
సాక్షి, ముంబై: కొత్త ఏడాదిలో వంట గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ బండ భారం పడింది. నాన్ సబ్సిడీ ( సబ్సిడీ లేని) వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తాజాగా ప్రకటించాయి. పెరిగిన ధరలు జనవరి 1నుంచే అమల్లోకి వచ్చాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం14.2 కిలోల సిలిండర్ న్యూఢిల్లీలో రూ. 19, ముంబైలో రూ. 19.50, ఇతర ప్రాంతాల్లో రూ. 20 వరకూ భారం పడనుంది. దీంతో వరుసగా ఐదో నెలలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగినట్లయింది. గత ఏడాది ఆగస్టునుంచి ఈ ఐదు నెలల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 140 పెరిగినట్లయింది.
తాజా పెంపు తరువాత ప్రస్తుతం న్యూఢిల్లీలో రూ. 684గా ఉన్న సిలిండర్ ధర రూ. 714కు చేరింది. ముంబైలో రూ. 895కు పెరిగింది. ఇక కోల్కతాలో రూ. 747, చెన్నైలో రూ. 734గా వుండనుంది పెంచిన ధరలు తక్షణం అమలులోకి వస్తాయని ఐఓసీఎల్ వెల్లడించింది. ఇదే సమయంలో 19 కిలోల బరువుండే కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1,241, ముంబైలో రూ. 1,190గా ఉందని ఇండియన్ ఆయిల్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment