బెంగళూరు:ఇంటింటికి పైపు ద్వారా వంటగ్యాస్ (పైప్ న్యాచులర్ గ్యాస్-పీఎన్‌జీ)ను సరఫరా చేసే పథకానికి త్వరలో బెంగళూరులో శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ వెల్లడించారు. గ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులు కోవడానికి ఉద్దేశించబడిన గివిటప్(ుజజీఠ్ఛిజ్టీఠఞ) కార్యక్రమాన్ని ఆయన బెంగళూరులో శనివారం ప్రారంభించి, మాట్లాడారు. సిలెండర్‌లలో వంట గ్యా స్‌ను సరఫరా చేయడంతో పోలిస్తే పీఎన్‌జీ అత్యంత భద్రతతో కూడుకున్నదే కాక, చౌకైనది కూడా అని పేర్కొన్నారు. పీఎన్‌జీ అమలుతో బినామీ రూపంలో సబ్సిడీ గ్యాస్‌ను పొందుతున్న వారి ఆటలు సాగవని అన్నారు. బెంగళూరు తర్వాత ఈ విధానాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలకూ విస్తరిస్తామని చెప్పారు. దీని వల్ల ఏడాదికి రూ.3వేల కోట్ల గ్యాస్ సబ్సిడీ నిధులు ఆదా అవుతాయని ఆయన వివరించారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపునకు స్పందించి ఎంతోమంది సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు గివిటప్‌కు మద్దతు పలికారన్నారు. ఒక్క కర్ణాటక నుంచే ఇప్పటి వరకూ 20 వేల మంది మార్కెట్ రేటుకే గ్యాస్‌ను కొనుగోలు చేస్తామని ముందుకు వచ్చారన్నారు.
ఇందులో 15 వేల మంది ఒక్క బెంగళూరులో ఉన్నట్లు తెలిపారు. వీరిలో బహుభాషనటి మాలాశ్రీ, దర్శకుడు రాజేంద్రసింగ్ బాబు తదితరులు ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులందరూ గివిటప్‌కు మద్దతు పలుకుతారని తెలిపారు. ఇక రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్‌గుండూరావ్‌తోపాటు రోషన్‌బేగ్ తదితర మంత్రులు ఇప్పటికే తాము గివిటప్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం పంపించారని కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు తెలిపారు. కాగా, కర్ణాటకలో మొదటిసారిగా గివిటప్‌కు మద్దతు పలికిన కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ భార్య తేజశ్విని అనంతకుమార్‌ను ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.
గివిటప్‌కు మార్గాలు ఇవి...
మైక్రోసైట్స్... కడLPG.in, giveitup.in Ððl»Œæ-OòÜr$Ï...www.ebharatgas.com, www.indane.co.in , www.hpgas.com
ఆయా గ్యాస్ కంపెనీ వినియోగదారులు తాము ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫోన్ ద్వారా ఎస్‌ఎమ్మెఎస్ రూపంలో గివిట్ అప్‌లో సభ్యులుగా చేరవచ్చు. {పత్యేక దరఖాస్తు ఫారం కూడా అందుబాటులో ఉంది.
త్వరలో బెంగళూరుకు ‘పీఎన్‌జీ’
Published Sun, Apr 5 2015 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM
Advertisement
Advertisement