సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ్య ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజ్యసభ ఫలితాలు ప్రకటించిన తర్వాత చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉండే నైతిక హక్కును కోల్పోయారన్నారు. అలాగే చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించిన ఆయన.. 'మాలోకం కళ్లన్నీ ఇసుక మీదే. అప్పట్లో శాండ్ మాఫియా నుంచి నెలనెలా మామూళ్లు అందుకునే వాడు. ఇప్పుడా ఆదాయం పోయిందని ఏడుపు. హైదరాబాద్‌లో కూర్చుని ఉచిత సలహాలు ఇవ్వకుండా ఇక్కడి కొచ్చి సమస్యను స్టడీ చేసి మాట్లాడు. ఎక్కడో ఒక ఘటనను చూపి ఇలాగే జరుగుతోందని అంటే ఎలా చిట్టి నాయుడు' అంటూ ట్వీట్ చేశారు. (ఎగిరెగిరి పడుతుంటే నిజమే అనుకున్నారంతా.)
మరోవైపు కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కృషిని విజయసాయిరెడ్డి ప్రశంసించారు. 'కోవిడ్ నియంత్రణ, చికిత్సలో సీఎం జగన్ కార్యదీక్ష, ముందుచూపును ప్రతి రాష్ట్రం ప్రశంసిస్తోంది. 7 లక్షల టెస్టులు పూర్తి కాగా, ప్రతి కుటుంబానికి పరీక్షలు జరిపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 30 వేల బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే 2 నెలల్లో మరో 40 వేల పడకలు సిద్ధమవుతాయి' అని పేర్కొన్నారు. ('కొడుకు విప్లవ యోధుడిలా కనిపించి ఉంటాడు')
Comments
Please login to add a commentAdd a comment