సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ''అచ్చెన్నాయుడు ఒక సంతకంతోనే అరెస్టు అయితే.. మంత్రిగా నేను అలాంటివి రోజుకు వంద పెట్టా.. ' అన్న లోకేష్ స్టేట్ మెంట్ చూసి.. చంద్రబాబు.. 'ఆహా..! నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు' అని గర్విస్తాడా, లేక...' అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో 'లోకేష్...! సొంత పెళ్ళానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే.. జగన్ గారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోందన్నావ్. అవునా...! తీసుకుంటున్నావా...? ఎందుకయ్యా.. రాజకీయాల్లో లేని మీ ఆవిడను కూడా నీ చేతగాని మాటలతో ఈ గొడవలోకి లాగుతావ్?!' అంటూ చురకలంటించారు.
కాగా మరో ట్వీట్‌లో బోండా ఉమాపై విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు.' ప్రజావేదిక అక్రమ నిర్మాణం కాబట్టే ప్రభుత్వం కూల్చేసింది. అదేదో మీ సొంత ఇల్లును నేలమట్టం చేసినట్టు సంవత్సరీకాలు జరపుకోవడం ఏమిటి ఉమా. మీ ప్రభుత్వ అవినీతి చిహ్నం ఆ రేకుల షెడ్డు. అందుకే తేదీ గుర్తుపెట్టుకుని శోకాలు పెడుతున్నారు. ప్రజలకు ఏదైనా సేవ చేయండయ్యా. అంతా హర్షిస్తారు.' అంటూ ట్వీట్ చేశారు.(‘సమస్యను స్టడీ చేసి మాట్లాడు’)
Comments
Please login to add a commentAdd a comment