నేటి నుంచి ఎల్‌పీజీ డీలర్ల ఆందోళన | lpg dealers protest from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎల్‌పీజీ డీలర్ల ఆందోళన

Nov 4 2016 11:52 PM | Updated on Sep 4 2017 7:11 PM

ఎల్‌పీజీ డీలర్లు శనివారం నుంచి ఆందోళన చేయనున్నారని ఫెడరేషన్‌ ఆప్‌ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఆఫ్‌ ఇండియా కర్నూలు జిల్లా శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

 కల్లూరు : ఎల్‌పీజీ డీలర్లు శనివారం నుంచి ఆందోళన చేయనున్నారని ఫెడరేషన్‌ ఆప్‌ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఆఫ్‌ ఇండియా కర్నూలు జిల్లా శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సరైన తూకం, కంపెనీ సీల్‌తో సిలిండర్‌ను పంపిణీ చేయాలనే డిమాండ్లను నెరవేర్చాలని ఆందోళన చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 5న నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయడం, 15న నల్ల బ్యాడ్జిలు ధరించడంతోపాటు ఒక రోజు ఇండెంట్‌ సప్లయ్‌ను నిలిపివేయడం చేస్తామని తెలిపారు. డిసెంబర్‌ 1వ తేదీన ఒక రోజు పూర్తి కాలం సమ్మె, డిసెంబర్‌ 15 నుంచి నిరవధి సమ్మె చేస్తామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement