కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
సంగారెడ్డి టౌన్: ‘నేను.. నా దేశం... ఈ రెండింటిలో నా దేశమే ముఖ్యం’ అన్న బీఆర్ అంబేద్కర్ నినాదంతో ముందుకు సాగాలని యువతకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు. వ్యక్తి కంటే దేశం ముఖ్యమని, యువత స్వార్ధ చింతన వీడి లోక కల్యాణం కోసం పాటుపడాలని ఉద్బోధించారు. శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 33వ రాష్ట్ర మహాసభలో ఆయన మాట్లాడారు. ఏబీవీపీ మత సంస్థ కాదని, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తోందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి సురేష్, క్షేత్ర సంఘటన కార్యదర్శి రామ్మోహన్ జీ, రాష్ట్ర అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి, కార్యదర్శి అయ్యప్ప, స్వాగత సమితి అధ్యక్షుడు దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర కమిటీ నూతన అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా చెన్న కృష్ణారెడ్డి, కార్యదర్శిగా అయ్యప్ప ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా బాబురావు వ్యవహరించారు.
వ్యక్తి కాదు.. దేశమే ముఖ్యం
Published Sat, Dec 26 2015 2:55 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 PM
Advertisement
Advertisement