండేది. ప్రస్తుతం జీఎస్టీ అమలుతో సిలిండర్ ధర రూ.12-15 వరకు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు జీఎస్టీ కారణంగా ప్రభుత్వం ఇచ్చే రాయితీ కూడా తగ్గనుంది. ఇప్పటి వరకు రూ.119.85 పైసలు రాయితీ ఇస్తుండగా జీఎస్టీ తర్వాత బుక్ చేసుకున్న వారి ఖాతాలో రూ.107 మాత్రమే పడనుంది. మొత్తంగా చూసుకుంటే ఒక్కో సిలిండర్‌పై వినియోగదారులకు రూ.32 వరకు జీఎస్టీ బండ పడే అవకాశాలు ఖాయం. రవాణా మరియు లాజిస్టిక్స్ వంటి వేరియబుల్ ఖర్చులు కారణంగా ఇతర రాష్ట్రాలలో ధరలలో చిన్న వ్యత్యాసం ఉండనుంది. -
జీఎస్టీతో వంటగ్యాస్ చౌక!
తగ్గనున్న నిత్యావసర వస్తువుల బడ్జెట్ న్యూఢిల్లీ: వంటగ్యాస్ (ఎల్పీజీ), నోట్ పుస్తకాలు, ఇన్సులిన్, అల్యూమినియం ఫాయిల్స్, అగర్బత్తి ఇలా నిత్యావసర వస్తువుల్లో చాలా వాటి ధరలు జీఎస్టీ అమలు కారణంగా జూలై 1 నుంచి చౌకగా లభించనున్నాయి. ఎందుకంటే వీటిపై ప్రస్తుతమున్న వివిధ రకాల పన్నుల కంటే తక్కువ పన్నునే జీఎస్టీ మండలి ఖరారు చేసింది. ఇలా పన్ను తగ్గే వాటిలో పాలపొడి, పెరుగు, మజ్జిగ, బ్రాండ్ పేరు లేని తేనె, డైరీ ఉత్పత్తులు, జున్ను, మసాలా దినుసులు, టీ, గోధుమలు, బియ్యం, గోధుమ, మైదా పిండి, కొబ్బరి నూనె, పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనె, ఆవనూనె, పంచదార, చక్కెరతో చేసిన మిఠాయిలు, పాస్తా, నూడుల్స్, పండ్లు, కూరగాయలు, పచ్చళ్లు, మురబ్బా, కెచప్, సాస్‌లు, ఇన్స్టంట్ ఫుడ్ మిక్స్‌లు, మినరల్ వాటర్, ఐస్, సిమెంట్, బొగ్గు, కిరోసిన్ (పీడీఎస్), పళ్ల పొడి, సబ్బులు, ఎక్స్‌రే ఫిల్మ్, మెడికల్ డయాగ్నస్టిక్ కిట్లు ఉన్నాయి. ప్రస్తుతంతో పోలిస్తే జీఎస్టీలో పన్నులు తగ్గే వాటి వివరాలతో కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. అలాగే, డ్రాయింగ్ పుస్తకాలు, సిల్క్, వూలె న్, కాటన్ వస్త్రాలు, రెడీమేడ్ వస్త్రాలు, రూ.500లోపున్న పాద రక్షలు, హెల్మెట్లు, ఎల్పీజీ స్టవ్, కళ్లద్దాలు, చెంచాలు, ఫోర్క్‌లు కూడా ధరలు తగ్గనున్నాయి. -
నేటి నుంచి ఎల్పీజీ డీలర్ల ఆందోళన
కల్లూరు : ఎల్పీజీ డీలర్లు శనివారం నుంచి ఆందోళన చేయనున్నారని ఫెడరేషన్ ఆప్ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సరైన తూకం, కంపెనీ సీల్‌తో సిలిండర్‌ను పంపిణీ చేయాలనే డిమాండ్లను నెరవేర్చాలని ఆందోళన చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 5న నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయడం, 15న నల్ల బ్యాడ్జిలు ధరించడంతోపాటు ఒక రోజు ఇండెంట్ సప్లయ్‌ను నిలిపివేయడం చేస్తామని తెలిపారు. డిసెంబర్ 1వ తేదీన ఒక రోజు పూర్తి కాలం సమ్మె, డిసెంబర్ 15 నుంచి నిరవధి సమ్మె చేస్తామని పేర్కొన్నారు. -
ఎల్పీజీపై కేంద్రం కాకి లెక్కలను కనిపెట్టిన కాగ్
న్యూఢిల్లీ: దేశంలో వంటగ్యాస్ వినియోగదారుల ఎల్పీజీ సిలిండర్ల కనెక్షన్లకు ఆధార్ కార్డును లింక్ చేయడం ద్వారా డూప్లికేట్ కనెక్షన్లను సమూలంగా నిర్మూలించామని, నగదు బదిలీ స్కీమ్‌ను ప్రవేశ పెట్టడం ద్వారా, సంపన్నులు స్వచ్ఛంగా ఎల్పీజీ సబ్సిడీని వదులు కోవడం స్కీమ్‌ను ప్రోత్సహించడం ద్వారా భారత ఖజానాకు 23 వేల కోట్ల రూపాయల సబ్సిడీ భారాన్ని మిగిల్చామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటూ వస్తోంది. ఈ విషయంలో గతవారం కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) పార్లమెంట్‌కు సమర్పించిన నివేదిక ప్రభుత్వ లెక్కల గారఢీని బట్టబయలు చేసింది. ప్రభుత్వం చెబుతున్న 23వేల కోట్ల రూపాయల సబ్సిడీలో 92 శాతం నిధులు అంతర్జాతీయంగా చమురు నిధులు తగ్గడం వల్ల సమకూరినవేనని తేల్చి చెపింది. కేవలం నగదు బదిలీ స్కీమ్ వల్ల ఎనిమిది శాతం నిధులు, అంటే 1,764 కోట్ల రూపాయలు మాత్రమే సమకూరాయని కాగ్ పేర్కొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదవిలో తాను రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడుతూ ఎల్‌పీజీల్లో సబ్సిడీల లీకును అరికట్టడం ద్వారా 15 వేల కోట్ల రూపాయల సబ్సిడీ భారాన్ని తగ్గించగలిగామని చెప్పారు. ఈ సబ్సిడీ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 12,700 కోట్ల రూపాయలకు మించదని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమనియన్ గత ఏప్రిల్ నెలలోనే తన మీడియా కాలంలో రాయడం ఇక్కడ గమనార్హం. ఒక్క 2015-16 ఆర్థిక సంవత్సరంలోనే 9,211 కోట్ల రూపాయలను ఆదా చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకుంది. వాస్తవానికి ఆ కాలానికి 4.813 కోట్ల రూపాయలు మాత్రమే ఆదా చేయగలిగిందని కాగ్ నివేదిక వెల్లడించింది. నగదు బదిలీ స్కీమ్ ద్వారా మిగలాల్సిన సబ్సిడీ నిధులు ఎక్కడికి పోతున్నాయి? బోగస్ కనెక్షన్లు పూర్తిగా నిర్మూలించామని ప్రభుత్వం చెబుతున్న మాటలు అబద్ధమా? ఇప్పటికీ కొంత మంది వినియోగదారులు బహుళ గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ కాగ్ తన నివేదికలోనే సమాధానాలు ఇచ్చింది. దేశంలోని సగటు ఎల్పీజీ వినియోగదారుడు గతంలో సగటున ఏడాదికి 6.7 సిలిండర్లను వినియోగించుకోగా, ఇప్పుడు ఏడాదికి దాదాపు 11 సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. (ఏడాదికి సబ్సిడీ సిలిండర్లు 12కు మించి ఇవ్వరనే విషయం తెల్సిందే) అంటే అధనపు సిలిండర్లు పక్కదారి పడుతున్నాయనే అంశం అర్థం అవుతోంది. 2014-15 సంవత్సరంలో 3.34 కోట్లు, 2015-16 సంవత్సరంలో 3.56 కోట్ల బోగస్ ఎల్పీజీ కనెక్షన్లను తొలగించామన్న ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో కూడా పొరపాట్లు ఉన్నాయని కాగ్ పేర్కొంది. వీటిలో బోగస్ కనెక్షన్లు ఇప్పటికీ కొనసాగుతుండడమే కాకుండా ఆధార్ కార్డులేని అర్హులైన వినియోగదారులు కూడా ఉన్నారు. బోగస్ కనెక్షన్లు, బహుళ కనెక్షన్లు పూర్తిగా నిర్మూలించేందుకు ఆధార్ కార్డులను లింక్ చేసినప్పటికీ ఒకే ఆధార్ కార్డు నెంబర్‌పై పలు కనెక్షన్లు ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందని కాగ్ పేర్కొంది. ఇలాంటి బోగస్ కనెక్షన్లు దాదాపు 50 శాతం కొనసాగుతుండగా, వారిలో 20 శాతం మంది ఇప్పటికీ సబ్సిడీలు పొందుతున్నారని తెలిపింది. దీనికి కారణం దేశంలోని ఎల్పీజీ వినియోగదారుల డేటా బేస్ సరిగ్గా లేకపోవడమేనని చెప్పింది. నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ల కనెక్షన్లు 34 శాతం పెరిగాయంటూ కేంద్రం చెబుతున్న లెక్కలు కరెక్టేనని, వాటిలో మెజారిటీ వినియోగదారులు ఈ కనెక్షన్లను కమర్షియల్ పర్పసే వాడుతున్నారని, దానివల్ల ప్రభుత్వానికి నష్టమే వాటిల్లుతోందని కాగ్ వెల్లడించింది. -
పుష్కర భక్తులకు మిల్లర్ల ఉచిత భోజనం
సాక్షి, అమరావతి : పుష్కరాల్లో భక్తులకు భోజనాలు ఏర్పాటుకు మిల్లర్లు ముందుకు వచ్చారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. గుంటూరులో శనివారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. అమరావతిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు రోజుకు 12 వేలమందికి ఐదు కూరలు, రెండు స్వీట్లతో భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నీరు, విద్యుత్తు, షెడ్డు, వంటగ్యాస్ వంటి సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ఇప్పటికే 1.36 లక్షల మందికి భోజనాలు, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు సరఫరాకు దాతలు ముందుకు వచ్చారని తెలిపారు. -
వంటింటికి మహాభాగ్యం!
* లక్ష ఇళ్లకు గ్యాస్ పైప్‌లైన్ * బీజీఎల్ విస్తరణకు కేంద్రం చర్యలు * కేంద్రమంత్రి ప్రకటనతో చిగురించిన ఆశలు సాక్షి, సిటీబ్యూరో: మహానగరానికి పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ అందించే ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఐదేళ్లుగా సా...గుతున్న పనులు.. కేంద్ర పెట్రోలియం మంత్రి ప్రకటనతో ఆశలు చిగురించాయి. వచ్చే రెండేళ్లలో లక్ష ఇళ్లకు, ఐదేళ్లలో రెండున్నర లక్షల ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. ఇందుకోసం నగరానికి పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేస్తున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) సంస్థను బలోపేతం చేయనుంది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టును సైతం విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే అదనంగా పైప్లైన్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. వంట గ్యాస్‌తో పాటు సీఎన్జీ స్టేషన్లను కూడా పెంచేందుకు చర్యలు చేపట్టింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పైప్‌లైన్ పనులపై బీజీఎల్ ప్రతినిధులతో చర్చించారు. మరోమారు క్షేత్ర స్థాయి పరిశీలన కోసం కేంద్ర మంత్రి నగరానికి రానున్నారు. ఐదేళ్లుగా నత్తనడకనే.. హైదరాబాద్‌లో ఇంటింటికి పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్జీ) అందించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ‘భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్’ (బీజీఎల్) సంస్థ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు పనులు ఐదేళ్లుగా ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి 2011 నవంబర్ 21న సిటీ ప్రాజెక్టుకు బీజీఎల్ శ్రీకారం చుట్టింది. ఐదేళ్లలో 2.66 లక్షల కుటుంబాలకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్, 50 స్టేషన్ల ద్వారా సీఎన్జీ గ్యాస్ అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొదటి విడతగా 2014 ఏప్రిల్ నాటికి లక్ష కుటుంబాలకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. అయితే, ఇప్పటికి కేవలం 1140 ఇళ్లకు మాత్రమే సరఫరా చేసింది. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ పీఎన్జీ, సీఎన్జీ విస్తరణ కోసం రూపొందించిన ప్రణాళిక కూడా కాగితాలకే పరిమితమైంది. ఐదేళ్లలో శామీర్‌పేట నుంచి కుత్బుల్లాపూర్ వరకు 33 కిలో మీటర్ల పనులు మాత్రమే జరిగాయి. బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లిహిల్స్ ప్రాంతాలకు సైతం పైప్‌లైన్ నిర్మాణ పనులు పడకేశాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడంతో పనుల్లో కదలికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎన్జీ అంతంతే.. భాగ్యనగరాన్ని పూర్తి స్థాయిలో సీఎన్జీ అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ సైతం ఆచరణకు నోచుకోలేదు. శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను నిర్మించి సీఎన్జీని అందుబాటులో తెచ్చినా.. డిమాండ్‌కు తగ్గట్టు గ్రిడ్ నుంచి గ్యాస్ సరఫరా లేదు. వాస్తవంగా నగరంలో ప్రజా రవాణకు వినియోగించే 85 వేల ఆటోలు, 7,500 బస్సులు, 20 వేలకు పైగా టాక్సీలు ఉన్నాయి. వీటికి రోజుకు సగటున 7,62,500 కిలోల (1.067 ఎస్‌సీఎండీ) సీఎన్జీ అవసరం ఉంటుందని బీజీఎల్ అంచనా వేసింది. అందుకు అనుగుణంగా సరఫరా చేయాలని సంస్థ సిద్ధమైంది. ప్రాజెక్టు ప్రారంభించిన తొలిదశలో మేడ్చల్, హకీంపేట, కంటోన్మెంట్ తదితర డి పోలకు చెందిన 350 ఆర్టీసీ బస్సులకు సీఎన్జీ సరఫరా చేస్తామని ప్రకటించింది. అయితే, కొద్ది రోజులు 164 బస్సులకు సరఫరా చేసి, ప్రస్తుతం 110 బస్సులకే పరిమితమైంది. నగరంలో మొత్తం 20 సీఎన్జీ స్టేషన్లు ఉండగా, అందులో ఆర్టీసీకి 3, ప్రయివేటు వాహనాల కోసం 17 ఉన్నాయి. వీటిలో రెండింటిని బీజీఎల్ సంస్థ నిర్వహిస్తోంది. ప్రస్తుతం నగరంలో సీఎన్జీ వాహనాలు 23 వేలకు మించి లేవు. ఢిల్లీలో మాత్రం 10 లక్షల వాహనాలు ఉన్నాయి. నగరంలో సైతం అదే స్థాయిలో విస్తరించేందుకు మరిన్ని సీఎన్జీ బంకులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
ఆ చర్యతో కేంద్రానికి 21,000 కోట్ల మిగులు!
న్యూఢిల్లీ: ఎల్పీజీ సబ్సిడీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ప్రస్తుత విధానం ద్వారా గత రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఖజానాకు రూ. 21,000 కోట్ల మిగులుబాటు నమోదైంది. ఈ విషయాన్ని బుధవారం స్వయంగా ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడించారు. గ్యాస్ సబ్సిడీని నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమచేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2014 నవంబర్‌లో దేశంలో కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించినప్పటకీ 2015 జనవరి నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ విధానం ద్వారా 3.34 కోట్ల నకిలీ లబ్దిదారులకు సబ్సిడీ ఫలాలను అందకుండా ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరంలో 14,672 కోట్లు, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 7,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు మిగిలిందని ఢిల్లీలో సబ్సిడీలపై నిర్వహించిన ఓ సదస్సులో మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. 2015-16లో సేవింగ్స్ తగ్గడానికి కారణం ప్రపంచ మార్కెట్లో చమురు ధర తక్కువగా ఉంటమేనని ఆయన తెలిపారు. -
18 టన్నుల గ్యాస్‌ను 19 గంటల్లో...
బెర్హంపూర్(ఒడిశా): బోల్తా పడిన ట్యాంకర్ నుంచి హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్‌పీ) సిబ్బంది లిక్వీఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ)ను సురక్షితంగా తరలించారు. ఒడిశాలోని గంజామ్ జిల్లాలోని ఛత్రపుత్ టౌన్ సమీపంలో శనివారం రాత్రి ఎల్పీజీని తరలిస్తున్న ట్యాంకర్ బొల్తా పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. అయితే గ్యాస్ లీక్ అయితే పెను ప్రమాదం సంభవించి ఉండేది. ట్యాంకర్‌లోని గ్యాస్‌ను మరో మూడు ట్యాకర్లలోకి జాగ్రత్తగా పైపుల సహాయంతో తరలించారు. విశాఖపట్నం, జత్నాయికి చెందిన 10 మంది సభ్యులతో కూడిన టీం 18 టన్నుల గ్యాస్‌ను ట్రాన్స్ఫర్ చేసే మిషన్‌ను 19 గంటల్లో విజయవంతంగా పూర్తి చేశారు. పని పూర్తి అవ్వగానే ఎన్‌హెచ్9 హైవేతోపాటూ, కరెంటు సప్లైని కూడా పునరుద్ధరించారు. ప్రమాదం జరిగిన వెంటనే గ్యాస్ లీక్ వల్ల ప్రమాదం సంభవించకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రహదారులు, కరెంటు సప్లైతోపాటూ దగ్గర్లోని స్కూళ్లు, కాలేజీలను మూసివేసిన విషయం తెలిసిందే. -
రిలయన్స్ ఎల్పీజీ విక్రయ అనుమతులు పొడిగింపు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉత్పత్తి చేసే ద్రవీకృత గ్యాస్ (ఎల్పీజీ)లో 1.2 లక్షల టన్నుల పరిమాణాన్ని ప్రైవేట్ వంట గ్యాస్ మార్కెటింగ్ సంస్థలకు విక్రయించుకునేందుకు ఇచ్చిన అనుమతుల గడువును వచ్చే ఏడాది మార్చి 31 దాకా ప్రభుత్వం పొడిగించింది. ఇందుకు సంబంధించి చమురు శాఖ ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ఈ గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. అయితే, ప్రస్తుత ఆదేశాలు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు పరిగణించవచ్చని చమురు శాఖ పేర్కొంది. దేశీయంగా వంటగ్యాస్‌కి కొరత ఉన్నందున ఎల్పీజీ కంట్రోల్ ఆర్డర్ కింద స్థానికంగా ఉత్పత్తి చేసే వంట గ్యాస్‌ను తప్పనిసరిగా ప్రభుత్వ రంగ రిటైలింగ్ సంస్థలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు మార్కెట్ రేటును ఇవ్వడం లేదంటూ.. సమాంతర మార్కెటింగ్ పథకం (పీఎంఎస్) కింద ప్రైవేట్ కంపెనీలకు ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ ఎల్పీజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విక్రయిస్తోంది. ఈ తరహా రిటైలింగ్‌ను ఆపేయాలంటూ గతేడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆదేశించగా.. దాన్ని ఆర్ఐఎల్ సవాలు చేసింది. -
వెలగని దీపం!
పాలమూరు : దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు దీపం పథకం ద్వారా ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించాలన్న సర్కారులక్ష్యం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. కనెక్షన్లు మంజూరై రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు ఏ ఒక్కరికీ గ్యాస్ అందకపోవడం గమనార్హం. గత ఏప్రిల్‌లో నియోజకవర్గానికి ఐదువేల చొప్పున జిల్లాలోని 14 నియోజకవర్గాలకు 70వేల కనెక్షన్లను ప్రభుత్వం మంజూరుచేసింది. దరఖాస్తులు స్వీకరించి మూడునెలలైనా అర్హుల జాబితా ఇంతవరకు ఖరారుకాలేదు. కలెక్టర్ చైర్మన్‌గా ప్రత్యేకకమిటీ లబ్ధిదారులను ఎంపికచేస్తుంది. మండలస్థాయిలో ఆ బాధ్యతను ఎంపీడీఓలకు కట్టబెట్టారు. గ్రామస్థాయిలో వచ్చిన దరఖాస్తులను గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలన్న నిబంధనలకు స్వస్తి పలికారు. స్థానిక అధికార పార్టీ నాయకుల సిఫార్సులు, సర్పంచ్ల జాబితా మేరకు ఎంపీడీఓలు లబ్ధిదారుల తుదిజాబితా రూపకల్పనలో జాప్యం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు జిల్లా అధికార యంత్రాంగానికి జాబితా చేరలేదు. గ్రామాల నుంచి వచ్చిన వాటిని ఆధార్ ప్రామాణికంగా డేటాఎంట్రీ పూర్తిచేసి జిల్లా పౌరసరఫరాల కార్యాలయానికి పంపించాల్సి ఉంది. జిల్లాలో ఏ మండలంలో కూడా జాబితా రూపకల్పన మొదలుపెట్టకపోగా గ్రామసభల ద్వారా ఎంపికచేసిన జాబితా కూడా చేరలేదని తెలుస్తోంది. కొలిక్కిరాని పంపిణీ ప్రక్రియ జిల్లాలో సమగ్రకుటుంబ సర్వే ప్రకారం 9.85లక్షల కుటుంబాలు ఉన్నాయి. అందులో 5.21లక్షల గ్యాస్కనెక్షన్లు ఉండగా 4.64లక్షల కుటుంబాలకు కనెక్షన్లు లేవని తేలింది. ప్రభుత్వం మంజూరుచేసిన 70వేల కనెక్షన్లకు 1.80లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో మహిళా సంఘాలకు ప్రాధాన్యమిస్తూ 25శాతం ఎస్సీలు, 16శాతం ఎస్టీలు, మైనార్టీలకు గ్యాస్కనెక్షన్ అందించాలని నిర్ణయించారు. సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము ఒక్కో కనెక్షన్‌కు రూ.1600చొప్పున మొత్తం 70వేల కనెక్షన్లకు రూ.11.20కోట్లు అందజేసింది. మే నెలలో దరఖాస్తులు స్వీకరించినప్పటికీ నిర్ణీత గడువు దాటినా పంపిణీ ఓ కొలిక్కిరాలేదు. లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్కనెక్షన్లు జారీచేసి ఖాళీ సిలిండర్‌తో పాటు రెగ్యులేటర్ ఇస్తారు. నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, గతంలో ప్రభుత్వం నుంచి దీపం పథకం ద్వారా లబ్ధిపొందని వారు, గ్యాస్కనెక్షన్ తీసుకునేందుకు డబ్బు వెచ్చించలేని నిరుపేదలు ఈ పథకానికి అర్హులు. గ్రామసభల ద్వారా ఎంపికచేసిన లబ్ధిదారుల జాబితాను కలెక్టర్ ఆమోదించి ఆ తరువాత జిల్లా మంత్రికి నివేదించిన తరువాతే కనె క్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం మేల్కోవాల్సి ఉంది. ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మండలస్థాయిలో కొనసాగుతోంది. మండలాల వారీగా తుది జాబితాను జిల్లాకు పంపుతారు. వాటిని జిల్లా కమిటీ ద్వారా స్క్రీనింగ్ చేసి అర్హులకు గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు చర్యలు చేపడతాం. - లక్ష్మినారాయణ, ఇన్చార్జి, డీఎస్ఓ -
త్వరలో బెంగళూరుకు ‘పీఎన్జీ’
బెంగళూరు:ఇంటింటికి పైపు ద్వారా వంటగ్యాస్ (పైప్ న్యాచులర్ గ్యాస్-పీఎన్జీ)ను సరఫరా చేసే పథకానికి త్వరలో బెంగళూరులో శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ వెల్లడించారు. గ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులు కోవడానికి ఉద్దేశించబడిన గివిటప్(ుజజీఠ్ఛిజ్టీఠఞ) కార్యక్రమాన్ని ఆయన బెంగళూరులో శనివారం ప్రారంభించి, మాట్లాడారు. సిలెండర్లలో వంట గ్యా స్ను సరఫరా చేయడంతో పోలిస్తే పీఎన్జీ అత్యంత భద్రతతో కూడుకున్నదే కాక, చౌకైనది కూడా అని పేర్కొన్నారు. పీఎన్జీ అమలుతో బినామీ రూపంలో సబ్సిడీ గ్యాస్‌ను పొందుతున్న వారి ఆటలు సాగవని అన్నారు. బెంగళూరు తర్వాత ఈ విధానాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలకూ విస్తరిస్తామని చెప్పారు. దీని వల్ల ఏడాదికి రూ.3వేల కోట్ల గ్యాస్ సబ్సిడీ నిధులు ఆదా అవుతాయని ఆయన వివరించారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపునకు స్పందించి ఎంతోమంది సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు గివిటప్‌కు మద్దతు పలికారన్నారు. ఒక్క కర్ణాటక నుంచే ఇప్పటి వరకూ 20 వేల మంది మార్కెట్ రేటుకే గ్యాస్‌ను కొనుగోలు చేస్తామని ముందుకు వచ్చారన్నారు. ఇందులో 15 వేల మంది ఒక్క బెంగళూరులో ఉన్నట్లు తెలిపారు. వీరిలో బహుభాషనటి మాలాశ్రీ, దర్శకుడు రాజేంద్రసింగ్ బాబు తదితరులు ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులందరూ గివిటప్‌కు మద్దతు పలుకుతారని తెలిపారు. ఇక రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్గుండూరావ్తోపాటు రోషన్‌బేగ్ తదితర మంత్రులు ఇప్పటికే తాము గివిటప్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం పంపించారని కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు తెలిపారు. కాగా, కర్ణాటకలో మొదటిసారిగా గివిటప్‌కు మద్దతు పలికిన కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ భార్య తేజశ్విని అనంతకుమార్‌ను ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. గివిటప్‌కు మార్గాలు ఇవి... మైక్రోసైట్స్... కడLPG.in, giveitup.in Ððl»Œæ-OòÜr$Ï...www.ebharatgas.com, www.indane.co.in , www.hpgas.com ఆయా గ్యాస్ కంపెనీ వినియోగదారులు తాము ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫోన్ ద్వారా ఎస్ఎమ్మెఎస్ రూపంలో గివిట్ అప్‌లో సభ్యులుగా చేరవచ్చు. {పత్యేక దరఖాస్తు ఫారం కూడా అందుబాటులో ఉంది. -
‘ఉన్నతం‘గా వదులుకునేలా చేయండి
గ్యాస్ సబ్సిడీ వదులుకునేలా ఉన్నతవర్గాల్లో ప్రచారం చేయాలి మరింతమంది పేదలకు అందేలా అవగాహన కల్పించాలి రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియంశాఖ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ‘ఉన్నతవర్గాలూ గ్యాస్ సబ్సిడీ ని వదులుకోండి..జాతి నిర్మాణానికి సహకరించండి’ అనే ప్రచారాన్ని విస్తృతం చేయాలని కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వశాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఉన్నతవర్గాలు వదులుకునే సబ్సిడీతో మరింతమంది పేదలకు ఎల్పీజీని అందించే అవకాశం ఉంటుందని, దీనిద్వారా దీర్ఘకాలంలో పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలతో కూడిన లేఖను పంపింది. దేశంలో 36 శాతం కుటుంబాలు ఇప్పటికీ వంటచెరుకు, పిడకలపై ఆధారపడి వంట చేసుకుంటున్నాయని, దీనివల్ల ఇంట్లో పొగచూరడంతో పిల్లలు, మహిళలు కాలుష్యం బారినపడుతున్నారని పేర్కొంది. ప్రతి ఏటా సబ్సిడీ సిలిండర్ ద్వారా రూ.6 వేల రాయితీని ప్రభుత్వం అందిస్తోందని, ఉన్నతవర్గాలు దీన్ని వదులుకునేందుకు ముందుకువస్తే ఆర్థికంగా వెనుకబడిన మరింతమందికి గ్యాస్ సిలిండర్ అందే అవకాశం ఉంటుందని తెలిపింది. ఎల్పీజీ సబ్సిడీని వదులకునే విధానాన్ని సైతం ప్రభుత్వం సరళీకృతం చేసిందని, సంస్థ వెబ్సైట్లోకి వెళ్లి... లేదా డిస్ట్రిబ్యూటర్లకు తెలిపైనా సబ్సిడీని వదులుకోవచ్చని పేర్కొంది. పొగవచ్చే పొయ్యిలతో వంట చేసుకుంటున్న పేద ప్రజల సంక్షేమం, జాతి నిర్మాణం కోసం ఉన్నతవర్గాలు స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకునేలా ప్రచారం చేయాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. -
ఇంధన సబ్సిడీలకు 22,000 కోట్లు కావాలి..
ఆర్థిక మంత్రిత్వ శాఖకు పెట్రోలియం శాఖ లేఖ న్యూఢిల్లీ: వంటగ్యాస్, కిరోసిన్ సబ్సిడీల కారణంగా వాటిల్లుతున్న ఆదాయ నష్టాలను పూడ్చుకోవడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) ద్వితీయార్ధంలో రూ.22,201 కోట్లు ఇవ్వాల్సిందిగా చమురు శాఖ కోరుతోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)లకు సబ్సిడీల భారంపై పరిహారం కింద రూ.17,000 కోట్లను చెల్లించింది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఓఎంసీల ఆదాయ నష్టాల్లో(రూ.51,110 కోట్లు) ఈ మొత్తం మూడో వంతు మాత్రమే. కాగా, ప్రభుత్వరంగ చమురు ఉత్పత్తి(అప్‌స్ట్రీమ్ ఆయిల్) కంపెనీలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా(ఓఐఎల్)లు రూ.31,926 కోట్లను భరించాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర బ్యారెల్ 50 డాలర్ల దిగువకు పడిపోయిన నేపథ్యంలో ద్వితీయార్ధంలో అప్‌స్ట్రీమ్ ఆయిల్ కంపెనీలు ఓఎంసీలకు ఆదాయ నష్టాల కింద ఎలాంటి చెల్లింపులూ జరపాల్సిన అవసరం లేదని కూడా పెట్రోలియం శాఖ పేర్కొంది. ఆర్థిక శాఖకు రాసిన లేఖలో ఈ వివరాలను తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత 2014-15 ఏడాదిలో ఓఎంసీలకు ఆదాయ నష్టాలు(మార్కెట్ రేటు కంటే తక్కువకు ఇంధనాలను విక్రయించడం కారణంగా) రూ.74,773 కోట్లుగా అంచనా. -
సబ్సిడీయేతర ఎల్పీజీ సిలెండర్‌కు 103 రూపాయల తగ్గింపు
న్యూఢిల్లీ: సబ్సిడీయేతర వంట గ్యాస్ (ఎల్పీజీ) సిలెండర్ ధర బాగా తగ్గింది. ఈ సిలెండర్‌కు ప్రభుత్వం 103 రూపాయలు తగ్గించింది. ఇక నుంచి నాన్ సబ్సిడీ సిలెండర్ ధర 605 రూపాయలు మాత్రమే ఉంటుంది. సబ్సిడీ సిలెండర్లు ఒక్కో కుటుంబానికి ఏడాదికి 12 మాత్రమే ఇస్తారు. ఆ తరువాత ఇంకా కావలసి వస్తే సబ్సిడీయేతర సిలెండర్లను మాత్రమే కొనుగోలు చేయాలి. జెట్ ఇంధనం ధర కూడా 11.3 శాతం తగ్గింది. తగ్గిన ధరలు ఈరోజు నుంచే అమలులోకి వస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పడిపోవడంతో ఈ ధరలు తగ్గాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పులేదు. -
ఇదేం మెలిక !
బ్యాంకు ఖాతాలు ఇచ్చిన వారికే గ్యాస్ సిలిండర్ జిల్లాలో వంట గ్యాస్ కనెక్షన్లు : 5,84,544 ఏజెన్సీలకు ఆధార్ సీడింగ్ పూర్తయినవి : 4,58,992 బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ పూర్తయినవి : 3,14,308 పండగపూట కూడా...గ్యాస్ వినియోగదారులకు కష్టాలు తప్పేలా లేవు. ఆధార్‌తోపాటు బ్యాంకు ఖాతాలు సమర్పించిన వారికే సిలిండర్లు ఇస్తున్నారు. మూడునెలల దాకా గడువు ఉన్నా జిల్లా అధికారుల తొందరపాటు చర్యల కారణంగా గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. -నల్లగొండ పండగ పూట గ్యాస్ వినియోగదారుల కష్టాలు నల్లగొండ: సంక్రాంతికి ముందుగానే ప్రజలు వంటగ్యాస్ కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. పండగ సెలవులు మూడు రోజులు అయినప్పటికి అంతకంటే ముందుగానే రెండో శనివారం, ఆదివారాలు కూడా సెలవు దినాలు కావడంతో పట్టణాల్లో, పల్లెల్లో పండగ వాతావరణం సందడి చేస్తోంది. అయితే సంక్రాంతి రోజున రకరకాల పిండివంటలు చేసుకుద్దామంటే ఏజెన్సీలు గ్యాస్ సిలిండర్ ఇవ్వకుండా ముప్పుతిప్పులు పెడుతున్నాయి. జిల్లా అధికారులు అత్యుత్సాహంతో తీసుకున్న నిర్ణయం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగదు బదిలీ పథకం అమల్లో భాగంగా వంట గ్యాస్ కనెక్షన్లుకు ఆధార్‌నంబర్లు తప్పని సరిగా సమర్పించాలి. దీంతోపాటు బ్యాంకు ఖాతాల నంబర్లు కూడా ఇవ్వాల్సి ఉంది. ఈ నెల నుంచే జిల్లాలో నగదు బదిలీ పథకం ఆరంభమైంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆధార్ సీడింగ్, బ్యాంకు ఖాతా నంబర్లు ఇచ్చిన వినియోగదారులకు మాత్రమే ఏజెన్సీలు రీఫిల్ ఇస్తున్నారు. అదేమంటే జిల్లా అధికారుల ఉత్తర్వుల మేరకు తాము నడుచుకుంటున్నామని చెబుతున్నారు. దీంతో పండుగపూట ఇంట్లో పొయ్యి వెలిగించలేని పరిస్థితి ఏర్పడింది. అధికారుల తొందరపాటు... నగదు బదిలీ పథకం ప్రారంభమైన నాటినుంచి మూడు మాసాల్లోగా బ్యాంకు ఖాతాలు ఇచ్చేందుకు కేంద్ర వెసులుబాటు కల్పించింది. కానీ ఏజెన్సీల ఒత్తిడికి తలొగ్గిన జిల్లా అధికారులు బ్యాంకు ఖాతాలు ఇచ్చిన వినియోగదారులకు మాత్రమే గ్యాస్ రీఫిల్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. గుట్టచప్పుడు కాకుండా జారీ అయిన ఈ ఉత్తర్వులను బయటకు పొక్కనీయకుండా ఏజెన్సీలు తమ ప్రతాపాన్ని వినియోగదారులపై చూపుతున్నాయి. బ్యాంకు ఖాతాలు ఇవ్వకుండా సిలిండర్ తెచ్చుకునేందుకు వెళ్లిన వినియోగదారులకు ఏజెన్సీలు ఈ ఉత్తర్వులను చూపించి గ్యాస్ ఇవ్వకుండా తిప్పిపంపిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన గడువు మేరకు మార్చి నెలాఖరులోగా వినియోగదారులు బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్ సీడింగ్ పూర్తిచేయాలి. నత్తనడకన ఆధార్ సీడింగ్.. జిల్లాలో మొత్తం 5.84 లక్షల గ్యాస్ కనెక్షన్లకుగాను 4.58 లక్షల కనె క్షన్లు గ్యాస్ ఏజెన్సీలకు అనుసంధానమయ్యాయి. ఇంకా 1,25,552 కనెక్షన్లు ఆధార్ సీడింగ్ చేయాల్సి ఉంది. ఏజెన్సీలు, బ్యాంకు ఖాతాలకు కేవలం 3.14 లక్షల కనెక్షన్లు మాత్రమే సీడింగ్ పూర్తయ్యాయి. ఆధార్ సీడింగ్ పూర్తయి ఏజెన్సీలకు బ్యాంకు ఖాతానంబర్లు ఇవ్వాల్సిన కనెక్షన్లు 1.44 లక్షలు ఉన్నాయి. ఈ వ్యవహారమంతా పూర్తికావడానికి మూడు మాసాల వరకు గడువు ఉంది. కానీ అధికారుల తొందరపాటు చర్య వల్ల ఏజెన్సీలు గ్యాస్ రీఫిల్ ఇవ్వకుండా కొత్త సమస్య సృష్టిస్తున్నారు. -
భారీగా తగ్గిన నాన్ సబ్సిడీ సిలిండర్ ధర
న్యూఢిల్లీ: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. మరోసారి సబ్సిడేతర వంట గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. గ్యాస్ బండపై రూ.43.50 తగిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు గురువారం ప్రకటించాయి. ప్రస్తుతం ఉన్న 14.2 కేజీల సబ్సీడేతర ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 752 నుంచి రూ.708.50 పైసలకు తగ్గింది. 2009 తరువాత ఇంత భారీ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా విమానం ఇంధనం ధరలు కూడా తగ్గాయి. అంతర్జాతీయంగా చముర ధరలు దిగిరావడంతో 12.5 శాతం మేర విమానం ఇంధన ధరలు తగ్గాయి. -
నేటి నుంచి గ్యాస్ సబ్సిడీ బ్యాంకు ఖాతాకే
న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్‌ను గృహావసరాల కోసం ఇప్పటి వరకు సబ్సిడీపై అందిస్తున్న కేంద్రం ఇకపై ఆ సబ్సిడీని వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని 54 జిల్లాల్లో ఇది అమలవుతుండగా గురువారం(జనవరి 1) నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. దీంతో వినియోగదారులు మార్కెట్ ధర ఎంతుంటే, అంత చెల్లించి సిలిండర్‌ను కొనుగోలు చేయాలి ఉంటుంది. తర్వాత ఒకటి రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాలో సబ్సిడీ మొత్తం జమ అవుతుంది. ప్రస్తుతం 14.2 కేజీల సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం 568 రూపాయలను సబ్సిడీగా అందిస్తోంది. సిలిండర్ ధర (ఢిల్లీ మార్కెట్) రూ.752గా ఉంది. -
నేటి నుంచి నగదు బదిలీ
జిల్లాలో 74 శాతం ఆధార్ అనుసంధానం బ్యాంక్‌ల్లో ఆధార్ నంబర్ తప్పనిసరి 75 వేల ఇండేన్ గ్యాస్ కనక్షన్లు తాత్కాలికంగా నిలుపుదల ! మార్చి నుంచి పూర్తి స్థాయిలోబదిలీ ప్రక్రియ అమలు ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లాలో వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం నేటి నుంచి అమలు కానుంది. నూతన సంవత్సరంలో గ్యాస్ వినియోగదారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో యూపీఏ ప్రభుత్వం గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాలతో మధ్యలోనే నిలిచిపోయింది. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ నగదు బదిలీని తెరపైకి తీసుకొచ్చింది. దీంతో జిల్లాలో నేటి నుంచి ఈ పథకం అమలు కానుంది. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాని గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ వర్తించదు. వారికి గ్యాస్ సిలిండర్ కావాలంటే ఇకపై రూ. 981 చెల్లించాలి. తొలుత గ్యాస్ వినియోగదారులు గ్యాస్ ధర మొత్తాన్ని చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే.. కొద్దిరోజుల తర్వాత సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 5,05,446 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం 5,00,114 కనెక్షన్లు వినియోగంలో ఉన్నాయి. వీటిలో 74 శాతం మంది ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నారు. మార్చిలోపు అనుసంధానం కాకుంటే అదనపు భారం.. జనవరి నుంచి ఈ పథకాన్ని ప్రారభింస్తున్నప్పటికీ ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానం చేసుకునేందుకు మార్చి వరకు గడువు ఉంది. అప్పటికి కూడా అనుసంధానం చేసుకోకుంటే అదనపు భారం మోయాల్సి వస్తుంది. గ్యాస్ కనెక్షన్లు తాత్కాలిక నిలుపుదల..! నగదు బదిలీ అమల్లో భాగంగా బ్యాంక్ ఖాతాలకు అధార్ అనుసంధానం చేసుకోని పలువురు వినియోగదారుల ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. వీటిలో ఇండేన్ గ్యాస్ వినియోగదారులైన 75 వేల మంది బ్యాంకుల్లో ఆధార్ అనుసంధానం చేసుకోకపోవటంతో వారి కనెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. వినియోగదారుల్లో గందళగోళం... గ్యాస్ వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారు. జనవరి 1నుంచి నగదు బదిలీ అమలవుతుందని, ఇక నుంచి సిలిండర్‌కు సబ్సిడీ వర్తించద ని ప్రకటించడంతో వారు ఆందోళన చెందుతున్నా రు. గత ఏడాది జిల్లాను పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి నగదు బదిలీ అమలు చేసే సమయంలో దాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే కొందరు లబ్ధిదారులు నగదు బదిలీ చేయించుకోవడంతో సబ్సిడీలో కొంత గందరగోళం నెలకొంది. ఒక వినియోగదారుడి సబ్సిడీ మరొకరి ఖాతాలోకి వెళ్లడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. తాజాగా మళ్లీ నగదు బదిలీ వ్యవహారం తెరపైకి రావడంతో ఒక వైపు ఆధార్ పూర్తికాక పోవడం, మరో వైపు బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోవడంతో అయోమయంలో పడ్డారు. గ్యాస్ వివరాలు ఇలా... జిల్లా వ్యాప్తంగా 5,00,114 గ్యాస్ కనక్షన్లు వినియోగంలో ఉన్నాయి. వీటిలో గ్యాస్ ఏజెన్సీల్లో అనుసంధానం అయినవి 3,69,816 కాగా, బ్యాంక్‌లో అనుసంధానం అయినవి 2,67,295 ఉన్నాయి. జిల్లాలో భారత్ పెట్రోలియం కంపెనీకి చెందినవి 76,805, ఇండియన్ అయిల్ కార్పొరేషన్ 1,66,118, హిందుస్థాన్ పెట్రోలియం 2,57,191 కనక్షన్లు ఉన్నాయి. -
వంట గ్యాస్ నగదు బదిలీకి నో!
ఆధార్, బ్యాంక్ ఖాతాల అనుసంధానానికి ముందుకురాని వినియోగదారులు సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలుకానున్న వంట గ్యాస్ నగదు బది లీకి వినియోగదారులు నిరాసక్తత కనబరుస్తున్నా రు. నగదు బదిలీ కోసం ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతాలు ఇవ్వాల్సి ఉన్నా వినియోగదారులు పెద్ద గా ముందుకు రావడంలేదు. పెద్దమొత్తంలో సిలిండర్ ధరను చెల్లించాల్సి రావడం, రాయితీ, రాయితీయేతర సిలిండర్ ధరల మధ్య వ్యాట్ వ్యత్యాసం ఉండటం, సకాలంలో ఖాతాలో రాయి తీ జమకాకపోవడంవంటి కారణాలరీత్యా విని యోగదారులు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 1 నుంచి ప్రారంభంకానున్న నగదు బదిలీ అమలు ఎలా సాధ్యమన్నది అంతుపట్టడం లేదు. నవంబర్ 15 నుంచే హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ ప్రక్రియ మొదలయింది. మూడు జిల్లాల పరి ధిలో ఇప్పటికే 32.71లక్షల మంది వినియోగదారులు ఈ పథకం పరిధిలోకి రాగా, జనవరి నుంచి మొత్తంగా 61.99 లక్షల మంది రానున్నారు. ఎల్పీజీ కనెక్షన్‌కు బ్యాంక్ ఖాతా, ఆధార్ సంఖ్య ను అనుసంధానం చేస్తే రాయితీ నేరుగా ఆ ఖాతాలోనే జమ అవుతుంది. ఆధార్ లేకున్నా బ్యాంక్ ఖాతా నంబర్ డీలర్‌కు ఇస్తే ఆ ఖాతాలో రాయితీ జమ అవుతుంది. మొదటి మూడు నెలల్లో ఈ పథకంలో చేరకపోయినా, బ్యాంక్ ఖాతా, ఆధార్ సంఖ్య ఇవ్వకపోయినా రాయితీ ధరకే సిలిండర్ ఇస్తారు. అయితే తర్వాతి మూడు నెలలపాటు రాయితీ ధరకు ఇవ్వరు కానీ ఈ రాయితీని బ్యాం కు ఖాతాను ఎప్పుడైతే అనుసంధానిస్తే అప్పుడు రాయితీ మొత్తాన్నంతా ఖాతాలో జమచేస్తారు. దీనిపై పౌర సరఫరాల శాఖ, చమురు కంపెనీలు, బ్యాంకులు విసృ్తత ప్రచారం జరిపినా ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానానికి వినియోగదారుల నుంచి స్పందన రాలేదు. ప్రస్తుతం రూ.444 చెల్లించి సిలిండర్ పొందుతుండగా, నగదు బదిలీ కింద రూ.832 చెల్లించాలి. దీనికితోడు అదనంగా రూ.19 వరకు వ్యాట్ భారం పడి రావాల్సిన సబ్సిడీ కన్నా తక్కువ మొత్తం ఖాతాల్లో జమ అవుతోంది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వం మౌనంగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు నగదు బదిలీపై ఆసక్తి చూపడం లేదు. దీనికితోడు బ్యాంకుల్లో సాఫ్ట్వేర్ సమస్యల కారణంగా సిలిండర్ పొందిన 10 నుంచి 15 రోజులకు గానీ రాయితీ జమ కావడం లేదని గుర్తించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఆధార్ నమోదు 75.72 శాతం, బ్యాంకు సీడింగ్ కేవలం 57.12 శాతం మాత్రమే నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆధార్ సీడింగ్ 59.24 శాతం, బ్యాంక్ సీడింగ్ కేవలం 27.25 శాతం మాత్రమే నమోదైంది. హైదరాబాద్‌లో మొత్తం 13,54,101 వినియోగదారులు ఉండగా 11,31,592 మంది ఆధార్ నమోదు చేయించుకున్నారు. -
నగదు బదిలీ అయ్యేనా?
వంటగ్యాస్ పంపిణీలో అక్రమాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం జిల్లాలో అమలయ్యేపరిస్థితి కనిపించడం లేదు. ఆధార్ సీడింగ్ ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో జనవరి 1 నుంచి నగదు బదిలీ సాధ్యాసాధ్యాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. నల్లగొండ : నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ....ఇక కేంద్రం వంట గ్యాస్ రాయితీని వినియోగదారుల ఖాతాలో నేరుగా జమ చేయాలన్న ఉద్దేశంతో నగదు బదిలీకి శ్రీకారం చుట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ పథకం ప్రారంభంకావాల్సి ఉన్నప్పటికీ అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో అప్పట్లో ఆపేశారు. అయితే గ్యాస్ పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టాలంటే నగదు బదిలీ తప్పదని భావిస్తున్న మోదీ ప్రభుత్వం తిరిగి ఈ పథకాన్ని వచ్చే జనవరి నుంచి పటిష్టంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు యంత్రాంగం కూడా సన్నద్ధమైంది. కానీ మొత్తం కనెక్షన్లు 5.20 లక్షలు... జిల్లాలో ఐఓసీ, హెచ్‌పీ, బీపీఎల్ కంపెనీల పరిధిలో మొత్తం 5,20,270 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దీపం పథకానికి సంబంధించి మరో 1,79,953 కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 5,20,270 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తాజా పరిణామాలతో ప్రభుత్వం అందజేసే సబ్సిడీ పొందాలంటే 5 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డుల ప్రతిని గ్యాస్ ఏజెన్సీలకు ఇవ్వడంతోపాటు, బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. నత్తనడకన ఆధార్ సీడింగ్ ... ఆధార్ సీడింగ్‌పై ప్రజల్లో ఇంకా పూర్తి అవగాహన లేకపోవడంతో నమోదు నత్తనడకన సాగుతోంది. 5.20 లక్షల గ్యాస్ కనెక్షన్లకుగాను 3.92 లక్షల కనెక్షన్లు గ్యాస్ ఏజెన్సీలకు అనుసంధానం చేశారు. వీటిలో ఏజెన్సీలు, బ్యాంకు ఖాతాలకు కేవలం 2.43 లక్షల కనెక్షన్లు మాత్రమే ఆధార్ సీడింగ్‌తో అనుసంధానమయ్యాయి. మొత్తంగా జిల్లాలో ఇంకా 4,56,571 కనెక్షన్లు ఏజెన్సీలు, బ్యాంకు ఖాతాలకు అధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉంది. అయితే జనవరి నాటికి ఆధార్‌కార్డు అనుసంధానించకపోయినా బ్యాంకు ఖాతాలు తప్పనిసరిగా గ్యాస్ ఏజెన్సీలకు సమర్పించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. దీని వల్ల మూడు మాసాల వరకు వినియోగదారులకు గ్యాస్ పంపిణీ చేసే వెసులుబాటు ఉంటుందని వారు తెలిపారు. అయితే ఆధార్ సీడింగ్ పూర్తయితే తప్ప నగదు బదిలీ పథకం పూర్తిస్థాయిలో అమలు చేయడం సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు. దూరాన్ని బట్టి ధర.. ప్రస్తుతం గ్యాస్ ధరను దూరాన్ని బట్టి రవాణా ఖర్చులను కలుపుకొని నిర్ణయిస్తారు. ప్రస్తుతం జిల్లాలో సిలిండర్ ధర రూ.957గా ఉంది. ఈ పూర్తి మొత్తాన్ని జనవరి నుంచి వినియోగదారులు గ్యాస్ ఏజెంట్లకు చెల్లిస్తేనే సిలిండర్ చెల్లిస్తారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం రూ.510 నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమవుతుంది. దీంతో నేరుగా ప్రభుత్వం గ్యాస్‌పై ఇచ్చే సబ్సిడీ మొత్తం లబ్ధిదారులకు చేరుతుంది. ఐఓసీ 2,95,624 హెచ్‌పీసీఎల్ 1,41,149 బీపీఎల్ 83,497 దీపం కనెక్షన్లు 1,79,953 గ్యాస్ కనెక్షన్లు మొత్తం 7,00,223 -
ఇక సబ్సిడీపై 5 కేజీల ఎల్పీజీ సిలిండర్లు
న్యూఢిల్లీ : వంటగ్యాస్ వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడానికి చమురు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం చమురు కంపెనీలు గృహవినియోగదారులకు 14.2 కేజీల సిలిండర్లను ఏడాదికి 12 చొప్పున సబ్సిడీ రేటుకు అందిస్తుండడం తెలిసిందే. తాజాగా ఈ కంపెనీలు 5 కేజీల చిన్న సిలిండర్లనూ సబ్సిడీ ధరకు అందిస్తున్నాయి. ఒక్కో సిలిండర్‌కు రూ.155 సబ్సిడీ(ఢిల్లీ రేటు) ధరపై ఏడాదికి 34 సిలిండర్లు సరఫరా చేసేందుకు కంపెనీలు కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చాయి. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం రాజ్యసభలో ఈ విషయం తెలిపారు. . 5 కేజీల సిలిండర్లు 34 దాటితేమాత్రం ఒక్కో దానికి రూ.351 చెల్లించి(ఢిల్లీలో ధర) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
బాధల బదిలీ
గ్యాస్ బండ అందకున్నా తీసుకున్నట్లు మెసేజ్‌లు నత్తనడకన వంటగ్యాస్ ఆధార్ సీడింగ్ జిల్లాలో 7,20,991 వంటగ్యాస్ కనెక్షన్లు ఏజెన్సీల పరిధిలో 92 శాతం సీడింగ్ బ్యాంకుల వద్ద 82 శాతం సీడింగ్ చిత్తూరు: నగదు బదిలీ పథకం కాస్తా కష్టాల బదిలీగా మారింది. వంటగ్యాస్‌కు ఈ పథకం అమలు చేయడంలో బాలారిష్టాలను అధిగమించడం లేదు. గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకుల్లో ఇచ్చిన ఖాతా నంబర్‌కు నగదు సక్రమంగా జమ కావడం లేదు. ఒకే ఆధార్‌కార్డు నంబర్‌తో వేర్వేరు బ్యాంకుల్లో ఖాతా ఉన్న వ్యక్తులకు కొత్త కష్టాలు తప్పడం లేదు. ఏజెన్సీలో ఇచ్చిన ఖాతాకు కాకుండా మరో అకౌంట్లో మొత్తం జమ అవుతోంది. దీంతో ఆ వినియోగదారుడు తిప్పలు పడుతున్నాడు. ఇంకొంత మందికి అసలు సబ్సిడీ అందుతున్న పరిస్థితి లేదు. కొందరికి సబ్సిడీ మొత్తం తక్కువగా జమ అవుతోంది. దీంతో వినియోగదారులు పదేపదే ఏజెన్సీలు, బ్యాంకుల వద్దకు తిరగాల్సి వస్తోంది. సర్వర్ సమస్య ఈ సమస్యలన్నింటికీ సాంకేతిక తప్పిదాలే కారణం అని చమురు సంస్థల ప్రతినిధులు చల్లగా చెబుతున్నారు. ముంబైలోని సర్వర్‌లో సాంకేతిక సమస్య వల్ల సెల్ఫోన్లకు తప్పుడు ఎస్ఎంఎస్లు వస్తున్నట్లు చెబుతున్నారు. ఒకే ఆధార్ నంబర్‌తో ఇతర బ్యాంకుల్లో కూడా అకౌంట్లు ఉండడంవల్ల వంటగ్యాస్ సబ్సిడీ మొత్తం మిగిలిన అకౌంట్లలో పడే అవకాశం ఉంటుందనేది వారి వాదన. ఏది ఏమైనా వినియోగదారులు మాత్రం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. సాగని ఆధార్ సీడింగ్ వంటగ్యాస్ సబ్సిడీకి సంబంధించి సవరించిన నగదు బదిలీ పథకాన్ని చిత్తూరు జిల్లాలో అమలు చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా సబ్సిడీ మొత్తాన్ని నగదు బదిలీ రూపంలో బ్యాంకుల ద్వారా వినియోగదారులకు అందించనున్నారు. ఇందుకోసం ఆధార్ సీడింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. ఫిబ్రవరి 14వ తేదీ లోపల పూర్తి చేయాలని తుది గడువు విధించారు. ఆ లోపు ఆధార్‌తో అనుసంధానం చేసుకోని వారికి సబ్సిడీ అందదని చెబుతున్నారు. గతంలో ప్రక్రియను పూర్తిచేసిన వినియోగదారులు మాత్రం ఇప్పుడు కొత్తగా చేయాల్సిన అవసరంలేదు. నాలుగేళ్లుగా నత్తనడక జిల్లాలో 2012లో వంటగ్యాస్‌కు ఆధార్ సీడింగ్ ప్రక్రియను ప్రారంభించారు. నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ ఈ ప్రక్రియ పూర్తికాలేదు. వినియోగదారులు శ్రద్ధ చూపకపోవడంతోనే ఆధార్‌సీడింగ్ ప్రక్రియ ముందుకు సాగడంలేదని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అంటున్నారు. జిల్లాలో ఐవోసీ, హెచ్‌పీ, భారత్ పెట్రోలియం గ్యాస్ ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. ఇండేన్‌కు సంబంధించి జిల్లాలో 4,50,000 మంది వంట గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకూ 89.98 శాతం మంది గ్యాస్ ఏజెన్సీ వద్ద ఆధార్ సీడింగ్ పూర్తి చేయగా బ్యాంకుల వద్ద మాత్రం కేవలం 81.84 శాతం మాత్రమే సీడింగ్ పూర్తి చేశారు. హెచ్‌పీకి సంబంధించి 20 ఏజెన్సీల పరిధిలో 2,20,976 కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గ్యాస్ ఏజెన్సీల వద్ద 93 శాతం ఆధార్‌సీడింగ్ పూర్తి కాగా బ్యాంకుల వద్ద మాత్రం 83 శాతం మాత్రమే సీడింగ్ పూర్తయింది. వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం వినియోగదారులను అష్టకష్టాలకు గురి చేస్తోంది. గ్యాస్ బండ అందని వారికి కూడా తీసుకున్నట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి. రెండు లేదా మూడు బ్యాంకు అకౌంట్లు ఉన్న వారికి సబ్సిడీ మొత్తం ఏ ఖాతాలో జమ అయిందనేది కూడా తెలియడం లేదంటున్నారు. ఆధార్‌కార్డుల అనుసంధాన ప్రక్రియతోపాటు సాంకేతిక లోపాలు వినియోగదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. -
నగదు బదిలీ...
నేటి నుంచి అమలు సిలిండర్ ధర రూ.952 హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో అమలు మొదటి మూడు నెలలు మినహాయింపు మరో మూడు నెలలు అదనపు అవకాశం సిటీబ్యూరో: హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో వంటగ్యాస్‌కు ప్రత్యక్ష నగదు బదిలీకి (డీబీడీ) శనివారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. నగరంలో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.952గా నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా తొలివిడత వంటగ్యాస్ సబ్సిడీకి ప్రత్యక్ష నగదు బదిలీ విధానం అమలయ్యే జిల్లాల్లో హైదరాబాద్-రంగారెడ్డి కూడా ఉన్నాయి. ఇక వినియోగదారులు సిలిండర్‌ను మార్కెట్ ధర ప్రకారం పూర్తి స్థాయిలో నగదు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగా ఆధార్ నంబర్‌తో సంబంధం లేదు. విని యోగదారులకు బ్యాంక్ ఖాతా ఉంటే అందులో సబ్సిడీ నగదు రూపంలో జమవుతుంది. ఇదీ ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం జంట జిల్లాల్లో సుమారు 29 లక్షల ఎల్పీజీ గృహ వినియోగదారులు ఉన్నారు. అందులో బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైన వారి సంఖ్య 22.24 లక్షలు. మరో 6.74 లక్షల వినియోగదారులు బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం కావాల్సి ఉంది. ఖాతా లేని వారికి మొదటి మూడు నెలలు సబ్సిడీ ధరపైనే సిలిండర్ సరఫరా అవుతుంది. అ తర్వాత మరో మూడు నెలలు అదనపు మినహాయింపు కాలంగా వెసులుబాటు కల్పిస్తారు. ఈలోగా బ్యాంక్ ఖాతాతో అనుసంధానం కాని వారు పూర్తి స్థాయి మార్కెట్ ధర చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గడువులోగా బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకుంటే అప్పటి వరకు తీసుకున్న సిలిండర్ సబ్సిడీమొత్తాన్ని నగదుగా పొందే వెసులుబాటు కల్పించారు. గతంలో పరిస్థితి.. గతంలో వంటగ్యాస్‌కు ఆధార్‌తో ముడిపెట్టి, న గదు బదిలీని అమలు చేశారు. ఇది వినియోగదారులకు చుక్కలు చూపించింది. మొత్తం తొమ్మిది నెలలు అమలైనప్పటికీ... మొదటి మూడు నెలల పాటు మినహాయింపు కాలంగా పరిగణించారు. ఫలితంగా ఆధార్ అనుసంధానం కాని వారికీ సబ్సిడీ వర్తించింది. ఆ తర్వాత 2013 సెప్టెంబర్ ఒకటి నుంచి 2014 ఫిబ్రవరి వరకు పూర్తి స్థాయి డీబీటీ అమలు కావడంతో వినియోగదారులకు తిప్పలు తప్పలేదు. ఆధార్అనుసంధానం కాని వారు సిలిండర్‌కు పూర్తి స్థాయి ధర ను చెల్లించాల్సి వచ్చింది. -
15 నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ
సిలిండర్‌కు రూ. 996 చెల్లిస్తే.. బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేది రూ. 552 సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం కొద్దిపాటి మార్పులు, చేర్పులతో తిరిగి ప్రారంభమవుతోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు తొలిదశలో ఈ నెల 15వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 54 జిల్లాల్లో నగదు బదిలీ అమల్లోకి రానుంది. ఇందులో రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలున్నాయి. ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా వేగంగా జరుగుతోంది. జనవరి ఒకటి నుంచి రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో వంటగ్యాస్‌కు నగదు బదిలీ ప్రారంభం కానుంది. ఇది అమల్లోకి వస్తే వంటగ్యాస్ సిలిండర్ పూర్తి ధరను వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుం ది. అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన సబ్సిడీ సొమ్ము నేరుగా లబ్ధిదారుల బ్యాం కు ఖాతాల్లో జమ అవుతుంది. అయితే సిలిండర్ పూర్తి ధరను ఒకేసారి చెల్లించాలంటే.. పేదలకు అది తలకు మించిన భారమనే విమర్శలు వస్తున్నాయి. సబ్సిడీ వంట గ్యాస్‌కు నగదు బదిలీ అంశాన్ని గతంలోనే యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చినా... దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో దానిని ఉపసంహరించుకుంది. కానీ ఇటీవల ఈ అంశంపై సమీక్షించిన ఎన్డీయే ప్రభుత్వం.. కొద్దిపాటి మార్పు, చేర్పులతో తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. నవంబర్ 10వ తేదీ నుంచే నగదు బదిలీని ప్రారంభించాలని భావించినా... పలు కారణాలతో ఇదే నెల 15వ తేదీకి వాయిదా పడింది. తొలిదశలో భాగంగా ఈ నగదు బదిలీని రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రాథమికంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తంగా దాదాపు కోటి మంది ఎల్పీజీ వినియోగదారులు ఉండగా అందులో సుమారు 35 లక్షలు ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. రూ. 996 చెల్లించాలి.. గృహ వినియోగదారులు ఇకపై వంటగ్యాస్‌ను తీసుకోవాలంటే ముందుగా నిర్ణీత ధర రూ. 996.50 (14.2 కేజీల సిలిండర్‌కు) చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం ప్రభుత్వం ఇందులో వినియోగదారులు చెల్లించాల్సిన రూ. 444 మినహాయించి, సబ్సిడీ మొత్తమైన రూ. 552.50ను తిరిగి వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. అయితే గతంలో విధంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. ఆధార్ లేకున్నా కేవలం బ్యాంకు ఖాతా ఉంటే చాలు వంటగ్యాస్ సబ్సిడీని నేరుగా వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఒకవేళ ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతా రెండూ లేనివారు ఉంటే వారికి మూడు నెలల పాటు ఖాతా తెరిచేందుకు అదనపు సమయం ఇస్తారు. అప్పటివరకు ప్రస్తుతం కొనసాగుతున్న పద్ధతిలోనే వారు వంట గ్యాస్‌ను పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం నగదు బదిలీ అమలుకానున్న మూడు జిల్లాల్లో సుమారు 24 శాతం మందికి బ్యాంకు ఖాతాలు వంటగ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానం కాలేదని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక ఏడాదిలో ఎప్పుడైనా 12 సిలిండర్లను తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే.. మరోవైపు నగదు బదిలీ కారణంగా.. పేద వినియోగదారులు ఒకేసారి పూర్తి సిలిండర్ ధరను చెల్లించాల్సి రావడం ఇబ్బంది మారుతుందనే విమర్శలు వస్తున్నాయి. -
గ్యాస్, కిరోసిన్, డీజిల్ ధరలు పెంచం: పెట్రోలియం శాఖ
న్యూఢిల్లీ: సబ్సిడీ గ్యాస్ సిలెండర్లు, కిరోసిన్, డిజీల్ ధరలను పెంచే ఉద్దేశం లేదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదనలేమి లేవని ప్రధాన్ తెలిపారు. కిరోసిన్, డీజిల్, ఎల్ పీజీ గ్యాస్ సిలెండర్ల ధరల పెంచేందుకు ప్రభుత్వ ప్రతిపాదన ఉందని వస్తున్న వార్తలను ఖండించారు. ఎల్ పీజీ గ్యాస్ సిలెండర్ ధర 250 రూపాయలు, కిరోసిన్ 5 రూపాయలు పెంచాలని కిరిటీ పరేఖ్ ప్యానల్ సిఫారసు చేసినప్పటికి ఇప్పట్లో ధరల పెంపు ఉండదన్నారు. బుధవారం నాన్ సబ్సిడీ ఎల్ పీజీ ధరను 16.50 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే. -
గ్యాస్ సిలిండర్ ధర రూ. 250 చొప్పున పెంపు?
ఇంట్లో కట్టెల పొయ్యి ఉందా? అయితే.. మళ్లీ కట్టెలు కొనుక్కుని దాన్ని వెలిగించడం మొదలుపెట్టండి. ఎందుకంటే.. గ్యాస్ సిలిండర్ ధరను సిలిండర్‌కు రూ. 250 చొప్పున పెంచాలని కేంద్ర చమురు మంత్రిత్వశాఖ భావిస్తోంది. ఈ విషయాన్ని రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ దృష్టికి చమురు మంత్రిత్వశాఖ తీసుకెళ్లనుంది. కిరోసిన్, గ్యాస్ సిలిండర్ల ధరలను నిపుణుల కమిటీ సూచించిన మేరకు పెంచాలని ఈ శాఖ భావిస్తోంది. గతంలో కిరీట్ పారిఖ్ కమిటీ చేసిన ప్రతిపాదనల మేరకు కిరోసిన్‌ను లీటరుకు రూ. 4-5 చొప్పున, గ్యాస్ సిలిండర్లను సిలిండర్‌కు రూ. 250 చొప్పున పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది. ఈ విషయాన్నే కేబినెట్ కమిటీకి నివేదిస్తోంది. ఇక నెలకు డీజిల్ ధరలను 40-50 పైసల వంతున పెంచాలన్న నిర్ణయాన్ని కొనసాగించాలని కూడా ఈ శాఖ భావిస్తోంది. కేబినెట్ ఆమోదం తెలిపితే చాలు.. ఇక సిలిండర్ల మీద భారీ వడ్డన తప్పకపోవచ్చు. ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయల ధరల మంటతో అల్లాడుతున్న సామాన్యుడికి ఇది పెనుభారంగానే పరిణమిస్తుంది. -
ఎల్పీజీ, కిరోసిన్ ధరల పెంపు నిలుపుదల
న్యూఢిల్లీ: ఎల్పీజీ, కిరోసిన్ ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో స్థానిక లెవీల కారణంగా ఇంధన ధరలు పెరగడంతో ప్రజలపై ఒకేసారి ఎక్కువ భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రవేశ పన్ను, ఆక్ట్రాయ్ వంటి లెవీలు పెరగడంతో కేరళలో ఎల్పీజీ సిలిండరు రూ.4.50 మేర, కర్ణాటకలో రూ.3, మధ్యప్రదేశ్‌లో రూ.4.50, యూపీలో రూ.1 చొప్పున పెరిగింది. హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో కిరోసిన్ ధర 2 పైసలు, 8 పైసల చొప్పున పెరిగింది. మరోవైపు రాష్ట్ర పన్నులు తగ్గడంతో అస్సాంలో సిలిండర్ ధర రూ.9.50, బీహార్‌లో రూ.1.50, మహారాష్ట్రలో రూ.3 మేర తగ్గింది. నవీ ముంబై, మహారాష్ట్రలలో కిరోసిన్ ధరలో లీటరుకు 11 పైసల నుంచి రూ.1.32 దాకా తగ్గుదల కనిపించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో స్థానిక పన్నుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే వరకు పెంపును నిలుపుదల చేయాలని చమురు శాఖ ఆదేశాలు జారీచేసింది. -
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెంపుదల
-
ప్రయాణికులపై ఆటో పిడుగు
సాక్షి, సిటీబ్యూరో: లక్షల మంది ప్రయాణికులపై భారాన్ని మోపుతూ ప్రభుత్వం శుక్రవారం ఆటో చార్జీలను పెంచింది. ఈ మేరకు రవాణాశాఖ జీవో నం.20 విడుదల చేసింది. దాంతో గ్రేటర్‌లోని లక్షా 20 వేల ఆటోరిక్షాలను వినియోగించుకొనే సుమారు 15 లక్షల మంది ప్రయణికులపై చార్జీల భారం పడనుంది. ఇప్పటికే పెరిగిన ఆర్టీసీ చార్జీలు, ఆకాశాన్నంటే నిత్యావసర వస్తువుల ధరలు, వంటగ్యాస్ భారంతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యుడిపై తాజాగా ఆటో పిడుగు పడింది. పెరిగిన చార్జీలు శనివారం తెల్లవారుజాము నుంచి అమల్లోకి రానున్నాయి. మొదటి 1.6 కిలోమీటర్ల దూరానికే ప్రయాణికుడిపై ఏకంగా రూ.4 పెంచారు. ఆ తర్వాత చేసే ప్రతి కిలోమీటర్ దూరానికి రెండురూపాయల చొప్పున అదనపు భారం పడనుంది. దాంతో సగటున ఒక్కో ప్రయాణికుడిపై రూ.10 అదనపు భారం పడే అవకాశం ఉంది. ఈ లెక్కన ప్రతి రోజు ఆటో ప్రయాణికులపై పెరిగిన చార్జీల కారణంగా రూ.కోటీ 50 లక్షల అదనపు భారం పడనుంది. పెరిగిన చార్జీలు.... ప్రస్తుతం 1.6 కిలోమీటర్ల దూరానికి తీసుకుంటున్న కనీస చార్జీ రూ.16. నేటి నుంచి ఇది రూ.20 ఆ పైన ప్రతి కిలోమీటర్‌కు రూ.9 లను రూ.11 లకు పెంచారు. ప్రస్తుతం ప్రతి 2 నిమిషాలకు 50 పైసల చొప్పున వెయిటింగ్ చార్జీ తీసుకుంటుండగా ఇక నుంచి దానిని 15 నిమిషాలకు రూ.5 చొప్పున తీసుకుంటారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు మీటర్ చార్జీలపైన ఆఫ్ రిటర్న్ (50 శాతం అదనంగా) చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో తిరిగే ఆటోలన్నీ విధిగా మీటర్ చార్జీలకు అనుగుణంగానే ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేయాలి. చార్జీలు పెంచిన తర్వాత మూడునెలల్లోపు ఆటోడ్రైవర్లు మీటర్లను సవరించుకోవాల్సి ఉంటుందని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ పేర్కొన్నారు. నిర్ణీత రీడింగ్ ప్రకారం చార్జీలు తీసుకోవాలని, మీటర్ రీడింగ్ నమోదు చేయకుండా ఇష్టారాజ్యంగా వసూలు చేసినా, తప్పుడు రీడింగ్ నమోదు చేసిన కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతపై... ఇటీవల మహిళలపై చోటుచేసుకుంటున్న దాడుల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై అధికారులు దృష్టి సారించారు. ప్రతి ఆటోలో విధిగా ఆటో యజమాని, డ్రైవర్ వివరాలను తెలిపే చార్ట్‌ను ఏర్పాటు చేయాలి. డాక్యుమెంట్లు కూడా ఆటోలో ఉండాలి. ఈ- చలానాలు, ట్రాఫిక్ చలానాల తగ్గింపు, తదితర అంశాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు. -
సబ్సిడీ సిలిండర్లకు ఆధార్ లింక్ తొలగింపు
-
ఆధార్ లింకేజీపై YSRCP ధర్నా
-
మంటపెట్టారు
కేంద్రం కొత్త సంవత్సర ‘కానుక’.. వంటగ్యాస్ ధర పెంపు రూ. 215 పెరిగిన సబ్సిడీయేతర సిలిండర్ ధర.. రూ. 11.00 హైదరాబాద్‌లో పెరిగిన సబ్సిడీ సిలిండర్ ధర సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: కొత్త సంవత్సర ఆరంభం రోజే కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.215 మేరకు పెంచేసింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.1112.50 ఉన్న సబ్సిడీయేతర సిలిండర్ ధర ఒక్కసారిగా రూ.1327.50కు ఎగబాకింది. ఈ పెంపుతో సబ్సిడీ సిలిండర్ ధర కూడా రూ. 11 పెరిగింది. ఈ నెల 1 నుంచే పెరిగిన ధర అమల్లోకి వచ్చింది. వంటగ్యాస్ ధర ఒకేసారి రూ.200కు పైగా పెరగడంపై ప్రజలు, రాజకీయ పక్షాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రో ఉత్పత్తుల ధరలను సాకుగా చూపుతూ చమురు కంపెనీలు వంటగ్యాస్ ధరలు పెంచుతూ పోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. తాజా పెరుగుదలతో కలిపి గత నెల రోజుల్లోనే వంటగ్యాస్ ధర మూడుసార్లు పెరగడం గమనార్హం. గత డిసెంబర్ 1న, అదే నెల 11న కూడా గ్యాస్ ధరలు పెరిగారుు. కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ అమల్లోకి తెచ్చిన తర్వాత సబ్సిడీయేతర వంటగ్యాస్ ధర భారీగా పెరిగింది. గత జూన్‌లో సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.965 ఉండేది. అప్పట్లో వినియోగదారులకు 412.50 సబ్సిడీ ధరతో గ్యాస్ లభించేది. సబ్సిడీపై అందజేసే సిలిండర్ల సంఖ్యపైనా పరిమితి ఉండేది కాదు. అరుుతే జూన్ నుంచి నగదు బదిలీ పథకం అమలు చేయడంతో పాటు ఏడాదికి 9 సబ్సిడీ సిలిండర్లు మాత్రమే ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ (కేవలం ఆరు నెలల్లోనే) సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.362 పెరగడం గమనార్హం. తొమ్మిది సిలిండర్ల పరిమితిని దాటి గ్యాస్‌ను వినిగియోగించేవారిపైనా, నగదు బదిలీ పథకం అమలవుతున్న జిల్లాల్లో ఆధార్ అనుసంధానం చేసుకోని సబ్సిడీ వర్తించని వినియోగదారులపైనా ఎప్పటికప్పుడు మోయలేని భారం పడుతోంది. చమురు కంపెనీలు ప్రతి నెలా మొదటి తారీఖున సబ్సిడీయేతర ఎల్పీజీ ధరలను సవరిస్తున్నారుు. సబ్సిడీగ్యాస్ వారిపై రూ.11.50 అదనపు భారం సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ ధర పెరగడం వల్ల సబ్సిడీ వంటగ్యాస్ వినియోగదారులపై కూడా అదనపు భారం పడుతోంది. తాజా పెంపునకు ముందు రాష్ట్ర రాజధానిలో (రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఈ ధరలో స్వల్ప తేడా ఉంటుంది) 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1112.50 ఉండగా ఇందులో నగదు బదిలీ కింద (సబ్సిడీ) రూ.641 వినియోగదారుల అకౌంట్లలో జమ అవుతోంది. దీంతో గరిష్టంగా ప్రజలకు సిలిండర్ ధర రూ.471.50 పడేది. బుధవారం నుంచి వంటగ్యాస్ ధర రూ.1327.50కు పెరిగింది. వినియోగదారులు 1327.50 చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే నగదు బదిలీ కింద ప్రభుత్వం రూ.845 వారి బ్యాంకు అకౌంట్లలో సబ్సిడీ కింద జమ చేస్తుంది. సబ్సిడీ మొత్తం పోనూ వినియోగదారులకు వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.482.50 పడుతుంది. అంటే సబ్సిడీ సిలిండర్లు కొనుగోలు చేసేవారిపై కూడా ఒక్కో దానికీ రూ.11.50 అదనపు భారం పడుతున్నట్లే. తొమ్మిది సిలిండర్లు దాటినా, సబ్సిడీ వర్తించకున్నా మోతే.. ఏడాదికి తొమ్మిది సిలిండర్లకు మాత్రమే నగదు బదిలీ కింద సబ్సిడీ వర్తిస్తుంది. పదో సిలిండర్ కావాలంటే రూ.1327.50 చెల్లించాల్సిందే. అంటే బ్యాంకులో ఎలాంటి మొత్తం జమ కాదు. మరోవైపు నగదు బదిలీ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన జిల్లాల్లో ఆధార్ (విశిష్ట గుర్తింపు సంఖ్య) నమోదు చేసుకోని, ఆధార్‌తో బ్యాంకు అకౌంటును అనుసంధానం చేసుకోని వినియోగదారులంతా ప్రతి ఒక్క సిలిండర్‌ను (తొలి తొమ్మిది సిలిండర్లను కూడా) సబ్సిడీయేతర ధర అంటే రూ.1327.50 చెల్లించి కొనుగోలు చేయక తప్పడం లేదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 28.29 లక్షల మందికి వంటగ్యాస్ కనెక్షన్లు ఉండగా 19.26 లక్షల మందికి మాత్రమే ఆధార్, బ్యాంకు అకౌంట్లు అనుసంధానం అయ్యాయి. మిగిలిన 9.03 లక్షల మంది వినియోగదారులకు నగదు బదిలీ కింద సబ్సిడీ వర్తించడంలేదు. దీంతో వీరంతా అన్నీ సబ్సిడీ రహిత సిలిండర్లనే కొనాల్సి వస్తోంది. ప్రస్తుతం వీరికి సిలిండర్ ధర రూ.1327.50 పడుతోంది. ఆధార్ లేదనే కారణంగా సబ్సిడీని, ప్రభుత్వ పథకాల అమలును నిలిపివేయరాదంటూ సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఆదేశించినా కేంద్ర ప్రభుత్వం ఖాతరు చేయక పోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం దొంగదెబ్బలు కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సందట్లో సడేమియూలా గ్యాస్ వినియోగదారులను దొంగదెబ్బ తీసింది. సిలిండర్‌పై వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రూ.25 సబ్సిడీని నగదు బదిలీ పథకం అమలవుతున్న జిల్లాల్లో ఎత్తివేసింది. అంటే ఈ జిల్లాల్లో ప్రజలపై ఒక్కో సిలిండర్‌కు రూ.25 అదనపు భారం పడింది. ఇది చాలదన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సబ్సిడీయేతర వంటగ్యాస్ బిల్లుపై 5% వ్యాట్‌ను విధిస్తోంది. సబ్సిడీ బిల్లు (వినియోగదారులు చెల్లించే మొత్తం)పై కాకుండా మార్కెట్ ధరపై వ్యాట్ విధించడం వల్ల రూ.41 అదనపు భారం పడుతోంది. అంటే నగదు బదిలీ అమల్లో లేని జిల్లాలతో పోల్చితే ఈ పథకం అమల్లో ఉన్న జిల్లాల ప్రజలపై ఒక్కో సిలిండర్‌కు రూ.66 అదనపు భారం పడుతోంది. తాజాగా నగదు బదిలీ పూర్తిస్థారుులో అమల్లోలేని జిల్లాల్లో కూడా రూ.25 సబ్సిడీని ప్రభుత్వం రద్దు చేసింది. 19 కిలోల సిలిండర్‌పై రూ.385.50 అదనపు భారం 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1882.50 నుంచి రూ.2268కు పెరిగింది. దీంతో 19 కిలోల సిలిండర్ కొనుగోలుదారులపై రూ.385.50 అదనపు భారం పడుతోంది. హోటళ్లు, మిఠాయి దుకాణాలు లాంటి అన్ని వ్యాపార సంస్థలపై ఈ పెంపు ప్రభావం తప్పదు. వాణిజ్య అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ ధర పెరిగినందున వ్యాపారులు తిరిగి ఈ భారాన్ని ప్రజలపైనే వేస్తారు. అంటే అంతిమంగా ఈ పెంపు ప్రభావం కూడా ప్రజలపైనే పడనుంది. ఆధార్ గడువు పెంపు రెండో దశలో ఆధార్ అనుసంధానానికి సంబంధించిన గడువును కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ నెలాఖరు వరకు పొడిగించింది. వాస్తవంగా ఈ జిల్లాల్లో నగదు బదిలీకి ఆధార్ గడువు డిసెంబర్ 31తో ముగిసింది. అరుుతే ఆధార్ ప్రక్రియ పూర్తికావడంలో సమస్యలు దృష్టిలో పెట్టుకుని గడువును పొడిగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సబ్సిడీతో ఆదుకున్న వైఎస్ 2003లో సిలిండర్ ధర రూ.305.88 ఉండేది. 2008 జూన్‌లో కేంద్రం ఈ ధరను రూ.355.88కి పెంచింది. రాష్ట్ర ప్రజలపై ఒక్కసారిగా పడిన రూ.50 అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.370 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు చెప్పినా.. పేదలకు ఇబ్బంది కలగకుండా చూడడమే ధ్యేయంగా వైఎస్ నిర్ణయం తీసుకుని అమలు చేశారు. దీంతో రాష్ట్ర వినియోగదారులకు పాత ధర (రూ.305.88)కే సిలిండర్ అందుబాటులో ఉంది. అనంతరం తీవ్రమైన ప్రజావ్యతిరేకత కారణంగా కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరను రూ.25 తగ్గించి రూ.330.88గా ఖరారు చేసింది. దీంతో వైఎస్ పాత నిర్ణయాన్ని అమలు చేస్తూ మిగతా రూ.25ను సబ్సిడీగా కొనసాగించారు. దీంతో 2003లో ఉన్న ధరకే సిలిండర్ అందుబాటులో ఉండింది. అరుుతే క్రమేణా కేంద్రం ధర పెంచుతూ పోతుండడంతో ప్రస్తుతం సిలిండర్ ధర గణనీయంగా పెరిగింది. తాజాగా ఈ రూ.25 సబ్సిడీని కూడా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఎత్తివేసింది. -
గ్యాస్ ధర పెంపు.. నాన్ సబ్సిడీ సిలిండర్ 1327!!
-
గ్యాస్ ధర పెంపు.. నాన్ సబ్సిడీ సిలిండర్ 1327!!
సామాన్యుడిపై మరోసారి 'బండ' పడింది. గ్యాస్ ధర మరింత పెరిగింది. నాన్ సబ్సిడీ సిలిండర్ల ధరను ప్రభుత్వం ఒక్కసారిగా పెంచేసింది. అంటే, ఏడాదికి తొమ్మిది సిలిండర్లు దాటితే జేబుకు భారీ చిల్లు పడటం ఖాయమన్న మాట. పదో సిలిండర్ నుంచి ఒక్కోటీ రూ. 1327.50 పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ ధర కేవలం 1112.50 రూపాయలు మాత్రమే ఉండేది. ఒక్కసారిగా నాన్ సబ్సిడీ సిలిండర్ ధరలను 215 రూపాయలు పెంచేశారు. దీంతోపాటు సబ్సిడీ సిలెండర్ ధరను కూడా స్వల్పంగా పెంచారు. రాయితీ పోను హైదరాబాద్‌లో రూ.441కు సిలెండర్ ధర చేరుకుంది. ఇది ఇప్పటివరకు రూ. 411.50 గా ఉండేది. అంటే, సబ్సిడీ సిలిండర్ల ధర ఒక్కోటీ రూ. 30 వంతున పెరిగిందన్నమాట. ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం రూ. 843 వరకు సబ్సిడీ ఇస్తుండగా, ఆ సబ్సిడీ ప్రభుత్వం నుంచి కంపెనీలకు చేరట్లేదని, అందుకే సబ్సిడీ సిలిండర్ ధర కూడా పెరిగిందని అంటున్నారు. -
కొనుగోలుదారుల పై పెనుభారం
-
వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 3.46 పెంపు
వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.3.46 పెరిగింది. డీల్లర్లకు చెల్లించే కమిషన్ మొత్తాన్ని ప్రభుత్వం 9 శాతం పెంచడంతో ఈ పెరుగుదల చోటుచేసుకుంది. 14.2 కిలోల సిలిండర్‌పై డీలర్ల కమిషన్‌ను రూ.3.46 పెంచడంతో వారి కమిషన్ రూ.40.71 చేరుకుంది. ఫలితంగా సిలిండర్ అమ్మకపు ధర రూ.3.46 మేర పెరగనుందని చమురు మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. పెంచిన కమిషన్ మొత్తం వినియోగదారులపైనే పడుతుందని, కొత్త ధర మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిందని వివరించారు. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ బండ ధర రూ.410.50 ఉండగా, ధర పెంపు అనంతరం రూ.413.96కి చేరింది. మరోవైపు 5 కిలోల సిలిండర్‌పై కూడా డీలర్ల కమిషన్‌ను రూ.1.73 పెంచారు. దీంతో వారి కమిషన్ రూ.20.36కి చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో 5 కిలోల సిలిండర్ ధర రూ.353 ఉంది. వేతనాలు, భత్యాల వంటి వ్యయం పెరిగిన నేపథ్యంలో డీలర్ల కమిషన్ పెంచినట్టు ఆ అధికారి తెలిపారు. అయితే సబ్సిడీ లేని సిలిండ్లరపై డిస్టిబ్యూటర్లకు అదనంగా ఇస్తున్న 75 పైసల కమిషన్ మొత్తంలో ఎలాంటి మార్పూ లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో సబ్సిడీ లేని సిలిండర్ ధర రూ.1,017.50గా ఉంది. -
ఆధార్ కార్డు లేకుండా గ్యాస్ ఇవ్వండి: హైకోర్టు
-
ఇక బంకుల్లో వంట గ్యాస్
న్యూఢిల్లీ: పెట్రోల్ బంకుల్లో వంట గ్యాస్ సిలిండర్ల (ఎల్పీజీ) విక్రయం ఇకపై దేశవ్యాప్తం కానుంది. ఐదు మెట్రో నగరాల్లో చమురు సంస్థల యాజమాన్యంలోని బంకుల్లో అక్టోబర్ 5 నుంచిప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 5 కిలోల ఎల్పీజీ సిలిండర్లను దేశవ్యాప్తంగా చమురు సంస్థల యాజమాన్యంలోని దాదాపు 1,440 పెట్రోల్ బంకులన్నింట్లోనూ విక్రయించేందుకు అనుమతిస్తూ పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. నిర్ణీత భద్రతా ప్రమాణాలున్న ఇతర బంకులను కూడా సిలిండర్లను విక్రయానికి అనుమతించే అవకాశముందని పెట్రోలియం శాఖ పేర్కొంది. ఇవి మార్కెట్ ధరకు (అంటే సబ్సిడీ ధరకు రెట్టింపుకు కాస్త ఎక్కువగా) అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం కొనుగోలుదారు ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. విద్యార్థులు, ఐటీ నిపుణులు, బీపీవో ఉద్యోగుల వంటివారికి దీనితో బాగా లబ్ధి చేకూరనుంది. 5 కేజీ ఎల్పీజీ సిలిండర్ మొదటిసారి కొనుగోలు చేసేందుకు రూ.1,000, రెగ్యులేటర్‌కు రూ.250 (పన్నులు అదనం) ఖర్చవుతుంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఈ నిర్ణయం అమలును ప్రస్తుతానికి నిలిపేశారు. -
వంట గ్యాస్ ధరల తగ్గింపు
దీపావళి సందర్భంగా పిండివంటలు చేసుకోవాలంటే గ్యాస్ ఎక్కువ అయిపోతుందని భయపడుతున్నారా? అయితే మీకో శుభవార్త. వంటగ్యాస్ ధరను చమురు కంపెనీలు తగ్గించాయి. గృహ వినియోగానికి సరఫరా చేసే 14.2 కిలోల సిలిండర్‌పై 53.50 రూపాయల వంతున ధరను తగ్గించాయి. ఇటీవలే పెట్రోలు ధరను లీటరు 1.15 రూపాయల చొప్పను తగ్గించిన చమురు సంస్థలు, తాజాగా వంటగ్యాస్ ధరను కూడా తగ్గించడం విశేషం. గృహ వినియోగ సిలిండర్లే కాక, వాణిజ్య సిలిండర్ల ధరలను కూడా చమురు కంపెనీలు తగ్గించాయి. ఒక్కో వాణిజ్య సిలిండర్ ధరను 91 రూపాయల వంతున తగ్గించడంతో చిరు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన ధరలు శుక్రవారం నుంచే అమలులోకి వచ్చాయి. -
రూ.70కి పైగా పెరిగిన సబ్బిడీయేతర వంటగ్యస్ ధర