'పుత్రరత్నం కోసం ఏ ఉన్మాద చర్యకైనా సిద్ధమే' | Vijayasai Reddy Comments On Chandrababu And Nara Lokesh | Sakshi
Sakshi News home page

వారి కుటుంబానికి పార్టీ తరఫున 5 లక్షలు ఆర్థికసాయం

Published Wed, Jan 6 2021 11:47 AM | Last Updated on Wed, Jan 6 2021 11:47 AM

Vijayasai Reddy Comments On Chandrababu And Nara Lokesh - Sakshi

సాక్షి, అమరావతి: అసమర్థుడయిన పుత్రరత్నం కోసం ఏ ఉన్మాద ధ్వంసరచనకైనా సిద్ధమేనని.. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ నిస్సిగ్గుగా తేల్చి చెప్పాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్‌ ఖాతాలో .. '14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ముసుగు తొలగించి ఇకపై తాను కొందరికే ప్రాతినిధ్యం వహిస్తానని ప్రకటించాడు. మొదట నీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చి సూటిగా చెప్పేసేయ్ బాబూ' అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

'ముందుకు సాగడం ప్రకృతి నియమం. మధ్య యుగాల నాటి ఉన్మాద మనస్థత్వంతో చంద్రబాబు రాకెట్ వేగంతో తిరోగమనంలోకి దూసుకెళ్తున్నాడు. ప్రపంచం పురోగమనం వైపు పరుగులు పెడుతుంటే అందుకోలేనంత వెనక పడిపోయాడని, ఒంటరిగా మిగిలిపోయాడని తొందర్లోనే తెలుస్తుంది' అంటూ వరుస ట్వీట్‌లలో చంద్రబాబుపై ధ్వజమెత్తారు. 

కాగా.. 'దేశ రక్షణ కోసం 14 ఏళ్ళు కవచంలా నిలబడి, విధి నిర్వహణలో మృతి చెందిన వీర జవాన్ మంచు రెడ్డప్ప నాయుడు అంత్యక్రియలు పోలీసు లాంఛనాలతో జరిగాయి. వారి కుటుంబానికి పార్టీ తరఫున 5 లక్షలు ఆర్థికసాయం అందించటం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను' అంటూ మరో ట్వీట్‌లో తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement