ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో రంగానికి రూ.లక్షా 22 వేల కోట్లు వెచ్చించనున్నట్టు కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ సహాయమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. వీటిలో రూ.62 వేల కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్, హెచ్‌పీసీఎల్ విస్తరణ, మరో రూ.60 వేల కోట్లతో కేజీ బేసిన్‌లో క్రూడాయిల్ వెలికితీతకు ఖర్చు చేయనున్నామని వెల్లడించారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలిలో రూ.600 కోట్లతో నిర్మించనున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (పెట్రో యూనివర్సిటీ)కి గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.