
సాక్షి, అమరావతి : వైఎస్సార్ సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ నాయుకుడు నారా లోకేష్ బాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎల్పీజీ విషయంలో లోకేష్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తప్పుబట్టారు. ఆదివారం ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ లోకేశం.. నేచురల్ గ్యాస్‌కి ఎల్పీజీకి మధ్య తేడా కూడా తెలియదా?.. నేచరుల్ గ్యాస్ వ్యాట్‌లో మార్పులు జరిగితే ఎల్పీజీపై అని దుష్ప్రచారం చేయిస్తావా?.. అసలు ఎల్పీజీపై ట్యాక్స్ రాష్ట్రం పరిధిలోకి వస్తుందా?.. ఇంత అజ్ఞానం పెట్టుకొని మళ్లీ ఎడిటోరియల్స్ రాస్తున్నట్లు బిల్డప్. లోకం నవ్వుతుంది పప్పు’’ అంటూ ఎద్దేవా చేశారు. ( చిట్టీ నాన్నారుని అడుగు చెప్తారు.. )
అంతకు క్రితం ట్వీట్‌లో.. ’’ చంద్రం..మళ్లీ దళిత రాజకీయం మొదలుపెట్టావా?.. సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన''‘వైఎస్సార్ ఆసరా' నుండి ప్రజల దృష్టి మరల్చడమే మీ కుతంత్రం కదా?.. కానీ మీ కుట్ర విఫలం. ‘వైఎస్సార్ ఆసరా' సఫలం. మళ్లీ వినండి.. మాట నిలబెట్టుకొని తొలి విడతలో రూ.6,792 కోట్లు అక్కచెల్లమ్మల ఖాతాలో జమ చేశారు ముఖ్యమంత్రి జగన్’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment