Minister Dharmendra Pradhan
-
హెచ్పీసీఎల్లో మొత్తం వాటాల విక్రయం
న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్)లో ప్రభుత్వానికి ఉన్న మొత్తం 51.11 శాతం వాటాలను ఓఎన్జీసీకి విక్రయించనున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విలీనానంతరం కూడా హెచ్‌పీసీఎల్ ప్రత్యేక బ్రాండ్, బోర్డుతో ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని ఆయన వివరించారు. ఈ డీల్‌తో హెచ్‌పీసీఎల్ దేశీయంగా మూడో అతి పెద్ద ఆయిల్ రిఫైనర్‌గా మారుతుందని మంత్రి పేర్కొన్నారు. హెచ్‌పీసీఎల్ యాజమాన్య హక్కుల బదలాయింపుతో పాటు 51.11 శాతం వాటాలను ఓఎన్జీసీకి వ్యూహాత్మక ప్రాతిపదికన విక్రయించేందుకు కేంద్ర క్యాబినెట్ కమిటీ జూలై 19న సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసిందని లోక్‌సభకు మంత్రి వివరించారు. ఈ డీల్‌ను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి ఈ లావాదేవీ పూర్తి కావొచ్చని పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ప్రధాన్ వివరించారు. -
1.22 లక్షల కోట్ల ‘పెట్రో’ పెట్టుబడులు
-
1.22 లక్షల కోట్ల ‘పెట్రో’ పెట్టుబడులు
►రూ.60 వేల కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్, హెచ్‌పీసీఎల్ విస్తరణ ► మరో రూ.62 వేల కోట్లతో కేజీ బేసిన్లో క్రూడాయిల్ వెలికితీత ► పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ► విశాఖలో పెట్రో యూనివర్సిటీకి శంకుస్థాపన ► ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం: సీఎం సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో రంగానికి రూ.లక్షా 22 వేల కోట్లు వెచ్చించనున్నట్టు కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ సహాయమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. వీటిలో రూ.62 వేల కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్, హెచ్‌పీసీఎల్ విస్తరణ, మరో రూ.60 వేల కోట్లతో కేజీ బేసిన్లో క్రూడాయిల్ వెలికితీతకు ఖర్చు చేయనున్నామని వెల్లడించారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలిలో రూ.600 కోట్లతో నిర్మించనున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (పెట్రో యూనివర్సిటీ)కి గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ... ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పెట్రో యూనివర్సిటీని విశాఖలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌కు, డిసెంబర్లో హెచ్‌పీసీఎల్ విస్తరణకు శంకుస్థాపన చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకులు విదేశాల్లో పెట్రో రంగంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా పనులు వేగవంతం చేస్తామని చెప్పారు. వచ్చే జూన్ 2వ తేదీ నాటికల్లా రాష్ట్రంలో ప్రధాని ఉజ్వల్ యోజన కింద అందరికీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు. అంతకుముందు నేషనల్ స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్‌ను మంత్రి ధర్మేంద్ర జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రధాని ఉజ్వల్ యోజన పథకాన్ని ఇక్కడినుంచే ప్రారంభించారు. ప్యాకేజీని సమర్థిస్తున్నా: చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీని సమర్థించడమే కాదు, అందుకు కారకుడైన వెంకయ్యనాయుడిని అభినందిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రంలో అభివృద్ధికి శ్రీకారం చుడతామన్నారు. విశాఖ నుంచి రాజమహేంద్రవరం వరకు పెట్రో హబ్‌గా తయారవుతుందని చెప్పారు. ఏపీలో రెండేళ్లలోనే జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు ప్రధాని మోదీ ఘనతేనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కొనియాడారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. కేంద్రం రాష్ట్రానికిచ్చే సొమ్ము పాచిపోదని, చట్టవిరుద్ధంగా దాచుకున్న సొమ్మే పాచిపోతుందని వ్యాఖ్యానించారు. వైఎస్ హయాంలోనే స్థల పరిశీలన పెట్రోవర్సిటీకి విశాఖలో శంకుస్థాపన చేసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులు వర్సిటీని తీసుకురావడం తమ ప్రభుత్వాల ఘనతగా చెప్పుకున్నారు. కానీ వాస్తవాలు చూస్తే.. దివంగత వైఎస్ఆర్ హయాంలోనే విశాఖలో ఐఐఎం, రాజమండ్రిలో పెట్రో వర్సిటీ ఏర్పాటుచేయాలని యూపీఏ ప్రభుత్వాన్ని కోరగా సుముఖత వ్యక్తంచేసింది. 2013లోనే కేంద్ర ఉన్నతాధికారుల బృందం స్థల పరిశీలన చేసింది. తాత్కాలిక తరగతుల నిర్వహణ కోసం భవన సముదాయాలను పరిశీలించారు. ఆ తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కూడా రాజమండ్రిలోనే పెట్రోవర్సిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. తొలి బడ్జెట్లో ఇందుకు తూర్పు గోదావరి జిల్లా పేరే ప్రతిపాదించారు. ఆ తర్వాత స్థలాలు అందుబాటులో లేవంటూ విశాఖకు ప్రతిపాదించారు. -
మా పాలనలో స్కామ్‌లు లేవు
- 2019లో తెలంగాణ బీజేపీదే - కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శామీర్‌పేట్/మేడ్చల్ రూరల్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో అవినీతికి, స్కామ్‌లకు తావు ఇవ్వలేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో ఆదివారం వికాస్‌పర్వ్ పేరుతో భారీ బహిరంగసభను ఏర్పా టు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా దేశంలో, రాష్ర్టంలో ఎంతోవుంది ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. దేశంలోని ఏ తల్లీ కన్నీరు పెట్టకుండా గ్యాస్ సబ్సిడీ కల్పించావుని పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి చేసేం దుకు ప్రధాని విదేశీ పర్యటనలు చేస్తూ పొరుగు దేశాలతో సత్సంబంధాలు పెంచుతున్నారని మంత్రి చెప్పారు. దేశంలోని కశ్మీర్ నుంచి కన్యాకువూరి వరకు బీజేపీ గాలి వీస్తోందని, అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతూ తమ నిధులతోనే పనులు చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నదని విమర్శించారు. ఇంటింటికీ మోదీ నినాదంతో వెళితే రానున్న కాలంలో తెలంగాణలో బీజేపీ పాగా వేయడం ఖాయమన్నారు. సభలో కేంద్ర జలవనరులు, పారిశుధ్యశాఖ సహాయమంత్రి రామ్కృపాల్యూదవ్, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు విజయ్‌పాల్ సింగ్ తోవుర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇక ఆన్లైన్లో
-
గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇక ఆన్లైన్లో చెల్లించొచ్చు!
వంటగ్యాస్ కనెక్షన్లకూ ఈఎంఐ! ముంబై: వంటగ్యాస్ సిలిండర్ రీఫిలింగ్ కోసం బుక్ చేసుకున్నప్పుడే డబ్బులు కూడా చెల్లించేలా ఆన్లైన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గతంలో ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం మాత్రమే ఉండేది. డబ్బులు మాత్రం సిలిండర్‌ను తెచ్చిన డెలివరీ బోయ్స్‌కు ఇవ్వాల్సి వచ్చేది. ఇకపై సిలిండర్‌ను బుక్ చేసుకున్న సమయంలోనే, ఆన్లైన్లో రీఫిలింగ్ డబ్బులనూ చెల్లించవచ్చు. ఎల్పీజీ సిలిండర్ రీఫిలింగ్ కోసం చెల్లించే మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించే సౌకర్యాన్ని ఆదివారం కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముంబైలో ప్రారంభించారు. ‘ప్రభుత్వ రంగ సంస్థలైన చమురు మార్కెటింగ్ సంస్థలు ఆన్లైన్ చెల్లింపు విధానాన్ని ప్రారంభించాయి’ అని ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఆన్లైన్ చెల్లింపు సదుపాయాన్ని www.mylpg.in వెబ్సైట్ ద్వారా, 13 భాషల్లో పొందవచ్చు. అన్ని ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు తదితర బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్ బుక్ చేసుకుని, డబ్బులు చెల్లించేలా టచ్ పాయింట్లను ఏర్పాటు చేసే విషయమూ ఆలోచిస్తున్నామని ప్రధాన్ తెలిపారు. వినియోగదారులకు వంటగ్యాస్ కనెక్షన్ల వ్యయాన్ని సమాన నెలసరి వాయిదాల(ఈఎంఐ) ద్వారా చెల్లించే అవకాశం కల్పించాలని చమురు మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) యోచిస్తున్నాయని వెల్లడించారు. వినియోగదారులు తమ కొత్త ఎల్పీజీ కనెక్షన్ ఖర్చు రూ. 3,400లను గరిష్టంగా 24 సమాన వాయిదాల్లో చెల్లించే ప్రతిపాదనపై ఓఎంసీలు కసరత్తు చేస్తున్నాయన్నారు. -
వ్యక్తి కాదు.. దేశమే ముఖ్యం
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంగారెడ్డి టౌన్: ‘నేను.. నా దేశం... ఈ రెండింటిలో నా దేశమే ముఖ్యం’ అన్న బీఆర్ అంబేద్కర్ నినాదంతో ముందుకు సాగాలని యువతకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు. వ్యక్తి కంటే దేశం ముఖ్యమని, యువత స్వార్ధ చింతన వీడి లోక కల్యాణం కోసం పాటుపడాలని ఉద్బోధించారు. శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 33వ రాష్ట్ర మహాసభలో ఆయన మాట్లాడారు. ఏబీవీపీ మత సంస్థ కాదని, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి సురేష్, క్షేత్ర సంఘటన కార్యదర్శి రామ్మోహన్ జీ, రాష్ట్ర అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి, కార్యదర్శి అయ్యప్ప, స్వాగత సమితి అధ్యక్షుడు దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ నూతన అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా చెన్న కృష్ణారెడ్డి, కార్యదర్శిగా అయ్యప్ప ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా బాబురావు వ్యవహరించారు. -
‘ఎల్పీజీ సబ్సిడీ’కి గిన్నిస్
ధ్రువపత్రం ప్రధానికి అందజేత న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్ల నగదు బదిలీ పథకం గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కింది. ఎల్పీజీ సబ్సిడీని ప్రపంచంలో అతిపెద్ద నగదు బదిలీ పథకంగా పేర్కొంటూ గిన్నిస్ బుక్ ఇచ్చిన సర్టిఫికెట్‌ను కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చారు. గృహ వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమచేసేలా గత యూపీఏ ప్రభుత్వం 2013, సెప్టెంబర్ 1న ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీఎల్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ పథకానికి అవాంతరాలు ఎదురవడంతో ఎన్డీఏ ప్రభుత్వం వాటిని పరిష్కరించి దాని పేరు మార్చి ‘పీఏహెచ్ఏఎల్ (ప్రత్యక్ష హస్తాంతరిత్ లాభ్-పహల్)’గా 2015, జనవరి 1 నుంచి అమలుచేసింది. గత జూన్ 30 నాటికి 12.57 కోట్ల మంది ఖాతాలకు నగదు బదిలీ చేస్తూ అతిపెద్ద నగదు బదిలీ పథకంగా ‘పహల్’ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ గుర్తించిందని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. 2015, ఏప్రిల్ 1 నాటికి 18.19 కోట్ల మంది నమోదిత వినియోగదారులుండగా, 14.85 కోట్ల మంది క్రియాశీల వినియోగదారులున్నారని తెలిపింది. 3.34 కోట్ల మంది వినియోగదారులను నకిలీగా గుర్తించి వారి కనెక్షన్లను రద్దు చేశారని, దీంతో 2014-15లో రూ. 14,672 కోట్లు ఆదా అయిందని తెలిపింది. -
విదేశీ చమురు, గ్యాస్ క్షేత్రాలు భారీగా కొనాలి: ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దాదాపు సగానికి తగ్గిపోయిన నేపథ్యంలో.. విదేశీ చమురు, గ్యాస్ క్షేత్రాలను భారత్ భారీగా కొనుగోలు చేయాలని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. అలాగే, దేశీయంగానూ ఇంధన అన్వేషణ కార్యకలాపాలు పెంచాలని, వ్యూహాత్మక నిల్వలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో పారిశ్రామిక దిగ్గజాలు ఈ మేరకు అభిప్రాయాలు వెలిబుచ్చినట్లు ప్రధాన్ తెలిపారు. చమురు రేట్లు తగ్గడంతో ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, కర్ణాటకలోని మంగళూరు, పాడూరులలోని వ్యూహాత్మక కేంద్రాల్లో నిల్వలు పెంచుకోవాలని వ్యాపారవేత్తలు సూచించినట్లు ఆయన చెప్పారు. -
చిన్న చమురు, గ్యాస్ క్షేత్రాలు...ఇక ప్రైవేట్ సంస్థల చేతికి
69 క్షేత్రాల వేలానికి కేంద్రం నిర్ణయం ♦ వీటిలో నిక్షేపాల విలువ రూ. 70,000 కోట్లు! ♦ కొత్తగా... ఆదాయాల్లో వాటాల విధానం న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా అప్పగించిన 69 చమురు, గ్యాస్ క్షేత్రాలను వేలం వేసి ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. వీటిపై ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి సంబంధించి కొత్త ఫార్ములాను ప్రతిపాదించింది. దీని ప్రకారం ఇప్పటిదాకా అమల్లో ఉన్న.. ‘లాభాల్లో వాటాల విధానం’ కాకుండా ఇకపై స్థూల ఆదాయాల్లో వాటాలివ్వాలనే విధానాన్ని ప్రవేశపెట్టనుంది. మరోవైపు, 2006-2011 మధ్య కాలంలో పప్పు ధాన్యాల దిగుమతులపై నాఫెడ్, పీఈసీ, ఎస్టీసీ తదితర సంస్థలకు వాటిల్లిన నష్టానికి సంబంధించి రూ.113.40 కోట్లు రీయింబర్స్ చేసేందుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇంధన క్షేత్రాల వేలానికి సంబంధించి.. 69 చిన్న క్షేత్రాల్లో ప్రస్తుత రేట్ల ప్రకారం దాదాపు రూ.70,000 కోట్ల విలువ చేసే 89 మిలియన్ టన్నుల మేర చమురు, గ్యాస్ నిక్షేపాలున్నాయని అంచనా వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. గతంలో పాటించిన లాభాల్లో వాటాల విధానం కారణంగా ప్రైవేటు ఆపరేటర్లు చేసే ప్రతి వ్యయాన్నీ ప్రభుత్వం పట్టి, పట్టి చూడాల్సి వస్తుండటం... జాప్యానికి, వివాదాలకు దారి తీస్తోందని తెలియజేశారు. ఆదాయాల పంపకానికి సంబంధించి కొత్త విధానం వల్ల చమురు ధరలు కనిష్ట స్థాయికి పడిపోయినా, గరిష్ట స్థాయికి ఎగిసినా ప్రభుత్వానికి దక్కాల్సిన ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉంటాయని ప్రధాన్ వివరించారు. తదుపరి నిర్వహించే లెసైన్సింగ్ రౌండులో కూడా ఇదే విధానాన్ని పాటించే అవకాశాలున్నాయని చెప్పారాయన. మూడు నెలల్లో బిడ్ డాక్యుమెంటు.. వేలంలో ఈ క్షేత్రాలను దక్కించుకునే సంస్థలకు రేటు పరంగాను, మార్కెటింగ్ పరంగానూ పూర్తి స్వేచ్ఛ కల్పిస్తామని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. నియంత్రణ సమస్య లేకుండా ఆయా కంపెనీలు మార్కెట్ రేటుకు ఎవరికైనా విక్రయించుకోవచ్చన్నారు. బిడ్ డాక్యుమెంటు మరో మూడు నెలల్లో సిద్ధమవుతుందని, ఆ తర్వాత వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తి పెంచడానికి, ఈ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించడానికి క్యాబినెట్ నిర్ణయం దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. ఇంధన అన్వేషణకు ఇదే సరైన సమయం.. చమురు ధరలు ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన తరుణంలో వేలంపై అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఆసక్తి కనపరుస్తాయా అన్న ప్రశ్నకు.. టెక్నాలజీ సామర్థ్యం గల చిన్న సంస్థలే లక్ష్యంగా వేలం నిర్వహిస్తామని ప్రధాన్ తెలిపారు. చమురు ధర కనిష్టంగా ఉన్నప్పుడు డ్రిల్లింగ్ రిగ్గు సర్వీసులు మొదలైనవి కూడా తక్కువకే లభిస్తాయి కనుక.. ఇంధన అన్వేషణ కార్యకలాపాలకు ఇదే సరైన సమయమన్నారు. ఈ 69 క్షేత్రాల నుంచి ఉత్పత్తి మొదలవడానికి కనీసం మూడేళ్లు పట్టొచ్చని అప్పటికి ధర లు మళ్లీ మెరుగుపడగలవని అంచనా వేస్తున్నట్లు ప్రధాన్ పేర్కొన్నారు. వేలం ప్రక్రియ ఇలా.. నామినేషన్ ప్రాతిపదికన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వద్ద 110 చిన్న చమురు, గ్యాస్ క్షేత్రాలుండేవి. అయితే, భౌగోళిక సంక్లిష్టత, పరిమాణం రీత్యా లాభసాటిగా లేకపోవడం, ప్రభుత్వ నిర్దేశిత రేటు గిట్టుబాటు కాకపోవడం వంటి అంశాల కారణంగా ఉత్పత్తి కుదరకపోవడంతో 63 క్షేత్రాలను ప్రభుత్వానికి కంపెనీ తిరిగి అప్పగించేసింది. ఆయిల్ ఇండియా కూడా ఇదే కారణంగా 6 క్షేత్రాలను వాపసు చేసింది. వీటినే ప్రభుత్వం వేలం వేయబోతోంది. వీటిలో 36 ఆఫ్‌షోర్, 33 ఆన్‌షోర్ క్షేత్రాలున్నాయి. వేలంలో వాటిని దక్కించుకునే కొత్త ఆపరేటరు.. ఇప్పటికే ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వాటిపై చేసిన వ్యయాలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌షోర్ క్షేత్రాల ఆపరేటర్లు 3 సంవత్సరాల్లో, ఆఫ్‌షోర్ ఆపరేటర్లు నాలుగు సంవత్సరాల్లో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంటుంది. ఆయా బ్లాకులపై రాయల్టీ కూడా కట్టాలి. చమురు సెస్సు ఉండదు. లాభాల్లో వాటాల పద్ధతి కాకుండా ప్రభుత్వానికి ఆదాయాల్లో లేదా చమురు, గ్యాస్‌లో ఎంత వాటాలు ఇస్తారన్నది ముందుగా బిడ్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. గరిష్ట స్థాయిలో వాటాలు ఇవ్వజూపే సంస్థ.. సదరు క్షేత్రాన్ని దక్కించుకుంటుంది. -
గ్యాస్ హబ్‌గా హైదరాబాద్
* తెలంగాణలో రూ.1,300 కోట్లతో పనులు: కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ * ఈశాన్యం నుంచి రాష్ట్రం మీదుగా గ్యాస్ పైప్‌లైన్ * ముంబై నుంచి హైదరాబాద్‌కు పైప్‌లైన్ ఏర్పాటుకు నిర్ణయం * రాష్ట్రంలో మరో రెండు గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలు ఏర్పాటు! సాక్షి, హైదరాబాద్: రానున్న రోజుల్లో హైదరాబాద్ గ్యాస్ హబ్‌గా మారే అవకాశం ఉందని కేంద్రసహజ వాయువు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఈశాన్యం నుంచి దక్షిణానికి గ్యాస్ పైప్‌లైన్ వేయనున్నామని, అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మీదుగా వెళుతుందని చెప్పారు. ఒడిశాలోని పారదీప్ నుంచి హైదరాబాద్ వరకు కొత్తగా ఐఓసీ వేసే గ్యాస్ పైప్‌లైన్‌కు రూ.2,500 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఇక హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో ముంబై నుంచి హైదరాబాద్‌కు గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నామని చెప్పారు. ఈ రెండు పైప్లైన్లు పూర్తయితే దేశ ఉత్తర, పశ్చిమ, తూర్పుల ప్రాంతాలను కలుపుతూ ఏర్పడే సరికొత్త గ్యాస్ పైప్‌లైన్‌కు హైదరాబాద్ హబ్‌గా మారుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాల యంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రూ. 1,300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఐఓసీ టెర్మినల్, గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలను ఏర్పా టు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు ప్రస్తుత ఆర్థిక ఏడాదిలోనే దాదాపు రూ.100 కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. అందరికీ వంట గ్యాస్.. తెలంగాణలో 86 లక్షల వంట గ్యాస్ వినియోగదారులు ఉండగా.. అందులో 74 లక్షల కనెక్షన్లు మాత్రమే క్రియాశీలంగా ఉన్నాయని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. రెండేళ్లలో రాష్ట్రంలో వందశాతం కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఉండేలా చూస్తామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సీఎన్జీతో 21వేల వాహనాలు, పీఎన్జీతో వెయ్యి వరకు వాహనాలు నడుస్తున్నాయని.. భవిష్యత్తులో ఇవి బాగా పెరగాల్సి ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో మోనోటెర్మినల్ కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, అందుకు రూ.500 కోట్లు కేటాయించామని చెప్పారు. తెలంగాణలో మరో రెండు గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలను నెలకొల్పనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో నాలుగు కేంద్రాలున్నాయని పేర్కొన్నారు. కాగా శుక్రవారం ప్రధాన్ పుట్టినరోజు కావడంతో కిషన్‌రెడ్డి, డా.లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
విశాఖలో వ్యూహాత్మక చమురు నిల్వకు ఏర్పాట్లు పూర్తి
పాట్నా: విశాఖలోని వ్యూహాత్మక ఆయిల్ రిజర్వ్‌లో ఈ నెల నుంచి ముడిచమురును నిల్వ చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇందుకోసం అవసరమైన ముడి చమురును ఇరాక్ నుంచి తెప్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. వైజాగ్‌లో ప్రాథమికంగా 1.3 మిలియన్ టన్నుల క్రూడ్‌ను నిల్వ ఉంచవచ్చని, క్రమంగా దీన్ని 5 మిలియన్ టన్నులకు పెంచనున్నట్లు మంత్రి వివరించారు. ఒకవేళ ఏవైనా అనూహ్య పరిణామాలు ఎదురైనా దేశీయంగా వినియోగానికి సంబంధించి కనీసం 13 రోజుల అవసరాలకు ఈ నిల్వలు సరిపోగలవని ఆయన తెలిపారు. -
త్వరలో బెంగళూరుకు ‘పీఎన్జీ’
బెంగళూరు:ఇంటింటికి పైపు ద్వారా వంటగ్యాస్ (పైప్ న్యాచులర్ గ్యాస్-పీఎన్జీ)ను సరఫరా చేసే పథకానికి త్వరలో బెంగళూరులో శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ వెల్లడించారు. గ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులు కోవడానికి ఉద్దేశించబడిన గివిటప్(ుజజీఠ్ఛిజ్టీఠఞ) కార్యక్రమాన్ని ఆయన బెంగళూరులో శనివారం ప్రారంభించి, మాట్లాడారు. సిలెండర్లలో వంట గ్యా స్ను సరఫరా చేయడంతో పోలిస్తే పీఎన్జీ అత్యంత భద్రతతో కూడుకున్నదే కాక, చౌకైనది కూడా అని పేర్కొన్నారు. పీఎన్జీ అమలుతో బినామీ రూపంలో సబ్సిడీ గ్యాస్‌ను పొందుతున్న వారి ఆటలు సాగవని అన్నారు. బెంగళూరు తర్వాత ఈ విధానాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలకూ విస్తరిస్తామని చెప్పారు. దీని వల్ల ఏడాదికి రూ.3వేల కోట్ల గ్యాస్ సబ్సిడీ నిధులు ఆదా అవుతాయని ఆయన వివరించారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపునకు స్పందించి ఎంతోమంది సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు గివిటప్‌కు మద్దతు పలికారన్నారు. ఒక్క కర్ణాటక నుంచే ఇప్పటి వరకూ 20 వేల మంది మార్కెట్ రేటుకే గ్యాస్‌ను కొనుగోలు చేస్తామని ముందుకు వచ్చారన్నారు. ఇందులో 15 వేల మంది ఒక్క బెంగళూరులో ఉన్నట్లు తెలిపారు. వీరిలో బహుభాషనటి మాలాశ్రీ, దర్శకుడు రాజేంద్రసింగ్ బాబు తదితరులు ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులందరూ గివిటప్‌కు మద్దతు పలుకుతారని తెలిపారు. ఇక రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్గుండూరావ్తోపాటు రోషన్‌బేగ్ తదితర మంత్రులు ఇప్పటికే తాము గివిటప్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం పంపించారని కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు తెలిపారు. కాగా, కర్ణాటకలో మొదటిసారిగా గివిటప్‌కు మద్దతు పలికిన కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ భార్య తేజశ్విని అనంతకుమార్‌ను ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. గివిటప్‌కు మార్గాలు ఇవి... మైక్రోసైట్స్... కడLPG.in, giveitup.in Ððl»Œæ-OòÜr$Ï...www.ebharatgas.com, www.indane.co.in , www.hpgas.com ఆయా గ్యాస్ కంపెనీ వినియోగదారులు తాము ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫోన్ ద్వారా ఎస్ఎమ్మెఎస్ రూపంలో గివిట్ అప్‌లో సభ్యులుగా చేరవచ్చు. {పత్యేక దరఖాస్తు ఫారం కూడా అందుబాటులో ఉంది. -
ఇక సబ్సిడీపై 5 కేజీల ఎల్పీజీ సిలిండర్లు
న్యూఢిల్లీ : వంటగ్యాస్ వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడానికి చమురు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం చమురు కంపెనీలు గృహవినియోగదారులకు 14.2 కేజీల సిలిండర్లను ఏడాదికి 12 చొప్పున సబ్సిడీ రేటుకు అందిస్తుండడం తెలిసిందే. తాజాగా ఈ కంపెనీలు 5 కేజీల చిన్న సిలిండర్లనూ సబ్సిడీ ధరకు అందిస్తున్నాయి. ఒక్కో సిలిండర్‌కు రూ.155 సబ్సిడీ(ఢిల్లీ రేటు) ధరపై ఏడాదికి 34 సిలిండర్లు సరఫరా చేసేందుకు కంపెనీలు కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చాయి. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం రాజ్యసభలో ఈ విషయం తెలిపారు. . 5 కేజీల సిలిండర్లు 34 దాటితేమాత్రం ఒక్కో దానికి రూ.351 చెల్లించి(ఢిల్లీలో ధర) కొనుగోలు చేయాల్సి ఉంటుంది.