
సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి నారా లోకేష్‌పై ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు.'తాడిపత్రి వచ్చి ఏం ఇరగదీశాడని ఆ పార్టీ కార్యకర్తలే విసుక్కుంటున్నారంట. 16 రకాల వంటకాలు చేయించుకుని సుష్టిగా భోంచేసి చెక్కేశాడని తెలుగు తమ్ముళ్లు తిట్టుకుంటున్నారు. పేరుకే పరామర్శలు, పలకరింపులు. టేస్టీ ఫుడ్ దొరుకుతుందంటే ఎంత దూరమైనా వెళ్లొస్తాడు మాలోకం' అంటూ పేర్కొన్నారు.
కాగా మరో ట్వీట్‌లో చంద్రబాబును ఉద్దేశించి.. 'గంటకు 5 లక్షల ఫీజు తీసుకునే ఢిల్లీ అడ్వొకేట్ల ఇళ్ల ముందు క్యూలు కడుతున్నారట తెలుగుదేశం మాజీలు. బాబు బీజేపీలోకి పంపిన కోవర్టులూ బాస్ కోసం అదే పనిలో ఉన్నారు. ఈయన కాపాడలేడు అనుకున్నారేమో ఎవరికి వారు లాయర్లకు అడ్వాన్సులిచ్చి గండం నుంచి బయట పడేయమని ప్రాధేయడుతున్నారట.' అంటూ విమర్శించారు.(అచ్చెన్నే అప్రూవర్ అయితే వారి పరిస్థితి?)
Comments
Please login to add a commentAdd a comment