డిమాండ్ల సాధనకు నిరాహారదీక్ష | protest for demands solutions | Sakshi
Sakshi News home page

డిమాండ్ల సాధనకు నిరాహారదీక్ష

Published Sat, Jul 30 2016 9:41 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

protest for demands solutions

మచిలీపట్నం సబర్బన్‌ :
దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 1వ తేదీ సోమవారం పెనమలూరులోని రాష్ట్ర మత్య్సశాఖ కమిషనర్‌‡ కార్యాలయం వద్ద ఒక్క రోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మత్య్స కార్మిక సంఘం మచిలీపట్నం డివిజన్‌ కార్యదర్శి ఒడుగు గంగాధరప్రసాద్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటూ ఎన్నికల్లో కల్లబొల్లి కబుర్లు చెప్పి గద్దెనెక్కిన తరువాత పాలకులు ఆ విషయాన్ని మర్చిపోతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి కోట్లాది రూపాయల ఆధాయాన్ని ఇచ్చే మత్య్సకారులను ఇబ్బందులకు గురి చేయటం తగదన్నారు. దీనికి నిరసనగా చేపట్టే నిరాహార దీక్షకు మత్య్సకారులందరూ హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement